5వ అధ్యాయం
ఖురాన్
నిర్దోషమని ఎవరు చెప్పినా వాస్తవానికి అలాంటిది అనంతమైన దోషానికే దారితీసింది. అది చెప్పిన వారికి, ఆమోదించిన వారికీ శాపంగానే పరిణమించింది. దోషరహిత గ్రంథంగా అవతారమెత్తింది. ఆమోదించటానికి వీలులేని స్థితిలోకి అలాంటి తత్వాలూ, సంస్థలూ దారి తీశాయి. పుస్తకం ప్రమాణాలను నిర్థారించి అవరోధంగా మారి తన విధులను నిర్వహిస్తుంది. క్రూరత్వం, మత మూర్ఖత్వం వాటిని అనుసరిస్తాయి. స్వేచ్ఛాలోచనకూ శాస్త్రీయ పరిశోధనకూ వ్యతిరేకంగా నడక సాగిస్తాయి. అజ్ఞానం దోషాలకు మూలం. నిజమైన అభివృద్ధికి బైబుల్లో చెప్పిన దేవతా పూజ అంతా పోవాలి. నిర్దోషం సామాన్యులదైనా, పురోహితులదైనా సమాజానికి హాని కలిగించేదే (టి. హెచ్. హక్సరే. సైన్స్ అండ్ హిబ్రూ ట్రెడిషన్, లండన్, 1895, పీఠిక, పుటః9)
ఈ వాక్యాలు చదివే ముస్లింలు నన్ను క్షమింతురు గాక, వారికి ఖురాన్ అల్లా ఇచ్చిన గ్రంథం. వారి విశ్వాసాన్ని నేను గౌరవిస్తాను. కాని నేను అందులో భాగం పంచుకోను. దానిమీద ఆధారపడను. ప్రాశ్చవాదులు కొందరు దీనిపై ఆధారపడ్డారు. ఈ ధోరణి వలన ఇస్లాం ప్రభుత్వాలూ, వ్యక్తులూ కొంత తోడ్పడవచ్చు. కాని నేను అర్థాన్ని కప్పిపుచ్చి మోసం చేయదలచలేదు. ముస్లింలు ముస్లిమేతరుల భావాలను తెలుసుకోకుండా ఉండవచ్చు. పుస్తకాలు చదవకుండానూ ఉండవచ్చు. చదివితే మాత్రం వారికి విరుద్ధమైన విషయాలు చాలా ఉంటాయని గ్రహించాలి. రాన్ అల్లా గ్రంథంగా నేను నమ్మను. (మాక్సిమ్ రాడిసన్, మహమ్మద్, న్యూయార్క్, 1980, పుట 217-18)
ఖురాన్ ను అరబిక్ లో రాశారు. దానిని సురలు అనే అధ్యాయాలుగానూ, ఆయాత్ అనే చరణాలుగానూ విభజించారు. సుమారు ఎనిమిదివేల పద్యపాదాలు, 6200 నుండి 6240 వరకూ చరణాలూ 114 సురలు ఖురాన్ లో ఉన్నాయి. తొమ్మిది, మొదటి ఫతీహాసుర తప్ప ప్రతి సుర కూడా దయామయుడైన దేవుని పేరిట అని మొదలవుతుంది. అవి కాలక్రమంలో ఎప్పుడు రాసినా, ఎవరు బాధ్యులైనా, ఖురాన్ లో మొదటగా సుదీర్ఘ సురలుగా రాశారు. మహమ్మద్ కు ఏ క్రమంలో వీటిని దైవం వెల్లడించినా ఉన్న తీరు అది.
నేడు సాధారణ, తాత్వికేతర ముస్లిం దృష్టిలో దేవుని వాక్యంగా ఖురాన్ తిరుగులేనిది, దేవుడు గాబ్రియేల్, పవిత్ర శక్తి ద్వారా మహమ్మద్ కు అరబిక్ లో దీన్ని అందజేశాడు. అది నిత్యమూ, అపౌరుషేయము. దీని మూలం, స్వర్గంలో ఉంది. (మాతృ గ్రంథం 43.3, గర్భిత గ్రంథం 55.77, సంరక్షిత ఫలకం 85.22 ప్రవక్తకు దివ్య సందేశంగా దేవదూత చెప్పగా ఇతడు దాన్ని తిరిగి చెప్పి, ప్రపంచానికి వెల్లడించాడు. మహమ్మదుకు చెప్పిన తీరులోనే ఏ మార్పులూ లేకుండా వీటిని అట్టిపెట్టినట్లు నాగరిక ముస్లింలు చెపుతారు. పుట్టుక, మరణం, వివాహాల సందర్భంగా కొరాన్ పఠిస్తారు. గైలామ్ ఇలా రాశాడు. ఇది అతి పవిత్రమైనది. ఇతర పుస్తకాల పక్కన ఉంచకూడదు. వాటి పైనే అట్టిపెట్టాలి. ఖురాన్ పెద్దగా చదివేటప్పుడు తాగకూడదు, పొగ పీల్చరాదు. మౌనంగా వినాలి. రోగాలకూ ఉపద్రవాలకూ ఇది నివారిణి కామోత్తేజాన్ని కలిగించడానికి ఖురాన్ చదవమని షేక్ సెఫ్ జావి తన సుగంథ గార్డెన్ లో రాశాడు.
ఖురాన్ యావత్తూ పిల్లలచే కంఠస్తం చేయించే పని ఆలోచనా రహితమని హర్ గ్రోంజే, గాల్యూమ్ (Hurgronje, Guilllaume) విమర్శించారు. కొన్ని చోట్ల ఖురాన్ లో కొన్ని భాగాలు కంఠస్తం చేయిస్తున్నారు. అందులో 6200 పైగా చరణాలున్నాయి. నిశిత పరిశీలన లేకుండా పోతుందని కూడా ఈ పండితులు అన్నారు. ఆలోచన స్తంభింపజేసి, కంఠస్తం చేసిన విషయాలను గురించి ఎలాంటి నిశిత ఆలోచనా చేయజాలని స్థితి ఏర్పడుతుంది. (Guillaume Alfred Islam)
లండన్ 1954 పేజి 74)
హర్ గ్రోంజే ఇలా పరిశీలించాడు.
ఒకప్పుడు ప్రపంచ సంస్కరణ శక్తిగా ఉన్న ఈ గ్రంథం నేడు కొన్ని నిర్దుష్ట నియమాలతో పంతుళ్ళు, పాఠకులు వల్లెవేస్తున్నారు. నియమాలు జటిలం కాదు. కానీ ఆ మాటలలో ఏమి అర్థం ఉందో అని అలోచించడం లేదు. ఖురాన్ వల్లె వేస్తే మంచిదనడం తప్ప మరేమీ లేదు. మామూలు పాఠకుల మాట అలా ఉంచి భాష్యాలు చదివిన పండితులు సైతం, వారు నిత్యం చేసే పనులు పాపాలని ఖండించే చరణాలు చదువుతూనే తమ క్రతువు సందర్భంగా తప్పు చేస్తున్నారని పఠిస్తూనే ఉంటారు.
13 శతాబ్దాల క్రితం ప్రపంచాన్ని జయించతలపెట్టిన వారిని ప్రేరేపించిన నియమావళి, పవిత్ర సంగీత పాఠ్యగ్రంథంగా మారింది. ముస్లింలో చదువుకున్న యువత విలువైన జీవితం వృధా అవుతున్నది. ((Zwemer, The Influence of Anicism in Islamలండన్ 1920 పుట 25 ఉదహరించాడు).
దైవ వాక్యమా ?
ముస్లిం భషాపండితుడు, వ్యాఖ్యాత (ఖురాన్ పై) సుయాతి 5చోట్ల ఖురాన్ పాఠాలు వివాదాస్పదమైనవని, వాటిలో మహమ్మద్ చెప్పినవి, గాబ్రియల్ చెప్పినవి ఉన్నాయని కనుక దేవుని వాక్యాలనడం సరికాదన్నాడు. ఖురాన్ లో అనేక విషయాలు దేవుడు మాట్లాడి ఉండడని అలిదష్తే కూడా చూపాడు. (Ali Dasti, Twenty three years, A study of prophetic career of Mohammed, లండన్ 1985 పేజి 148).
ఫాతెహా అనే ప్రారంభ సుర చూడండి.
దయామయుడైన దేవుని పేరిట, దేవుని శ్లాఘించుము, ప్రపంచాల అధిపతీ, కరుణామూర్తి, న్యాయ తీర్పు ఇచ్చే మూర్తీ, నిన్ను సేవిస్తాము. నిన్ను సహాయం కోరతాము. సక్రమ మార్గంలో నడిపించు. నీవు ఆగ్రహించే వారి బాటలోగాక, దోషుల మార్గంలోనే గాక, నీవు కరుణించిన పంథాలో నడిపించు.
ఈ మాటలు దేవుణ్ణి ఉద్దేశించిన ప్రార్థన. దేవుణ్ణి కొలవడానికి సహాయం అర్థిస్తూ మహమ్మద్ వాడిన మాటలవి. సుర ముందు అను (చెప్పుము) అని చేర్చితే సరిపోతుంది. కొరాన్ లో 350సార్లు అను అనే పదం వస్తుంది. ఖురాన్ లో ఉత్తరోత్తరా ఈ పదాన్ని చేర్చారు. ఇబ్బందికర విషయాలు తొలగించడానికి ఆ పదం చేర్చారు.
ప్రవక్త సహచరుడు, ఖురాన్ పై సాధికారంగల ఇబ్నమసూద్, ఫాతిహాను, సుర 113, 114లను నిరాకరించాడు. దేవుని శరణుజొచ్చుతాను అనేది ఖురాన్ లో భాగం కాదన్నాడు.
నేను నీ కాపలాదారు కాదు అని 6.104 సురలో రాసింది మహమ్మద్ మాటలే.
దేవుని నుండి రుజువులు నీకు లభించాయి. వాటిని గుర్తించిన వారు బాగుపడతారు. పట్టించుకోనివారు నష్టపోతారు. నేను నీ కాపలాదారుని కాదు. దావూద్ తన అనువాదంలో రాస్తూ నేనూ అంటే మహమ్మద్ అన్నాడు.
సుర 114లో మహమ్మద్ మాటలు నేను (మహమ్మద్) దేవుడిని గాక మరొకరిని ఎందుకు అన్వేషించాలి. దేవుడే (ఖురాన్) పవిత్ర గ్రంథం పంపినప్పుడు...... అంటాడు. మూల అరబిక్ లో లేని అలా అను అనే పదాన్ని అనువాదంలో యూసఫ్ అలి చేర్చి, దానిపై ఎలాంటి వ్యాఖ్యానమూ చేయలేదు. సుర 111 కూడా దేవుడి వాక్యాలుగా తగవని, అవి మహమ్మద్ మాటలని అలి దష్తే రాశాడు. విశ్వ రక్షకుడు ఒక అమాయక అరబ్బును శపించి, అతని భార్యను కట్టెలు మోసేదానివి అన్నాడన్నారు. మహమ్మద్ బద్ధ శత్రువు. మా అబు లాహబ్ కు ఈ సుర ప్రస్తావిస్తుంది. అబూలాహబ్ చేతులు పడిపోను. అతడి సంపద అతడికి అక్కరకు రాదు. సంపాదన నిలవదు. అతడు సర్వనాశనం అవుతాడు మండే అగ్నిలో దహించుక పోతాడు. ఈ మాటలు దేవుడివి కావు. మహమ్మద్ చేత ఇవి చెప్పించడమూ అనర్హమే.
గోల్డ్ జిహర్ ఇలా రాశాడు. ముతాజిలైట్ భక్తులు సహితం ఖురాన్ లో ప్రవక్త శత్రువులకు వ్యతిరేకంగా శాపనార్థాలు పెట్టిన వాటి గురించి సందేహాలు వెలిబుచ్చారు. అలాంటివి దేవుడు చెప్పినవి ఉండవన్నారు. సురక్షిత ఫలకాలపై ఉన్నత ఖురాన్ విషయాలు అలా ఉండవన్నారు. (ఇన్ ట్రడక్షన్ టు ఇస్లామిక్ థియాలజీ అండ్ లా, ఆండ్రాస్, రూథ్ హమోరి అనువాదం ప్రిన్ స్టన్ 1981, పుట 173).
మహమ్మద్ దేవుని మధ్య ఎవరు మాట్లాడారనేది 17.1 సుర ప్రకారం గందరగోళం ఏర్పడిందని అలీ దస్తీ రాశాడు. (23సం. ఎ స్టడీ ఆఫ్ ది ప్రోఫెటిక్ కెరియర్ ఆఫ్ మహమ్మద్, లండన్ 1985 పుట.150) మక్కా మసీదు ప్రార్థనా స్థలం నుండి నీ సేవకుడుని రాత్రిళ్ళు జెరూసలేం సుదూర ప్రాంత మసీదుకు తీసుకెళ్ళిన దేవుని స్తుతించుగాక. దేవుడు ద్రష్ట, శ్రోత, అతడికి మనం కృతజ్ఞతలు చూపాలి.
దస్తీ పై మాటలను గురించి ఇలా వ్యాఖ్యానించాడు. మక్కా నుండి పాలస్తీనాకు సేవకుడిని తీసుకెళ్ళి దేవుని స్తుతి, దేవుడే పలికి ఉండడు. తనను తాను దేవుడు పొగడుకోడు. దైవాన్ని మహమ్మద్ పొగిడిన మాటలివి. ఆ తరువాత వాక్యం దేవుని గురించి మాట్లాడిందే. ముగింపు మాటలూ అంతే. అవన్నీ మహమ్మదు మాటలు.
సుర 27.91 అనువదించేటప్పుడు చిత్తశుద్ధి లేకుండా మూర్ఖవాదన చేశారు. మహమ్మద్ అందులో స్పష్టంగా మాట్లాడినట్లు ఉన్నది. నన్ను ఈ నగరానికి సేవ చేయమని దేవుడు అజ్ఞాపించాడు. అరబిక్ లో లేని అలా అను పదాలను దావూద్, పికెట్ హాల్ వాక్యం ప్రారంభంలో చేర్చారు. సుర 81.15-29లో ప్రమాణం చేస్తున్నది మహమ్మదు. తిరుగాడే గ్రహాలూ, తలెత్తే తారలు సూర్యాస్తమయాలూ, ఉషోదయం ప్రమాణంగా చెపుతున్నాను. సుర 84.16-19 ప్రకారం తన పేగన్ వారసత్వాన్ని వదులుకోలేక మహమ్మదు ఇలా అంటాడు. సంధ్యాసమయ కాంతి, రాత్రిళ్ళు సంపూర్ణ చంద్రుని కాంతి ప్రమాణంగా చెపుతున్నాను. మహమ్మద్ మాట్లాడుతున్నట్లు ఇంకా ఉదాహరణలు ఉన్నాయి. (112.14-21, 111.1-10) ఇస్లాంకు వ్యతిరేకులు కాని బెల్, వాట్ లు కూడా ఇలా రాశారు. (ఆరబెల్, డబ్ల్యు.ఎం.వాట్, ఇన్ ట్రడక్షన్ టు ఖురాన్, ఎడిబరో, 1977 పుట. 66)
ప్రతి భాగంలోనూ దేవుడే మాట్లాడాడంటే చిక్కులు ఎదురవుతున్నాయి. దేవుని సంబోధించిన సందర్భాలున్నాయి. ఒక వ్యక్తి తనను దూరంగా ఉన్న వ్యక్తిగా చూపవచ్చు. కాని దేవుని ఉద్దేశించి ప్రవక్త చెప్పిందీ అనూహ్యంగానే ఉన్నది. దేవుడు ప్రమాణం చేసినట్లు తనమీద తానే ఒట్టు పెట్టుకున్నట్లు అందరూ గుర్తించే భాగం ఒకటున్నది. 19.64 దేవుని ఆజ్ఞ వలన మేము వచ్చాము. మా ముందూ, వెనుకా, మధ్య ఉన్నదంతా దేవునిదే. స్వర్గభూమి మధ్య ఉన్నదంతా దేవునిదే. దేవుడు విస్మరించడు. అతడిని సేవించాలి. సహనంతో పూజించాలి.
సుర 37.161-166లో దేవతలు స్పష్టంగా మాట్లాడినట్లు ఉన్నది. అంత స్పష్టంగా లేని చోట్ల కూడా ఇలాంటివి అన్వయించవచ్చు. దేవుడు తనను గౌరవంగా పిలుచుకున్నట్లు వ్యాఖ్యానించే దానికంటే దేవతలు మాట్లాడారని చెప్పటానికి వీలుగా మేము అని అర్థం వచ్చే వ్యాఖ్యానం చేస్తే సరిపోతుంది. దేవునికి అంటగట్టే కొన్ని విషయాలు సరిగా లేవు. దేవుని ఉద్దేశించినవి కూడా అతడే మాట్లాడినట్లు చెప్పటంతో గందరగోళం తప్పదు.
ఖురాన్ లో పరాయి పదాలు
ముస్లిం భాషావేత్తలు ఖురాన్ లో పరాయి పదాలు ఉన్నాయని గుర్తించినా సనాతనులు వారిని నోరు మూయించారు. ఒక సంప్రదాయం ప్రకారం ఖురాన్ లో అరబ్బీ తప్ప వేరే ఉన్నదని చెపితే దైవానికి వ్యతిరేకంగా మాట్లాడినట్లే. సుర 12.1 అరబిక్ ఖురాన్ సృష్టించాం. అల్ సుయూతి వంటి భాషావేత్తలు సనాతనుల అభ్యంతరాలను తప్పుకోటానికి సొంత వాదనలు చేశారు. ఖురాన్ లో పరాయి పదాలున్నాయని అల్ తాలిబీ వాదించారు. ఐతే అరబిక్ లోకి మార్చుకున్నారు గనుక అవి అరబిక్ గానే పరిగణించాలి. అల్ సుయూతీ 107 పరాయి పదాలు, ఆర్థర్ జఫ్రి 275 పరాయి పదాలు ఖురాన్ లో పేర్కొన్నారు. ఇవి ఆరమిక్, హిబ్రూ, సిరియన్, యుధియోపియన్, పర్షియన్, గ్రీక్ పదాలు, ఖురాన్ అనే పదం సిరియన్ నుండి వచ్చింది. క్రైస్తవ ఆధారాల ద్వారా మహమ్మదు దానిని స్వీకరించి ఉండవచ్చు.
పాఠాంతరాలు
ఖురాన్ ను గురించి ముస్లింలు చెప్చే అర్థరహిత మూర్ఖ వాదాలు గమనించాలంటే ఖురాన్ విభిన్న పాఠాంతరాలను అధ్యయనం చేయాలి. ఖురాన్ ఇది అని కచ్చితంగా చెప్పగల గ్రంథమేదీ లేదు. ఆ పవిత్ర పుస్తకానికి నిర్దుష్టత లేదు. ఖురాన్ దైవం ఇచ్చిందని ముస్లింలన్నప్పుడు ఏ ఖురాన్ అని అడిగితే చాలు. అతనిలో నిర్థారణ సడలిపోతుంది.
క్రీ.త. 632లో మహమ్మదు చనిపోయిన తరువాత అతడి ప్రసంగాల సంకలనం జరగలేదు. అతని అనుచరులు తెలిసినంత వరకూ క్రోడీకరించి రాయటం మొదలు పెట్టారు. ఇబ్నమసూద్, ఉబయ్ కాబ్, అలీ, అబూబకర్, అల్అషారి, అల్అస్వాద్ మొదలైన పండితులు ఈ సేకరణ చేశారు. ఇస్లాం వ్యాపించే కొద్దీ మక్కా, మదీన, డమాస్కస్, కుఫా, బస్రా వంటి నగరాలలో క్రోడీకరణ సాగిపోయింది. మదీనాలో అధికారికంగా క్రోడీకరించి ఉత్మన్, ఆప్రతులను ఇతర నగరాలకు పంపి మిగిలినవన్నీ నాశనం చేయమన్నారు.
ఉత్మన్ ప్రామాణీకరించి, అధికారికంగా వెలువరించిన అనంతరం కూడా భిన్న పాఠాంతరాలు నాలుగవ ఇస్లాం శతాబ్దం వరకూ ఉన్నాయి. ఈ ప్రామాణిక గ్రంథంలో పద విరమణ సంచికలు లేవు. కొన్ని అక్షరాలు గుర్తించటానికి వీలులేకుండా ఉన్నాయి. (.F,Q,J,H., Kh, S-D, R-Z, S-Sh, D-Dh, T-Z .తేడాలు లేకుండా ఉన్నాయి. అందువలన భిన్న అర్థాలకూ, పాఠాంతరాలకూ దారితీసింది. అచ్చులవలన సమస్య ఇంకా పెరిగిపోయింది. అరబ్బులకు హ్రస్వ అచ్చులు చూపే సంజ్ఞలు లేనందున తరువాత రోజుల్లో వీటిని చేర్చారు. అరబ్బు లిపి హల్లులతో కూడినది. అచ్చులపైన, లేదా కింద చుక్కలూ, సంజ్ఞలూ చిన్న అడ్డు గీత, స్వల్ప విరామ గుర్తు పెట్టారు. హల్లుల విషయం పరిష్కరించిన తరువాత అచ్చులు నిర్ణయించటంలో భిన్న పాఠాంతరాలు వచ్చాయి.
ఈ కష్టాలవలన వివిధ కేంద్రాలలో వారి సొంత ప్రమాణాలతో సంప్రదాయాలను పుస్తకాలలో చేర్చారు. ఉత్మన్ ఉత్తరువులు ఉన్నప్పటికీ అంతకు ముందే సేకరించిన గ్రంథాలు కూడా కొనసాగాయి. చార్లెస్ ఆడమ్స్ ఇలా రాశాడు. ఉత్మన్ తిరుగులేని ఉత్తరువులిచ్చినప్పటికీ వేలాది పాఠాంతరాలు అనేక చరణాలకు వచ్చాయి. వీటివలన ఉత్మన్ క్రోడీకరించిన వాటిని కూడా కొన్ని అవ్వయించారు. ఏది మూలమూ కాదో చెప్పలేని స్థితి ఏర్పడింది. (ఎన్ సైక్లోపీడియా ఆఫ్ రెలిజియన్ లో ఖురాన్, ఆడమ్స్ ఆర్ట్) కొందరు ముస్లింలు ఉత్మన్ క్రోడీకరించిన వాటికంటే ఇబ్నమసూద్, ఉబయ్ ఇబ్నకాబ్, అబూమూసా క్రోడీకరించిన వాటిని స్వీకరించారు. ఇబ్న ముజాహిద్ (క్రీస్తు తరువాత 935లో మరణించాడు.) గొప్ప కొరాన్ పండితుడు. అతని ప్రభావం వలన హల్లులతో నిర్ధారించిన ప్రమాణ గ్రంథం అచ్చులను పరిమితంగా వాడటం అంగీకరించారు. అందువలన 7 విధానాలు ఆమోదించబడ్డాయి.
1. మదీనాకు చెందిన నఫీ (క్రీ.త. 785 మరణం)
2. ఇబ్న కతీర్, మక్కా (737 మరణం)
3. ఇబ్న అమీర్, డమాస్కస్ (736 మరణం)
4. ఆబూ అమర్ బస్రా (770 మరణం)
5. అసీమ్, కుఫా (744 మరణం)
6. హంజ, కుఫా (772 మరణం)
7. అల్ కి సాయ్, కుఫా (804 మరణం)
ఇతర పండితులు పది పాఠాంతరాలనూ, మరికొందరు 14 పాంఠాంతరాలను ఆమోదించారు. ఇబ్న ముజాహిద్ పేర్కొన్న ఏడింటిలోనూ 14 పాఠాంతరాలకు అవకాశం ఉన్నది. ఈ ఏడూ రెండేసి ఆధారాల ద్వారా వచ్చాయి.
నఫి, మదీనాకు వార్డ్, కాలూన్ వలన సంక్రమించాయి.
అల్ బాజీ, కున్ బుల్ నుండి ఇబ్న కతీర్ కు, మక్కా
హిషామ్, ఇబ్నదఖవన్ నుండి ఇబ్న అమీర్ కు
అల్ దురి, అల్ సుసీ నుండి అబూ అమర్ కు
హఫ్స్, అబూబకర్ నుండి అసిమ్ కు
ఖలాఫ్, ఖలాల్ నుండి హంజాకు
అల్ దురీ, అబుల్ హరిత్ నుండి అల్ కిసాయ్ కు సంక్రమించాయి.
జెఫ్రీ ప్రకారం చివరకు 3 విధానాలు ఆధిక్యతలోకి వచ్చాయి. వార్ష్ (812లో మరణం), హఫ్స్ (805లో మరణం), అల్ద్ దూరి (860లో మరణం) అనే మూడు ఆధారాలు పూర్తిగా వివరణకు నోచుకోలేదు. (జఫ్రీ, ప్రోగ్రెస్ ఇన్ ది స్టడీ ఆఫ్ ది ఖురాన్ టెక్ట్స్, ముస్లిం వరల్డ్ సంపుటిః 25, పుటః 11)
ఆధునిక ఇస్లాంలో రెండూ పాఠాంతరాలు వాడుకలో ఉన్నాయి. హఫ్సా ద్వారా కుఫాకు చెందిన అసీమ్ కు సంక్రమించిన కొరాన్ లో 1924 ఈజిప్టు ప్రతిగా అధికార ముద్రవేసి ఆమోదించారు. ఈజిప్టు వెలుపల ఆఫ్రికాలో కొన్ని చోట్ల వార్ ద్వారా నఫీకి సంక్రమించిన పాఠాన్ని స్వీకరించారు. ఛార్లెస్ ఆడమ్స్ ఇలా రాశాడు.
ఖురాన్ వివిధ పాఠాంతరాలను గురించి అవగాహన లేకపోవటం గమనించాలి. లిఖిత మౌఖిక పాఠాలలో ఏడు రకాల పుస్తకాలున్నాయి. ఈ ఖురాన్ పాఠాంతరాల తేడాలు వాస్తవం. పవిత్ర గ్రంథం అనే ముస్లిం భావనకు ఖురాన్ పాఠాంతరాలు పవిత్రతను పోగొడుతున్నాయి. 7 రకాల కొరాన్లు సంకీర్తనల తేడాలు అని కొందరు వివరించబోయారు. కాని అందులోనూ భిన్నత్వం ఉన్నది. (ఏడమ్స్ ఆర్ట్, ఎన్ సైక్లోపీడియా ఆఫ్ రెలిజియన్ లో ఖురాన్)
గైలామ్ కూడా పాఠాంతరాలను ప్రస్తావించి వీటి ప్రాధాన్యత స్వల్పమయిందేమీ కాదన్నారు. (ఇస్లాం లండన్ 1954 పుటః 189)
సనాతన ముస్లింలకు భిన్న పాఠాంతరాలు. పఠనాలు తీవ్ర సమస్యలను సృష్టిస్తున్నాయి. ఉత్మన్, గ్రంథం నుండి విభేదిస్తున్న వాటిని వారు దాచి పెడుతున్నారు. ఆర్థర్ జఫ్రీ దాచిపెట్టే అంశాన్ని ఇలా రాశాడు. కీర్తి శేషులు ప్రొఫెసర్ బర్గ్ స్ల్రాసర్ పురావస్తు గ్రంథాలనుండి ప్రాచీన కూఫీ క్రోడీకరణలు ఫొటోలు తీశారు. అజర్ లైబ్రరీలో వింత లక్షణాలున్న పాఠాంతరాలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. వాటిని ఫొటో తీయడానికి ఆయన అనుమతి ఇవ్వలేదు. పాశ్చాత్య పండితుడికి భిన్నత్వాల పాఠాంతరాలు చూపగూడదని సనాతనులు భావించారు. వారి ఆసక్తి దృష్ట్యా ఇలా దాచిపెడుతున్నారు. (మోరే, పుటః121, ఇస్లాం ఇన్వేజన్ యూజిన్, 1992)
నిర్దుష్ట (సంపూర్ణ) అరబిక్
ఖురాన్ లో శైలి బలహీనతలను సుప్రసిద్ధ పండితుడు నాల్డెక్ వివరించాడు. (ఎన్ సైక్లోపేడియా బ్రిటానికా, 11వ ప్రచురణ, 15వ సంపుటి, పుటః 898-906)
ఖురాన్ లో అనేక భాగాలు ఆకర్షణీయమైన భాష నిర్మాణంతో ఉన్నప్పటికీ, రమణీయకత దృష్టితో చూస్తే నమ్మకం లేని వాళ్ళకు సహితం ఇది ఉత్తమ శ్రేణికి చెందింది కాదు. సుదీర్ఘంగా ఉండవలసిన చోట హఠాత్తుగా ఆపేశారు. తప్పనిసరిగా చూపించవలసిన సంబంధాలు, సంఘటనల క్రమం వదిలేశారు. కనుక వీటి చరిత్ర అవగాహన చేసుకోటం కష్టం. కృత్రిమ పదజాలం కొన్ని చోట్ల ఉన్నది. క్రమంగా చెప్పుకుంటూ పోవటం అనేది లేనేలేదు. జోసఫ్ చరిత్రతో పోల్చి చూస్తే వంశక్రమాల చరిత్ర బైబుల్లో అభినందనీయంగా సృష్టించి రాశారు. ఖురాన్ లో ఇలాంటి దోషాలు మరికొన్ని చోట్ల కూడా దొర్లాయి. భావాల పొందిక లేదు. వాక్య నిర్మాణంలో వక్రంగా ఉంటుంది. ఇలా ఎందుకు రాశారో తెలియదు. చాలా వాక్యాలు ఎప్పుడు ఆనాడు అని గాలిలో మాట్లాడినట్లు రాశారు. భాష్యకారులు దానికి ఇష్టం వచ్చిన అర్థాలు చేర్చే అవకాశం ఇచ్చారు. పదాలు అనవసరంగా పునరావృతం చేశారు. మహమ్మదు శైలిలో నిపుణుడు కాదు.
ప్రవక్త శైలిని గురించి అలీదస్తీ విమర్శలున్నాయి. ఖురాన్ లో వ్యాకరణ దోషాలను అలీదస్తీ చూపాడు. (23 ఇయర్స్ లండన్, 1985, పుటః 49-50) ఉదాహరణకు 162 చరణంలో సుర 4లో దోషాలు చూడవచ్చు. అలాగే సుర 49 చరణం 9, సుర 20 చరణం 63లోనూ ఇలాంటి దోషాలున్నవి. దీనిపై అలీ దస్తీ ఇలా వివరణ ఇచ్చాడు. ఓతమన్ అయేషా, హధామెనే అని మాంత్రికులకు సంబంధించిన పదాన్ని చదివారు. ముస్లిం పండితులు ఇలాంటి వాటిపట్ల కళ్ళు మూసుకున్నారు. దైవ వాక్యాలుగా కొరాన్ ను పేర్కొన్నందున దోషాలు ఉండవనీ, హద్యానె అని ఓత్ మన్, ఆయేషాలు చదవటం తప్పనీ, హదానె అనటం సరైందనీ పేర్కొన్నారు.
ఖురాన్ లో మామూలు నియమ నిబంధనలను అతిక్రమించే సందర్భాలు వందకు పైగా ఉన్నాయని అలీ దస్తీ చూపాడు.
కనిపించని చరణాలు, చేర్చిన చరణాలు
ప్రవక్త భార్య ఆయేషా సంప్రదాయం ప్రకారం రాళ్ళతో కొట్టటం వ్యభిచారంలో శిక్షగా ఉన్నదని చెప్పారు. అది ఖురాన్ లో భాగంగా ఉండేది. నేడది కనిపించటంలేదు. తొలి ఖలీఫాలు అలాంటి శిక్షలు అమలు జరిపారు. నేటి కొరాన్ ప్రకారం వ్యభిచారానికి 100 కొరడా దెబ్బలు మాత్రమే విధించాలి. కొరడా దెబ్బలు కాక నేటికీ ఇస్లాం చట్టం రాళ్ళతో కొట్టే శిక్షను ఎందుకు ఆమోదిస్తున్నదో అర్థం కాదు. ఈ సంప్రదాయం ప్రకారం వంద చరణాలు కనిపించటం లేదు. రాజకీయ కారణాలవలన అలీకి అనుకూలమైన చరణాలన్నీ ఉత్మన్ వదిలేశాడని షియాలంటారు.
ప్రవక్త కొన్ని చరణాలు మరచిపోయి ఉండవచ్చు. అతని అనుచరులకు కొన్ని జ్ఞాపకం ఉండకపోవచ్చు. రాసిన వారు కొన్నింటిని వదిలేసి ఉండవచ్చు. మహమ్మదు కొన్ని చరణాలు వదిలేశాడనటానికి సైతాను చరణాల ఉదంతమే ఉదాహరణ.
ఆధునిక పాశ్చాత్య పండితులేగాక ముస్లింలు సైతం చాలా చరణాలను ప్రశ్నించారు. ఆలీని ఇస్లాం తొలిరోజులలో అనుసరించిన కారిజైట్లు, జోసెఫ్ కు సంబంధించిన సుర చాలా తీవ్రమైనదిగా భావించి అందులోని కామ సంబంధమైన కథ ఖురాన్కు చెందింది కాదన్నారు. వాన్స్ బ్రోకు ముందు కూడా డిసాసీ, వైల్, హర్ష్ ఫీల్డ్, కాసనోవా వంటి పండితులు కొన్ని సురలు, చరణాలను అధికారికం కావన్నారు. వారి వాదనలు ఒక పట్టాన ఆమోదించటం లేదు. వాన్స్ బ్రో వాదనలు యువతరం పండితులను ఆకర్షించాయి. వృద్ధ పండితుల నిరోధక ధోరణులు ఇందులో లేవు.
చాలామంది పండితులు ఖురాన్ లోకి అనేక విషయాలు వచ్చి చోటుచేసుకున్నాయని నమ్ముతున్నారు. కొన్ని మారుమూల పదాల వివరణలో ఇలాంటి వాటిని చొప్పించారు. 42.36-38 సురలు వలె కొన్ని రాజకీయ స్వభావంతోనూ, మొండి వాదనలతోనూ ప్రవేశపెట్టారు. ఉత్మన్ ఖలీఫాగా ఉన్నత స్థానానికి పోవడం, ఆలీని వ్యతిరేకించటం కొన్ని సురలలో కనిపిస్తుంది. ప్రాసకోసం, మకుటం కోసం కొన్ని చేర్చారు. సంబంధాల పొందిక కోసం కొన్ని చేర్చారు.
మార్పులనూ, చేర్పులనూ జాగ్రత్తగా పరిశీలించిన బెల్, వాట్ ఖురాన్ శైలిలో ఒకే తీరు లేకపోవటం, మార్పులకు సాక్ష్యం అన్నారు. (ఇన్ ట్రడక్షన్ టు కొరాన్, ఎడింబరో 1977, పుట 93.)
ఖురాన్ మార్పులు చేశారనటానికి కొన్ని భాగాలు మొరటుగా కనిపించటం ఒక ఉదాహరణగా పేర్కొనవచ్చు. హఠాత్తుగా చరణశైలి మారటం, వేరే చరణంలో క్రితం చరణం పదాలను పునరుచ్ఛరణ చేయటం, పొందికగా ఉన్నచోట కొత్త విషయాన్ని చేర్చటం, ఒకే విషయాన్ని భిన్న తీరులలో చెప్పటం, వాక్య నిర్మాణంలో వ్యాకరణ జటిలత్వం, ఒక్కొక్క చరణం సుదీర్ఘంగా ఉండటం, సన్నివేశంలో హఠాత్తు మార్పులు చేయటం, సర్వనామాలలో ఏకవచనం నుండి బహువచనంకు పోవటం, ద్వితీయం నుండి ఉత్తమ పురుషానికి పోవటం, పరస్పర విరుద్ధ ప్రకటనలు ఒకచోటే ఉంచటం, భిన్న సమయాలకు సంబంధించిన వాటిని ఒకచోటే ఉంచటం, మొదలైనవన్నీ చేర్సులకూ, మార్పులకూ సాక్ష్యం.
క్రీ.త. 830లో అల్ కింది ఖురాన్ ను విమర్శిస్తూ, ఇలా రాశాడు. (ముస్లిమ్స్, వ. రిపిన్, పుటః26 సంపుటి 1, లండన్, 1991) ఖురాన్ ను చదివేవారికి అందులో చరిత్రలు మిళితమై కలగాపులగంగా మారినట్లు తెలుస్తుంది. అనేక మంది అందులో చేతులు పెట్టారు. కనుక తేడాలు వచ్చాయి. ఇష్టఇష్టాలను బట్టి మార్పులూ, చేర్పులూ చేశారు. దైవం నుండి వచ్చిన గ్రంథం అలా ఉంటుందా ?
సుర 20లో 15వ చరణం ఏ మాత్రం అక్కడ ఉండటానికి తగదు. మిగిలిన సురలు శైలికి దీనికీ భిన్నత్వం ఉన్నది. 78వ సురలో ఒకటి నుండి 5 వరకూ కృత్రిమంగా చేర్చారు. అక్కడ రాగం, ధోరణి, మిగిలిన వాటికంటే భిన్నంగా ఉన్నాయి. 32-35 చరణాల మధ్య 33-34 చరణాలను ప్రవేశపెట్టారు. 74వ సురలో 31వ చరణం ప్రవేశపెట్టిందే. భిన్నత్వం స్పష్టంగా చూడవచ్చు. 50వ సురలో 24-32 చరణాలు కృత్రిమంగా జొప్పించారు.
కొన్ని పదాలూ సమాసాలూ అరుదుగా ఉన్న వాటిని వివరించటానికి సొంత పదాలను చేర్చారు. ఇలాంటి వివరణలు 12 చోట్ల ఉన్నాయి. 101.9-11 సుర గురించి బెల్ వాట్ పేర్కొంటూ తరువాత చేర్చిన వాటికి ఉదాహరణగా దాన్ని చూపారు. (ఇన్ట్రడక్షన్ టు కొరాన్, పుట.94-95, ఎడింబరో, 1977)
ఇలా చేర్చినవి ఎంత స్వల్పమైనవి ఐనా కొరాన్ దైవదత్తమనీ, మహమ్మదుకు అది సంక్రమించిందని చెపుతున్న ముస్లిం పిడివాదానికి చావుదెబ్బ కొట్టాయి. ఇస్లాం అధికారిక వాదానికీ, పాశ్చాత్య భాషా పండితులు కనుగొన్న దానికీ సమన్వయం కుదర్చటం అసాధ్యమని రెగిన్ బ్లాకర్ తన ఇన్ట్రడక్షన్ టు కొరాన్ లో రాశాడు.
అబ్దుల్లా, సాద్ అబీసార్ కథకూడా ఉదహరించవచ్చు. (అలీదస్తీ, పుట 98)
మదీనాలో ఒక రచయితను దైవ ప్రేరణలు రాయడానికి నియోగించారు. ప్రవక్త అనుమతితో చరణాల చివరి మాటలను అతడు అనేక సందర్భాలలో మార్చాడు. దేవుడు శక్తిమంతుడూ, వివేకి అని ప్రవక్త చెప్పగా అబ్దుల్లా రాస్తున్నప్పుడు తెలిసినవాడు, వివేకి అని మార్చులు సూచించగా ప్రవక్త అభ్యంతర పెట్టలేదు. ఇలాంటి మార్పుల పరంపర గమనించిన అబ్దుల్లా దైవ ప్రేరణలను ఒక లేఖకుడు సూచించనంత మాత్రాన మార్చారంటే, అందుకు నిరసనగా అబ్దుల్లా ఇస్లాంను వదిలేశాడు. మక్కా వెళ్ళిపోయి కొరాషియైట్లలో చేరాడు.
మక్కాను వశపరచుకొన్న ప్రవక్త అబ్దుల్లాను చంపమన్నాడు. ఉత్మన్ అతి కష్టంమీద మహమ్మదు క్షమించటట్లు చేశాడు.
ఖురాన్ లో కొన్ని భాగాల తొలగింపు
బైబిల్ లో పరస్పర విరుద్ధాలు రాసిన విలియం హెన్రీబర్, కొరాన్ లో కొల్లలుగా ఉన్న పరస్పర విరుద్ధాల గురించి ఎగిరి గంతేసి ఉంటాడు. కాని అతడి ఆనందం ఆట్టే కాలం నిలవ లేదు. ముస్లింలు ఒక చక్కని సాకు అడ్డం పెట్టుకున్నారు. హుగ్స్ దీనిని వివరిస్తూ రాశాడు. మహమ్మద్ ప్రవక్త కాలంలో ప్రధానంగా కనిపించిన అవకాశవాదం ఒక చట్టంగా రూపొందింది. (డిక్షనరీ ఆఫ్ ఇస్లాంలో ఆర్ట్ ఖురాన్ పుటః520) సిద్ధాంతం ప్రకారం ఖురాన్ లో ఉత్తరోత్తరా వచ్చిన దైవ ప్రేరణలతో లోగడ ఉన్న కొన్ని భాగాలను తొలగించి నింపారు. సుర 2.105లో మహమ్మద్ ఈ విషయం నేర్పాడు.
దేవుడు రద్దు చేసిన చరణాలు లేదా మీరు మరచిన వాటి స్థానే, ఇంకా శ్రేష్ఠమైనవి లేదా అలాంటివి ప్రవేశపెడతాము 5 నుండి 500 వరకు ఇలా ప్రవేశపెట్టి, తొలగించిన చరణాలున్నాయని అల్ సుయూతి చెప్పాడు.
మార్గోలియత్ ఇలా రాశాడు. ఒక సందేశాన్ని అందివ్వడానికి ఉపసంహరించడానికి దైవానికి అధికారం ఉన్నదని మహమ్మద్ చెప్పాడు. అలాంటి రాజీ ప్రతిపాదన ఎలా చేర్చారనేది మిత్రులు శత్రువులూ అశ్చర్యపోవడం సహజం.
అల్ సుయూతి ఉదాహరణనిస్తూ 2.240 సుర తొలగించి 234 చరణం ప్రవేశపెట్టారన్నారు. ఇలా చేయటం ఎలా సాధ్యపడుతుంది ? సంప్రదాయ ముస్లిం సురలు, చరణాలు కాలక్రమంగా లేవు. పెద్ద అధ్యాయాలను తొలుత అట్టిపెట్టారు. సిద్ధాంత కారణాలుగా భాష్యకారులు ఈ క్రమాన్ని నిర్ణయించారు. మక్కా మదీనా కాలాలకు సంబంధించిన సురలను గురించి స్థూలంగా అంగీకారం ఉన్నది. దేవుని నిత్యం అనే పదం కాలానికి ఎలా బందీ అయిందో గమనించాలి.
ముస్లింలు ఒక ఊబిలోనుంచి బయటపడి మరొక దానిలో ప్రవేశించారు. సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు అయిన దేవుడు తన ఆజ్ఞలను తిరగదోడడం సమంజసమా ? తరచు వాటిని మార్చుకుంటూ అతడు పోయాడా ? అన్నీ తెలిసిన వాడైతే తొలుతే సరిగా ఎందుకు చెప్పలేదు. ఉత్తమ చరణాన్ని ముందే ఎందుకు బయటపెట్టలేదు. దస్తీ ఇలా రాశాడు. (23 ఇయర్స్, ఎ స్టడీ ఆఫ్ ది ప్రోఫెటిక్ కెరియర్ ఆఫ్ మహమ్మద్, పుట 155, లండన్, 1985)
ఆ రోజుల్లోనూ వెక్కిరించే వారున్నారు. సుర 16, 103, 104 చరణాలలో వారికి సమాధానం ఇచ్చారు. ఒక చరణానికి బదులు, ఇంకో చరణం ప్రవేశపెట్టినప్పుడు ఏది ఇవ్వాలో దైవానికి తెలుసు. కాని ఇదంతా మీరల్లినదేనని వారు వెక్కిరించారు. వారికి తెలియదు. వారితో చెప్పండి. ‘పవిత్రదేవత నమ్మకస్తులకు నిర్ధారణగా చెప్పే నిమిత్తం వాటిని దైవం నుండి తెచ్చింది.’ “ఖురాన్ దైవదత్తమైతే అందులో మానవుడి సంపూర్ణతలకు తావు లేదు. కాని కొరాన్ చరణాలలో పొందికలేని విషయాలు స్చష్టం. ఏది ఇవ్వాలో దైవానికి తెలుసుననుకోండి. ఒక చరణం స్థానే మరొకటి రావడంతో అభ్యంతర పెట్ఠేవారి అనుమానాలు బలపడ్డాయి. హెజాజీ అరబ్బులవంటి నిరక్షరాస్యులు సహితం దేవుడు ఉత్తమమైన దానినే ఇస్తాడనీ, మనుషులవలె క్షణికంగా మారడనీ తెలుసుకున్నారు.
ఖురాన్ లో ఈ విధంగా తొలగింపులు చేసే పద్ధతిని వెక్కిరించటం సహజం. నిత్యమూ, అపౌరుషేయమూ, విశ్వజనీనమూ అయిన దేవుని మాటలను, కాలదోషం పట్టాయని మార్పు చేయటం ఎలా వీలవుతుంది. దేవుని మాటలలో కొన్ని మాత్రమే బాగున్నాయని అనగలమా?
మూర్ చెప్పినట్లు 1200 చరణాలను తొలగించి వేరే వాటిని ప్రవేశపెట్టారు. ఒకవైపున దైవదత్తంగా ఖురాన్ పారాయణం చేస్తూ, కొన్ని భాగాలు సరైనవి కాదనగలమా? ఖురాన్ లో 3 శాతం తప్పుడువని గుర్తించారు.
ఒక ఉదాహరణ చూద్దాం. ఖురాన్ సుర 2.219లో మద్య నిషేధం ప్రస్తావించినందున ముస్లింలు తాగగూడదన్నారు. సుర 16.67లో సారాయి. ఆరోగ్యప్రదమైన పోషక ద్రవం లభిస్తుందని ఉన్నది. (రాడ్ వెల్) మత్తెక్కిన వారున్నారని దావూద్ ప్రస్తావించాడు. పికెట్ హాల్ రాసిందానిలో మత్తు పదార్థ సేల్ ప్రస్తావించాడు. యూసఫ్ ఆలీ సాకార్ అనే మాటను సంపూర్ణ ద్రవపదార్థంగా పేర్కొని ఇది సారాయి కాదన్నాడు. పులిసిన ద్రాక్షరసం అనే అర్థంలో సాకార్ ను వాడితే త్రాగేవారని అడ్డుపెట్టని రోజుల్లో ఈ విషయం అన్వయించి చూసుకోవాలన్నాడు. నిషిద్ధం మదీనా నుండి వచ్చిందనీ, సుర మక్కాకు చెందిందనీ అన్నాడు.
పండితులు తప్పుకోవటానికి వీలుగా సమయోచిత తొలగింపు సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. ఇస్లాం పండితులకు సమస్యలు తలెత్తాయి. తొలి సురలలో మక్కాకు సంబంధించిన వాటిలో సహనబోధ ఉన్నది. సహనం స్థానంలో అసహనాన్ని ప్రవేశపెట్టి మదీనా సుత్తాలు చంపడాన్ని సిఫారసు చేశాయి. 124 చరణంలో సహనం ఓర్పు ఉండగా దాని స్థానే నమ్మకం లేని వారిని ఎక్కడ కనిపించినా చంపమని 9.5 సుర చెపుతున్నది.
ఖురాన్ సిద్ధాంతాలు
దేవుడు తప్ప మరొక దైవం లేదు. ఇస్లాం రాజీపడని ఏకేశ్వరాధన పాటిస్తుంది. దేవుడులో భాగం పంచుకోటం అనేది గొప్ప పాపంగా పరిగణిస్తుంది. బహుదేవతారాధన, విగ్రహారాధన, పేగన్ వాదం, బహుముఖ దివ్యత్వం, అరబిక్ దృష్టిలో ఘోరమైన పాపాలే బహుదేవతావాదం కంటే ఏకేశ్వర వాదం ఉన్నతమైనదని మత వాదులూ 19వ శతాబ్దంలో సాంస్కృతిక పరిణామ వాదులూ, నిశిత పరిశీలన లేకుండానే భావించారు. బహుదేవతారాధనకు తాత్వికులు ఇటీవలి వరకూ శ్రద్ధవహించలేదు. తాత్వికంగా, అధిభౌతికంగా, బహుదేవతారాధనకంటే ఏకేశ్వరవాదన ఉన్నతమైనదా? ఐతే ఏ విధంగా ? బహుదేవతారాధన నుండి ఏకేశ్వర వాదనకు సహజ పరిణామం జరగి ఉంటే, ఏకేశ్వర వాదం నుండి నాస్తిక వాదానికి సహజ పరిణామం జరగ లేదా ? ఏకేశ్వర వాదన పోయి ఉన్నతమైన నాస్తిక వాదం, అజ్ఞేయవాదం ద్వారా రాలేదా?
ఏకేశ్వర వాదం తాత్వికంగాగానీ, అధిభౌతికంగాగానీ, బహుదేవతారాధనకంటే ఉన్నతమైనది కాదు. ఒకే దేవుడు ఉన్నాడనటానికి రుజువులేమీ లేవు.
చారిత్రకంగా మాట్లాడితే ఏకేశ్వరవాదానికి రహస్యంగా జనం స్థాయిలో బహుదేవతారాధనను పాటించింది. అధికారిక పిడివాదం ఎలా ఉన్నా ఇది వాస్తవం.
మూఢనమ్మకాలు ఏకేశ్వర వాదానికి కుదించటం కాక ఒకే దేవుడు అతడి దూతలో కేంద్రీకరించాయి.
ఏకేశ్వరవాదం తరచు అసహనంలో ఉగ్రరూపం దాల్చింది. దీనితో పోల్చిచూస్తే చారిత్రకంగా బహుదేవతారాధన పక్షాన మత యుద్ధాలు జరగలేదు. ఏకేశ్వరవాదన సిద్ధాంతం నుండి అసహనం తార్కికంగా జనించింది. దీనికి ఏకేశ్వర వాదమే సమాధానం చెప్పాలి. గోర్ వైడల్ ఇలా రాశాడు. (న్యూ స్టేట్స్ మన్ సొసైటీ, 1992, జూన్ 26, పుటః12)
ఏకేశ్వరవాదం మన సంస్కృతిలో పెద్ద దోషం. పాత నిబంధన నుండి యూదు, క్రైస్తవ, ఇస్లాం మతాలు అమానుషంగా పరిణమించాయి. ఆకాశ దేవుళ్ళ మతాలివి. పితృస్వామ్య పెత్తనంతో కూడినని. దేవుడు సర్వశక్తివంతమైన పితామహుడు. ఈ మతాలు వాటిననుసరించిన పురుషులు ఆయా దేశాలలో 2వేల సంవత్సరాల నుండి స్త్రీలను జుగుప్సతో చూశారు. ఈ ఆకాశ దేవుడు ఈర్ష్యాపరుడు. పూర్తిగా విధేయత కావాలంటాడు. అతనిని నిరాకరిస్తే మతం మార్చాలనీ, లేదా చంపేయాలంటాడు. ఆకాశ దేవుని ప్రయోజనాన్ని తీర్చగల రాజకీయం నియంతృత్వంలోనే ఉన్నది. ఉదార స్వభావంతో కూడిన ఉద్యమాలు దేవుని పెత్తనానికి ప్రమాదకరాలు. ఒకే దేవుడు, ఒకే రాజు. ఒకే పోప్, ఒకే కర్మాగార యజమాని, కుటుంబానికి తండ్రి నాయకత్వం ఈ ధోరణిలోవే.
అరేబియా బహుదేవతారాధనను ఇస్లాం తొలగించలేదు. అరబ్బుల ఆధ్యాత్మిక అవసరాలను అది తీర్చింది. ఈ లోకంలోనే అవకాశాలు పొందే తీరు చూపింది. ఏకేశ్వరాధన ఆధిక్యత సమర్ధనీయం కాదు. అరేబియాలో ఇస్లాంను అనుకరించే కారణాలను చరిత్రకారులు పాక్షికంగా చూచారు.
అరబ్బుల నైతిక స్ధాయిని పెంచేబదులు ఇస్లాం అన్ని విధాలైన అవినీతి ప్రవర్తనలను ఆమోదించింది.
ఏకేశ్వర వాదన ఒకరకంగా ఆదిమ దేవుళ్ళనుండి క్రమాన్ని తెచ్చి మూఢనమ్మకాలను తగ్గించిందనాలి. ఇది పైకి కనిపించేంత నిజం కాదు. (జివెర్బలోస్కీ ఇలా పరిశీలించాడు. ఎన్ సైక్లోపీడియా ఆఫ్ రెలిజియన్ లో బహుదేవతారాధన) బహుదేవతారాధన స్థానే ఏకేశ్వరాధన వచ్చినప్పుడు కొందరు దేవతల్ని రద్దు పరచటం లేదా దయ్యాలుగా మార్చటం, దేవతలూ, దూతలుగా స్థాయి తగ్గించి చూడటం గమనించవచ్చు. అంటే ఏకేశ్వరాధన విధానం ఆచరణలో బహుదేవతారాధనను కొనసాగిస్తున్నదన్నమాట.
హ్యూం ఇలా పరిశీలించాడు. (ఎంక్వైరీస్ కన్ సర్నింగ్ ది హ్యూమన్ అండర్ స్టాండింగ్స్ అండ్ కన్ సర్నింగ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ మోర్ ల్స్, ఆక్స్ ఫర్డ్, 1966, పుట 56)
మత సూత్రాలు మానవుడి మస్తిష్కంలో మారుతూ వచ్చాయి. విగ్రహారాధన నుండి మతవాదనకూ, తిరిగి దానికి మారుతూ తిరోగమించడం గమనించవచ్చు. మానవులు సుఖాన్వేషణలో ఈ అదృశ్య శక్తుల భావాలను దేనికీ అంటిపెట్టుకొనక మారుతూ వచ్చారు. పరిమిత శక్తినీ, మానవ విధిని నిర్ధారించే శక్తినీ, ప్రకృతిని నడిపించే శక్తినీ ఆపాదించారు. తమ దేవతలను సంపూర్ణ స్థాయికి పెంచారు. ఏకత్వం, అనంతత్వం, సాధారణత్వం, ఆధ్యాత్మికత అనే లక్షణాలు అంటగట్టారు. ఇవేవీ ప్రారంభించిన దశలో కొనసాగలేదు. మానవుడికీ, దేవతలకీ మధ్య కొందరు దూతలు బయలుదేరారు. వీరంతా మానవ స్వభావం గలవారే కనుక వారిని కూడా ఆరాధించారు. ఆవిధంగా విగ్రహారాధనా, ప్రార్థనలూ, స్తుతి కొనసాగాయి.
పైన పేర్కొన్నది ఖురాన్ లో ఇస్లాంలో ఎంతో సత్యం. దేవదూతలూ, అగ్ని వాయుదేవతలనూ అధికారికంగా ఖురాన్ గుర్తించింది. (డిక్షనరీ ఆఫ్ ఇస్లాం) ఎడ్వర్డ్ లేన్ ఇస్లాంలో ఆధ్యాత్మిక జీవులను 5 తీర్లుగా విభజించారు. ఇందులో మారిడ్స్ (Marids) అన్నిటికంటే శక్తివంతమైనది. కోతులూ, పందులూ మనుషులుగా మారినట్లే జాన్ అనేది జిన్ గా మారింది. మంచీ చెడుల మాట అటుంచి జిన్ జాన్ అనే వాటిని కలిపి వాడేస్తున్నారు. సైతాన్ పాపానికి ప్రతిబింబం. ఇఫ్రిత్, మారిడ్స్ శక్తివంతమైన పాపాత్ములు. స్వర్గం నుండి వచ్చే తారల తాకిడికి దోషులైన జిన్ లు నాశనమవుతున్నాయి. ఈ జిన్ లు మానవులతో కలిసి తమ సంతతిని పెంచుకుంటున్నాయి. ఇబ్లిన్ ముఠా అధిపతి 5గురి సంతానంలో జిన్ కూడా ఉన్నది. తిర్ అనే మరో శక్తి ఉపద్రవాలనూ, నష్టాలనూ, హానికలిగిస్తుండేది. అల్ అవార్ వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తుంది. సూత్ అబద్ధాలను సూచిస్తుంది. దాసివ్ భార్యాభర్తల మధ్య ద్వేషాన్ని పెంచుతుంది. ఈ జిన్ 3 విధాలు. రెక్కలు ఉండి ఎగిరేదొకటి, పాములు, కుక్కలతో కూడిందొకటి, మనుషులవలె సంచరించేది మరొకటి. గ్రీక్, రోమన్, నోర్స్ బహుదేవతారాధన గాథలవలె ఇక్కడ మూఢనమ్మకాలకు కొదువలేదు.
ఇస్లాంలో రుషుల ఆరాధన దేవుడికీ, మానవుడికీ మధ్య దూతగా ఉండేవారి ప్రయోజనాన్ని చూపుతున్నట్లు హ్యూం వివరించాడు. దీనినే గోల్డ్ జిహర్ ఇలా రాశాడు. (ముస్లిం స్టడీస్ 2 సంపుటాలు, లండన్ 1967-71, రెండవ సంపుటి, పుట 259)
ఇస్లాంలో భక్తులు దేవుడికీ మనుషులకూ మధ్య దేవదూతలనూ, మధ్యవర్తులనూ సృష్టించుకున్నారు. పాత సంప్రదాయాలలో వీరిని ఇస్లాం తొలగించింది. రుషుల ఆరాధన అక్కడ అన్వయించవచ్చుననీ కార్లహాస్ చెప్పాడు. ఏకేశ్వరాధనలో మానవుడికీ, దేవుడికీ మధ్య ఉన్న అంతరాన్ని బహు దేవతారాధన తృప్తిని సమకూర్చిపెడుతున్నది.
ముస్లిం సిద్ధాంతంలో దయ్యమనే భావన రెండు శక్తివంతమైన వాటికి దారితీస్తున్నది. దయ్యాన్ని అజాజిల్ అన్నారు. అది అగ్నిలో నుండి వచ్చింది. భూమిలో నుండి ఆదామును దేవుడు సృష్టించినప్పుడు అతడి ఉత్తరువుల ప్రకారం ఆదాం ముందు మోకరిల్లటానికి దయ్యం నిరాకరించింది. అప్పుడు ఈడెన్ తోట నుండి దయ్యాన్ని బహిష్కరించారు. తరువాత ఈ శక్తిని దేవుడు నాశనం చేయవలసి ఉన్నది. ప్రపంచంలో యుద్ధాలూ, కరువులూ, రోగాలూ మూకుమ్మడిగా జాతి హత్యలూ చూస్తే దయ్యమే శక్తివంతమైనదిగా కనిపిస్తున్నది. దీనిని దేవుడు ఇప్పటికే ఎందుకు నాశనం చేయలేదని చిక్కు సమస్య. ఆదాం ముందు మోకరిల్లి పూజించటం సైతానుపట్ల దేవుడు పొందికగా వ్యవహరించినట్లు కాదు. దేవుని తప్ప మరెవరినీ పూజించరాదని దేవుడే నిషేధించాడు కూడా.
ఖురాన్ లో దేవుని ఉనికికి తాత్విక వాదన ఏదీ లేదు. సంజ్ఞలు అనే భావన బహుశ ఇందుకు సమీపంలో ఉన్నదనవచ్చు. సహజ సంఘటనలు దేవుని శక్తికి సంజ్ఞలు అంటున్నారు.
భూమి ఆకాశాలను సృష్టించటం, మానవుడి సృష్టి, పశువుల వలన మానవుడికి ప్రయోజనాలూ, రాత్రింబవళ్ళూ, సూర్యుడు ప్రకాశించడం, చంద్రుడూ, తారలూ, గాలిమార్పు, వర్షం, ఎండిన భూమిలో చిగురించి పంటలు రావడం, సముద్రంలో నౌకల ప్రయాణం, పర్వతాల స్థిరత్వం, ఛాయలు, ఉరుములూ, మెరుపులూ, ఇనుము, అగ్ని, వినటం, చూడటం, అవగాహన, వివేచనా ఇవన్నీ దైవ ఉనికికి నిదర్శనాలుగా చూపారు. (ఇన్ ట్రడక్షన్ టు ఖురాన్, పుటః 122, బెల్, వాట్, ఎడింబరో, 1977)
తాత్వికంగా దీనినే ప్రయోజన వాదం అంటారు. దేవుని ఉనికికి ఆధారాలు చూపటానికి అందులోనూ తాత్వికులు లోపం గమనించారు. మహమ్మద్ కొరాన్ లో చూపిన వాటన్నిటికీ, దేవుడు లేదా విశ్వకర్మ లేకుండానే వివరించవచ్చు. ఏకేశ్వరాధనలోకి వస్తే ఒకే విశ్వకర్మ ఎందుకుండాలి ? హ్యూం ఇలా రాశాడు. (ఎసెన్షియల్ వర్క్స్ ఆఫ్ డేవిడ్ హ్యూం, న్యూయార్క్, 1965, పుట 192-193, 5వ భాగం)
దైవ ఏకత్వాన్ని గురించి రుజువు పరచటానికి ఎలాంటి వాదనలు చేస్తారు. ఇల్లు, ఓడ, పట్టణం, సంక్షేమం రాజ్యం నిర్మించడానికి ఎందరో చేతులు కలుపుతారు. అలాగే ప్రపంచ నిర్మాణానికి కూడా అనేకమంది దేవతలు ఎందుకు కలవరు ? ఇది కూడా మానవ వ్యవహారాలను పోలినదే. ఒకే దైవాన్ని సర్వశక్తివంతం అనిచెప్పి దాని ఉనికి రుజువు చేయలేక బలహీనపడేదానికంటే అధికార వికేంద్రీకరణ చేసి విస్తృత అధికారాలు ఒక్కరిలో లేకుండా చూపవచ్చు. అనేకమందిని ఏకం చేసి ఒక పథకాన్ని అమలు చేయవలసి వచ్చినప్పుడు సంపూర్ణంగా ఏదైనా చేయాలంటే ఇంకెందరు దేవతలు కావాలి అనేది అలోచించుకోవాలి.
అవసరం లేకుండా కారణాలను పెంచుకుంటూ పోవటం వాస్తవ తత్వానికి విరుద్ధం. కాని ప్రస్తుత విషయానికి ఈ సూత్రం అన్వయించేటట్లు లేదు. ఒకే దేవుడికి అన్ని లక్షణాలు ఉంటే, మిగిలిన దేవతల అవసరం లేదు. ఒకే దేవుడిలో అన్ని లక్షణాలూ ఉన్నాయా ? లేక వివిధ దేవుళ్ళలో అని విస్తరించి ఉన్నాయా అనేది నిర్ధారించలేని వివాదాస్పద విషయం. విశ్వాన్ని సృష్టించటానికి విపరీతమైన శక్తి, అధికారం ఒక్కనిలోనే మూర్తీభవించి ఉండాలని అనటం అవగాహనకు మించిపోయిన విషయం.
అరేబియా నుండి బహుదేవతారాధనను తొలగించటం మహమ్మదు చేసిన గొప్ప పనుల్లో ఒకటి అని అంటారు. ఏకేశ్వర వాదుల తలబిరుసుతనమే ఇది. బహుదేవతారాధనకు భిన్నంగా ఏకేశ్వరవాదనను అనుకూలంగా అంగీకరించాల్సిన వాదనలేమీ లేవు. బహుదేవతారాధనలో అంతర్గతంగా అసందర్భాలేమీలేవు. (ఎసెన్షియల్ వర్క్స్ ఆఫ్ డేవిడ్ హ్యూం, పుటః 203, 7వ భాగం, న్యూయార్క్, 1965) విశ్వపథకాన్ని గురించి ఖురాన్ వాదించిన ధోరణిని హ్యూం విమర్శిస్తూ విశ్వారంభానికి సంబంధించిన ప్రతిపాదనలన్నీ అసంభవాలే అన్నాడు. ఈ విశ్వక్రమాన్ని ఒక తీరులో నమ్మటం కుదిరేపని కాదన్నాడు. అందుకు తగిన పరికరాలేవీ లేవన్నాడు. మన అనుభవం కూడా పరిమితం, అసంపూర్ణం అన్నాడు. ఏదో ఒక ప్రతిపాదన నిర్ధారించాలంటే అందుకు తగిన నియమం ఏదీ అని కూడా ప్రశ్నించాడు.
ఏకేశ్వరాధన అసహనంతో కూడినదని గుర్తించారు. ఖురాన్ లోనే ద్వేష ప్రచారం ఉన్నది. విగ్రహారాధనలకూ, బహుదేవతారాధనలకూ పేర్లు పెట్టారు. అరేబియాలో ప్రవక్తకాలం నాడు విగ్రహారాధకులు ఎలాంటి సహనం చూపలేదనీ, ఇస్లాంను ఆమోదించటమో లేక చావో తేల్చుకోమన్నారనీ ముస్లిం రచయితలు ఏకగ్రీవంగా పేర్కొన్నారు. (డిక్షనరీ ఆఫ్ ఇస్లాం) ఏకేశ్వరాధనలో ఇమిడి ఉన్న పిడివాదం ఏమంటే సత్యానికీ, దైవానికీ అదొక్కటే మార్గమని చెప్పటం, మిగిలినవన్నీ వక్రమార్గాలనీ, నరకానికి దారితీస్తాయనీ అన్నారు. లూయీ ఇలారాశాడు. సంప్రదాయ క్రైస్తవం, ఇస్లాం రెండూ యూదువాదం నుండీ విభేదించినా, విశ్వసత్యాలను తమకే తెలుసుననే విషయంలో అంగీకారానికి వచ్చారు. మనిషికి తుది దైవసందేశం తమ ద్వారానే వచ్చిందని ఉభయులూ అన్నారు. తాము లేకుంటే వేరే మోక్షమార్గం లేదన్నారు. (రేస్ అండ్ స్లేవరీ ఇన్ ది మిడిల్ ఈస్ట్, న్యూయార్క్, 1990, పుట. 175)
క్రైస్తవులూ, మహమ్మదీయులూ, అలాగే మిగిలిన మతాలూ అనుసరించిన క్రూరత్వం ప్రపంచానికి తెచ్చిపెట్టిన ధోరణులను ఆలోచించమని షోపెన్ హార్ అన్నాడు. (ఆర్ధర్ షోపెన్ హార్, పరేర్గా అండ్ పేరాలిపోమెనా, 2 సంపుటాలు, అనువాదం ఇ.ఎఫ్.జె. పెయిన్ పుట. 356-59) అతడింకా ఇలా అన్నాడు. మూర్ఖవాదం, అనంత హింసాచర్యలూ, మత యుద్ధాలూ, హింసాపూరిత ఉన్మాదం ఒకసారి ఆలోచించండి. క్షమించటానికి వీలులేని మత యుద్దాల దారుణ కాండను దైవేచ్ఛ పేరిట 200 సంవత్సరాలపాటు సాగించిన విషయం గుర్తు తెచ్చుకోండి. ఇస్లామునూ, క్రైస్తవాన్ని షోపెన్ హార్ ఖండించాడు. స్పెయిన్ నుండి మూర్స్, యూదులను నిర్దాక్షిణ్యంగా బహిష్కరించి రూపుమాపారు. విభేదించిన వారిని విచారణల పేరుతో రక్తంలో ముంచారు. మహమ్మదీయులు మూడు ఖండాలలో దారుణ రక్తపాత దాడులు జరిపారు. తొలుత మహమ్మదీయులూ, తరువాత క్రైస్తవులూ ఇండియాలో జరిపిన దాడులను విస్మరించరాదు. ప్రాచీన దేవాలయాలను నాశనం చేసి, విగ్రహాలను పగులగొట్టి ఏకేశ్వరాధన పేరుతో ఎలా ఆగ్రహాన్ని వెల్లడించారో స్మృతులలో మెదలేటట్లు చూపారు. మహమ్మదు గజనీ నుండి ఔరంగజేబు వరకూ ఈ నరహత్యలో పాల్గొన్నారు. హిందువులూ, బౌద్ధులూ శాంతియుత చరిత్రతో కొనసాగుతుండగా ఏకేశ్వర వాదులు వారి క్రూరత్వాన్ని చూపారు. అసహనం ఏకేశ్వరవాదంలోనే ఉన్నది. అక్కడ దేవుడు మరొకరిని సహించని ఈర్ష్యాపరుడు. బహు దేవతలు బ్రతుకూ, బ్రతకనివ్వు అనే సూత్రాన్ని పాటించారు. ఒకే మతంలో భిన్న దేవతలు సహచరులుగా ఉన్నారు. ఇది ఇతర మతాలలోని దేవతలకు విస్తరించి సమానహక్కు లిచ్చేవరకూ పోయారు. రోమన్లు ఇష్టపూర్వకంగా ఫ్రైజియనులను, ఈజిప్టియనులను, తదితర దేవుళ్ళనూ ఆమోదించారు. ఏకేశ్వర వాదన మతాలు యుద్ధాలూ, హింసలూ, భావచ్ఛేదాన్ని సహించకపోవటం, వేరే దేవుళ్ళ విగ్రహాలను విచ్ఛిన్నం చేయటం, ఇండియాలో దేవాలయాలను, ఈజిప్టులో, కొలీసీలను నాశనం చేయటం కేవలం ఈర్ష్యతోనే.
హ్యూం వంద సంవత్సరాలకు ముందే షోపెన్ హార్ పేర్కొన్న విషయాలను ప్రస్తావించి బహుదేవతారాధనలో సదవకాశాలేమిటో వివరించాడు. (డేవిడ్ హ్యూం, ఎన్ క్వైరీస్ కన్ సర్నింగ్ ది హ్యూమన్ అండర్ స్టాండింగ్ అండ్ కన్ సర్నింగ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ మోరల్స్, ఆక్స్ ఫర్డ్, 1966, పుటః 59.
విగ్రహారాధనలో కొన్ని సదవకాశాలున్నాయి. దేవుళ్ళకు వివిధ పరిమిత అధికారాలు మాత్రమే ఉండేవి. దైవత్వంలో భాగం పంచుకోవటానికి క్రతువులూ, ఉత్సవాలూ, సంప్రదాయాలూ అందుకోవటానికి ఇతర దేవుళ్ళకు అవకాశం ఉండేది. ఏకేశ్వరాధన వాదులు ఇతర దేవతలను పూజించటం అపవిత్రంగా భావించారు. తమ వ్యతిరేకులను అపవిత్రంగా చూచారు. తాము పూజించేదీ, విశ్వసించేది మాత్రమే దైవం అమోదిస్తాడన్నారు. అందుకు భిన్నమైన వాటిని ఏ రూపంలోనూ దేవుడు ఆమోదించడన్నారు. దీని వలన స్పర్థలూ, పరస్పర వైరుధ్యాలూ తీవ్రరూపం దాల్చాయి.
విగ్రహారాధకుల సహనం నాటినుండి నేటివరకూ స్చష్టమే. అన్ని మతాల అసహనం దైవ ఏకత్వంలోనే జనించింది. యూదుల సంకుచిత ఆధ్యాత్మిక భావన అందరికీ తెలిసిందే. అంతకంటే దారుణసూత్రాలతో ఇతరులనందరినీ ఖండిస్తూ మహమ్మదీయవాదం ఉన్నది.
మహమ్మదును గురించి ప్రొ. వాట్ రాసిన రెండు సంపుటాల జీవిత చరిత్ర చాలా ప్రభావితమైన, ముఖ్యమైన రచనగా భావిస్తారు. క్రోన్, బాస్క్వే వంటి పండితులు సందేహాన్ని వ్యక్తపరిచినా ఇప్పటికి చాలామంది వాట్ వాదననే ఆమోదిస్తారు. మధ్య అరేబియాలో ఉన్న బహుదేవతారాధనకంటే మహమ్మదు బోధించిన ఏకేశ్వరాధన ఉన్నతమయిందన్నారు. ప్రజల ఆధ్యాత్మిక అవసరాలను మహమ్మదు సందేశం తీర్చిందన్నాడు. మక్కా ఆనాడు సాంఘిక రుగ్మతలతో ఆధ్యాత్మిక సంక్షోభంతో ఉండగా స్థానిక దేవతలూ, ఆచారాలూ పరిష్కారాన్ని చూపలేకపోయాయన్నాడు. నైతికంగా దిగజారిన విగ్రహారాధనలో ఉన్న మక్కా వారిని మహమ్మదు వచ్చి, ఆధ్యాత్మికంగా ఉన్నతస్థాయికి తీసుకెళ్ళారన్నాడు. మక్కాలో సాంఘిక రుగ్మతలున్నాయనే వాదనకు ఆధారాలు లేవని క్రోన్, బాస్క్వేలు వాదించారు. క్రోన్ ఇలా రాశాడు. (మెక్కన్ ట్రేడ్ అండ్ ది రైజ్ ఆఫ్ ఇస్లాం, ఆక్స్ ఫర్డ్, 1987, పుటః 234-45)
సంప్రదాయాలను చూస్తే మక్కావాసులు సామాజికంగా, మతపరంగా, రాజకీయ, నైతిక రంగాలలో జయప్రదంగా ఉన్నారు. ముస్లిం కళ్ళతో ఇస్లాం చరిత్రను ఆయన చూశారు. మక్కావాసులు నైతికంగా దిగజారారని ముస్లిం ఆధారాలు రాశాయి. తీరాచూస్తే వారి సంప్రదాయాలు విచ్ఛిన్నమైనందుకు ఇలా జరగలేదనీ, చాలా చక్కగా సమాజం సాగిపోయిందనీ తెలుస్తున్నది. సంప్రదాయ జీవితంనుండి మక్కావాసులు ఇస్లాంలోకి మారారు. అందుకే వారికి శిక్ష వేశాయి. ఈ ఆధారగ్రంథాలు జీవితానికి కట్టుబడి ఉండే వారు మానవ ద్వేషులుగా, అవినీతిపరులుగా కనిపిస్తారు. మహమ్మద్ కు వ్యతిరేకి అయిన అబూసూఫ్ యాన్ సంపన్నుల పక్షానికి నాయకుడు తప్పుడు దేవుళ్ళమీద అతడు ఒట్టుపెట్టలేదు. అలాచేస్తే ఏ నమ్మకం లేనివాడికింద జమ.
ఆధ్యాత్మిక సంక్షోభం ఏదీ ఆరవ శతాబ్దపు అరేబియాలో లేదు
అరేబియాలో మూకుమ్మడిగా ఇస్లాంలోకి ఎలా మారారు ? సమాజం ముఠాలతో ఉండేది. ఎవరి ముఠాకు వారి దేవుళ్ళు ఉన్నారు. ఆ దైవాన్ని పూజిస్తే సహాయం అందుతుందనీ, వర్షాలు కురుస్తాయనీ, పంటలు పండుతాయనీ, రోగాలు ఉండవనీ, రక్షణ ఉంటుందనీ, నమ్మారు. ఆదిమ ముఠాల దేవుళ్ళకు పరమసత్యాలు, జీవితానికి అర్థం తెలుసు అని చెప్పలేదు. నిత్య జీవితంలో వారి జోక్యం లేదు. ఒక దేవుడిని వదిలేసి మరొక దైవాన్ని స్వీకరించడంలో జీవిత దృక్పథం మారనక్కరలేదు. ఆటవిక ముఠా లక్షణాలను తీవ్రమైనవిగా, జాతిపట్ల గర్వించదగినవిగా ఉన్నట్లు ముస్లిం దైవం భావించింది. తమ దేవుళ్ళకంటే ముస్లిం దేవుడు అధిక ఫలాన్ని చూపాడు. అరబ్ రాజ్యేర్పాటు, దండయాత్రలు చూపాడు. ఉమ్మా (ఒక జాతి లేదా ప్రజ) ఏర్పాటు కనబరిచాడు. నమ్మకంలేని వారిపై జిహాద్ (పవిత్రయుద్ధం) ప్రకటించారు. మహమ్మద్ సఫలతకు ఇవే తోడ్పడ్డాయి. అరేబియాను, ఇతర భూభాగాలను జయించటం వలననే, అరేబియా సమైక్యత సాధ్యమైంది. మహమ్మద్ మదీనాలో విజయం సాధించగా, అనుచరులు పెరిగారు. అల్లా గొప్ప దేవుడయ్యాడు. జయం పొందిన దేవుడు నిజమైన దేవుడయ్యాడు. జయం పొందని దేవుళ్ళు తప్పుడువారయ్యారు. అరేబియా సారవంతం కాకుండా ఎండిపోతుండగా దండయాత్రలు అవసరమయ్యాయని బెకర్ రాశాడు. క్రోనే ఇలా అంటాడు.
దండయాత్రల రుచి చూసిన అరేబియాలో భౌతికంగా దిగజారుడు పరిస్థితి ఉన్నదనక్కరలేదు. ముందు స్వదేశ ముఠాలతో ప్రారంభించి, సారవంతమైన ప్రాంతాలకు ప్రాకారు. తమ అవసరాలు తీర్చగల వనరులు లభించాయి. దండయాత్రల విధానాన్ని మహమ్మద్ యొక్క దేవుడు ఆమోదించాడు. నమ్మకం లేని వారి మీద ఎక్కడైనా పోరాటం సాగించమన్నాడు. మహమ్మద్ దండయాత్ర చేయగా, అనుచరులు ఇష్టపడ్డారు. దేవుడు ఇలా చేయమన్నాడు. ఇంకేం కావాలి ?
పదార్థాల అవసరాల కోసం పవిత్ర యుద్దాన్ని అడ్డం పెట్టుకున్నారనే భ్రమ వద్దు. భౌతిక అవసరాలకోసమే యుద్ధం చేశారు. నా సేవకులు భూమిని సంక్రమింపజేసుకుంటారని దేవుడు చెప్పాడు. ఇరాక్ ను గురించి ఖదీసీయా యుద్ధ సందర్భంగా అరబ్బు సైనికులకు ఇలా చెప్పారు. పట్టుదల ఉంటే వారి ఆస్తులు, ఆడవాళ్ళూ, పిల్లలు, దేశం యావత్తూ మీదే. అంతకంటే దేవుడు స్చష్టంగా ఇంకేం చెప్పాలి ? ఇతరుల భూమి, స్త్రీలు, పిల్లల్ని ఆక్రమించ్ హక్కు మాత్రమే గాక, విధి కూడా ఉన్నదన్నాడు. పవిత్రయుద్ధంలో విధేయతే ముఖ్యం. ఆటవిక తీవ్రస్థాయిని మహమ్మద్ దైవం అత్యున్నత మతధర్మానికి తీసుకెళ్ళింది.
ఆనాడు ఆధ్యాత్మిక సందేహాలు, సంక్షోభాలు లేవు. ఆటవిక ముఠాల సందేహాలు తీర్చటానికి గాక, నాడు ప్రజలు తీవ్రస్థాయిలో దండయాత్రలు చేసే స్వభావంతో ఉన్నారు. దానిని మహమ్మద్ అవసరాల నిమిత్తం ఉపయోగపరచాడు. దోపిడీలు చేయించాడు. స్త్రీలను భూముల్ని స్వాధీన పరుచుకున్నారు. అల్లా విఫలం కాలేదు. గనుక, మిగిలిన దేవతల్ని వదిలేశారు. అల్లా ఫలితాలను ఇచ్చాడు. అందులో ఆదిభౌతిక దృష్టిలేదు. ఓకమ్స్ తర్కాన్ని హఠాత్తుగా అరబ్బులు అన్వయించలేదు. 19వ శతాబ్దంలో సైతం అరేబియాలో కొంతభాగం పేగన్ తత్వంతో ఉండేదని క్రోన్ రాశాడు.
వాట్ సిద్ధాంతం లోపాల్ని 1909లోనే డా. మార్గోలియత్ గ్రహించాడు. కొత్తగా మారిన వారిని ఇస్లాం, నైతికంగా స్థాయి పెంచిందనడానికి ఆధారాలు లేవన్నాడు. పేగన్లకంటే ముస్లింలు నైతికంగా అధికులు అనడానికి దాఖలాలు లేవన్నాడు. పైగా, సాక్ష్యాధారాలు అందుకు భిన్నంగా ఉన్నాయి.
దోపిడీ ముఠాలకు మహమ్మద్ అధిపతిగా ఉండగా దిగజారుడు రీతులు పొడసూపాయి. ఒట్టుపెట్టుకున్నవారు దానికి కట్టుబడనక్కరలేదని తెలుసుకున్నారు. దేవుడిపేరిట సొంత సమాజంలో వారి రక్తాన్ని చిందించారు. ఇస్లాం పేరిట అబద్ధాలాడినా, ద్రోహం చేసినా దైవం ఆమోదముద్ర వేసింది. అసభ్యమైన భాషను ముస్లింలు వాడారు. నమ్మకం లేనివారి భార్యల్ని, ఆస్తుల్ని కాజేసినా, ప్రవక్త కాదనలేదు. (మహమ్మద్ అండ్ ది రైజ్ ఆఫ్ ఇస్లాం, మార్గోలియత్ పుటః 149 లండన్ 1905)
అంతేకాదు. మానవ స్వేచ్ఛను ఏకేశ్వరాధనావాదం అణచివేసింది. అది నియంతృత్వానికి దారితీస్తుందని పండితులు వాదించారు. బహుదేవతారాధనలో బహుళత్వం, సృజన, మానవ స్వేచ్ఛ ఉన్నది. పురుషాధిపత్యంగా ఏకేశ్వరాధన ఉందని స్త్రీ ఉద్యమకారులు అన్నారు. స్త్రీల పట్ల సున్నితత్వం లేని, మార్పుకు వ్యతిరేకి అని ఏకేశ్వరవాదాన్ని చిత్రించారు.
ముస్లిం దైవభావన
దైవం సర్వశక్తివంతమని ఖురాన్ లో చాటారు. మానవేచ్ఛ సంపూర్తిగా దైవేచ్ఛకు లోబడి ఉంటుంది. ఆ మాటకొస్తే మానవేచ్ఛ అంటూ లేదు. నమ్మనివారు కూడా దైవేచ్ఛవలనే అలా ఉంటారు. మానవ స్వేచ్ఛకంటే విధి నిర్ణయమే ముస్లిం సిద్ధాంతంలో ప్రధానం. అదే కొరాన్ లో ఉంది. మక్ డొనాల్డ్ ఇలా అన్నాడు. స్వేచ్ఛాయుత ఇచ్ఛ, ముందే నిర్ణయమైన విధి అనేవి పరస్చర విరుద్ధాలు. వాటి ప్రస్తావన కొరాన్ లో చూస్తుంటే మహమ్మద్ అవకాశవాద బోధకుడనీ రాజకీయవాది అనీ, క్రమబద్ధమైన మతవాది కాదని స్చష్టపడుతుంది. ఎన్ సైక్లోపీడియా ఆఫ్ ఇస్లాం, ప్రధమ ప్రచురణ, కాదర్, ఆర్ట్)
మహమ్మద్ సిద్ధాంతంలో మంచి చెడ్డలకు చెందిన కేవల సిద్ధాంతం తఖ్ దీర్ - ఆరవసూత్రం సనాతనుల ప్రకారం ఈ ప్రపంచంలో మంచి చెడ్డలన్నీ దైవేచ్ఛనుండే వచ్చాయి. అవి తిరుగులేని నిర్థారణలు. విధి ఫలకాలపై అవి భద్రపరచబడ్డాయి.
ఖురాన్ లోని కొన్నింటిని ఉదహరిస్తే ఈ సిద్ధాంత వివరణ జరుగుతుంది.
సూర. 54.49 అన్నీ స్థిర నిర్ణయాలతో సృష్టి అయ్యా.యి.
3.139 జీవిత కాలాన్ని సృష్టికర్త నిర్థారించాడు. అతడి అనుమతి లేనిదే ఎవరూ చావరు.
87.2 దేవుడు అన్నీ సృష్టించి, తులనాత్మకత ఏర్చరిచాడు. వాటి విధిని జరిపిస్తూ మార్గం చూపుతాడు.
8.17 దేవుడే చంపాడు, కనుక ఫలమంతా దేవుడిదే. మీది కాదు.
9.51 దేవుడు నిర్ణయించినదే తప్ప మనమీదకేదీ రాదు.
13.30 సార్వభౌమత్వమంతా దైవాధీనమే.
14.4 తన ఇచ్ఛ ప్రకారం దైవం దారితప్పిస్తుంది నడిపిస్తుంది.
18.101 నమ్మకం లేనివారి (ఇన్ ఫిడిల్స్) కళ్ళు మూసుకుపోతాయి. వారికి వినే శక్తి పోతుంది.
32.32 తలచుకుంటే అన్ని ఆత్మలకూ మార్గం చూపేవాళ్ళమే. నా మాట గుర్తించారు. నరకాన్ని జిన్, మనుషులతో నింపుతాను.
45.26 మహమ్మద్ వారితో చెప్పండి. అల్లా నీకు జీవితం ప్రసాదించాడు. మరణించేటట్లు చేస్తాడు. పునరుత్థానం వరకూ సమీకరిస్తాడు.
57.22 సృష్టికి ముందే పవిత్ర గ్రంథంలో జరగాల్సిన సంఘటనలన్నీ రాశారు.
కొరాన్ లో మనిషి స్వేచ్ఛాయుత ఇచ్ఛకు ఒకరకంగా అనుమతించారు.
41.16 థామూద్ కు మార్గం చూపుతామన్నా, వారు అంధత్వాన్ని కోరుకున్నారు.
18.28 దేవుని నుండి సత్యం వస్తుంది. ఇచ్ఛగలవారు నమ్ముతారు. లేదా నమ్మకపోతారు.
ముస్లిం క్రీడ్ అనే గ్రంథంలో వెన్సింగ్ రాస్తూ, ముందే నిర్ణయించిన ఇస్లాంలో ఆధిక్యత వహించిందన్నాడు. (వెన్సింక్, పుటః 51-52 కేంబ్రిడ్జి, 1932) స్వేచ్ఛాయుత ఇచ్ఛను చూపే సంప్రదాయం ఒక్కటీ లేదు. డమాస్కస్ కు చెందిన జాన్ ఇలా అంటాడు. క్రీ.త. 8వ శతాబ్దిలో అతడు ఇస్లాంకు సుపరిచితుడు. క్రైస్తవానికీ ఇస్లాంకు ప్రధాన తేడా విధినిర్ణయం. స్వేచ్ఛాయుత ఇచ్ఛకు గల తేడా అన్నాడు.
మహమ్మద్ తుది రోజులలో విధి నిర్ణయం గురించి గట్టిగా మాట్లాడాడు. ఇందులో రాజీలేని కర్మవాదం కనిపిస్తుంది.
ముందే విధి నిర్ణయం అనే సిద్దాంత పరిశీలనకు పూర్వం, ఖురాన్ లో నరకం గురించి చూద్దాం. ఖురాన్ నరకయాతనలు చాలా ఆనందంగా ఆలోచించి దేవుడు ప్రవేశపెట్టాడు. కనీసం 30సార్లు జొహానుం అనే పదం వస్తుంది. ముస్లింలకు పశ్చాత్తాప నరకం ఇది. ముస్లింలు అందరూ ఖురాన్ ప్రకారం నరక ద్వారాలగుండా వెడతారు. (సుర 19.72) మీలో ఒక్కరూ నరక ద్వారాలగుండా వెళ్ళకుండా ఉండజాలరు. అది దైవనిర్ణయం అల్ నార్ అనే పదానికి అర్థం ఏమిటంటే పదేపదే విజృంభించే అగ్నిజ్వాల అని. నరకాగ్ని గుండాలకు పర్యాయపదాలుగా ఈ క్రింది సురలలోని మాటలు చూడవచ్చు.
లాజా (జ్వాల) సుర 97.5
అల్ - హుతామా (అణచివేత) సుర 104.4
సెయిర్ (ప్రజ్వలన) సుర 4.11
సాఖర్ః సుర 54.47, పాపులు దైషులు, ఉత్సాహంగా ఉంటారు. కానీ నరకానికి లాగేసిన తరువాత సాఖర్ స్పర్శ చూస్తారు.
అల్ జాహిం అగ్నిగుండం, హవియాహ్ సుర 2, 101లో ప్రస్తావించారు. మహమ్మద్ పరిమిత ఊహ గలవాడైతేస నరకయాతనలు వివరించడంలో పరవశుడై పేర్కొన్నాడు. సలసల కాగే నీరు, చర్మం వలిచివేయుట, మాంసం కాల్చుట, పేగులు హతమార్చుట. పుర్రె అణచివేయుట ఉన్నాయి. చరణాలకి చరణాలు, సురలకి సురలు ఈ అగ్ని గురించి జ్వాలల గురించీ చెప్పాయి. సుర 9.69లో దైవనమ్మకం లేనివారిని శాశ్వతంగా మాడ్చేస్తుంటారన్నారు.
అలాంటి విధానంలోని విలువలు ఎలాంటివి ? A. S. మిల్ ఇలా అంటాడు. (త్రి ఎస్సేస్ ఆన్ రెలిజియస్, పేజీ. 113-14, లండన్, 1874) దేవుడు కావాలని మనుషుల్ని నరకంలో నింపుతాడనేది జుగుప్సాకరమైన ఆలోచన. దేవుడే వారిని సృష్టించి, వక్రమార్గాన నడిపిస్తే, అందుకు వారు బాధ్యులు కాదు. అత్యున్నత దైవం నరకాన్ని సృష్టించాడు. అతడిని పూజించాలి. మనుషుల్ని వారి విధికి బలిచేసేటట్లు సృష్టిస్తున్నాడు. క్రైస్తవుల క్రూరత్వం దీనిముందు ఎందుకూ కొరగాకుండా పోతున్నది. ముందే నిర్థారణ అయిన భావనకు, ముస్లిం దైవభావనకు మిల్ వ్యాఖ్యానాలు ముటాలిస్ లకే వర్తిస్తాయి.
ఈ విధానాన్ని నైతికం అనలేం. నైతిక బాధ్యత అనేది నీతిలో ప్రధానం. తన చర్యలకు మనిషి బాధ్యుడు కావాలి. హేతుబద్ధమైన ఆలోచన చేయగలగాలి. కావాలని చేసే విధానం ఉండాలి. ముందే నిర్ధారించిన కొరాన్ విధానంలో యాంత్రికంగా మనిషి ఉంటాడు. అలాంటిచోట మనిషి నరకంలో తగలబడుతుంటే దేవుడు ఆనందిస్తుటాడు. మానవుడు తన చర్యలకు తాను బాధ్యుడు కాదు. సురలలో చూపినట్లుగా మనిషిని శిక్షించడం, అతనిని బాధ్యుడిగా చూపడం అసమంజసం.
కామం గురించి ఇస్లాం అభిప్రాయాలపై బాస్క్వే ఇలా అంటాడు. (L’Ethique Sexualite de L’Islam, Paris, 1966) ఇస్లాంలో నీతిలేదు. అల్లాకు లొంగి ఉండమని ముస్లింకు చెబుతారు. మంచి, చెడు అనేది ఖురాన్ నిర్వచనం ప్రకారం, తరువాత ఇస్లాం చట్టం అనుమతించిన మేరకు నిషేధించిన వరకూ పాటించాలి. సోక్రటీస్, యూథిపైర్ లో ప్రశ్నించినట్లు - పవిత్రమైనందుకు దేవుళ్ళు గౌరవిస్తున్నారా, దేవుళ్ళు ఇష్టపడినందుకు అదీ పవిత్రమైందా ? దీనికి సనాతన ముస్లిం నిర్దుష్టంగా సమాధానమిస్తాడు. దేవుడేది కావాలంటే అది మంచిది. ఏది వద్దంటే అది చెడ్డది. అంతేగాని హేతుబద్ధంగా మంచీ చెడూ లేదు. ఇది సంతృప్తికర సమాధానం కాదు- ప్లేటో ప్రకారం చూస్తే, మాకే ఇలా సూచిస్తాడు. (ది మిరకిల్ ఆఫ్ థీయిజం, ఆక్స్ ఫర్డ్, 1982, Mackie, పుటః 256) దైవేచ్ఛను బట్టి నైతిక విషయాలు ఉంటే, దేవుడు మంచివాడని, తన సృష్టినుండీ మంచిని అశిస్తాడని మితవాదులు అనడం అర్థరహితం మరో గ్రంథంలో మాకీ ఇలా రాశాడు.
(జె. ఎల్. మాకి, ఎథిక్స్, లండన్ 1977, పేజీ 230)
ముస్లింలు దేవుడిని మంచివాడనడంతో దేవుడు తననుతాను ఇష్టపడతాడనీ తన ధోరణి తనుకు నచ్చుతుందనీ అనడమే. నిరంకుశుడికి లోబడి ఉండడమే నైతిక నియమంగా ఉంది. ఇది గ్రహించి, మతవాదులు కొందరు, పవిత్రం గనుక దేవుడు ఇష్టపడతాడనే సూత్రాన్ని కోరుకున్నారు. అంటే నైతిక ప్రవర్తన దైవం పై ఆధారపడరాదనే అర్థం ఉంది. నీతి సర్వస్వతంత్రం. మత నమ్మకాల ప్రస్తావన లేకుండా అధ్యయనం చేసి చర్చించవచ్చు. దీనిలో నైతిక స్థాయికి మత ప్రాతిపదికలు లేవు.
మత విధానానికి భిన్నంగా నైతిక విలువలు స్వతంత్రంగా ఉండడం మంచిదనవచ్చు. ఇదే విషయాన్ని రస్సెల్ ఇలా పేర్కొన్నాడు. (వై ఐయాం నాట్ ఎ క్రిస్టియన్ - రస్సల్, లండన్, 1979, పేజి, 19) మంచి చెడ్డల మధ్య తేడా ఉందని కచ్చితంగా తెలిస్తే, పరిస్థితి ఇలా ఉంటుంది. ఆ తేడా దైవనిర్ణయమా కాదా ?దైవ నిర్ణయమైతే, మంచి చెడ్డలతేడా దేవుడికి లేదన్నమాట. అప్పుడు దేవుడు మంచివాడనడం అర్థరహితం, మతవాదులవలె దేవుడు మంచివాడంటే, మంచిచెడ్డలలో అర్థం ఉందనీ, అవి స్వతంత్రంగా దైవానికీ భిన్నంగా వాటి మంచి చెడ్డలు ఉన్నాయి. అవి దైవం వల్ల రాకపోగా, దైవానికి ముందే ఉన్నాయి కూడా స్వతంత్ర నైతిక బాధ్యత నుండీ తప్పించుకోలేం.
నరక భావన నైతికంగా అభినందనీయం కాదు. దేవుడు దయామయుడనీ, రెండు సురలు తప్ప, అన్నీ చెప్పాయి. (సుర 9, ఫాతెహా) తనను నమ్మనందుకు దయామయుడైన దేవుడు శాశ్వతంగా ఎవరినైనా నరకంలో ఉంచుతాడా ? రస్సెల్ అంటాడు తన స్వభావంలో ఎవరికైనా దయవుంటే, అలాంటి భయాలు, ఘోరాలు ప్రపంచంలో ప్రవేశపెట్టడు ఆంటోని ఫ్లూ ఇలా రాశాడు.
(The terror of Islam in P.Kurtz and T. Madiganted, detending the Enlightenment Buffalo NY 1987, పేజి, 277) మానవుల నేరాలు, దైవ శిక్షణలలో చాలా విచక్షణ ఉంది. కొరాన్ నరక సిద్ధాంతం క్రూరత్వానికీ, హింసకూ, దైవానుమతితో పరపీడన పరాయణానికీ నిదర్శనం. ఇస్లాం భయంపై ఆధారపడిందనీ, నీతిని చెడగొడుతుందనీ స్పష్టపడుతున్నది. (నేను తప్ప దేవుడు వేరే లేడు. నాకు భయపడు సుర 16.2) ఖురాన్ లో ఆద్యంతాలూ దేవునిపట్ల భయం ఉంది. మనిషి నిరంతరం భయపడుతూ, దైవ సంభ్రమంలో అప్రమత్తతతో బతకాలి.
(గిబ్, హెచ్.ఎ.ఆర్. ఇస్లాం ఆక్స్ ఫర్డ్, 1853, పేజి. 38)
తోటివారిపట్ల మన ప్రవర్తన, సానుభూతి, ఉదారత్వం స్థానే, దైవశిక్షలు తప్పించుకోడానికి, బహుమతులు పొందడానికి జీవితం సాగించాలన్నమాట.
మాకీ ఇలా వాదించాడు.
(ది మిరకిల్ ఆఫ్ థీయిజం, ఆక్స్ ఫర్డ్ 1982 పేజి. 256)
దైవాజ్ఞలను నీతివిధానాలుగా మానవులు ఆమోదించాలి. వీటికి మానవ సంక్షేమం, ప్రయోజనాలతో నిమిత్తం లేదు. అందులో నిరంకుశ, నిర్హేతుక నీతి ఉండొచ్చు. దైవాజ్ఞల నుండి కష్టమైన సమస్యలకు పరిష్కార మార్గాలు నైతికంగా చూడవచ్చు. కాని అలాంటి దైవాజ్ఞలు ఆధారపడదగ్గవి లేవు. బైబిల్ కొరాన్ వంటి దైవదత్తాలనేవి కూడా. సంకుచిత ఆటవిక కాలదోష నిర్ణయాలమయంగా, ఖండనీయంగా ఉన్నాయి. హాన్స్ కుంగ్ ఇలా అన్నాడు. మన నీతికి మనమే బాధ్యులం. మత నమ్మకానికి నీతిని అంటగట్టడం, దాని విలువను తొలగించడమే.
దేవుని బలహీనతలు
దేవుడు సర్వజ్ఞుడు. సర్వశక్తిమంతుడు. దయామయుడని అంటారు. అయినా, అతడు నిరంకుశుడుగా, తన వారిని అదుపులో పెట్టుకోలేని వాడుగా ఉంటాడు. అతడు కోపిష్టి, గర్విష్టి, అసూయాపరుడు. సంపూర్ణ జీవికి ఉండాల్సిన లక్షణాలు కావు. అతడు స్వయం సంవూర్ణుడైతే, మనుషులెందుకు అవసరమయ్యారు ? సర్వశక్తిమంతుడైతే, మనుషుల సహాయం ఎందుకు అడిగాడు ? ఎక్కడో మూలనున్న ఒక అరేబియా వర్తకుడిని తన చివరి సందేశకుడుగా ఎందుకు ఎంపిక చేశాడు ? తాను సృష్టించిన వారి నుండే, పొగడ్తలు, వూజలు ఎలా కోరుకుంటున్నాడు ? యాంత్రికంగా ఉండే మానవులను సృష్టించిన దేవుడు, తనకు రోజూ 5 సార్లు నేలగరిచి ప్రార్థనలు చేసే నిర్ణయం ఎందుకు చేశాడు ? పొగడ్తలు కావాలనుకోవడం నైతిక దైవస్థాయికి తగ్గట్టు లేదు. కొరాన్ దైవాన్ని గురించి పాల్ గ్రేవ్ ఇలా రాశాడు.
(డిక్షనరీ ఆఫ్ ఇస్లాం పేజీ 147)
అన్ని జీవులకూ భిన్నంగా ఉన్నతంగా ఉండే దేవుడు ఒకడే, సర్వజ్ఞుడు, సర్వశక్తివంతుడు. అతడికి నియమాలు, ప్రమాణాలు, పరిమితులు లేవు. అతడు కేవలం ఇచ్ఛాపరుడు. అతడు తన జీవులకు ఏదీ తెలుపడు. వారి నుండి ఏదీ ఆశించడు. వారిదంతా అతడికి చెందిందే. (సుర 8.17)
అలాంటి సర్వశక్తివంతుడు రాగద్వేషాలకతీతంగా ఉంటాడని అనుకుంటాం. కాని వాస్తవం అలా లేదు. అతడు బహూకరించేకంటే బాధపెట్టటమే ఎక్కువ. నిర్మాణం కంటే నిర్మూలనే ఎక్కువ. తాను సృష్టించిన జీవులు బానిసలనీ, జుగుప్సాకరమైన పరికరాలనీ, తమ ఆధిక్యత గుర్తించాలనీ దేవుడి లక్షణాలుగా చూపారు. (సుర 59, 3.47, 8.30)
దేవుడు అందుబాటులో లేనంత ఉన్నతంగా ప్రేమకూ, ఆనందానికీ అతీతంగా తోటివారూ, సలహాదారులూ, సంతానం లేకుండా నిరాకారంగా, నిర్వికారంగా తనకు తానే కారణంగా ఉంటాడు. టాల్ గ్రేవ్ ఇలా రాశాడు.
భయానకంగా, దారుణంగా చిత్రించిన దైవరూపం ఖురాన్ లో ఉన్నది. అరబిక్ గ్రంథంలో ఇలా ఉండటం ఎవరైనా గమనించవచ్చు. దైవానికి సంబంధించిన పై మాటలన్నీ ఆ గ్రంథం నుండి స్వీకరించినవే.
సమకాలీనులలో సంప్రదాయాలనుబట్టి మహమ్మద్ భావాలను ప్రత్యక్షసాక్షులు అలా చెప్పారు. అందుకు ఉదాహరణగా నెజ్ద్ లోని వహాబీలు అభినందించి ఆమోదించిన విషయాలను ప్రస్తావిస్తారు.
మానవుని సృష్టించదలచిన దేవుడు మట్టిని చేతబుచ్చుకొని సృష్టించాడు. ఆ సృష్టి ముందే ఉన్నది. రెండు ముద్దలు చేసి ఒకదానిని నరకంలోకి విసిరాడు. అది పట్టించుకోను అన్నాడు. మరొకటి స్వర్గంలోకి విసిరి నాకు నిమిత్తం లేదు అన్నాడు.
ఇందులో ముందే నిర్ధారించటం, ముందే ఖండించటం అనేది ఖురాన్ చూపుతుంది. స్వర్గ నరకాలు ప్రేమ, ద్వేషాలకు అతీతాలు. ఒక జీవిని శాశ్వతంగా నరకంలో కాల్చివేస్తూ మరొకజీవిని స్వర్గంలో అప్సరసల మధ్య ఉంచుతూ, తన ఇచ్ఛ ప్రకారం దేవుడు అనందిస్తూ ఉంటాడు. ఆ విధంగా మానవులంతా దేవునికి ఒకే బానిస స్థాయిలో ఇహ, పర లోకాలలో ఉంటారు.
దేవదూతగా మహమ్మద్
ప్రతి మతం దైవం నుండి ప్రత్యేకంగా ఆజ్ఞలు వచ్చినట్లు నటించింది. అవి కొందరు వ్యక్తులకు సంక్రమించాయనీ, యూదులకు మోజెస్ ఉన్నాడు. క్రైస్తవులకు జీసస్ క్రైస్ట్, దైవ దూతలూ, సెయింట్స్ ఉన్నారు. టర్కులకు వారి ప్రవక్త ఉన్నాడు. వీరంతా దైవదత్తమైన గ్రంథాలూ, లేదా ఆజ్ఞలను చూపారు. మోజెస్ కు దేవుడు చెప్పాడని యూదులన్నారు. దైవ ప్రేరణతో వాక్యాలు వచ్చినట్లు క్రైస్తవులన్నారు. స్వర్గం నుండి దేవదూత ఖురాన్ ను తెచ్చినట్లు దేవుడైన అల్లా చెప్పారు. అందరూ తమ మతాన్ని కాదన్నందుకు ఇతరులను నమ్మకంలేని వారుగా దూషించారు. నా మట్టుకు నేను వీరెవరినీ నమ్మను. థామస్ పెయిన్, ది ఏజ్ ఆఫ్ రీసన్ (సెకాకస్. 1974, పుట 270)
మానవ జాతికి మహమ్మద్ ను తన దూతగా అల్లా ఎంపిక చేశారు. మహమ్మద్ స్వయంగా దేవుని చూశానన్నాడు. సుర 53.2-18. ఇస్లాం తత్వవేత్త అయిన ముస్లిం, పాశ్చాత్య భాష్యకారులలో సానుభూతిపరులూ దీనిని నిరాకరించారు. దైవ సందేశాన్ని తరచు గేబ్రియల్ దేవదూత మహమ్మద్ కు దైవసందేశాన్ని అందజేసేవాడు. దైవాన్నీ లేదా దేవదూతనూ చూచినట్లు మహమ్మద్ కెలా తెలుసు ? తన అనుభవాలు దైవదత్తాలని అతనికి ఏ విధంగా తెలియ వచ్చింది ? ఒకవేళ అతడు చిత్తశుద్ధితో ఉన్నాడనుకొన్నా అందులో పొరపాటు ఉండకూడదా ? దైవాన్ని ప్రత్యక్షంగా చూశామనే వారంతా మానసిక రోగలక్షణాలతో ఉన్నట్లు తెలుస్తున్నది. మహమ్మద్ విషయంలో దేవుడే, లేక దేవదూత స్వయంగా సందేశం ఇచ్చాడని ఎలా తెలుస్తుంది. పెయిన్ ఇలా రాశాడు. (ది ఏజ్ ఆఫ్ రీజన్, పుటః 52) ఒక వ్యక్తికి దైవదత్తంగా వచ్చిన సందేశం మరే వ్యక్తికీ రాకపోవటం ఒక ఉదాహరణగా నిజమనుకొందాం. అలా స్వీకరించిన వ్యక్తి తనకు దైవం చెప్పింది మరొకరికి చెప్పగా, అతడు ఇంకొకరికి చెప్పగా, అలా చెపుతూ పోతున్నప్పుడు వారెవరికీ అది దైవసందేశంగా ఉండదు. మొదటి వ్యక్తికి మాత్రమే దైవసందేశం అవుతుంది. మిగిలిన వారికి విన్న విషయం గనుక అది నమ్మనవసరం లేదు.
మాట, రాతపూర్వకంగా మరొకరి ద్వారా వచ్చిన భావాలనూ, దైవదత్తం అనటం పరస్పర విరుద్ధం, మొదట సంక్రమించిన వారికి అది దైవదత్తం. అప్పటినుండి అతడు చెప్పిందంతా నమ్మాలని ఇతరుల ముందు భావించనక్కరలేదు. అది ఎవరికీ ప్రత్యక్షంగా చెప్పింది కాదు. మోజెస్ తనకు దైవం రెండు శిలాఫలకాలమీద ఆజ్ఞలను అందించాడని ఇజ్రాయెల్ వాసులకు చెప్పినప్పుడు వారికి మరే విధమైన ప్రమాణాలూ, ఆధారాలూ లేవు. ఒక చరిత్రకారుడు చెప్పిందేతప్ప, నాకూ మరే ప్రమాణమూ లేదు. ఆజ్ఞలలో దైవత్వానికి సంబంధించిన సాక్ష్యాధారాలేవీ లేవు. దైవానికి చెందకుండానే శాసనాలు రూపొందించిన ఏ వ్యక్తి అయినా అలాంటి నియమాలు చెప్పగలడు.
ఖురాన్ స్వర్గంలో రాశాడనీ, ఒక దేవదూత మహమ్మద్ కందించిందనీ అన్నప్పుడు నేనా దేవదూతను చూడలేదు. గనుక నమ్మకపోవటానికి నాకు హక్కున్నది.
వాన్స్ బ్రో, క్రోన్, కుక్ సిద్దాంతాలను పరిశీలించిన తరువాత పెయిన్, మోజెస్, మహమ్మద్ ల గురించి చెప్పింది ఉచితంగా తోస్తుంది.
పెయిన్ పేర్కొన్నట్లు దైవదత్తాలనుకున్న అంశాలు బైబుల్, ఖురాన్ ప్రకారం అంతర్గత సాక్ష్యాధారాలేమీ లేకుండా ఉన్నాయి. ఖురాన్ లో దైవానికి అర్హమైన లక్షణాలు ఏవీ కనిపించవు. బైబుల్, ఖురాన్ల మధ్య పరస్పర విరుద్ధ విషయాలున్నాయి. వీటిలో ఏది సరైనది ? ఉభయులూ దైవదత్తాలనే అంటున్నారు. ఈ దైవదత్తాలకు సరైన ఆధారాలు లేవు. (మేకీ, ఎథిక్స్, లండన్, 1977, పుట 232)
దైవం తనకు తాను బహిర్గత పరచదలుచుకున్నప్పుడు ఒక వ్యక్తికే వెల్లడించటం విచిత్రం. ప్రపంచ కప్ ఫుడ్ బాల్ ఆటల్లో కోట్లాది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా తిలకిస్తుండగా ఫుట్ బాల్ స్టేడియంలో దేవుడు ఎందుకు బయటపడలేదు. పెట్రీషియా క్రోన్ ఈ విషయంలో వ్యాఖ్యానిస్తూ, ఒకే వ్యక్తికి దేవుడు వెల్లడించటం, మిగిలిన వారంతా అతనివద్ద దైవజ్ఞానాన్ని కొనుగోలు చేయాలనటం, కాలక్రమేణ అతడి స్థానంలో ఒక సంస్థ వెలియడం, చివరకు కొందరి అదుపులో దైవం ఉండటం విడ్డూరం అనిపిస్తుంది. (1994, జనవరి 21, టైమ్స్ లిటరరీ సప్లిమెంట్, పుటః 12)
అబ్రహాం, ఇస్మాయిల్, మోజెస్, నోవా, తదితర ప్రవక్తలు
చాల్డియాలో అబ్రహాం పుట్టాడన్నారు. కుమ్మరి కుమారుడన్నారు. కుండలు చేస్తూ బ్రతికాడన్నారు. అతడు మక్కా వెళ్ళి 300 మైళ్ళు ప్రయాణం చేసి ఎడారులు దాటి పోయాడనటం విడ్డూరం. అతడు దండయాత్రలు చేయదలుకుంటే అస్సీరియా వంటి దేశంపై పోయేవాడు. అతడు పేదవాడైతే విదేశాలలో సామ్రాజ్యాలు స్థాపించిన దాఖలాలు లేవు.
(వోల్టేర్, డిక్షనరీ ఫిలాసఫీ, అనువాదం బెస్టర్ మన్, లండన్, 1971, పుటః 17)
చరిత్రకారుని దృష్టిలో ఫ్రెంచివారు హెర్టర్ కుమారుడు ఫ్రాంకస్ కానట్లే, అరబ్బులు అబ్రహాం కుమారుడైన ఇస్లాయిల్ సంతతీ కాదు.
(మాక్సిమ్ రాడిన్ సన్, లే అరబ్స్ (Lee Arabs) పారిస్, 1991, పుటః 136)
అబ్రహాం మక్కాకు వచ్చినట్లు ఎక్కడా లేదు.
(వాల్ట్ ముస్లిం, క్రిష్టియన్ ఎన్ కౌంటర్స్, లండన్, 1991, పుటః 136)
చారిత్రక పద్ధతుల శాస్త్రీయ విధానాలు ఆమోదించాల్సిందే.
(వాట్, పుటః 135, ముస్లిం, క్రిస్టియన్ ఎన్ కౌంటర్స్)
మక్కాలోని పవిత్ర మసీదులో కాబాను అబ్రహాం, ఇస్మాయిల్ నిర్మించారని ముస్లిం సంప్రదాయం చెపుతున్నది. పురావస్తు పరిశోధనా సాక్ష్యాధాలేవీ ఇందుకు సంబంధించి లేవు. తన మతానికి అరేబియా పుట్టుపూర్వోత్తరాలు అంటగట్టడానికి మహమ్మద్ ఈ కథను అల్లాడని, స్నోక్ హర్ గ్రోంజే స్పష్టం చేశాడు. మహమ్మద్ ఈ విధంగా తన మత స్వతంత్ర ప్రతిపత్తిని చూపి ఇస్లాంలో కాబాను అరబ్బులకు చెందిన చారిత్రక, మత విషయాలతో జోడించాడు. ఖురాన్ అధ్యయనం చేయటంలో పెంటకాక్ నుండి స్వీకరించిన విషయాలను గమనించాలి. బైబుల్ విమర్శలో అలాంటి ప్రభావం కనిపించకపోవటం ఆశ్చర్యం, మోజెస్ లోని 502 చరణాలు 36 సురలలోనూ, అరహాంలోని విషయాలు 25 సురలలోనూ, సుహూ 28 సురలో, 131 చరణాలలోనూ కనిపిస్తుంది. కొరాన్ లో పెంటకాక్ ను తారాత్ గా ప్రస్తావించారు.
బైబుల్ కథనాలను పరిశీలించిన పండితులు దానిలోని చరిత్రను సందేహించారు. అలాంటి పరిశోధనలను ఇస్లాం తప్పించుకోలేదు. 17వ శతాబ్దంలోనే లా పెరేరీ, స్పినోజా, హాబ్స్ వంటివారు పెంటకాక్ ను మోజెస్ రాయలేదని వాదించారు. మోజెస్ అనంతరం ఉన్నవారెవరో రాసి ఉంటారని స్పినోజా స్పష్టం చేశాడు. (ధియోలాజికో పొలిటికల్ ట్రీటైజ్, అనువాదం ఎల్విన్, న్యూయార్క్, 1951, పుటః 124)
19వ శతాబ్దంలో గ్రాఫ్, వెల్ హాసన్ వంటి విమర్శకులు పెంటకాక్ లో నలుగురు భిన్న రచయితలు ఉన్నారని నిర్దుష్టంగా చెప్పారు. ఇదే విషయాన్ని రాబిన్ లెన్ ఫాక్స్ విడమరిచి చెప్పాడు.
(ఆర్. ఎల్. ఫాక్స్, ది అన్ ఆధరైజ్డ్ వెర్షన్, లండన్, 1991, పుటః 176)
బైబుల్లోని నాలుగు, ఆధారాలను 5వ వ్యక్తి క్రీస్తు పూర్వం 528-400 మధ్యలో కలిపి రాశాడు. అలా కలవడంలో అనేక సృష్టి విషయాలలో ఉత్తమమైన వాటిని స్వీకరించారు. అతడొక ఉపసంపాదకుడు వంటివాడు. చరిత్రకారుడు కాదు. కానీ, ఎవరైనా అతనితో నీవు కలిసి రాసినదంతా చరిత్ర కాదు అని చెబితే దిగ్ర్భాంతి చెందేవాడు. చారిత్రక వాస్తవాలు ఇందులో కనీసస్థాయిలోనే ఉండే అవకాశం ఉన్నది. శతాబ్దాల తరబడి ఈ విషయాలు ప్రాథమిక ఆధారాలను బట్టి రాసినవి కావు. నోటిమాటగా అన్నేళ్ళు అట్టిపెట్టటం కష్టం. బేబెల్ టవర్, జేకబ్ అబ్రహాంల దోపిడీలు నమ్మే ఆధారాలు లేవు. బైబుల్లో జోస్ ఫ్ కథ చారిత్రక సత్యాలకు నిమిత్తంలేని అల్లిక మాత్రమే.
తోర రాసిందీకాదు, మోజెస్ కు ఇచ్చిందీ కాదు. అలాగే అబ్రహాం విషయంలో నమ్మదగినదేదీ లేదు. చరిత్రకారుడెవరూ ముస్లిం ఆధారాలలోకి వెళ్ళి బైబుల్ విషయాలను సరిచూడడు. అబ్రహాం, మోజెస్ తదితరులను గురించి ముస్లింలు పేర్కొన్నవి యూదుల గ్రంథాలనుండి స్వీకరించారు. కాబా నిర్మాణం వంటివి అల్లిన గాథలే.
చరిత్రకారులు మరికొంచెం దూరం వెళ్ళి అబ్రహాం అసలు లేడన్నారు. అబ్రహాం సంచారాలు చారిత్రకాలు కావన్నారు. ఎహోవా సేవకుడుగా సంచారాలన్నీ గాథలే. వీటిని ఒకచోట చేర్చి కూర్చారు. థామ్ సన్ ఇలా రాశాడు.
పురావస్తు శాఖ పరిశోధనలు ఇలాంటి ఆధారాలను రుజువు చేయలేదు. పిత్రుస్వామ్య సంప్రదాయాలను చారిత్రకాలు కాదన్నది. క్రీస్తుపూర్వం రెండవ శతాబ్దంలో పాలస్తీనా చరిత్ర ఆధారంగా జెనెసిస్ సాహితీ సంప్రదాయాలనుబట్టి అలాంటివేవీ సంభవాలు కావని చెప్పవచ్చు. అబ్రహాంను చారిత్రక పురుషుడుగా చూపే శ్రమంతా వృథా (ధామ్ సన్, ది హిస్టారిసిటీ ఆఫ్ ది పేట్రియార్కల్ నెరేటివ్స్, లండన్, 1974, పుటః 328)
లేస్ ఫాక్స్ ఇలా అన్నారు. ఏనియాస్, హెరాక్లీస్ వలె అబ్రహాం కూడా గాథలకు చెందడమే తప్ప చరిత్రకారులు వాటిని నమ్మరు. (ఫాక్స్, ది అనాథరైజ్డ్ వెర్షన్, లండన్, 1991, పుటః 176)
నోవా-ప్రళయం
నోవాచే నౌకానిర్మాణం, జంతువుల్ని కాపాడటం, ప్రపంచ ప్రళయం అనేవన్నీ జెనెసిస్ నుండి కొరాన్ స్వీకరించింది. క్రైస్తవులు ఈ కథల్ని వాస్తవమని భావించటంలేదు. కొద్దిమంది సనాతన వాదులు మాత్రం ఇంకా నావలో మిగిలిన వాటికోసం అన్వేషిస్తుంటారు. హేతుబద్ధమైన ఆలోచనలకు దూరంగా గూడుకట్టుకొన్న ముస్లింలు సాక్ష్యం కనిపిస్తున్నా నిరాకరిస్తున్నారు. పై గాథలో అసంబద్ధాలను చూపిస్తాను. స్పష్టమైన దానికోసరం వృథా అనిపిస్తున్నా దీనిని ఎక్కువమంది పట్టించుకుంటారని ఆశిద్దాం.
ప్రతి జీవి నుండి ఒక జంటను తీసుకురమ్మని నోవాకు చెప్పాడు. (సుర 11.36-41) కొంతమంది జంతు శాస్త్రజ్ఞులు కోటి కీటకాలు ఉన్నట్లు అంచనా వేశారు. అవన్నీ నౌకలో పట్టాయా ? (మార్గస్ లిన్ కె.వి. షవార్జ్ ఫైవ్ కింగ్.డమ్స్, శాన్ ఫ్రాన్సిస్ కో, 1982, పుటః224-39) కీటకాలకు ఎక్కువ స్థలం కేటాయించక పోవచ్చు. కనుక పెద్ద జంతువుల సంగతి చూద్దాం. ప్రాకే జంతువులు 5వేల రకాలున్నాయి. 9 వేల పక్షిజాతులున్నాయి. పాలిచ్చే జంతువులు 4,500 జాతులున్నాయి. ఫైలమ్ కార్డేటో వర్గంలో 46 వేల రకాలున్నాయి. ఎంత ఓడైతే ఇవన్నీ పడతాయి. 90వేల జాతుల్లో పాములూ, ఏనుగులూ, పక్షులూ, గుర్రాలూ, హిప్పోలు, రెయినోలు అలా ఎన్నో ఉన్నాయి. వాటన్నిటినీ నోవా తొందరగా ఎలా చేర్చాడు. అమెజాన్ నుండి కొన్నిటినీ, ఆస్ట్రేలియా నుండి కంగారూను ఎలా తెచ్చాడు. నోవా ఎక్కడ ఉన్నాడో ధృవ ప్రాంతాల ఎలుగుబంటికి ఎలా తెలిసింది ?
ఇంతకంటే అసంబద్ధతలుంటాయా ? అని ఇంగర్ సాల్ అడిగాడు. (సమ్ మిస్టేక్స్ ఆఫ్ మోజెస్, పుటః 149) ఇలాంటి పుక్కిటి గాథను వాస్తవంగా స్వీకరించరాదని అనుకోవచ్చు. లేదా, దేవుడికీ, అన్నీ సాధ్యమే అనుకోవచ్చు. దేవుడు ఇలాంటి చిక్కులతో కూడిన, ఎంతో వ్యవధి తీసుకున్న పద్ధతి ఎందుకు అనుసరించాడు ? నోవాను, ఇతర ధర్మాత్ములను ఏదైనా అద్భుతంతో కాపాడవచ్చుగదా?
భూగర్భ శాస్త్రం ఏదీ విశ్వ ప్రళయాన్ని సూచించడం లేదు. స్థానికంగా జలప్రళయాన్ని సూచించడంలేదు. స్థానికంగా జలప్రళయాలున్నా. కనీసం మధ్యప్రాచ్యం అంతా అనుసరించినవి కూడా లేవు. మెసపటోమియా గాథలనుండి బైబుల్లో జలప్రళయాలు ప్రస్తావించగా వాటి ఆధారంగా ఖురాన్ లో పేర్కొన్నారు. మెసపటోమియా, హీబ్రూ కథలలో ఏ ఒక్క ప్రళయాన్నీ దృష్టిలో పెట్టుకోనక్కరలేదు. (అర్.ఎల్.ఫాక్స్, ది అనాధరైజ్డ్ వెర్షన్, లండన్, 1991, పుటః 176).
డేవిడ్, సంకీర్తనలు
డేవిడ్ కు సంకీర్తనలు సంక్రమించాయని ఖురాన్ ద్వారా ముస్లింలు నమ్ముతున్నారు. తారాత్ లో మోజెస్ కి ఇచ్చినట్లే (సుర 4.163-65) బైబుల్ పండితులు డేవిడ్ రచనలపట్ల సందేహాలు వెలిబుచ్చారు. క్రీస్తుపూర్వం వేయి సంవత్సరంలో డేవిడ్ ఉంటే ఈ కీర్తనలు క్రీస్తుపూర్వం 539 ప్రాంతంలో సమకూర్చారు. సంకీర్తనల విభాగంలో ఐదు సంకలనాలు జెరూబాబెల్ దేవాలయంలోపాడటం కోసం రాశారు. ఇవన్నీ ప్రవాసానంతర సంకలనాలే. జెరూబాబెల్ దేవాలయంలో పాడటం కోసం రాశార. ఇవన్నీ ప్రవాసానంతరం సంకలనాలే. ఇందులో డేవిడ్ రాసినవేవీ లేవు. హాన్ మోనియా రాజూల గౌరవార్థం వారిని స్తుతిస్తూ ఇందులో చాలా ఉన్నాయి. ఈ రాజులు 142-63 బి.సి.లో ఉన్నారు. (హోవెల్ స్మిత్ ఇన్ సర్చ్ ఆఫ్ ది రియల్ బైబుల్, లండన్, 1943, పుటః 75)
ఆదాము, పరిణామం, సృష్టి, ఆధునిక విశ్వవాదం
చాలామంది ముస్లింలు ఇంకా పరిణామం అనే వాస్తవంతో కుదురుకోలేదు. మానవజాతి పుట్టుపూర్వోత్తరాలలో శాస్త్రీయంగా పరిశీలించినప్పుడు ఆడం-ఈవ్ కథకు స్థానం లేదు. (వాట్, ముస్లిం, క్రిస్టియన్ ఎన్ కౌంటర్స్, లండన్, 1991, పుటః 134-35)
సృష్టిని గురించి ఖురాన్ ఇచ్చే విరుద్ధ విషయం భాష్యకారులకు సమస్యలు తెచ్చిపెట్టింది.
స్వర్గం, భూమి, వాటి మధ్య ఉన్నదంతా 6 రోజుల్లో అలసట లేకుండా సృష్టించాం సుర 50.37)
రెండు రోజుల్లోభూమిని దేవుడు సృష్టించాడనటంలో నీకేమైనా సందేహం ఉందా ? అతనితో సమానులను చూపుతావా ? అతడు ప్రపంచాధిపతి భూమిపై పర్వతాలను నెలకొల్పి పోషక విశేషాలను సర్వత్రా పంపిణీచేసి నాలుగు రోజుల్లో కార్యక్రమం ముగించారు. తరువాత పొగ ఆవరించిన ఆకాశం విషయం పట్టించుకొన్నారు. భూమి, ఆకాశాల నుద్దేశించి, మీరు లొంగి ఉంటారా లేదా ? అని అడిగితే, ఉంటామన్నాయి. ఆకాశమంతా ఏడు లోకాలుగా పూర్తిచేసి ప్రతిదానికీ విధులను అప్పగించి కిందిస్థాయి వాటికి వెలుగు, సంరక్షణ దూతలను సమకూర్చాడు. ఇది సర్వజ్ఞుడి, సర్వశక్తివంతుడి చర్య. (సుర 41.9)
భూమికి రెండు రోజులు, దాని పోషణకు నాలుగు రోజులు ఏడు స్వర్గాలకు 2 రోజులు మొత్తం ఎనిమిది రోజులు పని జరిగింది. (సుర. 41) కాని సుర 1 ప్రకారం సృష్టి అంతా 6 రోజుల్లోనే జరిగింది. భాష్యకారులు ఈ తేడాను సర్ది చెప్పటానికి అడ్డగోలుగా రాశాడు.
భూమీ, ఆకాశాలూ, జీవులూ అన్నీ దేవుడూ, అతని శక్తికి రుజువులన్నారు. (లెవీ. 1957, పుటః 2.4) జీవులను, ముఖ్యంగా మనిషినీ వృథాగా సృష్టించలేదు. (సుర. 21.16) మనుషులూ, జిన్ కూ దైవారాధనలో ప్రత్యేక విధుల్ని కేటాయించారు. దేవుడికి లొంగి ఉండే అవకాశాన్ని తొలుత భూమి, ఆకాశాలకూ, పర్వతాలకూ ఇచ్చినా, అవి నిరాకరించటంతో ఆ సదవకాశం మనిషికి దక్కింది. సుర. 33.72 (లెవీ. 1957, పుట 2.4)
ఈ సిద్ధాంతాన్ని గురించి మనం ఏమనుకోవాలి. భూమి ఆకాశాలు, పర్వతాలూ, వ్యక్తులుగా పేర్కొనటమే గాక దైవాన్ని తృణీకరించాయి. సర్వశక్తివంతమైన దేవుడు విశ్వాన్ని సృష్టించి, నమ్మమని తన సృష్టిని అడిగితే, ఆ భారాన్ని సృష్టి నిరాకరిస్తున్నది.
అల్లా, ఉండు అనటంతో సృష్టి ఏర్పడింది. అంతకు ముందు దేవుని సింహాసనం నీటిపై తేలుతూ ఉండేది. భూమి ఆకాశాలన్నీ జలమయాలే. అల్లా విభజన చేసి దోషరహితంగా స్వర్గాన్ని నిర్మించి కప్పులేకుండా, స్తంభాలు లేకుండా భూమిపైన ఏర్చరచాడు. జీవ ప్రపంచం అంతా ఏడు పొరలతో కూడిన దశలో ఉన్నది. ఉప్పు, తీపి నీటిని ఏర్పరచి రెండూ కలియకుండా చూశారు. (లెవీ. 1957, పుటః 2,5)
ముందు భూమినీ, తరువాత స్వర్గాన్నీ సృష్టించారు. చంద్రుడికి స్వయంప్రకాశకాన్నిచ్చారు. సుర 10.5 - మనిషి సంవత్సరాలను తెలుసుకొని లెక్కించటానికి వీలుగా అదీ చంద్రాకారాన్నీ, శుక్లాలనూ ఏర్పరచారు. సుర 10.5 (లెవీ, 1957, పుటః 2, 5)
ఆడంను మట్టినుండి సృష్టించారు. దానిని భద్రపరచి అందులోని రక్తాన్నీ, మాంసాన్నీ, ఎముకలనూ, చర్మాన్నీ సృష్టించి, దానికి మరొక సృష్టిని జత చేర్చారు. (సుర 23.12)
మరొక వివరణ ప్రకారం మనిషిని రేతస్సు నుండి సృష్టించారు. (సుర 77.22) ఇంకొక సూత్రం ప్రకారం ప్రాణులన్నింటినీ నీటినుండి సృష్టించారు. (సుర 21.31, 25.56, 24.44) మనుషుల కోసం జంతువులను సృష్టించాడు. జంతువుల యజమానులు మనుషులే. వాటిపై స్వారీ చేయవచ్చు. కొన్నిటిని తినవచ్చు. వాటిపాలు తాగవచ్చు. ఇతర ఉపయోగాలూ స్వీకరించవచ్చు. (సుర 36.71)
జిన్ ను అగ్ని నుండి మానవుడికి ముందే సృష్టించారు. అదిగూడా మానవుడితోపాటే ఉంటుంది.
ముస్లిం భాష్యకారులు పరస్పర విరుద్దాలను సర్ది చెప్పుకోటంలో సమస్యలను ఎదుర్కోలేదు. కాని శాస్త్రీయ పరిశీలకులు అలాంటి అస్పష్ట, గందరగోళ సృష్టి వాదానికి శాస్త్రీయ సత్యాలను అన్వేషించే ప్రయత్నం చేయలేదు. ఎవరికేది కావాలో అలాంటివన్నీ గాథలలో, నమ్మకాలలో ఉన్నాయి. ఖురాన్ లోనే, సంప్రదాయాలలోనే జ్ఞానం యావత్తూ ఉన్నదని చాలామంది ముస్లింలు అనుకొంటారు. ఇబ్న హజమ్ హేతుబద్ధంగా రుజువు చేయగలిగిందంతా ఖురాన్ లో ప్రవక్త ప్రవచనాలలో ఉన్నదన్నారు. కొత్త శాస్త్రీయ పరిశోధనలో కనుగొన్నదానిని ఖురాన్ ముందే ఊహించిందని ముస్లిం మతవాదులు చెపుతారు. విద్యుత్ నుండి సాపేక్షతా సిద్ధాంతం వరకూ భౌతిక, రసాయనిక జీవశాస్త్రా వరకూ కొరాన్ లో చూశారు. (ఆషా, 1989, పుటః 14) ఈ ముస్లింలు జీవులన్నిటికీ నీటి ఆధారాలను ఖురాన్ లో చూస్తున్నారు. (సుర 21.31) నీటి కొలునులో జీవం అరంభమైనట్లు డార్విన్ చెప్పాడు. అది ఖురాన్ లో ఉన్నదంటున్నారు. గాలిద్వారా పరపరాగ సంపర్కం మొక్కలలో జరిగే తీరును విజ్ఞానశాస్త్రం చెప్పగా ఖురాన్ లో ఉన్నదన్నారు. (సుర 15.22) ఎ.జి.కైరన్స్ - స్మిత్ అనే రసాయన శాస్త్రజ్ఞుడు ప్రాణాధారాలు మట్టిలో ఉండవచ్చునని సూచించగా ముస్లింలు ఎగిరి గంతేసి ఖురాన్లో ఆడం మట్టినుండే సృష్టి అయ్యాడన్నారు. (డాకిన్స్. పుటః 148-65)
ముస్లింలు ఖురాన్ అంతా నిజమని నమ్ముతారు. గనుక, విశ్వం భూమిపై జీవం పుట్టుక గురించి ఆధునిక విజ్ఞానం చెప్పేదానిలో పొసగదని చూపదలిచాను. ఖురాన్ లోనే అసంబద్ధమైన పొందిక లేని విషయాలున్నాయి. సృష్టించిన రోజులకు సంబంధించి తేడాలు చూశాం. అల్లా ఉండు అంటే అతడి ఇచ్ఛప్రకారం సూర్యుడు లేకముందే రోజులు ఎలా ఉంటాయి ? రోజు అంటే భూమి తనచుట్టూ తాను ఒకసారి తిరగటం. సృష్టికి ముందు నీటిపైన దైవ సింహాసనం తేలియాడిందన్నారు. సృష్టికి ముందు ఈ నీరు ఎక్కడనుండి వచ్చింది ? దైవ సింహాసనం మానవత్వ ఆరోపణతో ఉండగా, సనాతనులు అదే పట్టుకు కూర్చున్నారు. ఆడం సంవత్సరాలు తెలుసుకోటానికి చంద్రుడూ, దాని దశలూ సృష్టించారని చెప్పారు. (సుర 10.5) బేబిలోనియా, ఈజిప్టు, పర్షియా, చైనా, గ్రీక్ నాగరికతలు కాలమానానికి సూర్యుని ప్రమాణం వాడారు. దీని ప్రకారం అరేబియాలో దృష్టి వెనకబడే ఉన్నది.
ఇప్పుడు విశ్వం పుట్టు పూర్వోత్తరాలు గురించి ఆధునిక రీతులు చూద్దాం.
1929లో ఎడ్విన్ హబుల్ తాను కనిపట్టిన విషయం బయటపెడుతూ సుదూరాలలో ఉన్న పాలపుంతలో భూమి నుండి దూరంగా జరిగిపోతున్నాయని వెల్లడించాడు. అంటే విశ్వం విస్తరిస్తున్నదని దీని సారాంశం. కాఫ్ మన్ ఈ విషయం ఇలా వివరించాడు. (యూనివర్స్, న్యూయార్క్, 1986 పుటః 110-16) విశ్వం కోట్లాది సంవత్సరాలుగా విస్తరిస్తూ పోతున్నది. గతంలో విశ్వంలోని పదార్థం అంతా ఒకేచోట కుదించుకొని ఉండాలి. విశ్వవ్యాప్తి ప్రారంభం కావటానికి పెద్ద పేలుడు సంభవించి ఉండాలి. అదే విశ్వసృష్టికి నాంది. విశ్వం వయసు 15-20 బిలియన్ సంవత్సరాలుగా అంచనా వేస్తున్నారు. పెద్ద పేలుడు తరువాత 10 సెకండ్లకు విశ్వం ఎంత సాంద్రతతో ఉన్నదంటే నేడు మనకు తెలిసిన పదార్థ నియమాలు కాలం, ప్రదేశాన్ని పదార్థాన్ని వివరించలేకపోయింది. మొదట మిలియన్ సంవత్సరాలపాటు పదార్థం, శక్తి ఒక అగ్ని గోళంలా ప్రోటానులు, ఎలక్ట్రాన్లు ఢీకొంటూ కొనసాగాయి. మరొక మిలియన్ సంవత్సరాల తరువాత ప్రొటాన్లు, ఎలక్ట్రానులు కలిసి హైడ్రోజన్ అణువులేర్పడ్డాయి. సూర్యమండలం జనించటానికి పది బిలియన్ సంవత్సరాలు ఆగవలసి వచ్చింది. బిలియన్ల సంవత్సరాల క్రితం అదృశ్యమైన నక్షత్రాలలోని పదార్థం సూర్యమండలంగా రూపొందింది. సూర్యుడు వయసులో చిన్న నక్షత్రం. కేవలం 5 బిలియన్ సంవత్సరాల క్రితమే పుట్టింది. హైడ్రోజన్, హీలియం మినహాయిస్తే సూర్యమండలంలో మిగిలినవన్నీ నక్షత్రాల నుండి 10 బిలియన్ సంవత్సరాల క్రితం చెదురు, మదురుగా వెదజల్లగా వచ్చి కూడాయి. ఈ నక్షత్రాల రస్మిలోనే మనం ఆవిర్భవించాం. (కాఫ్ మన్, పుటః 110) సూర్యమండలం ఇలాంటి రస్మి, గేస్ తో ఏర్పడింది. ఇందులోని గ్రహాలు ఈ రస్మికణాల కూడలిగా రూపొందాయి. అలాగే బయట గ్రహాలు కూడా జనించాయి. వంద మిలియన్ సంవత్సరాల క్రితం సూర్యకేంద్రంలో ధర్మో, న్యూక్లియర్ రియాక్షన్లు రావటానికి అనువుగా ఉన్నది. (కాఫమన్, పుట 116)
పైన వివరించిందంతా కొరాన్ కు భిన్నంగా ఉన్నది. ఖురాన్ సుర 41.12లో చెప్పినట్లు భూమి, ఆకాశంకంటే ముందు పుట్టలేదు. ముందు సూర్యమండలం, అంతకుముందే తారామండలం జనించాయి. ఆకాశమనేది అస్పష్టమైనది. సూర్యమండలం, పాలపుంత, విశ్వం అనే వాటిలో దేనిని ఖురాన్, బైబుల్ స్వర్గమంటున్నాయో, 6, 8, 2 రోజుల్లో సృష్టించామంటున్నాయో ఎంత వివరించినా అర్థం కాదు. సుర 10.5లో చెప్పినట్లు చంద్రుడికి స్వయం ప్రకాశం లేదు. సూర్యకాంతి పరావర్తనం చెందుతుంది. భూమి చుట్టూ తిరుగుతుంది గాని అందుకు భిన్నంగా తిరగదు.
పెద్ద ప్రేలుడుకు సంబంధించి ఖురాన్ లో ముందే ఉన్నదని ఎవరైనా అంటే, ఆధునిక విశ్వజ్ఞానం పదార్థశాస్త్రం, గణితంపై ఆధారపడేవన్న విషయం గుర్తుంచుకోవాలి. ఈ గణితం ముఖ్యంగా 17వ శతాబ్దంలో కేలిక్యులస్ రూపొందటంతో ఆభివృద్ధి, అవగాహన సాధ్యపడింది. కొరాన్ లో అస్పష్టత వలేకాక ఆధునిక విశ్వవిజ్ఞాన సిద్ధాంతాలు పెద్ద ప్రేలుడుకు సంబంధించిన నిర్దుష్ట విషయాలూ, గణితం ఆధారంగా అంచనా వేయ గలిగారు. ఇవి సాధారణ భాషలో చెప్పినప్పుడు గణిత నిర్దుష్టత సన్నగిల్లుతుంటుంది.
జీవం, పుట్టుక, పరిణామ సిద్దాంతం
4.5 బిలియన్ సంవత్సరాల క్రితం భూమి ఏర్పడింది. తరువాత బిలియన్ సంవత్సరాలకు రసాయనిక పరిణామం వలన తొలుత జీవం ఏర్పడింది. రష్యా జీవ రసాయనిక శాస్త్రజ్ఞుడు ఒపేరిన్ 1938లో జీవం పుట్టుక ప్రచురించాడు. భూమిపై ఉన్న రసాయనిక పదార్ధాలపై బయటినుండి వచ్చిన ధార్మిక అణువులు ప్రతి చర్యకు లోబడగా మార్పులు సంభవించాయన్నాడు. ఈ రసాయనిక చర్యకారణంగా నిర్జీవ మిశ్రమం నుండి సజీవ సముద్రాలు రూపొందాయని అన్నారు. వీటిలో ఎమినో యాసిడ్లు జీవ నిర్మాణానికి ప్రాతిపదికలు. వాటి నుండి ప్రొటీను అణువులు నిర్మితమయ్యాయి. కాలానుగుణంగా ఈ రసాయనిక ఎంపిక వలన జీవరీతులు స్థిరపడి అనేక దిశలుగా పెంపొందాయి. అవే ఉత్తరోత్తరా జీవ పదార్థానికి నాంది అయ్యాయి. (హెచ్. బర్క్స్. ఎవల్యూషన్ అండ్ అన్ బిలీఫ్, పుట 17-18, ఎన్ సైక్లోపీడియా ఆఫ్ అన్ బిలీఫ్, 1వ సంపుటి) ఓపెరిన్ కాలం నుండి మిల్లర్, ఫాక్స్, పొన్నంపెరుమా వంటి శాస్త్రజ్ఞులు నిర్జీవ రసాయనిక పదార్థాల నుండి సజీవ పదార్థాలను పరిశోధనాలయంలో సృష్టించారు.
ఇప్పటికీ జీవితం పుట్టుక గురించి జీవ రసాయనిక వివరణ ఇవ్వటంలో వివాదం ఉన్నది. జీవాణువులు, ముందు జనించాయా లేక వాటికి అవసరమైన అమినో ఆమ్లాలు వచ్చాయా అనేది స్పష్టపడలేదు. జీవం తనంతట తాను తిరిగి సృష్టించుకోవడానికి శక్తి కలిగి ఉన్నప్పుడు జీవపదార్థం ఆవిర్భవించింది. నిర్జీవ సమ్మిశ్రితం రసాయనిక పరిణామంగా పెంపొంది జీవ పరిణామానికి దారితీసింది. ఇది భిన్న రూపాలలో పరిసరాలకు అనుగుణంగా ఇమిడే స్వభావాన్ని రూపొందించుకున్నది.
1859లో డార్విన్ తన పరిణామ సిద్ధాంత గ్రంథాన్ని ప్రచురించాడు. అందులో డార్విన్ ముందు మాటగా ఇలా రాశాడు. (ది ఆరిజన్ ఆఫ్ స్వీసిస్, లండన్, 1872)
జీవోత్పత్తిని గ్రహిస్తే జీవుల పరస్పర సంబంధాలను బట్టి వాటి గర్భోత్పత్తి విధానాల రీత్యా భౌగోళికంగా వ్యాపించిన దృష్ట్యా ఏజీవికాజీవి స్వతంత్రంగా సృష్టికాలేదని, ఒక జీవినుండి మరొకటి సంక్రమిస్తూ భిన్న రూపాలు దాల్చాయని తెలుస్తుంది. ఐతే ఇన్ని ఆధారాలున్నా అనేక జీవులు వాటి మనుగడకు అనుగుణంగా శారీరక నిర్మాణాన్నీ ఇముడ్చుకున్నాయనేది గ్రహిస్తే ఎంతో అబ్బురమైన విషయంగా తోస్తుంది.
పరిణామం ఎలా సంభవించింది అని డార్విన్ ప్రశ్నించుకొని సహజమైన ఎంపిక ద్వారా అని సమాధానమిచ్చాడు. సుదీర్ఘమైన ఈ సహజ ఎంపిక జీవులలో సంభవించింది. (రూజ్. పుట. 47) డార్విన్ ఇలా వివరణ ఇచ్చాడు.
ప్రతి జీవులలోనూ బ్రతికేవారికంటే ఎక్కువే జనిస్తూ వచ్చాయి. ఇది మనుగడ పోరాటంగా సాగింది. ఏ జీవి ఐనా పరిసరాలకు పొందికగా మారితే బ్రతకటానికి ఎక్కువ అవకాశాలుండవు. అలాటి జీవి తాను మారిన రీతిలో తన జీవులకు సంక్రమింపజేస్తూ సాగిపోయింది. డార్విన్, ది ఆరిజిన్ ఆఫ్ స్విసీస్, పీఠిక)
ప్రకృతిలో మానవుడి స్థానాన్ని పరిణామ సిద్ధాంతం స్పష్టంగా సూచిస్తున్నది. ఇతర జీవులతోపాటు మానవుడు ఆవిర్భవించి పరిణమించాడా అనటానికి వాగ్ట్, లుబాక్, బుకానర్, రోల్, హెకెల్ వంటి ప్రకృతి వాదులూ, తాత్వికులూ ఈ సిద్ధాంతాలను పెంపొందించారు.
18వ శతాబ్దంలో డాలామాటర్ మనిషిని జంతువుగా వర్గీకరించి చూపాడు. (లిన్నాస్ (1707-78) మనిషిని కోతులతో వర్గీకరించి వివరించాడు. కింది జాతి జంతువులతో మానవుడి సంబంధాలు అనే సిద్ధాంతంలో టి.హెచ్.హక్సలే కుక్క అండాభివృద్ధి పరిశీలించి ఇలా చెప్పాడు. (హక్సలే, మేన్స్ ప్లేస్ ఇన్ నేచర్ అండ్ అదర్ ఎస్సేస్ 1914, పుట 52-62)
వెన్నెముక ఉన్న జంతువుల పరిణామ చరిత్ర ఇలాగే ఉంటుంది. మానవుడు వేరేనా ? కుక్క, పక్షి, కప్ప, చేప కంటే భిన్నంగా, ఇతర జీవజాలంతో అనుబంధం లేకుండా మానవుడు ఉన్నాడా ? లేక, వాటివలె క్రమంగా నెమ్మదిగా, పోషక పదార్థాలతో, మార్పులు చేసుకుంటూ, అలాంటి విధానాలతోనే వచ్చాడా ? సమాధానంలో సందేహం లేదు. మానవుడి ఆభివృద్ధి కూడా తొలుత ఇతర జంతుజాలానికి పోలి ఉంది. నిస్సందేహంగా అతడు కోతులకు సన్నిహితంగా ఉన్నాడు. కుక్కలకు, కోతులకు ఉన్న సంబంధంకంటె ఇది చేరువగా ఉంది. మానవ అండంలో మార్పులు ఇతర జంతువుల అండంలో జరుగుతున్న మార్పులవంటివే. అభివృద్ధి చెందడంలో మానవుడు కోతికి సమీపంలో ఉన్నాడు. పరిణామంలో ఉత్తరోత్తరా మానవుడికీ, కోతికీ తేడాలు స్పష్టంగా పెంపొందాయి. ఈ విషయం రుజువు పరచవచ్చు. కొందరిని కలవరపరచవచ్చు. కాని వాస్తవం అంతే.
శాస్త్రీయ పద్ధతుల సాక్ష్యాధారాలతో పరిణామక్రమం మనముందున్నది. ఇందుకు అనేక శాస్త్ర విభాగాలు తోడ్పడ్డాయి. భూగర్భ శాస్త్రం, జీవ భూగోళం, పోల్చి అధ్యయనం చేయడం, రసాయనిక శాస్త్రం, అండశాస్త్రం, పరస్పర ఆధార జీవులశాస్త్రం, శారీరక నిర్మాణం, మనస్తత్వం ఇవన్నీ ఉన్నాయి.
సాక్ష్యాధారాలన్నీ మానవుడి పరిణామాన్ని సూచిస్తున్నాయి. పూర్వీకులు కోతిని పోలినవారే. ఇందులో మానవుడి ప్రత్యేకసృష్టి జరగలేదు. బైబుల్, కొరాన్ లో అడం, ఈవ్ ల సందర్భం అర్ధరహితం, వర్గీకరణలో మానవుడితోపాటు కోతులు తదితరాలున్నాయి. మన పూర్వీకులు చెట్టు చేమలవరకూ సాగాయి. మన పూర్వీకుల వంశవృక్షం చివరకు సముద్రంలో తేలి మొక్కలవరకూ ఉన్నా అశ్చర్యం లేదు. (జె.జి.యంగ్ An introduction to the study of Man, Oxford, 1974, పుటః 402)
సృష్టికర్త దేవుడు
బైబుల్లో ఉన్న ప్రథమ కథ అర్థం చేసుకున్నారా ? దేవుడికి విజ్ఞానం అంటే నరకంవలె భయంకరమనిపించిందా ? దేవుడి గొప్ప పొరపాట్లలో మానవుడే ప్రముఖుడు. అతడు దేవుడికి ప్రత్యర్థిగా నిలిచాడు. విజ్ఞానంతో దేవుళ్ళు, పురోహితులు పసలేకుండా పోయారు. పురోహితుల బంధాల నుండి మానవుడిని విజ్ఞానం విమోచన చేసింది. (నీషే. ది పోర్టబుల్ నీషే ఎడిటెడ్ జడబ్ల్యు కాఫ్ మన్, న్యూయార్క్ 1974, పుట 628, ది యాంటీ క్రైస్ట్)
విశ్వం, జీవం పుట్టుకలో గాని, పరిణామంలో గాని దైవజోక్యానికి ఎక్కడా ఆధారాలు లేవు. దేవుడి పేరిట వివరించటం అంటే ఏ వివరణ లేకపోవటమే. అన్వేషణను చంపటమే. జిజ్ఞాసను ఆర్పేయటమే. విజ్ఞానాభివృద్ధిని హతమార్చడమే. జీవుల అద్భుత ఆశ్చర్యకర భిన్నత్వాన్ని సంక్లిష్టతను అదేదో మంత్రజాలంగా వివరించబోవటం మనకు సహాయపడినట్లుకాదు. జీవాణువు ఎలా వచ్చిందీ అనేదానికి దైవాన్ని ప్రవేశపెడితే అందులో ఏ వివరణ ఉండదు. డాకిన్స్ ఈ విషయమై రాస్తూ దేవుడు ఉన్నాడనీ, జీవాణువు ఎప్పుడూ ఉన్నదనీ, ప్రాణం ఎప్పుడూ ఉన్నదనీ చెప్పి తృప్తి పడడమే. (డాకిన్స్. ది బ్లైండ్ వాచ్ మేకర్, లండన్, 1988, పుట 141, 249)
డార్విన్ కూడా సర్ ఛార్లెస్ లేల్ కు రాసిన ఉత్తరంలో తన సిద్ధాంతాన్ని గురించి ఇలా వ్యాఖ్యానించాడు. సహజంగా ఎంపిక చేసే సిద్ధాంతానికీ, ఇంకేదైనా జోడిస్తే అలాంటిది పనికిరాదని తోసిపుచ్చుతాను. ఇందులో అద్భుతాలకు తావు లేదు. డాకిన్స్ దీనిపై వ్యాఖ్యానిస్తూ ఈ విషయం కొట్టిపారవేయదగిన స్వల్ప అంశం కాదన్నాడు. ఆద్భుతాలతో నిమిత్తం లేకుండా క్లిష్టమైన జీవులన్నీ ప్రకృతిలో ఇముడుతూ పరిణమించాయి. ది బ్లైండ్ వాచరఅ అనే పుస్తకంలో అదే ప్రధానంగా పేరొన్న విషయం దేవుడు దూకులాటలతో ఉన్న పరిణామం డార్విన్ దృష్టిలో పరిణామమే కాదు పరిణామంలోని కీలక అంశాన్ని ఈ దైవ జోక్యం చులకన చేస్తుంది.
ఆధునిక విశ్వవిజ్ఞానం పెద్ద పేలుడు సంభవించి అదే విధంగా స్టీఫెన్ హాకింగ్ స్పష్టం చేశాడు. (ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్, లండన్, 1988, పుటః 122, 143-49) గెలీలియో పట్ల తమ ధోరణి సవరించుకోవటానికి వేటికన్ ఒక శాస్త్రజ్ఞుల సమావేశం జరిపింది. సమావేశం చివరలో పోపును కలవటానికి ఏర్పాటు జరిగింది. పెద్ద పేలుడు తరువాత విశ్వపరిణామాన్ని పరిశీలించటం బాగానే ఉన్నదనీ, కాని పెద్ద పేలుడు జోలికి పోవద్దనీ, ఆ క్షణంలోనే సృష్టి జరిగింది. గనుక అది దైవ కార్యమని పోపన్నాడు. సమావేశంలో నేను మాట్లాడి వచ్చిన అంశం అదేనని ఆయనకు తెలియదు. కాలాకాశాలు పరిమితమనీ, హద్దులు లేవనీ అంటే అది లేదనీ, సృష్టి లేదనీ చెప్పాను.
హాకింగ్ ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ లో ఇలా రాశాడు
క్వాంటమ్ సిద్ధాంతంలో గురత్వాకర్షణ కొత్త అవకాశాలకు దారితీయగా అందులో కాలాకాశాలకు హద్దులు, లేవనీ, కనుక హద్దులవద్ద ప్రవర్తన అంటూ ప్రత్యేకించి చెప్పనవసరం లేదనీ తేలింది. శాస్త్రీయ నియమాలతో ఒకే దశ అంటూ లేదు. కాలాకాశాల అంచున నిలబడి దేవుడికీ విజ్ఞప్తి చేసుకునే అవకాశం లేదు. ఈ కాలాకాశాలకు హద్దులేర్పరచే కొత్త నియమం రూపొందించనక్కరలేదు. హద్దులు లేకపోవటమే ఒక హద్దు. విశ్వం స్వయం సంపూర్ణం. వెలుపల నుండి దీన్ని ప్రభావితం చేసేదంటూ ఏమీలేదు. ఇందులో సృష్టించేదే లేదు. వినాశనమైపోయేదీ ఏదీ లేదు. విశ్వం ఉన్నది.
అలాంటప్పుడు సృష్టికర్తకు చోటెక్కడ అని హాకింగ్ అడిగాడు.
విశ్వవ్యాప్తంగా కార్యకారణ నియమం పనిచేస్తుందని తెలిసిన మానవుడు ఈ సంఘటనలో ఎవరో జోక్యం చేసుకుంటారనే భావాన్ని స్వీకరించలేడు. భయంతో కూడిన మతానికి అతడి దృష్టిలో ఎలాంటి ఉపయోగమూ లేదు. (ఐనస్టైన్, ఐడియాస్ అండ్ ఒపీనియన్స్, 1989, ఢిల్లీ, పుటః 39)
పీటర్ ఆక్టిన్స్ తన వాదనలో ఎలాంటి జోక్యం లేకుండానే విశ్వం ఉనికిలోకి రావచ్చనీ, దేవుడు తన విశ్వరూపాన్ని ఈరకంగా చూపాడనే అవసరం లేదనీ పేర్కొన్నాడు. (క్రియేషన్ రివిజిటెడ్, ఆక్స్ ఫర్డ్, 1992, పీఠిక, పుటః7)
పెద్ద్ ప్రేలుడుకు సంబంధించి దేవుడి ప్రస్తావనతెస్తే, విజ్ఞానం వేసే ప్రశ్నలకు సమాధానం రాదు. అలాంటప్పుడు దేవుడి మూలం ఏమిటి అని ప్రశ్నించవలసివస్తుంది. ఫ్యూయర్ బాహ్ ఇలా అన్నాడు. (ది ఎస్సేస్ ఆఫ్ క్రిస్టియానిటీ, బఫెలో, 989, పుటః 195-196) మతం దృష్టిలో ప్రపంచం శూన్యం, వాస్తవాల ప్రపంచం కాదది. ఆలోచనాపరుడు ఆనందాలు మతానికి తెలియవు. ప్రకృతి అన్వేషకుడు మతానికి దూరం. జీవుల చైతన్యం అనంతంగా సాగిపోతున్న రీతులు మతంలో లేవు.
శాస్త్రజ్ఞుడు ఆశ్చర్యంతో జీవిత క్లిష్ట విషయాలను వివరించటానికి పూనుకుంటాడు. శాస్త్రీయ ప్రతిపాదనలు చేసి పరీక్షకు పెడతాడు. వాటిని నిరాకరించటానికి కూడా సిద్ధపడతాడు. విశ్వ రహస్యాలను వెలుపలకు తెస్తాడు. అదంతా దేవుడి సృష్టి అని మతవాదులు తృప్తి పడతారు.
ప్రళయం, కరువు
ఖురాన్ లో దేవుడు సుఖదుఃఖాలకీ, కరువు కాటకాలకీ కారణభూతుడన్నారు. సుర 7.56లో దేవుని దయవలన వర్షం వస్తుందన్నారు. కాని బంగ్లాదేశ్ వంటి ముస్లిం ప్రాంతం వరదలతో వేలాదమందిని పొట్టన బెట్టుకుంటే అదీ దైవదయేనా ? 1991 గాలివానలో గంటకు 200 కిలోమీటర్లు గాలివీయగా లక్షమంది చనిపోవటం, ఆ వరదలలో కోటిమందికి రక్షణ లేకుండా పోవటం గమనార్హం. అక్టోబరు నుండి ఏప్రిల్ వరకూ బంగ్లాదేశ్ కరువుకాటకాలతో బాధపడటం జరుగుతున్నది. సుర 57.22 ప్రకారం అన్నీ దైవదత్తాలే. పవిత్ర గ్రంథంలో లేవిదేదీ ప్రపంచంలో జరగదు.
పేద ముస్లింలను తరచు బాధిస్తున్న భూకంపాలు, ఉప్పెనలు దయామయుడైన దేవుడు పంపాడంటే ఎలా నమ్మడం ? 1750లో లిజ్బ్ స్ భూకంపంలో అనేకమంది చర్చిలలో ప్రార్థనలు చేస్తుండగా చనిపోయారు. 18వ శతాబ్దంలో వోల్టేర్ వంటి రచయితలపై ఈ సంఘటనల ప్రభావం ఉన్నది. అమాయకులు ఎందుకు హతం కావాలి ? చర్చికి వెళ్ళినవారు శిక్షించబడగా, వ్యభిచారం చేసేవారు రక్షింపబడటానికి కారణం, ఏమిటి ?
అద్భుతాలు
మహమ్మద్ ఎలాంటి అద్భుతాలు చేయలేదని 18వ శతాబ్దంలోని ప్రకృతి మతవాదులు పేర్కొంటూ ఇస్లాం హేతువాదాన్ని అతిశయోక్తిగా చెప్పారు. తాను దైవదూతను మాత్రమేనని, అద్భుతాలు చేయజాలననీ కొరాన్ లో మహమ్మద్ చెప్పాడు. (సుర 29.49, 13.27-30, 17.92-97) ఐనప్పటికీ ముస్లింలు నమ్మే అద్భుతాలు ఖురాన్ లో 4 చోట్ల ఉన్నాయి.
సుర 54.1, 2 ప్రకారం కాలం సమీపించింది. చంద్రుడు చీలిపోయాడు. నమ్మకం లేనివారు అది కాసేపట్లో తొలగిపోతుందంటారు.
బదర్ యుద్ధంలో ముస్లింలకు సహాయం, సుర 3.120, 121 ప్రకారం దేవుడు సహాయపడితే చాలదు. 3 వేల దేవదూతలను పై నుండి పంపినంతమాత్రాన చాలదు. పట్టుదలగా ఉంటే, దేవునికి భయపడితే, శత్రువు వచ్చినా ఐదువేల దేవదూతలతో దేవుడు సహాయపడతాడు.
రాత్రి ప్రయాణం, మక్కా నుండి జెరూసలేంకు రాత్రిళ్ళు తమ సేవకుడిని తీసుకెళ్ళి దేవుడిని స్తుతించాలి. సుర 17.1
ముస్లింల దృష్టిలో ఖురానే ఓ పెద్ద అద్భుత సృష్టి. సుర 29.48
ఇస్లాం సంప్రదాయాలలో మహమ్మద్ చేసిన అద్భుతాలలు ఉన్నాయి ఒకసారి రోగ గ్రస్తులను నయం చేయుట, మరోసారి ఒక పిల్లవాడితో వెయ్యిమందికి అన్నం పెట్టించుట వంటివి ఉన్నాయి.
విజ్ఞానం పెరుగుతుంటే అద్భుతాలలో నమ్మకం తగ్గుతున్నది. ప్రకృతి నియమాలు పనిచేసే తీరులో మానవ వ్యవహారాలలో జీవజోక్యాన్ని మనం నమ్మటంలేదు. ప్రకృతి నియమాలు కనుగొంటుంటే అద్బుతాలలో నమ్మకం సన్నగిల్లుతున్నది.
డేవిడ్ హ్యూం ఇలా వాదించాడు. (ఎస్సెన్షియల్ వర్క్స్ ఆఫ్ డేవిడ్ హ్యూం, న్యూయార్క్, 965, పుటః 114-115)
మనుషులంతా ఎందుకు చనిపోతారు ? ఈ విషయాన్ని గాలికి వదిలేయటానికి వీలులేదు. ప్రకృతి నియమాలలో వీరికి పొందిక ఉండాలి. వీటిని అధిగమించటం అంటే అద్భుతం జరగాలి. నియమాలకు లోబడి జరిగిందేదీ అద్భుతం కాదు. చనిపోయిన వ్యక్తి తిరిగిరావటం అద్బుతం. ఏ కాలంలోనూ ఇది జరగలేదు. అందరం అనుభవిస్తున్నాం. కనుక అద్భుతాలకు ఆధారాలు లేవు. అద్భుతం అబద్ధమని చూపటమే. ఒక అద్భుతం. ఎవరన్నా రుజువు చేయగలిగితే అప్పుడు అలోచించవచ్చు.
అద్భుతం జరగలేదని మన అనుభవాలు చెపుతున్నాయి. ప్రజలను మోసగిస్తున్నారు. భ్రాంతిలో పడవేస్తున్నారు. అతిశయోక్తులు చెపుతున్నారు. నమ్మకం ఉండాలంటున్నారు. ఫ్యూయల్ బాహ్ అన్నట్లు అద్భుతం అన్నది ఊహాజనిత మంత్రగత్తె, పరస్పర విరుద్ధాల కోర్కెలను అది తృప్తిపరుస్తుంది. కొరాన్ లోని అద్భుతాలు ఏనాడో జరిగాయి. వాటిని రుజువు పరచే స్థితిలో లేము.
అద్భుతాలకు వ్యతిరేకంగా మనదృష్టిని తప్పించుకొన్న వాదన ఒకటి హాస్పర్స్ చేశాడు.
చాలా అద్భుతాలు సర్వశక్తివంతుడికి అర్హమైనవి కావని అనుకుంటాం. దేవుడు తనను నమ్మించటానికి మారుమూల కొద్దిమందికి అద్భుతాలు చేసి చూపడం దేనికి ? కొద్దిమంది రోగాలను నయం చేసేబదులు బాధితులనందరినీ బాగుచేయవచ్చుకదా ? పోర్చుగీసు గ్రామంలో చదువురాని ముగ్గురు పిల్లలు ఫాతిమాను దర్శించినట్లు 1917లో ఒక అద్భుతంగా ప్రచారం చేశాడు. ఆకాలంలోనే జరుగుతున్న మొదటి ప్రపంచయుద్ధ మారణకాండను ఆపేయొచ్చుగదా ? అసలు ఆరంభించకుండానే ఉండవచ్చు కదా ? (జాన్ హాస్పర్స్, యాన్ ఇంట్రడక్షన్ టు ఫిలాసాఫికల్ ఎనాలిసిస్, లండన్, 1973, పుటః 454)
ఖురాన్ లో జీసస్ కన్యద్వారా పుట్టుక
కన్య మేరీకి జీసస్ అద్భుతంగా పుట్టాడని ఖురాన్ చెపుతుంది. సుర 19.16-21, 3.45-48 ఇలా చెపుతుంది.
చూడు, దేవతలిలా అన్నారు. ఓ మేరీ ! నీకు దేవుడు ప్రసాదించే బిడ్డపేరు జీసస్ క్రైస్ట్. అతడు బాల్య, యవ్వన దశలో జనంతో మాట్లాడతాడు. పుణ్యాత్ముడుగా ఉంటాడు. అందుకు మేరీ, ఓ దేవా ! పురుషుని సంపర్కంలేని నాకు కుమారుడెలా పుడతాడు ? అని అడిగింది. దేవుడిలా అన్నాడు. దేవుడు తలుచుకున్నది సృష్టిస్తాడు. కావాలి అంటే అది అవుతుంది. దేవుడు అతనికి పవిత్ర గ్రంథాన్ని, వివేచనను, తౌరాత్ ను దివ్యసువార్తను చెపుతాడు.
సనాతన క్రైస్తవ మత సిద్దాంతం నమ్ముతున్నా, ఉదార క్రైస్తవ వాదులూ, ఇంగ్లండ్ డరమ్ బిషప్ సహితం ఈ కథను యధాతథంగా ఒప్పుకోవటం లేదు. కన్య అనే పదానికి పవిత్రమని వ్యాఖ్యానిస్తున్నారు. మార్టిన్ లూథర్ (1483-1546) 16వ శతాబ్దంలో రాస్తూ మేరీ బిడ్డను కన్నదని చెపుతూనే కన్య అని నమ్మమనటంతో ప్రపంచ దృష్టిలో వెర్రివాళ్ళమయ్యాం. ఇది హేతు విరుద్ధం. సృష్టికి వ్యతిరేకం, ఆడం, ఈవులతో దేవుడు మీ కడుపు పండి వృద్ది చెందుగాక అన్నాడు. (ఫ్యూయర్ బాహ్, పుటః 304)
క్రైస్తవ బైబుల్ పండితులు ఈ కన్య పుట్టుకను చూచిన విధానాన్ని బట్టి ముస్లింలు తమ నిర్ణయాలను కూడా ఆలోచించుకోవాలి. ఖురాన్ లో ఈ సత్యాలను అక్షరాలా వ్యాఖ్యానించటానికి వీలులేదని గ్రహించాలి. ఛార్లెస్ గైగ్నేబర్ట్ (1867-1939) రాస్తూ కన్యకు పుట్టుక గురించి నిశిత పరిశీలన చేశాడు. (హాఫ్ మన్ అర్. జోసెఫ్, పుటః 233-512, జీసస్ ఇన్ హిస్టరీ అండ్ మిత్, బఫెలో, 1986) గైగ్నేబర్ట్ గ్రీస్-రోమన్ కాలం నాటి కన్య ప్రసవించేగాథకు సమాంతర విషయాలను ఉదహరించాడు.
పెర్సియన్ అనే అతను దాన అనే కర్మకు పుడతాడు. దాన దానిమ్మపళ్ళు తిని గర్భం దాల్చిఆటిస్ ను కన్నది. ఇలాంటి కథలు ప్రచారంలో ఉన్న సమాజంలో జీసస్ ను దివ్య పురుషుడుగా చూపటానికి క్రైస్తవులు ప్రయత్నించారు. ఏ కథనూ కావాలని అనుకరించకపోయినా నమ్మకాల ప్రభావం వారిపైన ఉన్నది.
అడాల్ఫ్ హార్నక్ (1851-1930) వంటి పండితులు కన్యకు పుట్టే ఉదంతాలను పాత నిబంధనల దివ్య సందేశాల నుండి వ్యాఖ్యానించారన్నారు. సుర 7.14లోని గాథ క్రీస్తుపూర్వం 132లో అనువదించినట్లు తెలుస్తున్నది. ఈ సందర్భంగా జాడా రాజు అహజ్ తనపై సిరియా ఇజ్రాయిల్ రాజులు దాడి చేస్తారని భయపడ్డాడు. అహజ్ కు ప్రవక్త ఇలా హామీ ఇచ్చాడు. కన్య ఒక కుమారుని కంటుంది. అతనికి ఇమాన్యుయేల్ అని పేరు పెట్టు. తేనె, వెన్న ఆహారంగా పెట్టు. మంచిని స్వీకరించి చెడును నిరాకరించటం అతడికి తెలుస్తుంది. ఇది జరిగేలోపు నీవు గర్హించే రాజులిరువురూ వెళ్ళిపోతారు.
క్రైస్తవులు ఈ విషయాన్ని ఈసయ్య నుండి గ్రహించి సందర్భం లేకుండా దానికి ప్రవక్త అర్థాన్ని కల్పించారు. హిబ్రూలో కన్య అనే పదం వాడలేదు. యువతి అని ప్రయోగించారు. గైగ్నేబర్ట్ ఇలా రాశాడు.
సనాతన మతవాదులు హిబ్రూపదానికి కన్య అనే అర్థాన్నివృధాగా కల్సించారు. ప్రవక్తకు అద్భుతాలు చెప్పే ఆలోచనలేదు. యూదులు క్రైస్తవులపై దాడి మొదలు పెట్టగానే వారిలోని ఘోరతప్పిదాలను కూడా వెల్లడించారు. దైవాంశతో పుట్టాడని క్రైస్తవులు నమ్మి క్రీస్తు పుట్టుకకు గ్రీక్ పదం పార్థియన్ అనేదానికి కన్య అని అర్థం కల్పించారు. గైగ్నేబర్ట్ ఈ కన్యత్వ ప్రసవ సిద్దాంతాన్ని ఒప్పుకోలేదు. హార్నెక్ మాత్రం అంగీకరించాడు.
కన్యకు పుట్టిన విషయం నమ్మలేదు కానీ, పాల్, జాన్, మార్క్ లు జీసస్ ను దేవుని కుమారునిగా చిత్రించారు. మేథ్యూ, లూక్ లు అద్భుతాలలో నమ్మకాన్ని ప్రదర్శించారు. దేవుడు జీసస్ ను తన పథకం ప్రకారం ఈ లోకంలోకి తీసుకువచ్చాడనీ వారి ఉభయుల మధ్య సంబంధం ప్రత్యేకమైనదన్నారు. జీసస్ దేవుని కుమారుడు అనటంలో, మానవులకర్థమయ్యే భాష అదే గనుక దానిని ప్రయోగించామన్నారు. ఇది ఉపమానంగా మాత్రమే స్వీకరించాలి.
జీసస్ ఈ సంబంధాన్ని తానుగా ఎక్కడా అన్వయించలేదు. ఇజ్రాయెల్ లో ప్రవక్త ప్రాధాన్యత కూడా కనిపించలేదు. అంటే యూదులు దేవదూతగా జీసస్ కు ప్రాధాన్యత కల్పించలేదు. వారి దృష్టిలో ప్రవక్త అంటే కుమారుడని కాక సేవకుడని, యహోవా మనిషని అర్థం. కానీ, పాలస్తీనా కంటె భిన్నమైన అర్థంలో గ్రీక్ దేశంలో వ్యాఖ్యానం వ్యాపించింది. దేవుడు మనిషిని పుట్టించటం అనే భావన దేవుడికీ, క్రీస్తుకూ ఉన్న సంబంధం గ్రీస్ లో అశ్చర్యపరచలేదు. యూదులకు భిన్నంగా గ్రీకులు సానుభూతితో దేవదూతను స్వీకరించారు. గనుక అక్కడే క్రైస్తవ జాతులలో ఈ ఉదంతం వ్యాపించి ఉండవచ్చు. గ్రీక్ లో సేవకుడు, కుమారుడు అనే అర్థం వచ్చే పదాలను దేవుడికీ, దేవదూతకూ వాడారు. కన్యకు పుట్టటం కూడా ఒక గాథగా వ్యాపించింది. ఈసయ్య 7.14లో మాథ్యూ, లూక్ లు ఈ విషయాలను సమర్థించారు. అతడు దేవుని బిడ్డడే, అతడు పవిత్రాత్మచే జన్మించినవాడే.
జీసస్ పుట్టుక
సుర 19.22-34 ప్రకారం జీసస్ పుట్టుక పేర్కొన్నారు. సుర 19.22 ప్రకారం ఖురాన్ ఇలా చెప్పింది. అతనిని ప్రసవించిన తరువాత ఆమె బిడ్డను తీసుకొని మారుమూలకు వెళ్ళిపోయింది. అక్కడ ఆమెకొక వాణి వినిపించింది. విచారించకు నీపాదాల చెంత జలపాతం ఏర్చరచారు. నీ సమీపంలో ఖర్జూర చెట్టును కదిలిస్తే పండ్లు నీకు అందిస్తుంది. వాటిని తిని నీరు తాగి నీకెవరైనా కనిపిస్తే, నేనెవరితోనూ మాట్లాడను, దైవం మీద ఒట్టు పెట్టుకున్నానని చెప్పు.
తరువాత బిడ్డను జనం వద్దకు తీసుకురాగా, ఓ మేరీ, ఆరన్ సోదరీ నీ తండ్రి చెడ్డవాడు కాదు. నీ తల్లి వ్యభిచారిణి కాదు. అన్నప్పుడు ఆమె బిడ్డను చూపెట్టింది. పసివానితో మేము ఎలా మాట్లాడతాము ? అన్నారు వారు. అప్పుడు బాలుడు ఇట్లా అన్నాడు. నిజంగా నేను దైవ సేవకుడిని, నాకు పవిత్ర గ్రంథం ఇచ్చి, ప్రవక్తను చేసి పంపాడు. నన్ను ఆ దేవుడే ప్రార్థించమని, దానాలు చేయమనీ, తల్లిని గౌరవించమనీ పంపాడు. నేను పుట్టినప్పుడు, మరణించినప్పుడు సజీవంగా మళ్ళీ లేచినప్పుడు నన్ను దేవుడు కరుణిస్తాడు.
లెటో అనే ఆమె కోస్ఫో బేల కుమార్తె. ఆమె అపోలోకు జన్మనిచ్చింది. అపోలో తల్లి గర్భంలోంచి మాట్లాడాడు. ఇలాంటి కథనే కేలిమాకస్ కూడా చెప్పాడు. (305-249 క్రీ.పూ.)
బుద్ధుని పుట్టుకలో కూడా మాయాదేవి కలలో ఒక తెల్ల ఏనుగు కుడి ప్రక్కగా వచ్చినట్లు కలగన్నది. ఆమె కుమారుడు గొప్ప చక్రవర్తిగానీ, లేదా బుద్ధుడుగానీ అవుతాడని బ్రాహ్మణులు చెప్పారు. 10 నెలల అద్భుత గర్భం తరువాత మాయాదేవి లుంబినీ వనంలో ప్రవేశించగా రావి కొమ్మను పట్టుకోగా కుమారుడు కుడిపక్కగా జనించాడు. పుట్టగానే బుద్ధుడు లేచి ఉత్తర దిశగా 7 అడుగులు వేసి అదే తన చివరి జన్మ అని విశ్వాన్ని ఆవరించబోతున్నాననీ చెప్పాడు. జీసస్ పుట్టుకను గురించి ఖురాన్ లో ఆధారాలేమిటో అంతకుముందే వ్యాఖ్యానించాం.
జీసస్ ఉన్నాడా ?
జీసస్ చారిత్రక ఆధారాలను సందేహించే పండితులన్నారంటే ముస్లింలకు ఆశ్చర్యంగా ఉంటుంది. ముస్లింల దృష్టిలో జీసస్ ఖచ్చితంగా ఉన్నాడు. క్రీస్తు మిధ్య సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు. బ్రూనోబాయర్ (1809-1882) జె.ఎం.రాబర్ట్ సన్ (1856-1933), ఆర్థర్ డ్రూస్ (1865-1935), వాన్ డెన్ బర్గ్ వాన్ ఐసింగా, ఆల్ బర్ట్ కాల్ట్ హాఫ్, గైఫా (1967 పారిస్), ప్రాస్ పర్ ల్ ఫారిక్ (పారిస్, 1959), డ.బ్ల్యు.బి. స్మిత్ (1957 ది బర్త్ ఆఫ్ ది గాస్పెల్), లండన్ యూనివర్సిటీలోని ప్రొ.జి.ఎ.వెల్స్, జీసస్ హిస్టారిసిటీ, ఎన్ సైక్లోపేడియా ఆఫ్ ఆన్ బిలీఫ్, 1వ సంపుటి), జోసెఫ్ హాఫ్ మన్ ఈ పరిస్థితిని సమీక్షిస్తూ ఇలా రాశారు.
పండితాభిప్రాయం ప్రకారం చారిత్రక వ్యక్తి స్థానే మిథ్యాపూరిత ఆచారాన్ని ప్రవేశపెట్టినట్లు చెపుతున్నారు. చారిత్రక వ్యక్తి ప్రతిపాదన అనవసరమనీ, బైబుల్లోని జీవిత ప్రస్తావనలకు వీటిని జోడించనక్కరలేదని మరి కొందరంటున్నారు. చారిత్రక వ్యక్తి కొత్త నిబంధన ప్రకారం మరుగున పడి ఉండవచ్చునని అనుకోవచ్చు (హాఫ్ మన్ ది ఆరిజన్ ఆఫ్ క్రిస్టియానిటీ, పుటః 179)
క్రీస్తు లేడనటానికి లభిస్తున్న ఆధారాలు అంత కొట్టిపారవేయదగినవేమీ కాదు.
ముస్లింలకూ, క్రైస్తవులకూ జీసస్ గాథపై చర్చ, వాదోపవాదాలూ సమానంగా అన్వయించాలి కూడా. ఇస్లాం పై రాసిన గ్రంథమేదీ బాయర్ అభిప్రాయానికి గానీ, జీసస్ చారిత్రకతను గురించి రేడికల్ డచ్ వారి సిద్ధాంతం కానీ చర్చించలేదు. చదువుకున్న వారంతా వీటిని తప్పక పట్టించుకోవాలి. నాగరికత చరిత్రలో క్రైస్తవ తొలిదశ చరిత్ర ప్రధానమైనది. ముస్లింల దృష్టిలో జీసస్ దైవ ప్రవక్తలలో ఒకడు. అనేక అద్భుతాలు జరిపిన చారిత్రక వ్యక్తి. అతడు మళ్ళీ తుది రోజు వచ్చి క్రైస్తవ వ్యతిరేకులను చంపేస్తాడు. జీసస్ లేకుంటే దాని ఫలితంగా ఖురాన్ చెప్చేదంతా కొట్టిపారవేయవలసే వస్తుంది.
జీసస్ చారిత్రక సమస్యే కాక మనకు తెలిసినది ఎంత అని పరిశీలించాలి. ముస్లింలతో సహా ఇది అందరికీ చెందిన విషయం. జీసస్ ఉన్నాడని ముస్లింలు నమ్ముతున్నారు. 200 సం.ల పాటు నిస్పాక్షిక పరిశీలన చేసి, గొప్ప చరిత్రకారులు బయటపెట్టిన విషయాన్ని శ్రద్ధతో పట్టించుకోక తప్పదు. సత్యం పట్ల ముస్లింలు, క్రైస్తవులూ దృష్టి పెట్టాలి. జీసస్ ఉన్నాడనే క్రైస్తవ మత సిద్దాంతకర్తలు సహితం అతని జీవితానికి సంబంధించిన కొన్ని సమస్యలు పరిష్కారం కాలేదంటున్నారు. కొత్త నిబంధనలోని క్రీస్తు గాథలు చారిత్రక ఆధారాలు లేనివని మితవాద క్రైస్తవవాదులు కూడా ఒప్పుకుంటున్నారు. ఎర్నెస్ట్ కేస్ మెన్ ఇలా రాశాడు. గత రెండు శతాబ్దాలుగా కొత్త నిబంధన లోని అద్భుత కథలకు సంబంధించి తీవ్రచర్చలు సాగాయి. మతపరమైన విజ్ఞానంతో దీనికి సంబంధించిన పోరాటం ఆగిపోయింది. అద్భుతాలు జరిగాయనే భావన ఓడిపోయింది. (హాఫ్ మన్ జి.ఎ.లారే, జీసస్ ఇన్ హిస్టరీ అండ్ మితో, పుటః 135-136).
ఖురాన్ లో జీసస్ కథలు వాస్తవమని కథలు వాస్తవమని ఆమోదించలేదు. చాలా కథలు, మూఢ నమ్మకాలతో కూడినవి. అందలి అద్భుతాలు మాత్రం పట్టించుకో దగినవి కావు. జీసస్ ఉనికిని రుజువుగా ఖురాన్ ను ఏ క్రైస్తవ మత పండితుడూ స్వీకరించడు. ఏ చరిత్ర కారుడూ ఆధారాలకోసం కొరాన్ చూడడు. ఇది సంఘటనలు జరిగిన తరువాత 600 సంవత్సరాలకు మానవుడు రాసిందిగా చరిత్రకారుడు గ్రహిస్తాడు. ఖురాన్ కథలు ఏ ఆధారంతో వచ్చాయో ఆ బైబుల్ గాథల్ని చారిత్రకాలు కావని మనం అంటున్నాం. జీసస్ లేడని చెప్పే సిద్ధాంతాన్ని ఒప్పుకోకపోయినా కొత్త నిబంధన చరిత్రకారులు చెప్పే నిర్ణయాలు కొత్త వెలుగునిస్తున్నాయి. వీటికి, ఇస్లాం పండితులు ముస్లిం సంప్రదాయాల గురించి చెప్పే వాటికి చాలా పోలికలున్నాయి.
2. క్రైస్తవానికి అన్వయించే విమర్శలే ఇస్లాంతో సహా అన్నిమతాలకూ వర్తిస్తాయి.
3. గత 150 సంవత్సరాలుగా యూరోప్, అమెరికాలలో జీసస్ చారిత్రక సత్యాన్ని గురించి చర్చిస్తున్నా, చంపుతామని ఏ పండితుడినీ ఎవరూ బెదిరించలేదు. 1842 బాయర్ ను మత శాస్త్ర పదవినుండి బోన్ యూనివర్సిటీలో తప్పించారు. అయినా అతడు జీవితాంతం ప్రచురణ సాగించాడు. జీసస్ లేడని చెబుతున్నప్రొఫెసర్ వెల్ లండన్ యూనివర్సిటీలో ఉపాధ్యాయుడుగా ఉన్నాడు. ఇస్లాం లోకం ఇందులో గుణపాఠం నేర్చుకోవాలి.
4. గత 150 ఏళ్ళుగా ముస్లిం పిడి వాదం వలన పరిశోధన, చర్చ జరగడం లేదు. అలాంటి చర్చ జరిగితేనే గత మూర్ఖ వాదం పోయి వివేచన వికాసంలోని అస్థిరత్వాన్ని గ్రహించగలమని జోసెఫ్ హాఫ్ మన్ అన్నారు.
5. ముస్లిం, క్రైస్తవ భక్తి విశ్వాసాల వలన చరిత్రను నిష్పాక్షికంగా చూడలేకపోతున్నారు. చారిత్రక సత్యం బాహ్య నిజానికి చేరువుగా తీసుకెడుతుంది. అందులో ఊహలు, తృణీకరణలు ఉంటాయి. నిశిత పరిశీలన హేతుబద్ధవాదనలు, సాక్ష్యాలు సమర్పించడం ఉంటాయి. వ్యక్తిగత మత నమ్మకాన్ని తెచ్చిపెడితే, పిడివాదంతో మాదే సరైనదని వాదిస్తే, గతానికి చెందిన చరిత్రను నిశితంగా, సందేహంతో పరిశీలించడం కుదరదు. (ఆర్.జి. కౌలింగ్ వుండ్ ను ఉదహరించిన హాఫ్ మన్ గ్రంథం జీసస్ ఇన్ హిస్టరీ అండ్ మిత్, 1986 బఫెలో పుటః 199)
వాదోపవాదనలు
స్ట్రాస్
డేవిడ్ స్ట్రాస్ రాస్తూ సువార్తలను చారిత్రక జీవిత ఆధారాలుగా స్వీకరించలేమని, అది వారి ఉద్దేశం కూడా కాదని పేర్కొన్నారు. తొలి క్రైస్తవులు మతం మార్పిడి చేయటానికి కలగాపులగం మత గాథల్ని ప్రచారంలోకి తెచ్చారు (లైఫ్ ఆఫ్ జీసస్ క్రిటికల్లీ ఎక్జామిన్డు 1835 హాఫ్ మన్, లారే ప్రచురించిన జీసస్ ఇన్ హిస్టరీ అండ్ మిత్, పుటః 13)
కొత్త నిబంధనలోని కథలన్నీ యూదులు అశించిన దివ్యవాణి ఫలితమేనని స్ట్రాస్ చెప్పాడు.
సువార్త ప్రచారకులు తాము అనుకున్నదే జీసస్ చేత చెప్పించారు. పాత నిబంధనలో తమకు తెలిసిన దాన్ని దైవదూత నోటితో తినిపించారు. దేవదూతకు సంబంధంలేని విషయాలు కూడా భవిష్యత్తు వాణిగా పలికించారు. ఈసయ్య 35లో అంధుల కళ్ళు తెరువబడతాయి. అనే వాక్యాన్ని బేబిలోని యూదులు ప్రవాసం నుంచి బయటపడి సంతోషంగా వ్యక్తం చేసిన మాటలు. దానినే మత ప్రచారకులు గుడ్డితనాన్ని పోగొడతాడని వ్యఖ్యానించి జీసస్ చేత ఆ పనులు చేయించారు. (స్ట్రాస్, ఎన్ సైక్లోపీడియా అఫ్ అన్ బిలీఫ్, పుట 657, రెండవ సంపుటి)
బాయర్
పాత నిబంధనలోని ప్రవక్తలను స్వీకరించి తొలి క్రైస్తవులు జీసస్ క్రైస్ట్ ను అదేవిధంగా చిత్రించారు. జీసస్ క్రీస్తు అనే వ్యక్తి లేడు. యూదు-గ్రీకు, రోమన్ భావాల మిళితం వలన మొదటి శతాబ్దం మధ్యలో క్రైస్తవం తలెత్తింది. గ్రీక్ పదంలో గోస్ అనేది క్రైస్తవులూ వాడారు. దీనిని హెరాక్లిటన్, స్టాయిక్స్, పైలో నుండి స్వీకరించారు. పైలో దృష్టిలో లోగోస్ అంటే సృజనాత్మక శక్తి. ఇది ప్రపంచాన్ని అదుపులో పెడుతుంది. దీని ద్వారా మనుషులు దైవాన్ని తెలుసుకుంటారు. జాన్ సువార్తలో లోగోస్ ను దేవునితో సమానం చేసి జీసస్ క్రైస్త్ అవతారంగా చూపారు.
క్రైస్తవం మీద ప్రభావాలను చూపిన మరికొన్ని ఆధారాలను బట్టి 4వశతాబ్దంలో క్రైస్తవ వ్యతిరేక రచయితలు కొన్ని పోలికలు చూపారు. జీసస్ జీవితానికి, టైనాలోని అపోలోనియస్ అనే కొత్త పైథాగరియన్ ఉపాధ్యాయునికి పోలికలున్నాయన్నారు. అతడు క్రైస్తవ శకానికి కొంచెం ముందుగా జన్మించాడు. సంచారకుడుగా, సన్యాసి జీవితం గడుపుతూ, తనకు అద్భుత శక్తులున్నాయంటూ, రోమన్ చక్రవర్తులూ, డొమీషియన్ల కాలంలో ప్రాణాలు గుప్పిట పెట్టుకుని తిరిగాడు. అతడు దేవుని కుమారుడుగా అనుచరులు చూపారు. వారి కళ్ళ ఎదుటే తిరిగి పునరుజ్జీవనం పొంది స్వర్గానికి అవరోహించాడన్నారు మిత్రాల మార్మిక సంప్రదాయాలు క్రీస్తు పూర్వం మొదటి శతాబ్దం మధ్యలో రోమన్ సామ్రాజ్యం ఉండేది. ఇందులో రహస్య క్రతువులూ, ఆచారాలూ, కొత్తవారిని దశల వారీగా ప్రవేశపెట్టటం అందలి విశేషాలు. దీనికి క్రైస్తవుల బాప్టిజానికి పోలికలున్నాయి.
తొలి క్రైస్తవులు జీసస్ చేత చెప్పించే మాటలు క్రైస్తవుల అనుభవాలు, నమ్మకాలూ, ఆశలూ ప్రతిబింబించేవి మాత్రమే. మార్క్ 1.14-15 చూడండి. జాన్ ను జైల్లో పెట్టిన తరువాత జీసస్ దివ్యవాణి ప్రచారం చేస్తూ గలీలీకి వచ్చారు. సమయం ఆసన్నమయింది. దేవుని రాజ్యం సంక్రమిస్తుంది. పశ్చాత్తాప పడండి. సువార్తను నమ్మండి. ఈ మాటలు క్రీస్తు ఎన్నడూ అనలేదు.
తొలి క్రైస్తవుల నమ్మకాలు ఆధ్యాత్మిక విమోచనలో వారి విశ్వాసం, క్రైస్తవం రానున్నదనే ఆశ ఈ మాటలు చెప్పించాయి. వీటికి చారిత్రక ఆధారాలు కల్పించటానికి ప్రయత్నించారు. పాత నిబంధన కాలం నుండి సామ్రాజ్యవాదం వరకూ ఇలాంటి విమోచనా ప్రయత్నాల క్రమం చూడవచ్చు. ప్రతి కొత్త తరం వారూ ప్రాచీన ప్రతిజ్ఞలన్నీ తమ కాలంలో తీరతాయని అనుకొన్నారు. పాత నిబంధన ననుసరించి తొలి క్రైస్తవులు రక్షకుడు రాకముందే ఎలిజా భూమి మీదకు తిరిగి వస్తాడనుకున్నారు. బాప్టిస్టు జాన్ తిరిగి వచ్చిన ఎలిజాగా స్వీకరించారు. తరువాత రక్షకుడు వస్తాడనుకొన్నారు. జాన్ పేరును ఎలిజాగా చూపారు. మార్క్ 9.13 (ఎన్ సైక్లోపీడియా ఆఫ్ అన్ బిలీఫ్, 1వ సంపుటి, బాయర్ పై వెల్స్ వ్యాసం, పుట 44-46).
రెడే
విలియం రెడే 20వ శతాబ్దం ఆరంభంలో రాస్తూ లాయర్ కు తాను రుణపడినట్లు చెప్పారు. మార్క్ సువార్త తొలి క్రైస్తవుల మత విశ్వాసాలతో ఉన్నదన్నారు. ఇది జీవిత చరిత్ర అనటంకన్నా జీసస్ ను దైవదూతగా తొలి క్రైస్తవులు ఆశించిన విధానంగా ఉన్నదన్నారు. (హాఫ్ మన్, లారే, పుటః 15, జీసస్ ఇన్ హిస్టరీ అండ్ మిత్)
కాల్టాఫ్
అల్బర్ట్ కాల్టాఫ్ 20వ శతాబ్దంలో రాస్తూ క్రైస్తవ పుట్టుపూర్వోత్తరాలు చారిత్రక స్థాపకుడు లేకుండానే చూపవచ్చునన్నాడు. రోమన్ సామ్రాజ్యంలో యూదుల దివ్యవాణి ఆశలు మతసామాజిక పరంగా ప్రజ్వరిల్లినప్పుడు క్రైస్తవం తలెత్తిందన్నారు. (హాఫ్ మన్, లారే పుటః16) సామాజిక మతపరంగా చూస్తే ఆనాడు నైతిక సాంఘిక శక్తుల వ్యక్తీకరణ క్రీస్తురూపంలో వచ్చింది.
క్రైస్తవేతర సాక్ష్యం
రోమన్ సామ్రాజ్య కాలంలో మొదటి శతాబ్దంలో సుమారు 60మంది చరిత్రకారులు ఉన్నప్పటికీ, క్రైస్తవ సంప్రదాయాల వెలుపల అందరూ అంగీకరించిన క్రైస్తవ కథనం లేదు. జోసఫస్, టాసిటస్, సుయోటోనియస్, యుక్లైనీలు రాసింది అసంపూర్తిగా ఏమంత ఉపయోగపడకుండా ఉన్నది. (గార్డెన్ స్టైన్, యాన్ యాన్ థాంలజీ ఆఫ్ యథీయిజం అండ్ రేషనలిజం, బఫెలో, న్యూయార్క్, 1980 పుటః 178)
సువార్తలు
మాథ్యూ, మార్క్, బాక్, జాన్ సువార్తలు జీసస్ శిష్యులు రాసినవి కావు. ప్రత్యక్షంగా చూసి రాసినవీ కావు. క్రీస్తు శిలువ అనంతరం 40 నుండి 80 సంవత్సరాల లోపు తెలియని రచయితలు ఎవరో రాశారు. మేథ్యూ, మార్క్, లూక్ రాసిన దానిలో పోలికలెక్కువగా ఉన్నందున వాటిని సువార్త త్రయంగా పేర్కొంటారు. తొలుత మార్క్ రాసి ఉండవచ్చు. మిగిలిన ఇరువురూ అతన్ని ఉదాహరణగా పెట్టుకొన్నారు. సువార్తల్లో జీసస్ చేత చెప్పించిన మాటలు చారిత్రక పురుషుని పలుకులు కావు. హాఫ్ మన్ ఇలా ముగించాడు.
చారిత్రక జీసస్ ను గురించి ప్రస్తావించటం కష్టం. గాథలను అల్లుకుపోయే రోజులు ఆనాడు అద్భుతాల వాతావరణాన్ని సృష్టించింది. మత స్థాపనకూ, ఆచారాలకూ ఒక స్థాపకుడుండ నక్కరలేదనీ, మార్మిక మతం రుజువు చేస్తున్నది. తొలి క్రైస్తవులు పాటించిన సంప్రదాయాలను సువార్తలుగా పండితులు పేర్కొంటున్నారు. (హాఫ్ మన్, పుటః 177, ది ఆరిజిన్స్ ఆఫ్ క్రిస్టియానిటీ)
పిల్గాత్ కు ముందు విచారణలు తీవ్రమైన సమస్యలను తెచ్చిపెడుతున్నది. చారిత్రక సంఘటనలుగా లేక మతనమ్మకాలుగా తొలి క్రైస్తవులు వాటిని సృష్టించారు. పాత నిబంధనలు దివ్యవాణి నుండి మార్క్ రాసిన వాటిలో చాలా స్వీకరించారు. నైన్ హామ్ ఈ విషయం తెలిపాడు (హాఫ్ మన్, పుటః 184)
పాల్ లేఖలు
మార్క్ సువార్తకు ముందు పాల్ లేఖలు రాశాడు. వాటిలో జీసస్ జీవితాన్ని గురించి వివరాలు లేకపోవటం ఆశ్చర్యం. జీసస్ తల్లిదండ్రులూ, కన్నెకు పుట్టుట, జన్మస్థలం, బాప్టిస్టుగా జాన్ ప్రస్తావన, యజమానిని గురించి పీటర్ తెలియదనుట మొదలైన అంశాలేవీ లేవు. జి.ఎ.వెల్స్ ఈ విషయమై రాస్తూ వాటిలో జీసెస్ కాల, ప్రదేశాల ఉనికి ప్రస్తావనే లేదన్నారు. విచారణ జరిగిన తీరుగానీ, శిలువ వేసిన విషయం గానీ లేదన్నారు. అద్భుతాల ప్రస్తావన తీసుకురాలేదన్నారు. (హిస్టారిసిటీ ఆఫ్ జీసస్ ఎన్ సైక్లోపీడియా ఆఫ్ అన్ బిలీఫ్, సంపుటి 1 పుటః 364) సువార్తల్లో జీసస్ కు అంటగట్టిన సిద్ధాంతాలు పాల్ కు తెలిసి ఉన్నా వాటి ప్రస్తావన రాలేదు.
పాల్ అనంతరం తొలి లేఖల్లో చారిత్రక వివరాలేమీ లేవు. క్రీస్తు తరువాత 90కి ముందే ఈ లేఖలు రాశారు. క్రీస్తు తరువాత 90-110 రాసిన ఉత్తరాలలో దివ్యవాణి వివరాలు లభించాయి. దీనినిబట్టి వెల్స్ ఇలా నిర్ణయించాడు. (హిస్టారిసిటీ ఆఫ్ జీసస్, పుటః 365)
లేఖలలో తొలుత జీవిత విశేషాలు లేకపోవటం, జీసస్ పట్ల ఆసక్తి లేనట్లు చెప్పజాలం. పాల్ మాత్రమే కాక ఇతర లేఖకుడు జీసస్ కు చారిత్రకతను ఎందుకు ఇవ్వలేదో వివరించలసి ఉన్నది. జీసస్ ఉన్నట్లు మొదటి శతాబ్దం చివరిలో కనుగొన్నారని గ్రహిస్తే అసలు విషయం అర్థం అవుతుంది. కాని అతని ఉనికిని చారిత్రకంగా స్వీకరిస్తేనే గందరగోళం వస్తుంది.
మార్క్ సువార్త ఎప్పుడు
మనకు తెలిసిన జీసస్ జీవితం ఎప్పుడు, ఎందుకు రూపొందింది ? మార్క్ సువార్త తొలుత వచ్చింది. అందులో జీసస్ జీవిత వివరాలున్నాయి. కొత్త నిబంధన నిపుణులు ఈ రచన తేదీని క్రీ.త. 70గా పేర్కొంటున్నారు. జి.ఎ.వెల్స్ దీన్ని క్రీ.త. 90గా చెపుతున్నాడు. పాలస్తీనా క్రైస్తవులు రోమ్తతో యూదుల యుద్ధం వలన అధిగమించినప్పుడు జెంటైల్ క్రైస్తవులు మొట్టమొదటిసారిగా జీసస్ ను, పిలాత్ నూ కలిశారు. పాలస్తీనా క్రీ.త. 30లో జరిగిన దానికి వీరు చెప్పేది అసంపూర్తి విషయమే. (వెల్స్, ఫ్రీ ఎన్ క్వైరీ వ్యాసం. 1983, సంపుటి 3, సంచిక 4) జీసస్ జీవితాన్ని గురించి చారిత్రక ఆధారాలను నిరాకరిస్తున్న వారిని నోరు మూయించటానికి కథలు అల్లి, పునరుజ్జీవ గాథను వాస్తవమంటూ క్రైస్తవులు రాశాడు.
ఇస్లాం ఆవిర్భావం, క్రైస్తవ పుట్టుపూర్వోత్తరాలు
క్రైస్తవ పుట్టుపూర్వోత్తరానికి, ఇస్లాం తలెత్తటానికి పేర్కొన్న సిద్ధాంతాలలో పోలికలు కనిపిస్తున్నాయి. మహమ్మదుకు సంప్రదించిన సంప్రదాయాలు చాలావరకు తప్పుడువని గోల్డ్ జిహర్ కొట్టిపారేశారు. మొదటి రెండు శతాబ్దాలలో ఇస్లాం మత, చారిత్రక, సాంఘికాభివృద్ది వలన ఈ సంప్రదాయాలు తలెత్తాయన్నారు. శాస్త్రీయమైన చరిత్రకు సంప్రదాయాలు ఆధారం కావు. తొలి ముస్లిం సమాజ ధోరణులకు ప్రతిబింబంగానే సంప్రదాయాలున్నాయి. క్రైస్తవ సమాజాలు తమ అనుభవాలనూ, ఆశలనూ జీసస్ కు అంటగట్టినట్లే అక్కడా జరిగింది.
ఖురాన్ లో జటిలమైన భాగాలను వివరించటానికి అరబ్బు కథకులు కూడా మహమ్మదుకు సంబంధించిన జీవిత విశేషాలు అల్లారు.
షాట్ వ్యాఖ్యానాలు న్యాయసంబంధమైన విషయాలలో ఎలా ఉన్నాయో చూడాలంటే, మార్క్ సువార్తపై రేడే నిర్ణయాలను పోల్చి చూడవచ్చు. (లా అండ్ జస్టిస్, ది కేంబ్రిడ్జి హిస్టరీ ఆఫ్ ఇస్లాం 4 సంపుటాలు, పుట 156, కేంబ్రిడ్జి హిస్టరీ ఆఫ్ ఇస్లాం 4 సంపుటాలు, పుట 156, కేంబ్రిడ్జి, 1970) వాదోపవాదాలతో సంప్రదాయాలను సమకూర్చి విరుద్ధ సిద్ధాంతాలను ఆచారాలను తిప్పికొట్టడానికి ప్రయోగించారు. ఈ వాదోప వాదాల సందర్భాలను ఉన్నత అధికారిక రీతుల నుండి సంక్రమించాయన్నారు. ప్రవక్త జీవితం నుండి వివరాలను కొన్ని అల్లి తమ న్యాయ సిద్ధాంతాలకు మద్దతు సమకూర్చుకున్నారు.
రేడే ఈ విషయంలో తొలి క్రైస్తవ నమ్మకాలు, ఆశయాలూ మార్క్ సువార్తలో ఎలా వచ్చాయో, అవి జీసస్ జీవిత నిజ విషయాలెలా కావో చూపాడు. (హాఫ్ మన్, లారే, పుటః 15 జీసస్ ఇన్ హిస్టరీ అండ్ మిత్)
తొలి రోజుల్లో ఈ రెండు మతాలూ ప్రత్యర్థి సంప్రదాయాలతో తారసిల్లగా తమను సమర్థించుకోవడానికి ఇలా అరేబియన్, పాలస్తీనియా నుండి అవి ఆవిర్భవించినట్లు చూపారు. క్రైస్తవం ఎలాగైతే యూదు, గ్రీక్, రోమన్ భావాలనుండి తలెత్తిందో, అలాగే ఇస్లాం కూడా తాత్మాడిక్ యూదు, సిరియా క్రైస్తవులూ, గ్రీక్, రోమన్ భావాలనుండి ఆవిర్భవించింది.
మొదటి శతాబ్దంలోని క్రైస్తవులకు స్థిరమైన సువార్తలుగాని, కొత్త నిబంధన కానీ లేదని మోర్టర్ స్మిత్ పేర్కొన్నాడు. (హాఫ్ మన్, లారే, పుటః 48) 9వ శతాబ్దం వరకూ ఖురాన్ నిర్దష్ట ప్రతి లేదనేది ఇప్పుడు స్పష్టంగా తెలుస్తున్నది.
తీర్పు రోజు
తుది రోజు ఇస్లాంలో కేంద్ర సిద్ధాంతంగా ఉంది. ఖురాన్ లో దీనిని సూచించడానికి చాలా పదాలు వాడారు. సిరియా క్రైస్తవం నుండి ఈ తుది రోజుకు సంబంధించిన మహమ్మదు భావాలు వచ్చాయి. ఇవి మహమ్మదు నాకట్టుకున్నాయి. తుదిరోజును గురించి ఖురాన్ లో చాలా వివరమైన చిత్రీకరణ ఉన్నది. ఈ సంఘటన రణభేరిద్వారా తెలియపరుస్తారనీ, పర్వతాలు ధూళిగా మారిపోతాయనీ, ఆకాశంలో చీకట్లు కమ్ముకుంటాయనీ, సముద్రాలు మరుగుతాయనీ, సమాధులు తెరుచుకోగా, మనుషులను అగ్ని దేవతలు తీర్పుకు పిలుస్తారు. వారి చర్యలను తులనాత్మకంగా తూచి శాశ్వతమోక్షాన్ని లేదా చిత్రహింసల నరకాన్ని కేటాయిస్తారు. మక్కా సందేశాలలో తుదిరోజు భయానక దృశ్యాలను విపరీతంగా పునరావృతం చేశారు. చనిపోయిన స్త్రీ పురుషులందరినీ శారీరకంగా మళ్ళీ పైకి లేపుతారు.
ఇలాంటి పునరుజ్జీవనం అరేబియన్లకు కొత్త ఆలోచన మక్కా పేగన్లు ఈ అసంభవ భావాన్ని కొట్టిపారేశారు. పేగన్ తత్వవేత్తలు క్రైస్తవులకు వ్యతిరేకంగా చేసిన వాదోపవాదాలలో చనిపోయిన వారెలా లేస్తారనీ, ఏ శరీరంతో ఉంటారనీ అడిగారు. కుళ్ళిపోయిన శరీరం మళ్ళీ ఎలా సరిఅవుతుందని ప్రశ్నించారు. సముద్రంలో మునిగిన వారూ, ఆడవి మృగాల బారిన పడిన వారూ వెనక్కు ఎలా వస్తారని నిలదీశారు (మోమిగ్లియానో సంపాదకత్వం. ది కాన్ ఫ్లిక్ట్ బిట్విన్ పేగనిజం అండ్ క్రిష్టియానిటీ, ఆక్స్ ఫర్డ్, 1970, పుట 161)
మనుషులంతా చనిపోతారనేదానికి ఈ పునరుజ్జీవన సిద్ధాంతం విరుద్ధంగా ఉన్నందున తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవలసి వచ్చింది. ముస్లిం సిద్ధాంతాల ప్రకారం శరీరం సజీవంగా వస్తుంది. స్వర్గాన్ని, భూమినీ సృష్టించిన దేవుడు తన ప్రతి రూపంలో మనుషులను సృష్టించిన తరువాత వారికి ఒక నిర్ణీత కాలాన్ని నిర్ధారించాడు. ఇదంతా పాపాత్ములు నమ్మరు. సురః 17.100
ఆంథోనీ ఫ్లూ ఇలా అభ్యంతరం తెలిపాడు. (గాడ్ ఫ్రీడం అండ్ ఇమ్మోర్టరాలిటీ, పుట 107, బఫెలో, 1984)
అల్లాకు తన రూపంలో సృష్టించే సర్వశక్తివంతమైన లక్షణం ఉన్నది. ఈ విషయాన్ని ప్రవక్త నిర్దుష్టంగా చెప్పారు. ఒక వస్తువును నాశనం చేసిన తరువాత మళ్ళీ అలాంటిదే సృష్టించినప్పుడు తొలి వస్తువు ప్రతిరూపం అవుతుందే కాని నిజరూపం కాదు. తీర్పునాడు శిక్షలు విధించే విధానంలో అసలు వారి కంటే ప్రతిరూపాలే వాటిని స్వీకరిస్తాయి. ఇది కవలపిల్లలలో ఒకరు చేసిందానికి మరొకరిని శిక్షించటం వంటిది.
పరస్ప విరుద్ధాలతో ముస్లింల భావనలున్నాయి. తీర్పునాడు మానవులంతా ముఖాముఖి సృష్టికర్త వద్ద ఉంటారన్నారు. కాని సుర 2.159, 3.169 ప్రకారం దేవుని కోసం పవిత్ర యుద్ధాలలో చనిపోయినవారు ఆయన వద్ద బ్రతికే ఉన్నారని రాశారు. తుది తీర్పుకుముందే ఈ మృతులను దేవుడు పైకి తీసుకెళ్ళినట్లున్నది. అలాగే చివరి రోజు వరకూ ఆగకుండా ఇస్లాం శతృవులను దేవుడు సరాసరి నరకానికి పంపిస్తాడు. నేడు శరీరంలోని వివిధ అంగాలను చికిత్స ద్వారా మార్పిడి చేస్తున్నారు. ఇస్లాం ప్రచారంలో ఒక సైనికుడు చనిపోతే అప్పుడు ఏదైనా ఒక అంగం ఇతరులకు దానం చేస్తే ఆ సైనికుడిని పునరుజ్జీవనం ఎలా చేయిస్తారు ? అతడిలో లేని అంగం తిరిగి రాదు గనుక అతడి ప్రతిరూపమే రావాలి. దేవుడికి అన్నీ సాధ్యమే అంటే సిద్ధాంతపు నిర్హేతుకతను ఒప్పుకోవడమే. జీవితానంతరం బ్రతుకును గురించి శతాబ్దాలుగా ఎన్ని మంత్రాలు, మాయలూ, శక్తులూ, కథలూ అల్లినా ఏ ఒక్కరూ రుజువు చేయలేకపోయారు. చావు అంటే భయం వలన, భవిష్యత్తు జీవితంలో నమ్మకం వలనా ఇలాంటి ఆడంబరాలు చోటుచేసుకున్నాయి.
తుది తీర్పుకు నైతిక అభ్యంతరాలు
క్రైస్తవం నుండి మహమ్మద్ స్వీకరించినది ఏది ? తుది తీర్పు సిద్ధాంతం మాత్రమే.
నిషే, ది యాంటిక్రైస్ట్
(ది పోర్టబుల్ నీషే, న్యూయార్క్, 1974, ఎడిటెడ్ డబ్ల్యు కాఫ్ మన్)
వునరుజ్జీవన సిద్ధాంతానికి ప్రాపంచిక, తార్కిక అభ్యంతరాలమాట అలా ఉంచి కొన్ని నైతిక అభ్యంతరాలున్నాయి. ఈ జీవితాన్ని చిన్న చూపుచూడటమే జీవితానంతర సిద్ధాంతాలలో ప్రధానంగా కనిపిస్తున్నట్లు నిషే వాదించాడు. జీవితాన్ని అర్థవంతం చేసుకునే బదులు జీవితానంతర సిద్ధాంతం వలన ఈ జీవితాన్ని అర్థంలేనిదిగా చూపుతున్నారు.
ప్రపంచంలో జీవితానంతర విషయాన్ని గురించి కథలల్లటం అర్థరహితం. జీవితాన్ని గురించి అనుమానించటం ఎక్కువయింది. ఇంకేదో జీవితంలో ఉత్తమ రీతులున్నాయని అంటూ మన జీవితంపై పగ సాధిస్తున్నాము.
(నిషే. పుటః484)
తుదితీర్పు అనేది పగ సాధనలో ఒక తీయని ఓదార్పు, అతీతం అనడంలోనే ఈ ప్రపంచాన్ని గర్హించినట్లయింది. (నీషే. పుటః 535)
ఈ అతీతం అనేది ప్రవక్తలుగా ముద్రవేసుకున్నవారికి, పురోహితులకూ, ఇతరులను అదుపులో పెట్టే అవకాశాన్ని ఇస్తున్నది. నరకం పేరిట జనాన్ని భయపెట్టటం, స్వర్గసుఖాల పేరిట ఆకర్షించటం కూడా ఉన్నది. ఈ భావనల ఆధారంగానే పురోహితుడు యజమానిగా మారి అలా కొనసాగుతున్నాడు (నీషే.పుటః 612) ఖురాన్ బోధనలలో మహమ్మద్ పెంపొందించిన అధమాధమ సంప్రదాయం పవిత్ర యుద్ధాన్ని గురించే ఇస్లాం కోసం చనిపోయిన వారికి స్వర్గంలో సత్ఫలితాలుంటాయన్నాడు. స్వర్గంలో ఈ సమస్యకు సైనికపరమైన విలువలతో కూడినదని రసెల్ వ్యాఖ్యానించాడు. (రసెల్ వై అయాం నాట్ ఎ క్రిస్టియన్, పుటః 72)
ఇస్లాం చరిత్రలో ఇలా చనిపోవటానికి సిద్ధపడిన వారిని భయంకరంగా రూపొందించారు. రాజకీయ హత్యలకు కూడా వీరిని వాడారు. 11, 12 శతాబ్దాలలో హత్యలకు ముందే ఇవన్నీ వచ్చాయి. ఆధునిక మధ్య ప్రాచ్య తీవ్రవాదులను రాజకీయ కారణాలుగా అమరులని ముద్రవేసి చూపుతున్నారు. వీరు భయాన్ని జయించేటట్లు శిక్షణ ఇచ్చారు. డాకిన్స్ చెప్పినట్లు ఈ అమరవీరులు తాము స్వర్గానికి పోతామని చిత్తశుద్ధితో నమ్ముతున్నారు. అదొక ఆయుధం. యుద్ధ సాంకేతికంలో మత విశ్వాసానికి ప్రత్యేక అధ్యాయం కేటాయించాలి. విల్లు, అశ్వం, టేంకు, న్యూట్రాన్ బాంబుకు సమానంగా మత విశ్వాసం కూడా చోటుచేసుకున్నది. (డాకిన్స్, ఎడిప్లోరబుల్ ఎఫైర్, న్యూ హ్యూమనిస్టు, 104 సంపుటి, లండన్, మే. 1989)
ఈ ప్రపంచంలో జీవితం తాత్కాలికమని తెలుసుకున్న మానవుడు జీవిత రమణీయకతనూ, విలువనూ గ్రహిస్తాడు. ఈ జీవితం ఒక్కటే సత్యమని తెలిసిన తరువాత సాధ్యమైనంత మందికి దీనిని మెరుగులు పెట్టటానికి ప్రయత్నించాలి.
జీవితంపై కాకుండా అతీతమైన శూన్యావస్థపై దృష్టి కేంద్రీకరిస్తే జీవితంలో ముఖ్యమైనదంతా పోగొట్టుకున్నట్లే. వ్యక్తిగత అమరత్వం అనేది వివేచనను నాశనం చేస్తుంది. జీవితాన్ని పెంపొందిస్తూ, భవిష్యత్తుకు బాటలు వేసేవన్నీ పోగొట్టేటట్లు చేస్తుంది. సమాజదృష్టి, పూర్వీకులకు కృతజ్ఞత, సహకారం, నమ్మకం, సంక్షేమం అనేవి ఎందుకనిపిస్తుంది. (నీషే, పుట 618)
భయంలో నీతి
మతం ప్రధానంగా భయంపై ఆధారపడింది. కొంతవరకూ తెలియనిదాన్ని గురించి భయం, అన్నికష్టాలలో, కలహాలలో నీ చెంత నిలిచే పెద్దన్న ఉన్నాడనే అభయం కొంత. మార్మికం, ఓటమి, మరణం పట్ల భయమే ప్రధాన ప్రాతిపదిక. క్రూరత్వానికి ఈ భయమే పితృస్థానం, క్రూరత్వం, మతం, చట్టపట్టాలేసుకుని సాగాయి (బెర్ ట్రాండ్ రసేల్, పుటః 25)
ఖురాన్ నీతి విధానం అంతా భయంపై ఆధారపడిందే. మహమ్మద్ దేవుని ఆగ్రహాన్ని ఆయుధంగా శత్రువులపై ప్రయోగించి, తన వారిని పవిత్ర చర్యలకు పురికొల్పే భయానక ధోరణి అవలంబించి సంపూర్ణ దాసోహానికి గురిచేశాడు. ముస్లిం మత శాస్త్రం, నీతి ప్రాతిపదిక అంతా సర్వశక్తివంతమైన దేవుడు అతని సృష్టిలోని మనిషి నిరంతరం దేవుని ఆగ్రహానికి గురవుతూ ఉండటమే ప్రధాన అంశాలు (సర్ హేమిల్టన్ గిబ్ ఇస్లాం, ఆక్స్ ఫర్డ్ 1953, పుటః 27)
దయామయుడైన దేవుడి భావనకు శాశ్వత శిక్షల భావన పొసగదు. ఖురాన్ సిద్దాంతాలలో అంతా ముందే నిర్ధారించనట్లు చెప్పిన తరువాత ఈ శిక్షలు అసలే అర్థం కావు. దేవుడు జీవులను నరకానికి పంపే నిమిత్తం సృష్టించటమనేది వీరు పేర్కొన్నారు.
నిజమైన నీతికి భయం అడ్డు వస్తుంది. స్వార్థంతో నరక చిత్రహింసలు తప్పించుకోటానికి, స్వర్గ సుఖాలననుభవించటానికి మనుషులు ఉపక్రమిస్తారు.
దైవ శిక్షలు
ఖురాన్ లోని శిక్షలు పాశవికాలు. ఖురాన్ నిర్ధారించిన శిక్షలు ఆనాడు సహజమైనవని సమర్థించేవారు. 20వ శతాబ్దంలో వాటిని అమలు పరుస్తుంటే గతుక్కుమన్నారు. కొరాన్ దైవ వాక్యం. శాశ్వత సత్యం గదా ? మరి.
ఆటంకాలు తొలగించుట
సుర 5.38 అలా చెపుతున్నది. స్త్రీ పురుషులలో దొంగ ఎవరైనా సరే చేతులు నరికివేయి. వారి నేరానికి దేవుని శిక్ష అది. ముస్లిం చట్టం ప్రకారం దొంగ కుడిచేయి మణికట్టు దగ్గర నరకాలి. రెండవ నేరానికి ఎడమ పాదం, తరువాత చేసే నేరానికి
జైలు శిక్ష ఉండాలి. (డిక్షనరీ ఆఫ్ ఇస్లాం, పుట 285)
శిలువ
సుర 5.33 ఇలా చెపుతున్నది. దేవుడూ, అతని దూతలపైన యుద్ధం చేసేవారిని ఉరితీయాలి. శిలువ వేయాలి. చేతులూ, కాళ్ళూ నరకాలి, దేశం నుంచి వెళ్ళగొట్టాలి. ఈ ప్రపంచంలో వారికి అది శిక్షగానూ, తరువాత ప్రపంచంలో భారీ శిక్షగానూ ఉండాలి.
స్త్రీలకు శిక్ష
వ్యభిచారానికి కొరాన్ శిక్షలు పేర్కొన్నది. స్త్రీలు వ్యభిచార నేరంలో పట్టుబడితే వారిని బందీలుగా అట్టిపెట్టాలి. నలుగురు సాక్షులు వారి నేరాన్ని ధృవపరిస్తే చనిపోయేవరకూ అలాంటి వారిని గృహ నిర్భంధం చేయాలి. సుర 4.15.
దెబ్బలు
సుర 24 .2-4 ప్రకారం స్త్రీ పురుషులలో వ్యభిచారానికి వంద కొరడా దెబ్బలు కొట్టాలి. దయ చూపరాదు.
ఖురాన్ లో తరువాత ప్రవేశపెట్టిన రాళ్ళతో కొట్టే విధానం కొందరు పండితులు సందేహిస్తున్నారు. ఇస్లాం చట్టం మానవహక్కులూ సమానంగా ఉన్నాయని కొందరు ఇస్లాం వాదులు సరిపెట్ట జూస్తున్నారు. మానవహక్కుల ప్రకటన ఆర్టికల్ 5 ప్రకారం ఏ ఒక్కరినీ చిత్రహింస చేయరాదు. ఆమానుష శిక్షలు విధించరాదు. ఐనప్పుడు అంగాలు తొలగించటం, కొరడా దెబ్బలు, రాళ్ళతో కొట్టడం అమానుషం కాదా?
ఖురాన్ లో చారిత్రక దోషాలు
హమాన్ పర్షియన్ రాజు అహసురస్ వద్ద మంత్రి. ఎస్తర్ లో ఈ ప్రస్తావన ఉంది. కాని కొరాన్ సుర 40.38లో ఇతనిని మోసెస్ కాలంలో పారోవావద్ద మంత్రిగా పేర్కొన్నారు.
జీసస్ తల్లి మేరీకి మోసెస్, అరన్ ల సోదరి మేరీకి ఇలాగే పొరబడ్డారు. సుర 2.249, 250లో సాల్ కథకూ జడ్జిమెంట్ 7.5లో గిడియస్ కూ గందరగోళం ఉంది.
చారిత్రకంగా అలెగ్జాండర్ ది గ్రేట్ గురించి కొరాన్ 18.82లో తీవ్ర గందరగోళం ఉంది. అలెగ్జాండర్ ప్రేమ వ్యవహారం మెసడోనియన్ ముస్లిం కాజాలడు. అతడు వృద్ధాప్యం వరకూ జీవించలేదు. ముస్లింలు అన్నట్లు అతడు అబ్రహాం సమకాలీనుడు కాదు.
ముస్లిం సమాజానికి అదుపులు
కొత్త సమాజానికి ఖురాన్ నియమనిబంధనలు సూచించింది. ఆయా అధ్యాయాలలో వీటిని పరిశీలిద్దాం. ఉపవాసాలు, దానాలు, పన్నులు, పారంపర్యత మొదలైనవి ఉన్నాయి. ఖురాన్ నీతి సూత్రాలతో పేచీలేదు. అవి కొత్తవి కాదు. పెద్దల, తల్లిదండ్రులపట్ల దయ, గౌరవం, పేదలపట్ల ఔదర్యం, పగ బదులు క్షమించుట ఉన్నాయి. రామణీయకత, ఔన్నత్యాల ప్రస్తావన ఉంది. మొత్తం మీద పరికిస్తే ఖురాన్ బోధనలు మానవ వివేచనకు, సాంఘిక, నైతిక, మేధస్సు ప్రగతికి పెద్ద, అపరాధమే. దేవుని మాట సంగతి అలా ఉంచి, దేవుడికి తగని పాశవిక సూత్రాలెన్నో ఉన్నాయి. మహమ్మద్ చేయి కొరాన్ లో ఉన్నదనడానికి తగిన సాక్ష్యాధారాలున్నాయి. అందులో నైతిక దృష్టి 7వ శతాబ్ద పరిస్థితుల ప్రతిబింబమే. అది నేడు ఆమోదయోగ్యం కాదు.
మతం, ముఖ్యంగా ఇస్లాం
మనిషిని ధర్మపరుడిగా చేస్తుంది. గనుక మతాన్ని విమర్శించడం తగదు అంటారు. కాని నాకెక్కడా అది కనిపించలేదు. బెర్ట్రాండ్ రస్సెల్ (వై ఐ యాం నాట్ ఎ క్రిస్టియన్, పేజి. 24)
ఏ మతమైనా వాస్తవమనడానికి ఆధారాలు ఉండవు. చాలా వాటిలో అబద్ధమనడానికి సాక్ష్యాలు ఉంటాయి. అబద్ధాలైనా అవి నైతిక వర్తనకు ఉపకరిస్తున్నాయని కొందరు తాత్వికులు ప్రవచించారు. సాంఘిక స్థిరత్వానికి తోడ్పడుతున్నాయన్నారు. తాత్వికుడు క్వైన్ ఇలా రాశాడు. మతం విధించే నిబంధనల సాంఘిక విలువల సమస్య ఉత్పన్నమైంది. వాస్తవాలకు అవి ఎంత దూరంగా ఉన్నాయనే మాట అలా ఉంచండి. వీటివలన ఉత్పన్నమైనదైతే, శాస్త్రీయ వికాసానికీ, భ్రమలకూ మధ్య డోలాందోళిత స్థితి ఏర్పడక తప్పదు. ( W.V.O.Quine, Quiddities-Cambridge 1987, పేజి. 209)
అలాంటి అభిప్రాయం ప్రాపంచిక అనుభవరీత్యా తప్పు. నైతికంగా జుగుప్సాకరం, రస్సెల్ ఇలా వాదించాడు.
ఒక కాలంలో మత భావన, పిడివాద నమ్మకం ఎంత తీవ్రంగా ఉంటే. క్రూరత్వం అంతగా వ్యాపించడం గమనార్హం. క్రైస్తవాన్ని సంపూర్ణంగా నమ్మిన రోజుల్లోనే దారుణ హింసాకాండ సాగింది. లక్షలాది స్త్రీలను మంత్రగత్తెల పేరిట చంపారు. మతం పేరిట క్రూరత్వాన్ని పాటించారు.
క్రైస్తవుల యుద్ధాలు మనకు సుపరిచితం. కాని ముస్లింలు చేసినవి అంతగా తెలియదు. 20వ శతాబ్దంలో అల్లా పేరిట దారుణ క్రూర హింసాకాండ చూద్దాం. అఫ్ఘనిస్తాన్ లో ఇస్లాం పేరిట అధికారం కోసం తీవ్ర అంతర్యుద్ధం సాగించారు. దయామయుడైన దేవునికి 5సార్లు ప్రార్థన చేస్తూనే, మధ్యలో వందలాది అమాయకుల్ని చంపేశారు. కొందరు పొరుగున ఉన్న పాకిస్తాన్ కు పారిపోయారు. కమ్యూనిస్టుల రాజ్యాన్నిమరుపు తెచ్చే దారుణాలు వారు చనిచూశారు. అంతర్యుద్ధంలో 1994 నాటికే 10 వేలమంది హతమైనట్లు ఇంటర్నేషనల్ హెరాల్డ్ ట్రిబ్యునల్ ఏప్రిల్ 26, 1994 ప్రచురించింది. కాబూల్ లోనే 1994 జనవరి ... ఏప్రిల్ మధ్య 1500 మంది హతమార్చబడ్డారు.
సూడాన్
1983లో జనరల్ సుమైరి అనే నియంత ఇస్లాం చట్టాన్ని అమలు పరచి సూడాన్ లో మూకుమ్మడిగా హత్యాకాండ సాగించాడు (1994 జూన్ నాటికి) జనాభాలో 3వవంతు క్రైస్తవులు, యానిమిస్టులు దక్షిణాదిలో ఉన్న వీరిపై ఉత్తరాది ఇస్లాం వాదులు నిర్దాక్షిణ్య యుద్దకాండ జరిపారు. 1983 నుండి 5 లక్షలకు పైగా చంపేశారు. సూడాన్ రాజధాని ఖార్టూమ్ నుండి 5 లక్షలమందిని నిరాశ్రయులను చేశారు. వారంతా ఎడారుల్లో 120 డిగ్రీల వేడిలో ఎలాంటి సదుపాయాలు, సౌకర్యాలు లేక మాడిపోయారు. ఎకానమిస్ట్ పత్రిక 1994 ఏప్రిల్, 9న ఇలా రాసింది.
మత దీవెనల పేరిట ఇరాన్ అర్థిక సహాయంతో, చైనాలో తయారైన ఆయుధాలను సైన్యానికి అందించారు. జిహాద్ పేరిట పోరాటం సాగించారు. సూడాన్ ముజహిదీన్లు సైన్యంలో చేరి, ఇస్లాం కోసం చావడానికి సిద్ధమయ్యారు.
ఇండోనేషియా
1965లో 250000 నుండి 6 లక్షల వరకూ ఇండోనేషియాలో హతమార్చబడిన ఉదంతాలు నేడు బయటపడుతున్నాయి. 1965లో కుట్ర విఫలం కాగా, ఇండోనేషియా సైన్యం (అమెరికా కనుసైగతో) కమ్యూనిస్టులపై పగ తీర్చుకున్నది. జాతీయ వాదులు, ముస్లింలు పగ తీర్చుకోవడానికి సైన్యం ప్రోత్సహించింది. చైనా రైతుల్ని ముస్లిం యువకులు హతమార్చారు. సాయంత్రం 6 తరువాత ఎవరూ బయటకు వచ్చేవారే కాదు. తూర్పుజావా పారిపోయిన చైనా రైతు ఈ విషయం చెబుతూ, స్త్రీల స్తనాల్ని కోసేశారని, చాలామంది శవాల్ని సముద్రంలో పారేసారని ఆ సముద్ర చేపలు తినడానికి జనం భయపడ్డారని చెప్పాడు.
మనుషుల చెవులు కోసి మెడలో దండగా వేసుకొని యువ ముస్లింలు పొద్దున్నే తిరిగేవారు. (గార్డియన్ వీక్లీ 1990 సెప్టెంబరు 23) తూర్పు తైమూర్ దాడిలో 2 లక్షల పెరుల్ని చంపేశారు.
ఆధ్యాత్మిక ప్రాచ్యం అనే అర్థం లేని మాట దృష్ట్యా ఈ దారుణాలను వెల్లడిస్తున్నారు. పాశ్చాత్యం నాస్తికమనీ, కుళ్ళిపోయిందనే ప్రచారం చేస్తుంటారు. మతం మనిషిని ధార్మికుని గావిస్తుందంటారు. క్రూరత్వంలో యూరోప్ వారు, ఆసియావారు, క్రైస్తవులు, ముస్లింలు అందరూ నేరస్తులే. వేలాది నాస్తికులు మచ్చలేని జీవితాలు గడిపారు. తోటివారికోసం నిస్వార్థంగా సేవ చేశారు.
ప్రయోజన వాదానికి అభ్యంతరం
క్రైస్తవ మతం వాస్తవమైనా కాకపోయినా దానిని బోధిస్తే నమ్మినవారు నేరాలు లేకుండా ఉంటారని చెప్పటం జుగుప్సాకరం, దిగజారుడుతనం, హేతుబద్దమైన విచారణ కంటె సుఖం, భద్రత కోరుకోవటం మత ఛాందస వాదంలో ప్రముఖంగా కనిపిస్తుంది. (రాబిన్ సన్, ఏన్ ఎథీయిస్ట్ వాల్యూస్, ఆక్స్ ఫర్డ్, 1964, పుటః పుట 117)
మతం తప్పుడుదైనా నీతికోసం అట్టిపెట్టాలనటం నైతికంగానూ గర్హనీయమే. దీనివలన మనిషి వివేచన వక్రమార్గానపడి మోసానికి ప్రోత్సాహం లభించి సత్యాన్వేషణకు దూరమవుతాయి. రసెల్ ఇలా చెప్పాడు.
వాస్తవం కాకున్నా నమ్మకాన్ని ప్రధానంగా స్వీకరించటం వలన అనేక దోషాలు తలెత్తుతాయి. జిజ్ఞాసకు ప్రోత్సాహం పోతుంది. సనాతనులకు పెత్తనం సంక్రమిస్తుంది. చారిత్రక వాస్తవాలు దోషాలుగా చూపవలసివస్తుంది. సనాతనత్వానికి వ్యతిరేకత నేరంగా పరిగణించి శిక్షలు విధిస్తారు. మతం వాస్తవం గనుక నమ్మాలి. అంటే, అర్థం ఉంది. అది ఉపయోగకరమైంది గనుక నమ్మాలి అంటే, వాస్తవం ఐనా కాకపోయినా అనుసరించాలి. అంటే దారుణ నీతిగా పరిగణిస్తాను (రసెల్, వై ఐయామ్ నాట్ ఎ క్రిస్టియన్, పుటః 156-57)
కొందరు నిజమైన భక్తులు కూడా ఇలానే వాదిస్తారు. చాలా సందర్భాలలో ప్రొఫెసర్ వాట్ చారిత్రక సత్యం అంత ప్రధానం కాదనీ, సూచనప్రాయమైన సాంకేతిక ముఖ్యమనీ అన్నాడు. ఇది చిత్తశుద్ధిలేని మాట. పాల్ మాటలు ఈ విధంగా ఉన్నాయి. చనిపోయిన వారి నుండి క్రీస్తు లేచాడంటే వునరుజ్జీవనం లేదని ఎలా అంటారు ? చనిపోయిన వారిలో మళ్ళీ పునరుజ్జీవనం లేకపోతే క్రీస్తు కూడా తిరిగిరాడు. క్రీస్తు రాకుంటే బోధనలు వృధా, నమ్మకం వృధా. (కొరింథియన్ 15.12-14)
కాబాను అబ్రహాం నిర్మించినట్లు ముస్లింలు నమ్ముతారు. అబ్రహాం అనేవాడు లేడంటే, ఉన్నా అరేబియాలో అడుగు పెట్టలేదంటే, అలాంటి చారిత్రక సత్యం వలన మక్కా యాత్ర అర్థంలేనిదవుతుంది. దేవునిలో నమ్మకం ఉన్న వ్యక్తి అలా వాదించినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది.
సత్యాన్వేషణనను దేవుడు ఆమోదిస్తాడు. తనను పూజించటానికి గాను అబద్దాలను దేవుడు ప్రోత్సహిస్తాడా ? ప్రయోజనతావాదం కొట్టిపారేయడానికి వీలులేకుండా మార్పులు చేస్తుంటారు. దారుణంగా బాధలు పడిన వ్యక్తి ఏ విధంగానూ ఈ లోకంలో బాగు పడలేని వ్యక్తి. జీవిత క్రూర సత్యాలకు బలి అయిన వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడదాం. జీవితానంతరం, దేవునిలో నమ్మకం పెట్టుకుంటే ఈ లోకంలో పడిన కష్టాలన్నీ తీరుతాయని అంటే అదొక కలగా మారుతుందా ? నమ్మకం ఒక్కటే ఈ కష్టాలను భరించేటట్లు చేస్తుంది. అలాంటి మాటలకు సమాధానం లేదు. మనిషి జీవితాన్ని చదువూ, రాజకీయ సామాజిక చర్యల ద్వారా బాగుపరచడానికి పూనుకోవాలి. అంతేగానీ సరిపెట్టుకొని ఊరుకోరాదు.
----
Thursday, March 13, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment