I read about this book at
http://naprapamcham.blogspot.com/2008/03/why-i-am-not-muslim.html
i got the book from
http://www.centerforinquiry.net/india/local_resources/why_i_am_not_a_muslim/
Please read and post your comments
Thursday, March 13, 2008
నేను ముస్లింగా ఉండలేకపోతున్నాను ఎందుకని
నేను ముస్లింగా ఉండలేకపోతున్నాను ఎందుకని
ఇంగ్లీషు మూలం
ఇబ్న్ వారక్
తెలుగుసేత
ఎన్. ఇన్నయ్య
ఇదీ క్రమం
ముందు మాట
కృతజ్ఞత
పరిచయం
రష్డీ (తంతు) వ్యవహారం
ఇస్లాం (ఎక్కడ మొదలైంది
మూలాధార సమస్య
మహమ్మద్ అతని సందేశం
కొరాన్
ఇస్లాం నియంతృత్వ స్వభావం
ప్రజాస్వామ్యం మానవ హక్కులు ఇస్లాంలో ఇముడుతాయా
అరబ్ సామ్రాజ్యవాదం, ఇస్లాం వలసవాదం
అరబ్ దండయాత్రలు - ముస్లిమేతరుల స్థితి
కాఫీర్లు, నాస్తికులు, స్వేచ్ఛాలోచన,
గ్రీకు తత్వం, విజ్ఞానం, ఇస్లాంపై వాటి ప్రభావం
సూఫీ వాదం (ఇస్లాం మర్మవాదం)
అల్ మారి
స్త్రీలు - ఇస్లాం
నిషేధాలు - త్రాగుడు, పందులు, పురుషాయితం, విస్కీ, వైన్
మహ్మద్ గురించి తుది అంచనా
పాశ్చాత్య ప్రపంచంలో - ఇస్లాం
ముందు మాట
నేను ముస్లిం కుటుంబంలో పుట్టాను. నేడు ఇస్లాం రిపబ్లిక్ అని చెప్పుకునే దేశంలో పెరిగాను. నా కుటుంబీకులు ముస్లింలే. కొందరు ఛాందసులు, మరి కొందరు అంత కాదు. నా చిన్నతనంలో సుంతీ, కొరాన్ పాఠశాలలో తొలి రోజు జ్ఞాపకమే. దానినిబట్టి మనో విశ్లేషకులు రాబట్టేదేమైనా ఉంటే అలా చేయవచ్చు. నా జాతీయభాష చదవడం, రాయడం రాకముందే, అరబ్బీ చదవడం నేర్చాను. ఒక్క మాటకూ అర్థం తెలియదు. అది ముస్లింపిల్లలకు సహజానుభవమే. సొంతంగా ఆలోచించడం మొదలైన తరువాత, నా మీద రుద్దిన మత ఛాందస పిడి వాదనల్ని వదిలేశాను. ప్రస్తుతం నేను సెక్యులర్ హ్యూమనిస్ట్ ను. మానసిక రుగ్మతతో కూడిన వారి కలల ఫలితమే మతాలని నా ఉద్దేశం. అవన్నీ తప్పుడివే. అలా రుజువుపరచవచ్చు కూడా. మతాలన్నీ హానికరాలే.
అలాంటి పరిస్థితులలో వచ్చిన నేను అలానే ఉండేవాడిని కానీ, ఇస్లాం చెలరేగడం, రష్డీ వ్యవహారం చూశాను. నేను ఇంతకు ముందు ఏ పుస్తకమూ రాయలేదు. కానీ ఈ సంఘటనల మూలంగా రాయవలసి వచ్చింది. 1930 ప్రాంతంలో నాజీ వాదం, కమ్యూనిజం, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, రాజు, దేశం, సామ్రాజ్య వ్యతిరేక వాదం ఇత్యాది సిద్ధాంతపర వాతావరణంలో మనం ఎలా నిలదొక్కుకున్నామోనని, యుద్ధం తరువాత వారు నోరునొక్కుకునేవారే. జీవన్మరణ సమస్య ఎదుర్కొన్నప్పుడు ఏ ధోరణి అవలంబిస్తామనేది అరుదుగా పరిష్కరించాల్సి వస్తుంది. అందులో ఇస్లాం చెలరేగడం, రష్డీ సమస్య, వాటివల్ల నేను తీసుకున్న ధోరణే ఈ గ్రంథంలో విశేషాలు. 1930 ప్రాంతంలో లేకపోతిమే అని చింతించే వారికి నేడు రష్డీ సమస్య ఎదురవుతుంది. అల్జీరియా, సూడాన్, ఇరాన్, సౌదీ అరేబియా, పాకిస్తాన్ లలో జరుగుతున్న ఘర్షణలలో ముస్లింలు, ముస్లిం స్త్రీలు, ముస్లిం మేథావులు, రచయితలు, సాధారణ పౌరులు బలి అవుతున్నారు. ఈ పుస్తకం నా యుద్ధ యత్నమే. ఇలాంటి రచన చేయగలనా అని నా వివేచనను ప్రశ్నించుకున్నప్పుడల్లా, దేవుడి పేరిట కొత్తగా హత్యలు, ఇస్లాం పేరిట అల్జీరియా, సూడాన్, ఇరాన్, టర్కీలలో జరిగే మారణ హోమాలు నన్ను నా పుస్తకం పూర్తి చేసేటట్లు పురిగొల్పాయి.
ముస్లింల కోసం వాదిస్తున్నామనే పత్రికా రచయితలు, కమ్యూనిజం నుండి ఇతర మతాల నుండి మారినవారు, పాశ్చాత్యలోకంలో పుస్తకాలు, వ్యాసాలు రాశారు. అవి దారుణంగా, అసహ్యంగా ఉన్నాయి. రష్డీ వ్యవహారానికి సంబంధించినదే ఈ ఉదంతం. వీరంతా ముస్లింలకోసం స్పందించడంలేదు. కానీ ముస్లిం దేశాలలో కొందరు ధైర్యవంతులు, రష్డీని సమర్థిస్తూ నిలబడ్డారు. 1994 జనవరిలో ఈజిప్ట్ పత్రిక రోజ్ ఆల్ యూసస్ రష్డీ శటానిక్ వర్సెస్ నుండి కొన్నిభాగాలుగా ప్రచురించింది.
ఇస్లాంలో మౌలిక పిడివాద సూత్రాలపట్ల నిశిత పరిశీలన, రాజీలేని ధోరణి ఛాందస సముద్రంలో సందేహ బిందువులు ఈ గ్రంథం ప్రయత్నంగా ఉంటుంది. దీనిపై విమర్శ వస్తుందని తెలుసు. జాన్ స్టువర్ట్ మిల్. అతని అభిమాని వాన్ హైక్ మాటల్ని ఈ సందర్భంగా ఉదహరిస్తాను.
స్వేచ్ఛ (లిబర్టీ) గురించి మిల్ ఇలా అన్నాడు.
స్వేచ్ఛగా చర్చ కావాలని ఆహ్వానించేవారే. అందుకోసం చివరి దాకాలాగొద్దంటారు. తగిన కారణాలు లేకుంటే ఇలాంటి ప్రయత్నం ఎందుకు చేయరాదో అర్ధం కాదు. (ఆన్ లిబర్టీ, పుట 83) మిల్ ఇంకా ఇలా అన్నాడు.
అభిప్రాయాన్ని వ్యక్తం చేయకుండా నోరు నొక్కడం మానవ జాతిని దోచుకోవడమే. వాడుకలో ఉన్న అభిప్రాయానికి నిరసన చూపే వారిపట్ల, అలాంటి భావాలున్నలున్న వారిపట్ల అన్యాయం చెయ్యడమే. అభిప్రాయం సరైనదైతే, సత్యాన్ని స్వీకరించి దోషాన్ని తృణీకరించే అవకాశం పోగొడుతున్నారు. దోషంతో సత్యాన్ని మిళితం చేసినప్పుడు స్పష్టంగా విషయాన్ని చూడడం సాధ్యం కాదు. అభిప్రాయాన్ని నోరు నొక్కేసేముందు అది తప్పుడు భావన అని నిర్ధారించాలి. ఒకవేళ తప్పుడు భావన అయినా బలవంతంగా అణచివేస్తామనడం తప్పు. (అదే పుస్తకంలో పుట 79).
(యుటిలిటేరియనిజం, లిబర్టి, రిప్రజంటేటివ్ గవర్నమెంట్, లండన్ 1960)
వాన్ హైక్ (von hayek) ఇలా అంటాడు. ఏ సమాజంలోనైనా స్వేచ్ఛాభావన పరిమితమైన కొద్దిమందికే ప్రాధాన్యత వహిస్తున్నది. అయితే ఈ స్వేచ్ఛను ఎవరికి ఇవ్వాలనే విషయమై నిర్ణయించే సమర్థత, అధికారం ఎవరికీ లేదు.... మేథా సంపన్నమైన స్వేచ్ఛ అందరికీ ఒకే విధమైన స్వతంత్ర ఆలోచన అందించదు. గనుక, దానిని నిరాకరించడం కేవలం స్వేచ్ఛ విలువను గుర్తించకపోవడమే. ప్రతివారూ ఆలోచిస్తున్నారా, రాస్తున్నారా అనిగాక, ఏ భావన అయినా కొందరు వాదించడానికి అవకాశం ఉంటేనే, మేథాసంపన్నమైన పురోభివృద్ధి ఉంటుంది. నిరసనను అణచనంతవరకూ సమకాలీన భావాల్ని ప్రశ్నించేవారుంటారు. కొత్త భావాల్ని ప్రచారం చేయడం, పరీక్షకు పెట్టడం కుదురుతుంది.
భిన్న భావాలు, విభిన్న అవగాహనగల మేథావుల మధ్య భావ సంపర్కం జరిగితే, ఆలోచనా జీవన స్రవంతి సాగుతుంది. వివేచన పెంపొందడం సామాజిక రీతి, భిన్నాభిప్రాయాలపై ఇది కొనసాగుతుంటుంది. (పుట. 122 ది రోజోటు సెర్ఫ్ డం, లండన్ 1944).
కృతజ్ఞత
నేను పండితుడిని కాను. నిపుణుడినీ కాను. సొంతంగా చెబుతున్నాననుకోవడం లేదు. పండితులపై ఆధారపడి, వారిని ఉదహరిస్తూ, వారి భావాలను సంక్షిప్తంగా రాసి, అవి సేకరించిన వివరాలు నోట్స్ లోనూ, గ్రంథ పట్టికలోనూ ఉదహరించాను. నా సృష్టి అనదగిన ఆలోచన, భావన లేదు. ఉదాహరణల పట్టిక పుస్తకం అని ఎవరైనా దీనిని అంటే నేను బాధపడను.
ఇస్లాం విజ్ఞాన సర్వస్వం (ఎన్ సైక్లోపీడియా ఆఫ్ ఇస్లాం) ప్రథమ, ద్వితీయ ముద్రణలు నాకు ఎంతో తోడ్పడ్డాయి. ప్రథమ ముద్రణలో ఉన్న సందేహవాదం ద్వితీయ ముద్రణలో లేదు. నిశిత పరిశీలన కోల్పోయి, రాజకీయ, మత విషయాలు సరైనవేనా అని ద్వితీయ ముద్రణ సరిచూడలేకపోయింది. ఇస్లాం నిఘంటువు (డిక్షనరీ ఆఫ్ ఇస్లాం) తప్పనిసరి అయింది. అందులో సందేహ వాదన చోటు చేసుకుంది. బెర్న్ డ్ లూయీస్, మాంట్ మొరీవాట్ లకు నేనెంత రుణపడిందీ నోట్ పుస్తక పట్టిక తెలుపుతుంది. బెర్నాడ్ లూయీస్ గత అర్థశతాబ్దిలో ఇంగ్లీషు వచన రచనలో గొప్పవాడు.
ప్రొఫెసర్ వాట్ గురించి కొన్నిసార్లు నేను కర్కశంగా రాసినా అయన గొప్ప పండితుడు. స్పష్టంగా అరమరికలు లేకుండా రచించాడు. న్యూ హ్యూమనిస్ట్ పత్రికలో ఇబ్న ఆల్ రవాండి రాసిన వ్యాస పరంపర నాకు నైతిక సత్తాను, ప్రోత్సాహాన్నిచ్చింది. బహుశ న్యాయం కాదుగాని కొందరు రచయితలను ప్రత్యేకించి ప్రస్తావిస్తున్నాను.
2వ అధ్యాయం డి. టైప్స్
3వ అధ్యాయం డబ్ల్యూ.టిస్ డల్, ఎం.బోయ్ స్, ఎస్.జ్విమ్మర్,
సిసిటోరే, ఎ.జైగర్
4వ అధ్యాయం ఎస్.హర్ గ్రోంజె, ఐ.గోల్డ్ జిహర్, జె.షాట్,
ఎం.కున్, పి. క్రోన్
5వ అధ్యాయం ఎ. జెఫ్రి, డబ్ల్యూ మూర్
6వ అధ్యాయం ఆర్.బెల్, డబ్ల్యూ ఎం.వాట్, ఎ.దష్తి
7వ అధ్యాయం జి.హెచ్.బాక్వె, జె.షాట్
8వ అధ్యాయం ఎ. ఐ. మేయర్
9వ అధ్యాయం ఐ. గోల్డ్ జిహర్
10వ అధ్యాయం బియోర్ (ఆమె మూడు రచనలపై ఈ
అధ్యాయం ఆధారం)
11వ అధ్యాయం జి. వాడ్డ, ఆర్.వాల్జర్, ఐగోల్డ్ జిహర్
12వ అధ్యాయం ఎం.ప్లెన్నర్, పైన్స్, ఆర్.ఎ.నికల్ సన్,
ఎ.జె.ఆర్చరీ
13వ అధ్యాయం ఎ.జె.ఆర్చరీ
14వ అధ్యాయం ఆర్. ఎ. నికల్ సన్, ఎ. రిహాని
15వ అధ్యాయం జి. ఆషా (ఈ అధ్యాయంలో విలువగలవన్నీ
బాస్క్వే నుండే)
16వ అధ్యాయం ఖమరియా, గిధా, లివాట్, ఎఫ్.జె.సి.మూన్స్
17వ అధ్యాయం డబ్ల్యూ ఎం. వాట్, డి. ఎస్. మార్గోవిత్, డబ్ల్యూ
మూర్
18వ అధ్యాయం ఎల్. హిస్కెట్
ఎకర్ మన్ తో మాట్లాడుతూ గెట సలహా సూచన చేస్తూ, గ్రంథ చౌర్యంపై ఒక రచయితకు ఇలా చెప్పాడట. నేను రాసిన దానిలో ఒక పుస్తకం నుండో, జీవితం నుండో స్వీకరించాననడంలో అర్థం లేదు. అసలు సంగతేమంటే, సరిగా వినియోగించానా లేదా అని చూడాలి. చాలామంది ఇస్లాం పండితుల పరిశోధనా పాండిత్యాన్ని నేను వాడటం వారు ఆమోదిస్తారో లేదో తెలియదు. కాని అందులో కర్కశంగా తుది నిర్ణయాలతో ఇస్లాం గురించి రాసిందంతా కేవలం నాది మాత్రమే.
పరిచయం
ఈ పుస్తకం చదివేటప్పుడు సిద్ధాంతానికీ, ఆచరణకు గల తేడా గుర్తుంచుకోవాలి. ముస్లిం ఏం చేయాలి. వాస్తవానికి వారేమి చేస్తున్నారు అనే విచక్షణ గమనించాలి. వారు నమ్మి చేస్తున్నదేమిటి, నమ్మవలసి ఉన్నదేది అనేది కూడా గుర్తించాలి. ఇస్లాంను మూడు కోణాల నుండి పరిశీలించాలి. ఇస్లాం ఒకటిలో ప్రవక్త చెప్పింది ప్రధానం, అంటే కొరాన్ లో ఆయన చెప్పిందన్నమాట. ఇస్లాం రెండులో సంప్రదాయాల (హడిత్) ద్వారా మత పండితులు ప్రవచించి, వ్యాఖ్యానించి, పెంపొందించిన మతం. దీనిలో షరియా, ఇస్లాం చట్టం కూడా ఉన్నాయి. ఇస్లాం మూడులో ముస్లింలు వాస్తవానికి చేసింది,
సాధించింది ఏమిటి అంటే ఇస్లాం నాగరికతను గమనించడన్నమాట.
ఇస్లాం మూడులో ఇస్లాం నాగరికత అత్యున్నత దశకు చేరుకున్న ఉదంతం ఈ గ్రంథంలో ఆవిర్భవిస్తుంది. ఇస్లాం ఒకటి, రెండు వలన గాక, వాటిని మించి సాధించిన పని ఇది. ఇస్లాం ఒకటి రెండుతోనే పరిమితమై ఉంటే, ఇస్లాం విజ్ఞానం, సాహిత్యం, కళలు ఉన్నత దిశకు చేరుకునేవి కావు. ఉదాహరణకు కవిత్వం చూద్దాం. తొలి దశలో కవుల్ని మహమ్మద్ ఈసడించుకున్నాడు. దారితప్పిన వారు కవుల్ని అనుసరిస్తారు (సుర.26.224) మిష్కత్ సంప్రదాయాలలో మహమ్మద్ ఇలా అంటాడు. కడుపునిండా కవిత్వంకంటే చెడు పదార్థంతో పొట్ట నింపటం మంచిది. ఇస్లాం ఒకటి, రెండు దశల్ని అనుసరిస్తే, సోమపానాన్ని శ్లాఘిస్తూ యువకుల పిరుదుల్ని పొగుడుతూ, అబూ నువాస్ రాసిన కవితలు గానీ, అరబ్ సాహిత్యంలో సుప్రసిద్ధ మదిర (సారా) కవితలుగాని వచ్చేవే కాదు.
ఇస్లాం నిఘంటువు ప్రకారం మహమ్మద్ చిత్రకారుల్ని, మనుషుల, జంతువుల బొమ్మలు గీసే వారిని శాపనార్ధాలు పెట్టినందువలన, ఇస్లాం కళలో వాటిని నిషిద్ధాలుగా భావించారు. (మిష్కత్ 7, అధ్యాయం 1, ఒకటో భాగం) అరబ్ చిత్రకళ పరిచయ వాక్యాలలో ఎటింగ్ హాసన్ ప్రస్తావిస్తూ బొమ్మలు గీసే వారిని అధములుగా హడిత్ ఖండించినట్లు చెప్పాడు. సృష్టికర్త అయిన దేవుడితో వీరు పోటీ పడుతున్నట్లు భావించారు. చట్ట ప్రకారం బొమ్మలతో కూడిన చిత్రకళకు ఆస్కారం లేదు. కొత్తగా మారిన ముస్లిమ్ లు ఈ సనాతన స్థితిని అనుసరించక, సంపన్న చిత్ర సంప్రదాయాల్ని, ప్రాచీన నాగరికతల్ని పాటించి, పర్షియన్ మొగల్ చిత్ర కళల్ని రూపొందించారు.
ఇతర నాగరకతలతో, ఉన్నత సంపదతో సంబంధాల వలన ఇస్లాం కళ, తత్వం, విజ్ఞానం సృజనాత్మకంగా పెంపొందింది. ఇస్లాంలో ఒకటి రెండు దశలవలన ఇవి రాలేదు. కళలు, తత్వం, శాస్త్రీయ సంప్రదాయాలు అరేబియాలో బొత్తిగా లేవు. అరబ్ గతం నుండి కవిత తలెత్తి, సృజనాత్మకత కొనసాగడానికి ఇస్లాం ప్రేరణ అంతగా తోడ్పడలేదు. బైజాంటైన్, ససానియన్ కళలు లేకుంటే ఇస్లాం కళలు ఉండేవి కావు. ఇస్లాం ఒకటి, రెండు దశలు కూడా కళలకు వ్యతిరేకం. గ్రీకు తత్వం, విజ్ఞానం పెరిగేవి కావు. ఈ విదేశీ శాస్త్రాలకు ఇస్లాం ఒకటి, రెండు దశలు వ్యతిరేకం. సనాతనుల దృష్టిలో ఇస్లాం తత్వం అనేది పరస్పర విరుద్ధం. ఇస్లాం సైన్స్ వృధా.
ఈ రంగాలలో అత్యున్నతంగా ప్రాతినిధ్యం వహించిన వారు ఇస్లాం ఒకటి, రెండు దశలకు వ్యతిరేకులు, ముస్లిమేతరులు మాత్రమే. గ్రీకు తత్వాన్ని అరబిక్ లోకి అనువదించిన హునైన్ ఇబ్న ఇషాక్ (809-873) క్రైస్తవుడు. అరబ్బు గద్యానికి సృష్టికర్తగా భావిస్తున్న ఇబ్నఅల్ ముఖఫా (757లో చనిపోయాడు) పహల్వీ నుండి అరబ్బీ లోనికి అనువదించినవాడు మనిషియన్. ఇతడు ఖురాన్ ను విమర్శించాడు. (వాట్ - ఇస్లామన్ ఫిలాసఫీ అండ్ థియాలజీ, ఎడిన్ బరో 1979) అబ్బాసిద్ కాలానికి ప్రాతినిధ్యం వహించే కవులుగా మూటి ఇబ్న ఇయాస్, అబునూవాస్, అబూ అతాహియ, అల్ ముతనబి, అల్ మారి అనే ఐదుగురిని నికల్ సన్ చర్చకు స్వీకరించాడు. (లిటరరీ హిస్టరీ ఆఫ్ ది అరబ్స్, కేంబ్రిడ్జి 1930) వీరందరూ ద్రోహులుగా, విరుద్ధ భావుకులుగా చిత్రీకరించి, చర్చించబడ్డారు. ఇస్లాం సైన్స్ కి ప్రాతినిధ్యం వహించిన గొప్ప వ్యక్తి అల్ రజి, ఇతడు గొప్ప వైద్యుడు కూడా. (11వ
అధ్యాయం చర్చ) ఇస్లాం ఒకటి రెండు దశలన్నింటికీ అల్ రజి వ్యతిరేకి. మహమ్మద్ కు ప్రవక్త స్వభావం లేదన్నాడు కూడా.
స్త్రీలు, ముస్లిమేతరులు, నమ్మకం లేనివారు, విరుద్ధ భావుకులు, బానిసలు (స్త్రీ, పురుషులు) సిద్ధాంత, ఆచరణ రీత్యా కూడా దిగ్భ్రమ గొలిపే విషయం. ఈ విషయమై ఇస్లాం అన్ని దశల్ని ఖండించాల్సిందే. ఖురాన్ సూత్రాలవలన, ఇస్లాం న్యాయవేత్తల వలన స్త్రీలపట్ల ముస్లిమేతరులు, విరుద్ధ భావుకులపట్ల అనుసరించిన ధోరణి రూపొందింది. ఇస్లాం చట్టం నియంతృత్వంతో కూడినది. వ్యక్తి పుట్టినప్పటి నుండి చనిపోయే వరకూ అన్నివిధాల అదుపులో పెట్టాలంటుంది. అయితే ఇస్లాం చట్టం తు.చ. తప్పకుండా పాటించడం లేదు. సారా తాగడం, పురుషాయతం ఇస్లాం ఖండించినా, ఆచరణలో ఇస్లాం నాగరికత వీటిని సహిస్తున్నది. అయితే కుటుంబం వివాహం, విడాకుల వంటివి షరియా అదుపులో ఉన్నాయి.
షరియాకంటే పేర్కొనే దానికంటే కొన్ని విషయాలు ఇస్లాం తీవ్రంగా పాటిస్తున్నది. ఖురాన్ లో సున్తీ ప్రస్తావన లేదు. న్యాయవేత్తలు దీనిని సిఫారసు చేస్తున్నారు. ముస్లిం పిల్లలందరికీ సున్తీ చేయిస్తున్నారు. ఖురాన్ లో బాలికల సున్తీ ప్రస్తావన లేదు. కొన్ని ఇస్లాం దేశాలలో దీనిని పాటిస్తున్నారు. ముస్లిం పురుషులందరూ మౌలికంగా సమానమని ఖురాన్ అంటుంది. అచరణలో ఇది పాటించడము లేదు. ఇస్లాం ప్రకారం అరబ్బులు కాని వారిని విచక్షణతో చూస్తున్నారు. ఇస్లాం ఒకటి, రెండు దశలు చెప్పే నీతి సూత్రాలని ఇస్లాం మూడోదశ ఆచరించడం లేదు.
పుస్తక పరిచయం
కథ చెప్పడమే కాదు. వినడం కూడా చేతకావాలన్నాడు రాచకొండ విశ్వనాథశాస్త్రి పుస్తకాలు రాయడం ఒక ఎత్తు. వాటిని అచ్చు వేయడానికి ధైర్యం కావాలి. సాల్మన్ రష్డీ, తస్లీమా నస్రీన్ (బంగ్లాదేశ్ లజ్జ రచయిత్రి) రచనలు వెలువడిన తరువాత, చాలమంది ప్రచురణకర్తలు వివాదాస్పద రచనలంటే భయపడుతున్నారు. ముఖ్యంగా ముస్లింలను, మహమ్మద్, కొరాన్, ఇస్లాం చట్టాలను విమర్శించే గ్రంథాల జోలికి పోకూడదనుకుంటున్నారు. అలాంటి సందర్భంలో అమెరికాలోని హ్యూమనిస్టు ప్రచురణ సంస్థ ప్రామిథిస్ వారు ధైర్యంగా ఈ పుస్తకాన్ని ఇటీవలే వెలువరించడం ఆహ్వానించదగిన మార్పు.
పుస్తక రచయిత ముస్లిం. ఇస్లాంను బయటివారు విమర్శించిన రచనలు చాలా ఉన్నాయి. వాటిని ముస్లింలు అంతగా పట్టించుకోరు. కాని తమలోని ఒక వ్యక్తి విమర్శిస్తే, చంపేసేవరకూ, అమానుషంగా ప్రవర్తిస్తారు. శటానిక్ వర్సెస్ రాసిన సాల్మన్ రష్డీని చంపేయమని ఇస్లాం అధిపతి అయోతుల్లా ఖొమినీ ఉత్తర్వులు జారీచేశారు. బంగ్లాదేశ్ లో తస్లీమా నస్రీన్ కు తలదాచుకునే అవకాశం లేక, స్వీడన్ కు పారిపోవాల్సిన దుర్గతి పట్టించారు. వారి పుస్తకాలను నిషేధించారు. మళ్ళీ ఈ దేశాలన్నీ మానవ హక్కుల పత్రం పాటిస్తామని సంతకాలు చేసిన వారే. ఇబన్ వారక్ రచన చాలా లోతుపాతులతో, నిశిత పరిశీలనతో, అనేక మంది రచయితలను పట్టి చూచి రాసిన గ్రంథం. అంతా అయిన తరువాత ఇక తాను ముస్లింగా ఉండలేనంటున్నాడు. అది ధైర్యానికి నిదర్శన ప్రకటన.
బెర్ట్రాండ్ రస్సెల్ నేనెందుకు క్రైస్తవుణ్ణి కాదు అనే రచన చేస్తే ప్రపంచంలో ఇతర మతస్తులు మెచ్చుకున్నారు. ఇబన్ వారక్ అంటాడు. రసెల్ రచనలో క్రీస్తుకు బదులు అల్లాను పెడితే, అదంతా ముస్లింలకు యధాతధంగా వర్తిస్తుంది. అలాగే అన్ని మతాలకూ చెందుతుంది. నేనెందుకు హిందువును కాలేదు అని ఇటీవల రామేంద్ర బీహార్ నుండి ఒక రచన ప్రచురించాడు. అదికూడా రసెల్, ఇబన్ వారక్ ధోరణిలోనే.
ఈ రచనలో 17 అధ్యాయాలు ఉన్నవి. ఇబన్ వారక్ చాలా పరిశోధన చేసి ప్రతి అంశాన్ని పట్టిచూచి, రాశాడు. రష్డీ వ్యవహారంతో తొలి అధ్యాయం ఆరంభమవుతుంది. 1989 ఫిబ్రవరిలో ఇరాన్ అధిపతి అయోతుల్లా ఖొమినీ ఫత్వా జారీ చేసి సాల్మన్ రష్డీని చంపమన్నాడు. పాశ్చాత్యులలో కొందరు ముస్లింలను దువ్వడానికిగాను ఈ చర్యను సమర్థించారని, ఖొమిని చర్యను ఖండించలేకపోయారని ఆయన చూపారు. ఫ్రెంచి తత్వవేత్త ఫూకోసైతం ఖొమిని చర్యల్ని ఆహ్వానించి, ఇరాన్ లో దారుణాల పట్ల కళ్ళు మూసుకున్నట్లు రచయిత ప్రస్తావించారు. శాస్త్రీయ రంగంలో పరిశోధనలు, రుజువులు, ప్రగతిని కొంతవరకు క్రైస్తవులు స్వీకరించి, మత ఛాందసాన్ని సవరించారని, ఇంకా ముస్లింలు ప్రారంభించ లేదని రచయిత అన్నారు. అయితే శాస్త్రీయ ఉప్పెనకు కొరాన్ తట్టుకోలేదని కూడా ఆయన అన్నాడు.
రెండో అధ్యాయంలో ఇస్లాం పుట్టుపూర్వోత్తరాలు, యూదు క్రైస్తవ మతాల గ్రంథాల ప్రభావం సుదీర్ఘంగా చర్చించారు. విగ్రహారాధన వ్యతిరేకించే ముస్లింలు మక్కాలో కాబా నల్లరాతిని ప్రతిష్ఠించి, ఆరాధించే రీతులు ఎలా వచ్చాయో వివరించారు. ఇది ఆకాశం నుండి వూడిపడిన ఉల్క అని కీ.శే.కారల్ శాగన్ రాశారు. మక్కా మీదుగా ఎమెన్, సిరియా వెళ్ళే ఒంటె వ్యాపారస్తుల కాబావద్ద ఆగి, పక్కనే ఉన్న ఊట బావి నీటితో సేద తీర్చుకొని వెళ్ళేవారని రచయిత పేర్కొన్నారు.
మూడో అధ్యాయంలో మూలాధారాల పరిశీలనో ఎదుర్కొంటున్న సమస్యల్ని, రచయిత కూలంకషంగా చూచారు. ఖురాన్ గురించి ముస్లిం సనాతనులు చెప్పే అబద్ధాలు మొదలు, మహమ్మద్, సంప్రదాయల వెనుక ఎంతవరకు నిలబడగల చరిత్ర ఉందో చూపారు.
నాలుగో అధ్యాయంలో మహమ్మద్ సందేశాలను రచయిత విప్పి చూపారు. మహమ్మద్ గురించి రాసిన వాళ్ళలో చాలామంది వ్యతిరేకులు కాదని, అయినా వాస్తవాలు తెలిపారని, ముస్లింలు అదంతా గ్రహిస్తే అంత అభిలషించరని రచయిత అన్నారు. మహమ్మద్ లో మక్కా కాలంలో మహమ్మద్ చిత్త శుద్ధిగల మత నమ్మకస్తుడుగా ఉన్నాడు.
ఖురాన్ గురించి ఐదవ అధ్యాయం విపులంగా పరిశీలిస్తుంది. ముస్లింలు ఖురాన్ పవిత్రమనీ, దైవదత్తమనీ, సత్యమనీ నమ్ముతారు. అలాంటి గ్రంథంలో పరస్పర విరుద్ధాలు, ప్రక్షిప్తాలు, భిన్న పాఠాంతరాలు ఉండడాన్ని రచయిత చూపాడు. ఖురాన్ సూచించే శిక్షలో మానవహక్కుల్ని ఎలా ఉల్లంఘిస్తున్నాయో రచయిత పేర్కొని ఇస్లాం దేశాలన్నీ మానవహక్కుల పత్రం అంగీకరించిన విషయం గుర్తు చేశారు. బైబిల్ వలె ఖురాన్ కూడా సృష్టివాదం, ఒప్పుకోగా, సైన్స్ అందుకు విరుద్ధంగా పరిణామ వాదానికి సాక్ష్యాధారాలు చూపుతున్నది. అలాగే జీవం కూడా.
ఇస్లాంలో నియంతృత్వం ఎలా ఉందో రచయిత మరొక అధ్యాయంలో చూపాడు. ఇస్లాం అంతా విధులలో కూడినది. పుట్టిన దగ్గరనుండి చనిపోయే వరకూ జీవితాన్ని అదుపులో పెట్టడం ఇస్లాం పని. కనుకనే ఇస్లాంలో సెక్యులరిజం లేదు. అంటే మతం-రాజ్యం విడిగా చూడడం లేదు. ఇస్లాం యావత్తు నాలుగు స్తంభాలపై ఆధారపడుతుంది. ఖురాన్, సున్నా, (ప్రవక్త ప్రవచనాలు), వీటిని గురించి ఒక అంగీకారానికి వచ్చిన ముస్లిం పండితుల మాటలు. ఉపమానాలతో కూడిన వాదన. రచయితననుసరించి ఖురాన్ 7-9 శతాబ్దాల మధ్య రాసిందే. ఇందులో యూదు, క్రైస్తవ, జొరాస్ట్రియన్, సమారిటన్ నుండి స్వీకరించి చేర్చినవి చాలా ఉన్నాయి. ఇందులో శాస్త్రీయంగా నిలబడని దోషాలు, వ్యాకరణ భాషా దోషాలు, కాలదోషం, పరస్పర విరుద్ధ విషయాలు, అసంబద్ధాలు పేగన్ల పట్ల అసహనం, హింస, హత్య, స్త్రీ పురుష అసమానతలు, బానిసత్వాన్ని అంగీకరించండం, అమానుష శిక్షలు, మానవ వివేచన పట్ల జుగుప్స ఉన్నాయి. దైవదత్తమైన వాటిలో ఇలా ఉండడం అర్థం లేనిదని రచయిత ఉద్దేశం. ఉదారత, తల్లిదండ్రులపట్ల గౌరవం వంటివి ఉన్నప్పటికీ అసంబద్ధాల మధ్య అవి మునిగిపోయాయి.
ఇస్లాంలో పురోహిత వర్గం లేదని ముస్లిం పండితులు చెబుతారు. కాని ఇస్లాంకు సరైన వ్యాఖ్యానం చేసే పేరిట అన్ని చోట్ల పురోహిత వర్గం తిష్ఠవేసి పెత్తనం చేస్తున్నది. ఉలేమాలు వీరే. ముస్లింలలో నిశిత పరిశీలన, శాస్త్రీయ దృక్పథం పెంపొందకుండా నిరోధిస్తున్నది ఈ ముల్లాలే. వెయ్యేళ్ళ క్రితం ఆనాటి పరిస్థితులలో వచ్చిన షరియా చట్టాలు నేడు చారిత్రకంగా చూడాలేగాని, తు.చ.తప్పక పాటిస్తే నైతిక ప్రగతి ఉండదని రచయిత ఘంటాపథంగా చెప్పారు.
మానవహక్కులుః ముస్లిం దేశాలు ఇస్లాంను పాటిస్తూనే. మానవ హక్కుల్ని అంగీకరిస్తూ సంతకాలు చేశాయి. ఐక్యరాజ్య సమాఖ్యలో వీరు సభ్యులే. కాని ఆచరణలో అడుగడుగునా మానవ హక్కుల్నిఇస్లాం అడ్డుకుంటున్నది. ఇస్లాం స్త్రీలు పురుషులు సమానం కాదు. పురుషుడి సాక్ష్యంలో సగం విలువ మాత్రమే స్త్రీ సాక్ష్యానికి ఉంటుంది. స్త్రీలకు అన్ని విధాల స్వేచ్ఛను ఇస్లాం పరిమితం చేస్తుంది. ముసుగు వేసుకోమంటుంది. మానవ హక్కుల ప్రకారం స్త్రీ పురుషులకు హక్కులు స్వేచ్ఛ, భావాలు సమానంగా ఉండాలి. కాని ఇస్లాం ప్రకారం స్త్రీలు ముస్లింలు కాని వారిని పెళ్లి చేసుకోరాదు. ముస్లిం దేశాలలో నివసించే ముస్లిమేతరులకు కోర్టులో కాని, మరెక్కడా సమాన హక్కులు లేవు. ముస్లిం దేశాలలో నాస్తికులు, నమ్మకం లేనివారు చంపబడాల్సిందే. ముస్లిం దేశాలలో ఇతరమతాల వారు తమ ప్రార్థనలు చేసుకోడానికి, బాహాటంగా గుడి, చర్చి నిర్మించడానికి, పవిత్ర గ్రంథాలు చదవడానికి వీల్లేదు. మానవహక్కులు బానిసత్వాన్ని వ్యతిరేకిస్తుండగా ఇస్లాం గుర్తిస్తున్నది. బానిస స్త్రీలతో లైంగిక సంపర్కం ముస్లింలకు ఖురాన్ అనుమతిస్తున్నది. (సుర 4ః3) మానవహక్కుల ప్రకారం క్రూరమైన, అమానుషమైన శిక్షలు, మానవత్వాన్ని దిగజార్చే శిక్షలు ఉండరాదు. ఇస్లాం ప్రకారం కొరడాతో బహిరంగంగా కొట్టడం, చేతులు కాళ్ళు నరకడం, రాళ్ళు విసరి చంపడం అనుమతిస్తున్నారు. చట్టం ముందు అందరూ సమానమని మానవహక్కులు చెబుతుండగా, ఇస్లాం అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నది. ముస్లింలలో ఇతరులు మతం మార్చుకొని చేరవచ్చు. కాని ముస్లింలు మతం మార్చుకొని వేరేపోవడానికి వీల్లేదు.
ప్రజాస్వామ్యం - ఇస్లాం పొసగనివని, మానవ హక్కులకు ఇస్లాంలో అవకాశం లేదని రచయిత వివరంగా చెప్పాడు. ముస్లింలు ఇతర ప్రపంచంతో పాటు ముందుకు సాగడానికి, మతాన్ని రాజ్యాన్ని విడదీసే సెక్యులరిజం అవసరమని రచయిత అన్నారు.
స్త్రీలు-ఇస్లాం - స్త్రీలపట్ల ఇస్లాం ఎలా ప్రవర్తిస్తున్నదో చాలా వివరంగా రచయిత ఒక అధ్యాయంలో చర్చించారు. క్రైస్తవులవలె ఇస్లాం కూడా పురుషుని సృష్టి ముందు జరిగిందని భావించారు. స్త్రీలపట్ల ఇస్లాం చాలా క్రూరంగా, హేయంగా ప్రవర్తించిన ఉదాహరణలు రచయిత చూపాడు.
స్త్రీ బహిస్టు సమయంలో ఖురాన్ తాకరాదు. కాబా చుట్టూ తిరగరాదు. ప్రార్థన చేయరాదు. ఉపవాసం ఉండరాదన్నారు. స్త్రీ పురుష అసమానత్వం ఖురాన్ లో నిర్దష్టంగా ఉంది. (సుర 2.282) ఆస్తిహక్కులో కూడా అబ్బాయికి రెండురెట్లు, అమ్మాయికి ఒక భాగం చెందాలన్నారు.
రక్తపాతంతో కూడిన పగ సాధింపు ఇస్లాంలో పేర్కొన్నారు. (సుర 2.178) స్త్రీలకంటే పురుషులు వివేచనలో అధికులని ఇస్లాం న్యాయవేత్తలు పేర్కొన్నారు.
ముస్లిం స్త్రీల ముసుగు వారి బానిసత్వానికి గృహ నిర్బంధానికీ, తక్కువగా చూడడానికి నిదర్శనంగా నిలచింది. ముస్లిం స్త్రీలు అనేకదేశాలలో బయటకు వచ్చి, తమ స్వేచ్ఛా స్వాతంత్రాలను వెల్లడిస్తున్నా, మొత్తం మీద ఇస్లాం వారిని చిన్న చూపు చూస్తూనే ఉంది. రచయిత ఈ రంగంలో సోదాహరణలతో వివరణ ఇచ్చారు.
ఇస్లాం సాహిత్యంలో వైన్, స్త్రీల గురించి రమణీయమైన కవితలు, సాహిత్యం ఈ రచయితే ప్రస్తావించారు. వైన్ దైవదత్తమని మహమ్మద్ ఒకచోట ఖురాన్ లో ప్రస్తావించాడు. (16.69) మరొకచోట వైన్ నిషిద్ధం, అని కూడా చెప్పాడు (5.92)
ప్రతి మతం ఆహార పానీయాలలో నిషేధాలు పాంటించింది. హిందువులు, క్రైస్తవులు దీనికి మినహాయింపుకాదు. ముస్లింలు పందిని నిషేధించారు. చైనాలో ముస్లింలు పంది మాంసం తింటూనే, దానిని పోర్క్ అనకుండా మటన్ అని సరిపెట్టుకుంటున్నారు. మొరాకోలో రహస్యంగా తింటున్నారు.
లైంగిక ఆచారాలలో పురుషాయితం, స్త్రీల పట్ల స్త్రీలు అనుసరించే రీతుల్ని కూడా రచయిత ప్రస్తావించారు. ముస్లిం కవుల కవితల్ని చూపాడు.
మహమ్మద్ః రచయిత ఒక అధ్యాయంలో మహమ్మద్ వ్యక్తిత్వాన్ని అంచనా వేశారు. చరిత్రలో ఆయన గొప్ప వ్యక్తి అన్నారు. మక్కా కాలమంతటా మహమ్మద్ చిత్తశుద్ధితో ప్రవర్తించాడన్నారు. మదీనా కాలంలో మహమ్మద్ మారిపోయినట్లు చెప్పారు.
ముస్లింలకు తప్ప ఇతరులకు ముక్తి లేదని, మానవాళికి ఈ సందేశం అందించడానికి దైవం నిర్ణయించినట్లు చెప్పారు. ఇది పెద్ద భ్రమ అని రస్పెల్ ను ఉదహరిస్తూ రచయిత పేర్కొన్నారు.
ఖురాన్ దైవదత్తమనీ, అదే అంతిమ సత్యమనీ మహమ్మద్ చెప్పడంతో కొత్త భావాలకు, స్వేచ్ఛకు స్వస్తి పలికినట్లయిందని రచయిత స్పష్టం చేశారు.
పాశ్చాత్య దేశాలలో ముస్లింలపట్ల, ఇస్లాం, ఖురాన్ గురించి రాజీ ధోరణిలో ప్రవర్తించడం వలన, ప్రజాస్వామ్య విలువల పట్ల రాజీపడినట్లయిందని రచయిత హెచ్చరించారు. స్వేచ్ఛకూ, ఇది లేని వారికీ పోరాటం జరుగుతుందనీ, 21వ శతాబ్దంలో ముందుకు పోవాలంటే స్వేచ్ఛతో కూడిన, ప్రజాస్వామిక మానవ హక్కులు పాటించాలని రచయిత అంటున్నారు.
సాల్మన్ రష్డీ కటానిక్ వర్సెస్ వంటిది కాదీ పుస్తకం. ఒక ముస్లిం పండితుడు ప్రజాస్వామిక, స్వేచ్ఛా పిపాసిగా ఆక్రందనతో రాసిన పుస్తకం ఇది. అయితే ముస్లింలలో ఉన్న అసమానం దృష్ట్యా ఈ రచనకు సుప్రసిద్ధ ప్రచురణ సంస్థ అమెరికాలో చేబట్టింది. బహుశ ఇస్లాం గురించి ఇంత వివులంగా, సమగ్రంగా ఇటీవల ఏ రచనా వెలువడలేదేమో.
భారతదేశంలో హమీద్ దల్వాయ్, ఎ.బి.షా వంటి వారు చేసిన రచనలు చాలా మందిని ఆలోచింపజేశాయి. ఈ రచన బహుళ ప్రచారంలోకి వస్తే ఇంకా కళ్ళు తెరుస్తారు. ఖురాన్ గురించి కూలంకషంగా చర్చించిన అనంతరం, సుమారు 6వేల సురా సూత్రాలతో కూడిన ఖురాన్ ను రోజూ ముస్లిం పిల్లలకు నూరిపోసి, కంఠస్తం చేయించడం కూడా రచయిత ప్రస్తావించారు.

1వ అధ్యాయం
1వ అధ్యాయం
సాల్మన్ రష్డి వ్యవహారం
1989 ఫిబ్రవరి 14 ముందు
యూదు తాత్వికుడు, వైద్యుడు అయిన ఇబ్నకమ్మున 1280లో బాగ్దాద్ లో ఒక విశిష్ట గ్రంథాన్ని వెలువరించాడు. మూడు నమ్మకాల పరిశీలన అనేది ఆ గ్రంథ శీర్షిక. యూదు మతం, క్రైస్తవం, ఇస్లాంపై శాస్త్రీయ వాస్తవికత, విమర్శనాత్మక వైఖరులతో వెలువడింది కాన, ఆ పుస్తకం విశిష్టమైనది. అజ్ఞేయ వాదానికి దగ్గరగా ఉన్న దైవ చింతన అందులో ఉంది. (పుట. 8, పరిచయం, ఎగ్జామినేషన్ ఆఫ్ త్రి ఫెయిత్స్, అనువాదం - మోషే పెరల్ మన్, బర్కిలీ, లాస్ఏంజిలస్, 1921).
ప్రవక్త మహమ్మద్ చెప్పింది ఏదీ స్వతసిద్ధం కాదు. దైవాన్ని గురించిన మన జ్ఞానాన్ని గురించి కానీ, దైవానికి మనం విధేయులమై ఉండవలసిన అవసరాన్ని గురించి కానీ అతను కొత్తగా చెప్పిందేమీ లేదు. అంతకు ముందటి మతాలన్నిటిలోనూ అది ఉంది. (పుట 145, పైన పేర్కొన్న గ్రంథం). పోనీ, ప్రవక్త పరిపూర్ణుడనుకుందామా అంటే, కానేకాదు. మహమ్మద్ పరిపూర్ణత సాధించడంలోనూ, ఇతరుల్లో దాన్ని పెంపొందించడంలోనూ సామర్ధ్యం లేనివాడు. భయం వలన, అధికారం కోసం, అధిక పన్నులు తప్పించుకోవడానికి, అవమానపడకుండా ఉండడానికి, ఖైదీగా పట్టుబడినప్పుడు, ముస్లిం స్త్రీతో లైంగిక సంబంధం ఏర్పడినప్పుడు ప్రజలు ఇస్లాంలోకి మారారు. అలాంటి కారణాలవల్ల తప్ప, తన విశ్వాసానికీ, ఇస్లాం విశ్వాసానికీ తేడా తెలిసిన ఏ ముస్లిమేతరుడూ ఇస్లాంలోకి మారడు. మహమ్మద్ ప్రవక్త కావడానికి తగిన వాదనలు, రుజువులు ముస్లింలు చూపలేక పోయారు. సందేహవాదాన్ని ముస్లింలు ఎలా పరిగణించారు? పై పుస్రక ప్రచురణ జరిగిన తరువాత నాలుగేళ్ళకు పువాతి (1244-1323) అనే 13వ శతాబ్ది చరిత్రకారుడు ఇలా వివరించాడు.
1284లో యూదు జాతీయుడైన ఇబ్నకమ్మున ఒక గ్రంథం రాశాడని తెలిసింది. అందులో అతడు ప్రవక్త ప్రవచనాలపట్ల అగౌరవం ప్రదర్శించాడన్నారు. ఆయన రాసిందాన్ని తిరిగి మనం చెప్పుకోవలసిన పని లేదు. కానీ, ఉద్రిక్తులైన జనం ఆయన ఇంటి మీద దాడి చేసి చంపాలనుకున్నారు. అమీర్ తోపాటు కొందరు ఉన్నతాధికారులు ముస్తాన్ సిరియా మదరసాకు వెళ్ళి ఆ విషయాన్ని వివరించడానికి ఉన్నత న్యాయమూర్తిని, న్యాయకోవిదుల్ని కలిశారు. ఇబ్నకమ్మున కోసం వెతికారు. అతను దాక్కున్నాడు. ఆరోజు శుక్రవారం ఉన్నత న్యాయమూర్తి ప్రార్థనకు పోతుండగా జనం అడ్డుపడ్డారు. ఆయన మదరసాకు వచ్చాడు. ప్రజల్ని శాంతపరచడానికి అమీర్ బయటకు వచ్చాడు. కాని, ఇబ్నకమ్మునను వెనకేసుకొస్తున్నాడని జనం అతన్ని తిట్టారు.
మరునాడు ప్రొద్దున్నే నగర ప్రాకారం దగ్గర ఇబ్నకమ్మునను తగులబెట్టాలని అమీర్ ఉత్తర్వులిచ్చాడు. అంతే, జనం వూరడిల్లారు. ఇక, ఇబ్నకమ్మున ఊసే ఎత్తలేదు.
తోలుకప్పిన పెట్టెలో ఇబ్నకమ్మునను దాచిపెట్టారు. కిల్లా అనే చోటకు అ పెట్టెను చేర్చారు. కిల్లాలో ఇబ్నకమ్మున కుమారుడు అధికారిగా ఉన్నాడు. చనిపోయే వరకు ఇబ్నకమ్మున అక్కడే ఉన్నాడు. (పుట. 3, నోట్ 5).
తమ మతాన్ని అవమానిస్తే సనాతన ఛాందసులే కాక, సాధారణ ముస్లింలు కూడా ఎలా స్పందిస్తారో పునాతి పేర్కొన్న సంఘటన చెపుతుంది. ఇస్లాం చరిత్రలో ఇలాంటి సంఘటనలెన్ని జరిగాయో ? జాన్ కెన్నెత్ గాల్ బ్రెత్ అమెరికా రాయబారిగా ఇండియాలో ఉన్నప్పుడు (1961-63) తన పెంపుడు పిల్లికి అహమ్మద్ అని ముద్దుపేరు పెట్టుకున్నాడు. ప్రవక్త మహమ్మద్ ను అహమ్మద్ అని కూడా పిలుస్తారు. అందువల్ల రాయబారి చిక్కుల్లో పడతాడు. బెంగుళూరు దినపత్రిక దక్కన్ హెరాల్డ్ మహమ్మద్ మూర్ఖుడు అనే శీర్షికతో ఒక కథను ప్రచురించింది. ఆ పత్రిక కార్యాలయాన్ని ముస్లింలు తగలబెట్టారు. నిజానికి అది ప్రవక్తకు సంబంధంలేని కథ. మహమ్మద్ అనేది ఒక వికారి పేరు మాత్రమే. ఆ మధ్య ఒక మళయాళ నాటకాన్ని ది యాంట్స్ దట్ ఈట్ కార్ప్స్ (శవాలను తినే చీమలు) ప్రదర్శించినప్పుడు షార్జాలో 10 మంది భారతీయుల్ని జైల్లో పెట్టారు. అందులో మహమ్మద్ కు వ్యతిరేక వ్యాఖ్యలున్నాయని అధికార వర్గాలు తెలిపాయి.
విమర్శించడానికి సాహసించే ముస్లింలని ద్రోహులుగా పేర్కొని తల తీసేయడం, సిలువ కొట్టడం, తగులబెట్టడం జరుగుతుంది. (చూడు. ఈ పుస్తకంలో 10వ అధ్యాయం) ముస్లింలు ఇస్లాంను విమర్శించిన ఇటీవలి ఉదాహరణలు చూద్దాం.
డేనియల్ పైప్స్ వ్రాసిన రష్డీ ఎఫైర్ అనే ఉత్తమ గ్రంథంలో చాలా ఉదంతాలు పేర్కొన్నారు. ఇస్లాంతో విబేధించే రచనలు చేసినందుకు ముస్లిం ఆలోచనాపరులు శిక్షలు పొందారు. కొందరు మాత్రం తప్పించుకోగలిగారు. అలా తప్పించుకున్నవారిలో ఇరాన్ రచయిత అలీ దష్తీ కూడా ఉన్నాడని పైప్స్ పొరపాటుపడి రాశాడు. దష్తీ విషాదగాథను చెప్పుకోబోయే ముందు ముస్లిం నమ్మకాలపై ఇరవై మూడు సంవత్సరాలు అనే గ్రంథంలో రష్డీ చేసిన విమర్శనాత్మక దాడిని చూద్దాం. అతడా పుస్తకాన్ని 1937లో వ్రాసినా, 1974 దాకా అది ప్రచురణకు నోచుకోలేదు. బహుశ అది బీరూట్ లో అచ్చయిందేమో ? ఎందుకంటే, 1971-77 మధ్య ఇరాన్ షా పాలనలో ఉంది. అప్పుడు మత విమర్శ నిషేధానికి గురైంది. 1979 విప్లవానంతరం దాని ప్రచురణకు ప్రభుత్వ వ్యతిరేక రహస్య ముఠాలకు దష్తీ అనుమతిచ్చాడు. మహమ్మద్ ప్రవక్తకు సంబంధించిన ఈ పుస్తకం ప్రతులు 1980-86 మధ్య ఐదు లక్షలు అమ్ముడు పోయాయి.
నమ్మకం మానవుడి వివేకాన్నీ ఇంగిత జ్ఞానాన్నీ బండబారుస్తుందంటూ గుడ్డినమ్మకాన్ని విమర్శించిన దష్తీ వివేచనాత్మకతను సమర్ధించాడు. (పుట. 10) పండితుల్లో సైతం నిష్పాక్షిక, హేతుబద్ధ అధ్యయనం అవసరమని నొక్కి చెప్పాడు. ఖురాన్ దైవదత్తం కాదన్నాడు. మహమ్మద్ లో మహత్యాలేమీ లేవన్నాడు. విషయపరిజ్ఞానానికీ, ధర్మబద్ధతకూ ఖురాన్ నిదర్శనమనడం తప్పన్నాడు. సందేహవాద దృక్పథంతో వాటిని పరిశీలించాడు. వంచన, అతిశయోక్తి చోటు చేసుకొనక ముందు ఖురాన్ వంటి గ్రంథాన్ని ఏ దైవభక్తుడైనా సృష్టించగలిగి ఉండేవాడని ఖురాన్ లోని వాక్యక్రమం రుజువు చేస్తున్నదని పూర్వకాలపు ముస్లిం పండితులే అంగీకరించారని దష్తీ రాశాడు. (పుట. 48).
ఖురాన్ లో కొన్ని వాక్యాలు అసంపూర్తిగా ఉన్నందువల్ల అవి అంత స్పష్టంగాలేవు. వాటికి భాష్యం అవసరమవుతున్నది. విదేశీ మాటలు, అరబ్ భాషలో బహుళ ప్రచారంలో లేని మాటలు, మామూలు అర్థంలో వాడని పదాలు, తర్కబద్ధం కానివి, వ్యాకరణబద్ధం కానివి, ఎవరినీ ఉద్దేశించని పదాలు, విషయానికి చెందని పదాలు ఖురాన్ లో ఉన్నాయి. దాదాపు 100కు పైగా సాధారణ నియమాలు పాటించనివి అందులో కన్పిస్తాయి. (అలీ దష్తీ. పుట. 50)
ఖురాన్ అద్భుతాలతో కూడి ఉంది అనే మాటను గురించి ఇబ్నకమ్మున వలే దష్తీ కుడా ఇలా అన్నాడు.
లోగడ వెల్లడించని కొత్త భావాలేవీ ఖురాన్ లో లేవు. నీతి సూత్రాలు కూడా పాతవే. అంతకు ముందు అందరూ గుర్తించినవే. యూదుల క్రైస్తవుల గాథల నుంచి పుణికి పుచ్చుకున్న కథనాలు చాలా ఉన్నాయి. వారి పీఠాధిపతుల్ని, పురోహితుల్ని మహమ్మద్ కలిశాడు. సిరియా వెడుతూ వారిని సంప్రదించాడు. అద్ తాముద్ సంతతివారి జ్ఞాపకాలతో కథలుగా రూపొందినవే మిగతావి. నైతిక రంగంలో కూడా ఖురాన్ సూక్తులు అద్భుతమైనవేమీ కావు. లోగడ అనేక ప్రదేశాల్లోని ప్రజల్లో అలాంటి భావనలున్నాయి. కన్ ఫ్యూషియస్, బుద్ధుడు, జొరాస్టర్, సోక్రటీస్, మోషే జీసస్ మొదలైనవారు అలాంటి భావనల్ని చెప్పారు. లోగా పామర అరబ్బులు యూదుల నుంచి స్వీకరించిన విధులు, ఆచారాలు ఇస్లాంలో కొనసాగాయి. (అలీ దష్తీ, పుట. 56).
మక్కా యాత్ర చేసేటప్పుడు, ఇతరత్రా పాటించే మూడు నమ్మకాలను దష్తీ అపహాస్యం చేశాడు. వ్యతిరేకుల్ని మహమ్మద్ చంపాడు, హత్య చేశాడు. రాజకీయ హత్యలకు పాల్పడ్డాడు. వీటన్నిటినీ ఇస్లాం సేవలుగా మహమ్మద్ అనుచరులు చిత్రించారు. ఇస్లాంలో స్త్రీల పరిస్థితిని పరిశీలించిన దష్తీ వారి స్థితి హీనమన్నాడు. దైవానికి సంబంధించిన ముస్లిం సిద్ధాంతాన్ని వ్యతిరేకించాడు. ఖురాన్ దైవం క్రూరుడు, కోపిష్టి, గర్వి అనీ, అతనిలో శ్లాఘనీయ గుణాలేమీ లేవనీ అన్నాడు. ఖురాన్ దైవదత్తం కాదన్నాడు. దేవుడే మాట్లాడుతున్నాడో, మహమ్మదే మాట్లాడుతున్నాడో తెలియని గందరగోళ పరిస్థితి ఖురాన్ లో ఉన్నదన్నాడు.
పైప్స్ భావించినట్లుగాకాక, మూడేళ్ళు ఖొమేనీ జైళ్ళలో కుమిలి కుమిలి, ఆ తరవాత తన 83వ యేట మరణించాడు. మరణించబోయే ముందు ఒక స్నేహితుడితో ఇలా చెప్పాడు. ఇలాంటి పుస్తకాలు ప్రచురించడానికి షా అనుమతించి ఉంటే, మనకు ఇస్లామిక్ విప్లవం వచ్చి ఉండేదే కాదు. (అమీర్ తాహరీ, పుట. 290, హోలీ టెర్రర్, 1987, లండన్)
కైరోలోని సుప్రసిద్ధ అల్ అజర్ ఇస్లాం విశ్వవిద్యాలయంలో షేక్ అలీ అబ్ద్ అల్ రజిక్ 1925లో ఇస్లాం అండ్ ది ప్రిన్స్ పుల్స్ ఆఫ్ గవర్నమెంట్ అనే గ్రంథాన్ని ప్రచురించాడు. (పైప్స్, పుట. 74, ది రష్డి ఎఫైర్, న్యూయార్క్, 1990) మతమూ రాజకీయాలూ వేర్వేరుగా ఉండాలని ఈ గ్రంథంలో అయన వాదించాడు. ఇస్లాం బోధించింది కూడా అదేనని ఆయన చిత్త శుద్ధితో నమ్మాడు. ఇతర షేక్ లు అలాంటి అభిప్రాయాన్ని అంగీకరించలేదు. అతడిని విచారించి, అపవిత్రత నేరం మోపి, యూనివర్సిటీ నుంచి తొలగించి, మతపరమైన హోదాలన్నిటికీ అనర్హుడుగా ప్రకటించారు.
అల్ హజర్ లోని మరో ఈజిప్టు రచయిత తాహ హుసాన్. (పైప్స్. పుట. 75) ఫ్రాన్స్ లో చదువుతున్న హుసాన్ సందేహవాద మనస్తత్వం పెంపొందించుకున్నాడు. ఈజిప్టుకు తిరిగి వచ్చాక కాలం చెల్లిన సాంప్రదాయాలను విమర్శించి తీవ్ర విమర్శకు గురయ్యాడు. మత సంస్థలు కూడా హుసాన్ భావాలను ఒప్పుకోలేదు. అతడు తన పదవుల నుంచి తొలగవలసి వచ్చింది. ఇస్లాంకు మొదటి కవిత్వం మీద వ్రాస్తూ అతడు అబ్రహాం, ఇస్మాయిల్ ప్రస్తావన ఖురాన్ లో ఉన్నంత మాత్రాన వారు చరిత్రలో ఉన్నట్లు కాదన్నాడు.
సిరియా సైనిక పత్రిక జయాష్ అష్ సాబ్ 1976 ఏప్రిల్ లో ఆరు రోజుల యుద్ధారంభంలో ఒక వ్యాసాన్ని ప్రచురించింది. అందులో ఇస్లాంనే కాక, దేవుణ్ణి, మతాన్ని కూడా చారిత్రక అవశేషాలుగా పురావస్తు ప్రదర్శనశాలలో ఉంచాలని వ్రాసింది. (పైప్స్, పుట. 75) దానితో ఇబ్నకమ్మున ఉదంతం వలెనే సిరియా నగరాల్లో వీధినపడి హింసకు సమ్మెలకు, అరెస్టులకు పాల్పడ్డారు. అదంతా యూదు అమెరికా కుట్ర అన్నారు. అయినా, హింస ఆగకపోయేసరికి ఆ వ్యాస రచయిత ఇబ్రహీం కలాస్ ను, ఇద్దరు పత్రికా సంపాదకుల్ని పోస్టుమార్టం చేసి నేరస్థులుగా నిర్ణయించి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. ఆ తర్వాత వారిని విడుదల చేయడం ఒక సుఖాంతం. 1967లో అరబ్బులు ఇజ్రాయిల్ చేతిలో దారుణంగా ఓడిపోయారు. అనంతరం 1969లో ఒక సిరియన్ మార్క్సిస్ట్ మేథావి మతం మీద మంచి విమర్శను వెలువరించాడు. బీరూట్ లోని అమెరికన్ యూనివర్సిటీలో చదివిన అల్ అజం సాదిక్ ఏల్ విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ పొంది, బ్రిటిష్ తాత్వికుడైన బిషప్ బర్కిలీపై ఒక అధ్యయనం వెలువరించాడు. (పైప్స్. పుట. 75).
బీరూట్ లోని సున్నీ మతస్థులు అల్ అజం చేసిన తీవ్ర విమర్శను తట్టుకోలేకపోయారు. మత సమస్యల్ని రెచ్చగొడుతున్నందుకు శిక్షించకుండా వదిలివేశారు. సిరియా రాజకుటుంబీకులతో అతనికున్న సంబంధాలే అందుకు కారణం కావచ్చు. అయినా, కొంతకాలం విదేశాల్లో గడపడం శ్రేయస్కరమని అతడు భావించాడు.
ప్రజల్లో విమర్శనాత్మక పరిశీలనను పెంపొందించినందుకు అరబ్ నాయకుల్ని అల్ అజం తప్పుపట్టాడు. ఇస్లాం పట్ల ఏమాత్రం నిశిత పరిశీలన చేయకుండానే కాలదోషం పట్టిన మార్గంలో నాయకులు నడవడాన్ని ఎత్తి చూపాడు. అరబ్ తిరోగమనవాదులు మతాలోచనను సిద్ధాంత ఆయుధంగా వాడుకున్నారన్నాడు.
అరబ్బుల్ని దోచుకోవడంలో ప్రయోగిస్తున్న భావచౌర్యాన్ని శాస్త్రీయ విశ్లేషణ చేయడంలేదనీ, విశుద్ధ పరిశీలన లేదనీ ఆయన అన్నాడు. అరబ్ మేథను విమర్శించడం కాని, సాంఘిక సంప్రదాయాలను పరిశీలించడం కానీ, నాయకులు బొత్తిగా చేయడం లేదన్నాడు. ప్రజల సంప్రదాయాలను, విలువలను, కళలను, మతాన్ని, నీతిని కాపాడుతున్నామనే నెపంతో వెనకబడిన సంస్థల్ని, మధ్యయుగాల సంస్కృతిని, పులుముడు సిద్ధాంతాలను వెనకేసుకొస్తున్నాడని చూపాడు. (డోనోహు, ఎస్ పోసిటో, పుట. 114, ఇస్లాం ఇన్ ట్రాన్సిషన్, 1965, ఆక్స్ ఫర్డ్)
గత 150 సంవత్సరాలుగా శాస్రాభివృద్ధి వల్ల ఉత్పన్నమైన సవాళ్ళను ప్రతి ముస్లిమూ ఎదుర్కోవలసిందే. అనేక విషయాలలో ముస్లిం మత విశ్వాసం శాస్త్రవిజ్ఞానంతో నేరుగా ఘర్షణ పడవవలసి వస్తున్నది. అసలు విధానంలోనే మౌలిక భేదం ఉంది. గుడ్డినమ్మకం మీద ఇస్లాం ఆధారపడుతున్నది. ఇస్లాం పవిత్ర గ్రంథాల్ని పరిశీలించకుండా పాటిస్తున్నది. అవిమర్శనాత్మక యోచన మీద, పరిశీలనమీద, విషయాలను రాబట్టడం మీద, వాస్తవానికి సరిపడుతున్నదా లేదా అనే అంశం మీద ఆధారపడి సైన్స్ పురోగమిస్తుంది. మనం మతాన్ని విమర్శించకుండా ఉండలేము. పవిత్ర గ్రంథాలన్నిటిని శాస్త్రీయ పద్ధతిలో పరిశీలించాలి. అప్పుడే, వెనక్కు చూడడం మానివేస్తాం. అప్పుడే మనం అమల్లో ఉన్న వైజ్ఞానిక రాజకీయ వ్యవస్థను ఉన్నదాన్ని ఉన్నట్లుగా అట్టిపెట్టాలనే మార్మికవాదన సమర్థనకు స్వస్తి పలుకుతాం.
సాదిక్ అల్ అజం వ్రాసిన గ్రంథం చాలా ముఖ్యమైనది. అది బాగా వెలుగులోకి రావాలి. ఇంకా అది అరబిక్ నుండి ఇతర భాషల్లోకి రాలేదు. సాదిక్ అల్ అజం ఇటీవల ఒక సాహసోపేత వ్యాసం వ్రాసి రష్డీని సమర్థించాడు. (ది వెల్డ్ డెన్ ఇస్లామ్స్, 31-1991)
లోపల నుండే ఇస్లాంను మార్చాలనే మరో ప్రయత్నం కూడా విషాదాంతంగా ముగిసింది. సుడాన్ మతవాది మహమ్ముద్ మహమ్మద్ తాహ చట్టం ద్వారా ఖురాన్ ప్రాధాన్యతను తగ్గించే ప్రయత్నం చేశాడు. (పైప్స్. పుట. 75-77) ప్రజావసరాలను తీర్చడానికి 20వ శతాబ్దిలో కొత్త చట్టం అవసరమన్నాడు. తన భావాల ప్రచారానికి రిపబ్లికన్ బ్రదరిక్ అనే సంస్థను స్థాపించాడు. ఖార్టూంలోని మతవాదులు తాహ భావాలపట్ల ఉదారంగా వ్యవహరించలేక పోయారు. 1968లో అతన్ని దోషిగా ప్రకటించారు. ఇస్లాం చట్టంలో దానికి మరణమే శిక్ష. అతని రచనల్ని తగలబెట్టారు. శిక్ష తప్పించుకొని తాహ. 17 సంవత్సరాలపాటు తిరిగాడు. మరల విచారించి 1985 జనవరి ఖార్టూంలో అతని 76వ యేట బహిరంగంగా ఉరితీశారు.
పైప్స్ ఉదహరించిన సమకాలీన ముస్లిం నాయకులలో లిబియా నాయకుడు మహమ్మద్ అల్ గడ్డఫీ సుప్రసిద్ధుడు. మహమ్మదు ప్రవక్తమీదా, ఖురాన్ మీదా, ఇస్లాం మీదా అతడు చాలా విద్రోహకర ప్రకటనలు చేశాడు. (పుట. 79-80) షరియాను వ్యక్తిగతమైనదిగా అట్టిపెట్టాడు. ప్రజాజీవనరంగంలో తన భావాలను ప్రచారం చేశాడు. ఇస్లాం కేలండరును మార్చివేశాడు. మక్కా యాత్రికుల్ని మూర్ఖులుగా చిత్రించాడు. మహమ్మద్ ప్రవక్తను నిరసించాడు. ప్రవక్తకంటే తాను సాధించిందే యెక్కువన్నాడు. ఖురాన్ సత్యాలను గురించి సందేహాలను వెలిబుచ్చాడు. ప్రవక్త జీవిత విశేషాల్ని సందేహించాడు. గడ్డఫీ ఇస్లాంకు విరుద్ధంగా మారుతున్నట్లు మత నాయకులు గమనించారు. కానీ, అతడిని చంపివేయమని పిలుపునివ్వలేదు. అతడు చెప్పేవి అబద్ధాలని ఖండించారు. అతడి రచనల్ని విశ్వసించలేదు. ఈ విషయాలు అమెరికా గూఢచారి సంస్థకు తెలిసి ఉన్నట్లయితే. గడ్డఫీ రచనల్ని పునర్ముద్రించి ఉచితంగా పంచిపెట్టే వాళ్ళే. అనంతర విషయాలు మత ఛాందస పండితులు చూచుకొనేవారే.
ఆధునిక సమస్యలకు పరిష్కారమార్గం ఇస్లాం చూపగలదా అని సందేహించిన మరో ఇరువురున్నారు. (అమీర్ తాహెరీ, పుట. 212). కైరో న్యాయవాది నూర్ ఫర్ వాజ్ 1986లో షరియాను విమర్శిస్తూ, ఆధునిక కాలానికి ఇస్లాంచట్టం పనికిరాదన్నాడు. తిరోగమన ఆదివాసీ నియమాలతో అది కూడి ఉందన్నాడు. మరో ఈజిప్టు న్యాయవాది రచయిత, ఫరజ్ ఫదా 1986లో షరియా వద్దు ( నో టు షరియెట్) అనే శీర్షికతో తీవ్రమైన పత్రం ఒకటి ప్రచురించాడు. ఆధునిక రాజ్యాన్ని నడపడానికి తగిన సెక్యులర్ చట్టాన్ని ఇస్లాం ఇవ్వజాలదన్నాడు. కాబట్టి, మతాన్నీ, రాజ్యాన్నీ వేరుచేయాలన్నాడు. పిడివాది అయిన షేక్ కాషిక్ రచనలకంటే ఇతడి రచనే బహుళ జనాదరణ పొందింది. ఇస్లాం ప్రపంచంలో దీనిని ఉర్దూ, టర్కీ, పర్షియన్, ఇంకా ఇతర భాషల్లోకి అనువదించారు.
1969 ఫిబ్రవరికి ముందు 24 మంది అరబ్బు రచయితలు ద ఇస్లాం ఎన్ క్వొశ్చన్ 5 ప్రశ్నలకు బదులిచ్చారు. (1986 గ్రాసెట్) ప్రశ్నలు
1. ఇస్లాం విశ్వజనీనంగా ఉండగలదా ?
2. ఇస్లాం ఆధునిక రాజ్యానికి ప్రభుత్వ విధానం కాగలదా ?
3. ఇస్లామిక్ అరబిక్ ప్రజల పరిణామానికి ఇస్లాం విధానం తప్పనిసరా ?
4. తిరిగి ఇస్లాం వైపు మళ్ళాలని గత పదేళ్ళుగా సాగుతున్న వాదం సరైనదేనా ?
5. ఈనాడు ఇస్లాంకు బద్ధ విరోధి ఎవరు ?
వీటికి ఇస్లాం పండితులిచ్చిన సమాధానాలనుబట్టి, ఇస్లాం ప్రపంచంలోని సాంఘిక రాజకీయ, ఆర్ధిక సమస్యలకు ఇస్లాం సమాధానం కాదు. సెక్యులర్ విధానం కావాలని అధికసంఖ్యాకులన్నారు. రెండవ ప్రశ్నకు కాదని జవాబిచ్చినవారు 9 మంది. సెక్యులర్ రాజ్యం కావాలన్నవారు ఆరుగురు మాత్రమే ఉన్నారు. ఔనని చెప్పినవారు కూడా, అది కొన్ని పరిమితులకు లోబడి ఉండాలన్నారు. ఇస్లాంని ఆధునికంగా వ్యాఖ్యానించగలిగేటంతవరకు హక్కులను కాపాడాలన్నారు. తిరిగి ఇస్లాంలోకి పోవడాన్ని మత మౌఢ్యమనీ, ముస్లింలందరికీ అది అత్యంత ప్రమాదకరమైనదనీ భావించారు. అందులో రబిడ్ బోజెడ్రా అనే నవలాకారుడు, రచయిత, కమ్యూనిస్ట్ నాస్తికుడు కూడా ఉన్నాడు. ఆయన అల్జీరీయాలో మతాన్ని గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. (పుట. 203-14 Barbulolsco and Carinal Philippe L’ Islam en Question, Paris, 1986) రంజాన్ మాసంలో కొద్దిమంది మాత్రమే నమ్మకంతో ప్రార్ధిస్తారనీ, 80 శాతం మంది ప్రార్ధనలు చేస్తున్నట్లు నటిస్తారనీ అన్నాడు. సామాజిక ప్రతిష్టకోసం మక్కాయాత్ర చేస్తారనీ, త్రాగుతారనీ, వ్యభిచరిస్తారనీ అయినా వారిని మంచి ముస్లింలుగా చిత్రిస్తారనీ రాశాడు. ఆధునిక రాజ్యానికి ఇస్లాం తగిందేనా....అనే ప్రశ్నకు బోజెడ్రా నిర్ద్వంద్వంగా ఇలా వ్రాశాడు.
కాదు, ఎంతమాత్రమూ కాదు. అసంభవం. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం కాదు. సుడాన్ అధిపతి నెమెరూ షరియాను అమలుపరచ దలచినప్పుడు, అది పనిచేయలేదు. కొందరి చేతులు, కాళ్ళు నరికిన తర్వాత ఆ విధానానికి స్వస్తి పలికారు. రాళ్ళతో కొట్టి చంపడం వంటి పద్ధతులపట్ల ముస్లిముల్లో వ్యతిరేకత ఉంది. సౌదీ అరేబియా వంటి చోట్ల అది అమలు జరుగుతూ ఉంది. ఆధునిక రాజ్యానికి ఇస్లాం ఏమాత్రం పొసగదు. ఇస్లాం ప్రభుత్వవిధానం కానేకాదు.
1983 నుండి బోజెడ్రాపై ఫత్వా అమలులో ఉందేమో తెలియదు. అల్జీరియాలో అతడిని చంపేస్తామంటున్నా, రహస్య వేషాలలో అక్కడే చోటు మారుస్తూ ఉన్నాడు. 1992లో అతడు ఇస్లాం పార్టీపై తీవ్ర విమర్శ ప్రచురించాడు. ఆ యేడే ఎన్నికల్లో గెలవడానికి ఉపక్రమించిన ఆ పార్టీకి ఆది గోరుచుట్టుపై రోకటిపోటయింది. అతడు దానిని ప్రజాస్వామ్య వ్యతిరేక తీవ్రవాదపార్టీగా విమర్శించాడు. దానిని నాజీ పార్టీతో పోల్చాడు. మౌనంగా ఉండేవారిపట్ల బోజెడ్రాకు అసహ్యంతప్ప వేరేమీ లేదు. ఇస్లామిస్టుల్ని నిశిత పరిశీలన చేయని వారిపట్ల అతడికి గౌరవం లేదు. మధ్యయుగాల్లోకి పోవడం మంచిదని నటించేవారిని అతడు అసహ్యించుకున్నాడు. 1983లో విధించిన ఫత్వా మరల 1989లో ఫత్వాకు దారితీసింది.
1989 ఫిబ్రవరి 14 అనంతరం
ప్రపంచ చరిత్రలో, మేథారంగంలో 1989 ఒక గిరిగీసిన అంశంగా నిలబడుతుంది. అయొతుల్లా ఖొమిని 1989 ఫిబ్రవరిలో సాల్మన్ రష్డీని చంపేయమని (ఫత్వా) ఆజ్ఞ ఇచ్చాడు. వెంటనే పాశ్చాత్య ప్రపంచంలో మేథావులు, అరబ్బు వాదులు, ఇస్లాం నిపుణులు రష్డీని ఆక్షేపిస్తూ శటానిక్ వర్సెస్ రాసి, నెత్తిమీదకు తెచ్చుకున్నందుకు ఆయన్నే తప్పుపడుతూ రాశారు. అమెరికాలో ఇస్లాం నిపుణుడు జాన్ ఎస్పోసిటో రాస్తూ రష్డీ రాసిన తీరులో పరిస్థితి విషమిస్తుందని పాశ్చాత్యపండితుడెవరైనా చెప్పగలరన్నాడు. (పైప్స్. పుట. 71) అంతకు ముందు ఉదహరించిన సాదిక్ అల్ అజాం పుస్తకం నుండి కొన్ని భాగాలు ప్రచురించిన వ్యక్తి ఇలా అనడం ద్వంద్వ వైఖరిని సూచిస్తుంది. ఆ పుస్తకంలోనూ ఇస్లాంను విమర్శించారుగా. ముస్లింలు నొచ్చుకున్నందుకు మరికొందరు రచయితలు రష్డీని చంపమని అమానుష పిలుపు ఇస్తే, చరిత్రకారుడు ప్రొఫెసర్ ట్రెవర్ రోపర్ ఉదాసీనంగా ఆమోదం చూపాడు.
బ్రిటిష్ చట్టవు ఉదారత్వంలో సాల్మన్ రష్డీ ఎలా ఉంటున్నాడో తెలియదు. బ్రిటిష్ పోలీసు చట్టం గురించి అతడు మూర్ఖంగా ప్రవర్తించాడు. బ్రటిష్ ముస్లింలు అతడిని చీకటిలో పడేసి బాదితే నేను నొచ్చుకోను. కనీసం అదేనా అతని కలాన్ని అదుపులో పెట్టగలిగితే, సాహిత్యరంగం బాగుపడుతుంది. (హాలిడే పుట 17 ది ఫండమెంటల్ లెసన్ ఆఫ్ ది ఫత్వా న్యూ స్టేట్స్ మన్ అండ్ సొసైటీ 1993 ఫిబ్రవరి 12)
చంపమనడాన్ని ఎవరూ ఈ వ్యాసాల్లో ఖండించలేదు. పైగా రష్డీ పుస్తకాన్నినిషేధించమని, పంపిణీ నుండి తొలగించమని సిఫారసు చేశారు. ప్రజాస్వామిక మౌలిక సూత్రమైన భావ స్వేచ్ఛను సమర్థించలేదు. అది లేకుండా మానవ ప్రగతే లేదు. దీనికోసమే రచయితలు మేథావులు చావడానికైనా సిద్ధమే.
పాశ్చాత్య సాహిత్యం మేథారంగంలో చరిత్రలు కొన్ని ఇస్లాం సున్నితత్వాన్ని కించపరుస్తాయి. గనుక వాటిని ఉపసంహరించాలని ముస్లింలు కోరితే ప్రొఫెసర్ రోవర్ ఏం చేస్తారు ? తనకు ప్రీతిపాత్రమైన గ్రంథాలను ఉపసంహరించక ముందే ట్రెవర్-రోవర్ గాఢనిద్ర నుండి మేల్కొంటారా ?
ఖురాన్ గురించి గిబ్బన్ రాసినదానికి ఆయన పుస్తకాలను ముస్లింలు తగలబెడతారా ? ఖురాన్ లో భావ ప్రేరణ కలిగించేవి చాలా అరుదు. కట్టుకథలు, వ్యర్థమాటలు, ఉదాహరణలో ఉన్న ఖురాన్ కొన్నిసార్లు ఆకాశంలో తేలిపోతూ, మరికొన్నిసార్లు మట్టిగరుస్తూ ఉంటుంది. మహమ్మద్ ప్రవక్త తనకు దైవదత్తమని చెప్చే ధోరణి చూస్తే అంతకు ముందు బలహీనతలు బయటపడతాయి. తాను దైవ దూతనని చెప్పుకోవడం కట్టుకథే.
తప్పుడు విధానాలు, క్రూరత్వం, అన్యాయం అన్నీ తమ విశ్వాస ప్రకటనలకు వినియోగించారు. యుద్ధరంగం నుండి తప్పించుకున్న యూదుల్ని, ఇతరుల్ని చంపేయడాన్ని మహమ్మద్ అనుమతించాడు. అలాంటి చర్యలవలన మహమ్మద్ శీలం కళంకమైంది. తృష్ణ అతడిని చివరి రోజుల్లో ఆవరించింది. తన యవ్వనదశ పట్ల అతడు లోలోన నవ్వుకొని ఉండవచ్చునని రాజకీయవాదులు గ్రహిస్తారు. వ్యక్తిగత జీవితంలో మనిషి బలహీనతల్ని ప్రవక్త కనబరిచాడు. ప్రవక్త అని ఆపాదించేవన్నీ దుర్వినియోగపరిచాడు. తన జాతి పై విధించిన చట్టాలకు, తాను మాత్రం ప్రవక్తగా దైవం ఇచ్చిన అంశాల నెపంతో ప్రక్కన బెట్టాడు. అరమరికలు లేకుండా తన కోర్కెల్ని స్త్రీలతో తీర్చుకున్నాడు. (గిబ్బన్ 5, సంపుటి పుట 240, డిక్లైన్ అండ్ ఫాల్ ఆఫ్ ది రోమన్ ఎంపైర్ 6 సంపుటాలు, లండన్ 1941).
రోవర్ కు ప్రీతిపాత్రుడైన హ్యూం ఇలా రాశాడు. ఖురాన్ ఒక అడ్డగోలు అసంబద్ధ విధానం. మహమ్మద్ చెప్పింది వింటే విద్రోహుల్ని, అమానుషత్వాన్ని, పగను వెనకేసుకు రావడం చూడొచ్చు. నాగరిక సమాజానికి పొసగని విషయాలవి. స్థిరమైన విషయం ఏదీ లేదు. నమ్మకస్తుల్ని బాధపెట్టిందా, ఉపయోగపడిందా అనే దానిపైనే నియమాల్ని పొగడడం, తెగడడం గమనిస్తాం. మహమ్మద్ నటించిన ప్రవక్త అని హ్యూం అన్నాడు. ఖురాన్ అంతా మహమ్మద్ నాటకం అనీ, అతడు చెప్పిందంతా ఘోరమైనదనీ అందరికీ ఈసరికి అర్థమై ఉండాలి. (హ్యూం 3 పుట 450 ఎన్ క్వైరీస్ కన్ సర్నింగ్ ది హ్యూమన్ అండర్ స్టాండింగ్ అండ్ కన్ సర్నింగ్ ఆఫ్ ప్రిన్సిపుల్ ఆఫ్ మోరల్స్, ఆక్స్ ఫర్డ్ 1966)
తన కొత్త మతం కోసం గద్ద ఆకృతిలో పవిత్ర దైవంతో సంభాషించినట్లు మహమ్మద్ నటించాడని హాబ్స్ రాస్తే ఏమంటారు ? (హాబ్స్ పుట 136).
పాశ్చాత్య సాహిత్యంలో గొప్ప కవితగా నిలచిన డివైన్ కామెడీలో మహమ్మద్ గురించి రాసిందానికి ఏమంటారు (డాంటే ఇన్ ఫెర్నో కాంటో 28 లైన్ 31).
మహమ్మద్ ను నరకంలో పడేయడం గురించి డాంటే కారణాలను డివైన్ కామెడీ అనువాదకుడు మార్క్ మూసా ఇలా అంటాడు. మహమ్మద్ కు, అతనితోపాటు అలీకి ఇచ్చిన శిక్షవలన, క్రైస్తవ, మహమ్మదీయ మతాలపట్ల డాంటే నమ్మకాలు వెల్లడవుతాయి. డాంటే సమకాలీనులు మహమ్మద్ తొలుత క్రైస్తవుడనీ, పోప్ కావాలనుకున్న కార్డినల్ అనే అనుకునేవారు. (డాంటే పుట 331 నోట్ 31, ది డివైన్ కామెడీ అనువాదం ఎం. మూసా లండన్ 1988)
మహమ్మద్, ఖురాన్ గురించి కార్లైల్, వోల్టేర్ కూడా చాలా కర్కశ విషయాలు చెప్పారు. కాని 1989లో పాశ్చాత్య ఇస్లాం పండితులు రష్డీని విమర్శించడంలోను, ఇస్లాం ప్రచార సాహిత్యాన్ని తవ్వి తీయడంలోనూ నిమగ్నులై మత విశ్వాసం పట్ల విమర్శ విస్మరించారు. ఇస్లాం మత మూర్ఖత్వాన్ని వివరించడంలో ఆర్థిక బాధలు, తాదాత్మ్యత కోల్పోవడం, పాశ్చాత్యలోకం నుండి భయం, తెల్ల జాతీయ వాదం వంటివి అడ్డం పెట్టుకొని, ఆటవిక ప్రవర్తనల్ని వెనకేసుకొచ్చారు. నైతిక బాధ్యతను ముస్లింల నుండి పాశ్చాత్యలోకానికి అప్పగించారు. నమస్య ఇస్లాం కాదు. ఖురాన్ పేరిట అతివాదుల ప్రవర్తనే ప్రధానం. ఇస్లాం ఓర్పుగల సహనమతం. అయొతుల్లా ఖొమిని నిజమైన ఇస్లాంను అనుసరించడంలేదు. అతడు అసహ్యంగా ఇరాన్ లో అమలు పరిచేదంతా ఇస్లాం కాదు. ఇస్లాం అన్ని వేళలా అభిప్రాయభేదాల్ని సహిస్తుంది ఇలా నడిచింది వాదన.
ఇస్లాం మూలవాదం, ముస్లిం ఛాందసం వంటి పదజాలాన్ని వాడి ఇస్లాంను క్షమించే ప్రయత్నం చేస్తున్నారు. ఇస్లాం మౌలిక వాదం అనటమే అనౌచిత్యం. క్రైస్తవం ఇస్లాంల మధ్య చాలా తేడా ఉన్నది. క్రైస్తవులు బైబుల్ ను తు.చ. తప్పకుండా భాష్యం చెప్పడం మానేశారు. అవి అత్యవసరమైనవి కావు అంటూ బైబుల్లో మినహాయింపులు చేసుకుంటున్నారు. గెర్షివిన్. ఇరా. లిరిక్స్, లండన్, 1977, పుట. 149) క్రైస్తవులలో మౌలిక వాదులు అలా కానివారు ఉన్నారు. ముస్లింలు ఖురాన్ ను వ్యాఖ్యానించడంలో అది దైవవాక్యమని భావిస్తున్నారు.
సాధారణ ముస్లింలు తమ పవిత్ర గ్రంథానికి, ప్రవక్తకూ, మతానికీ అవమానాలు జరిగాయంటూ ఊరికేనే రెచ్చిపోతున్నారు. రష్డీని చంపమని ఖొమేనీ ఇచ్చిన ఉత్తరువును సాధారణ ముస్లింలందరూ సమర్థించారు.
ఇస్లాం పేర ఖొమేని ఇరాన్ లో పాటించేదంతా అసలైన ఇస్లాం కాదని ముస్లిం మితవాదులూ, పాశ్చాత్య ఉదారవాదులూ, క్రైస్తవ పురోహిత వర్గం వాదిస్తున్నారు. ముస్లిం మితవాదులు, ఇతరులు తాము చెప్పేదంతా సరైనదనీ అనుకోరాదు. ఇస్లాంలో క్రూరంగా, ఆమోదయోగ్యం కానివన్నీ ఇలాంటివారు చెప్పే మాటలవలన, చిత్తశుద్ధి లేని ధోరణి వలన ఏమాత్రం తొలగి పోదు. ఇస్లాం మౌలిక వాదులు తార్కికంగానూ, చిత్తశుద్ధితోనూ ఉన్నారు. ఖురాన్ దైవదత్తమా, కాదా అనే ప్రాతిపదిక గురించి వారికి స్పష్టత ఉన్నది. ఖొమేనీ చర్యలు ఇస్లాం బోధకులను సూటిగా ప్రతిబింబిస్తున్నది. అవి ఖురాన్ లో ఉండొచ్చు. ప్రవక్త మాటలలో, చేతలలో ఉండొచ్చు. వీటిపై ఆధారపడిన ఇస్లాం చట్టంలోనూ ఉండవచ్చు. రష్డీని చంపమని ఇచ్చిన ఉత్తరువును సమర్థించడానికి మహమ్మద్ జీవితంలో చాలా వివరాలున్నాయి. ప్రవక్తకు వ్యతిరేకంగా వ్యంగ్య రచనలు చేసిన రచయితల్ని చంపేశారు. రాజకీయ హత్యలు కోకొల్లలుగా ఉన్నాయి. ఖొమేనీ పాశ్చాత్య వాదులకు, ముస్లిం మితవాదులకు సమాధానం ఇస్తూ అలా అంటాడు.
వికలాంగులు, చేతగానివారూ తప్ప మిగిలిస యుక్తవయస్కులైన పురుషులంతా ప్రపంచంలోని అన్ని దేశాలను జయించి ఇస్లాంను ఆమోదించేటట్లు చేయాలి.
ఇస్లాం పవిత్ర యుద్ధంలో ప్రపంచాన్ని ఇస్లాం ఎందుకు జయించమంటుందో గ్రహించాలి. ఇస్లాం అంటే తెలియనివారు ఇస్లాం యుద్ధ వ్యతిరేకి అని అనుకుంటారు. వారికి తెలివిలేదు. ఇస్లాం ప్రకారం నమ్మకం లేనివారిని వారెట్లా చంపుతారో అలాగే చంపు అంటుంది. నమ్మకం లేనివారు మనల్ని చంపేవరకూ ముస్లింలు చూస్తూ ఉండాలా...ఇస్లాం ప్రకారం ముస్లిమేతరులను చంపాలి. కత్తికి గురి చెయ్యాలి. వారి సైన్యాన్ని చిందరవందర చేయాలి. అంటే అర్థం ఏమిటి... ముస్లిమేతరులు మనల్ని అధిగమించేవరకూ ఊరికే కూర్చోవాలా ? నిన్ను చంపాలనుకునే వారిని అల్లా పేరిట చంపేయి అని ముస్లిం అంటున్నది. అంటే ఏమిటి ? శతృవుకి లొంగిపోవాలని అర్థం కాదు. ఇస్లాం ప్రకారం కత్తివల్లనే మంచి అంటూ ఏదైనా జరిగితే ఇంతవరకూ జరిగింది. కనుక కత్తితోనే జనాన్ని విధేయులను చేయగలం. కత్తే స్వర్గానికి దారి. పవిత్ర సైనికులు స్వర్గ ద్వారం తెరవాలి. ఖురాన్ సూత్రాలూ, ప్రవక్త ప్రవచనాలూ ముస్లింలను పోరాటానికి పురికొల్పుతున్నాయి. యుద్ధం లేకుండా ఆపాలని ఇస్లాం ఎక్కడా చెప్పడం లేదు. అలా అనే వారిని నేను ఛీత్కరిస్తున్నాను. (అమీర్ తాహెరీ, పుట 226-27, హోలీ టెరర్ లండన్, 1987).
ఖురాన్ నుండి సూటిగా ఉదహరిస్తున్న ఖొమిని జిహాద్ పవిత్ర యుద్ధం అంటే నిఘంటు అర్థం ఇస్తూ ఇస్లాం సిద్ధాంతాన్ని వివరిస్తున్నాడు. ఇస్లాం నిఘంటువు జిహాద్ అంటే ఇలా చెబుతున్నది. మహమ్మద్ ప్రయత్నంలో నమ్మకం లేనివారిపై మత యుద్ధం చేయడమే జిహాద్. అదొక తప్పనిసరైన మత విధి. ఖురాన్ నిర్ధారించిన ఈ విధిని దైవ సంస్థగా సంప్రదాయాలు ధృఢపరుస్తూ, ముస్లింల నుండి ద్వేషాన్ని పారద్రోలడానికి ఇది తోడ్పడుతుంది. (ఇస్లాం నిఘంటువులో జిహాద్ వ్యాసం పుట 243)
ఖొమిని ముస్లింలు నమ్ముతున్నట్లుగా కొరాన్ దైవ వాక్యమైతే అందలి మాటలు విధిగా పాటించాల్సి ఉంటే, పాశ్చాత్యవాదులు ముస్లిం మితవాదులు చెప్పేది సరైనదా ? ఖొమిని చెప్పేది తర్కబద్ధం కాదా ?
నిజమైన ఇస్లాం స్త్రీలను బాగా చూస్తుంది అని కొందరు ఆధునిక మేథావి ముస్లిం పురుషులు - స్త్రీలు నటించడం గమనించవచ్చు. ఇస్లాంకు ప్రజాస్వామ్యానికి మానవ హక్కులకూ విరుద్ధం ఏదీలేదని కూడా అంటూ ఉంటారు. (విపుల చర్చ 7వ అధ్యాయంలో)
ఇస్లాం బెదిరింపు మిథ్యా ?, వాస్తవమా ? అమెరికాలో ఇస్లాం పండితుడు జాన్ ఎస్పోజిటో ఈ విషయాన్ని హోలీక్రాస్ యూనివర్సిటీ నుండి పరిశీలిస్తూ 1991లో ప్రచురించాడు. అశ్లీల శృంగారంపట్ల చిత్తశుద్ధి లేనట్లే ఈ విషయంలోనూ ఈ పుస్తకం చిత్తశుద్ధి కనబరచడంలేదు. శీర్షిక చూస్తే సాహసోపేతం అనిపిస్తుంది. పుస్తకం తెరవకుండానే ఏముందో చెప్పవచ్చు. రష్డీ వ్యవహారానంతరం, ఆక్స్ ఫర్డ్ ప్రచురణకర్తలు ఇస్లాం విమర్శ ప్రచురించే సాహసం చేయబోవడం లేదు. ముస్లిం ప్రపంచ ఆగ్రహానికి ఎస్పోజిటో గురికాదలచనూ లేదు. ఇస్లాం బెదిరింపే గాక, ముస్లింలలో వేలాదిమందికి సైతం బెదిరింపు అని ఇస్లాం పట్ల ఉదారవాదులు గ్రహించడం లేదు. పవిత్ర భయానక విషయంలో చాలామంది ముస్లింలు కొరముట్లు అవుతున్నారని అమీర్ తాహెరీ రాశాడు. ఇస్లాం పాలనలో ఉన్న దేశం నుండి ఒక రచయిత ఇటీవల రాస్తూ రష్డీని సమర్ధించాలి, అలా చేయడంలో మనల్ని మనం సమర్ధించుకున్నట్లే అన్నాడు. (హాలిడే పుట 19 ది ఫండమెంటల్ లెసన్ ఆఫ్ ది ఫత్వా - న్యూ స్టేట్స్ మన్ అండ్ సొసైటీ - 1993 ఫిబ్రవరి 12).
రష్డీకి బహిరంగ లేఖ రాసిన ఒక ఇరానియన్ రచయిత. రష్డీపై దృష్టి సారించడంలో, ప్రపంచ వ్యాప్తంగా వందలాది రచయితల దురదృష్టకర స్థితిని విస్మరిస్తున్నాం. 1989 ఫిబ్రవరి 14 అనంతరం ఇరాన్ లో చాలామంది పత్రికా రచయితలు, కవులు బలి చేయబడి, మూకుమ్మడిగా రాజకీయ ఖైదీలతోబాటు పూడ్చి పెట్టబడ్డారు. వారి ఖాతాలను వెల్లడిస్తూ వ్యాసం రాయడమే వారి దోషం. (మగ్డొనాఫ్ సంపాదకత్వంలో పుట 55-66, ది రష్డీ లెటర్స్, లింకన్ 1993)
అలాంటి వారి పేర్లు కొన్ని - అమీర్ నికైన్, మోనోకర్ బెజది, జావీద్ మిసాని, అబుతొరబ్ బగార్జదా. కొందర్ని అపహరించి, చిత్రహింసలు పెట్టి, చీకట్లో కాల్చి చంపారు. ఇద్దరు కవులు సయ్యద్ సుల్తాన్ పూర్, రహమాన్ హతేఫీ అలా అంతమయ్యారు.
ఎడ్వర్డ్ మోర్టిమన్, ఎస్పోజటో వంటి పాశ్చాత్య భట్రాజీయులు అంటీ అంటనట్లుగా ఉంటూ, అన్నింటికి రష్డీని నిందించడం బట్టి, ఇరానియన్లు కొందరు ధైర్యసాహసంతో ముందుకు వచ్చి చేసిన ప్రకటన గమనార్హం.
ఖొమిని ఇచ్చిన మరణ శాసనం వలన సాల్మన్ రష్డీ భయంతో మూడేళ్ళుగా జీవిస్తున్నాడు. ఈ పాశవిక ఉత్తరువు పట్ల ఎలాంటి సమష్టి చర్య ఇరాన్ వాసులు తీసుకోలేదు. స్వేచ్ఛా ప్రకటనలకు విరుద్ధంగా ఇరాన్ లో ఇచ్చిన ఉత్తరువును ఇరాన్ మేథావులు ఖండించాలి. ఇతరుల కంటే వీరే రష్డీని సమర్థించాలి.
భావ స్వేచ్ఛ మానవాళి సాధించిన గొప్ప విజయం. వోల్టేర్ అన్నట్లు ఈ భావ స్వేచ్ఛను నిర్భయంగా వెల్లడించకపోతే అర్ధం లేదు. సాల్మన్ రష్డీని సమర్థిస్తున్న మేథావులుగా ఈ ప్రకటనపై సంతకాలు చేస్తున్నాం. ఏదో ఒక పవిత్ర నిబంధన అడ్డం పెట్టుకొని, భావ స్వేచ్ఛను వ్యక్తిగాని ముఠాగాని అడ్డు పెట్టరాదు.
ఖొమిని ఇచ్చిన మరణ ఉత్తరువు సహించరానిది. సృజనాత్మక రచనను రామణీయకత దృష్టితో తప్ప, అన్యథా కొలవరాదు. సాల్మన్ రష్డీని ఏకగ్రీవంగా సమర్థిస్తున్నాం. ఇరాన్ రచయితలు కళాకారులు, పత్రికా రచయితలు, భావుకులు ఇరాన్ లో మత కబంధ నిబంధనల వత్తిడిలో కుమిలిపోతున్నారని బయటి ప్రపంచం తెలుసుకోవాలి. ఇరాన్ లో విరుద్ధ భావ ప్రకటనలు వ్యక్తం చేసినందుకు బలి అయిన వారి సంఖ్యను ఉదాశీనంగా చూడ వీల్లేదు.
క్రమ బద్ధంగా ఇరాన్ లో జరుగుతున్న మానవ హక్కుల వ్యతిరేకతను సహిస్తే ఇస్లాం రాజ్యం విజృంభించి భయానక చర్యల్ని బయటి ప్రపంచానికి ఎగుమతి చేస్తుంది కూడా. (ఎస్.వై.ఆర్.బి. పుట. 31 సం.39, 1992 మే 14 నం. 9)
ప్రవాసంలో ఉన్న 50 మంది ఇరానియన్లు
రష్డీ వ్యవహారం కేవలం విదేశీ జోక్యం మాత్రమే కాదని వీరు అర్థం చేసుకున్నారు. ఇది ఇస్లాం టెర్రరిజం. బ్రిటిషు చట్టం ప్రకారం బ్రిటిష్ పౌరుడిగా రష్డి ఏ నేరం చేయలేదు. రష్డి వ్యవహారంలో భావ స్వేచ్ఛ అనే సూత్రం ఇమిడి ఉన్నది. పాశ్చాత్య నాగరికతలోనూ ఆ మాటకొస్తే నాగరిక సమాజంలోనూ ఈ భావ స్వేచ్ఛ అనే సూత్రం ఇమిడి ఉన్నది. పాశ్చాత్య నాగరికతలోనూ ఆ మాటకొస్తే నాగరిక సమాజంలోనూ ఈ భావ స్వచ్ఛా సూత్రాలు ఇమిడి ఉన్నాయి.
ఇస్లాం లోకంలో రచయితలూ, మేథావులూ కొందరు ధైర్యంగా రష్డీని సమర్థించారు. డేనియల్ పైప్స్ తన పుస్తకంలో అలాంటి వారి భావాలూ, ప్రకటనలూ పేర్కొన్నాడు. 1993 నవంబరులో పూర్ రష్డీ అనే పేరిట ఫ్రాన్స్ లో వెలువడిన గ్రంథంలో రష్డీ భావ స్వేచ్ఛను సమర్థిస్తూ అరబ్ ముస్లిం మేథావులు 100 మంది తమ మద్దతు తెలిపారు.
ఫత్వా ఫలితంగా చాలామంది భయపడినట్లు కాక, ఇస్లాం ప్రవక్తను, ఖురాన్ ను విమర్శస్తూ పుస్తకాలూ వ్యాసాలు వెలువడుతున్నాయి. ప్రవక్తను వెక్కిరిస్తూ బరాల్డ్ ఒక గ్రంథం రాశారు. పసిపిల్లలను చిత్రహింసలు పెట్టిన ప్రవక్తను గురించి మోరే రాశాడు. (మహమ్మద్ చేసుకున్న 9యేళ్ళ ఆయేషానుద్దేశించి ఈ రచన జరిగింది) అల్లాను సద్దాం హుస్సేన్ గా ఖురాన్ దృష్ట్యా ఫ్లూ ఆంథోనీ చిత్రించాడు. (జులై 1993, సంపుటి 2, సంచిక, 109 న్యూ హ్యూమనిస్ట్) నిశిత పరిశీలన నోరు నొక్కటం జరిగే పని కాదు.
ఇస్లాం అధ్యయనం చేసేవారిలో చాలామంది భావస్వేచ్ఛను సమర్థించకపోవడం నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. ఇందుకు కారణం లేకపోలేదు. ఇస్లాం గురించి ప్రస్తావించే గ్రంథాల పట్టికలో కొన్ని నమ్మకాలకు విరుద్ధమైనవి ఉన్నాయి. వాటికి దూరంగా ఉండటం కష్టం. గిబ్స్ రాసిన ఇస్లాంలో తటస్థవైఖరి గమనించవచ్చు. దీన్ని ఆక్సఫర్డ్ ప్రెస్ వాళ్ళు ముద్రించారు. ఆర్ ఎ. నికల్ సన్ ఎ లిటరరీ హిస్టరీ ఆఫ్ ది అరబ్స్ లో ఖురాన్ మానవ సృష్టి అన్నాడు. అదే చాలా నమ్మకద్రోహ వాక్యంగా భావించాలి. గిబ్స్ ఉదహరించిన పుస్తకంలో కనీసం మరొక 7 గ్రంథాలనైనా ముస్లింలు నిరాకరిస్తారు. ఇటీవల రిపిన్ తన పుస్తకంలో సూచించిన 15 గ్రంథాలు ముస్లింలు అభ్యంతర పెట్టేవిగా ఉన్నాయి. (ముస్లిమ్స్, దైర్ రెలిజియస్ బిలీఫ్స్ అండ్ ప్రాక్టీసెస్) నోల్డెక్, హర్ గ్రోంజె, గోల్డ్ జిహార్, కటానీ, లామెన్స్, షా చెక్ వ్యక్తం చేసిన భావాలు ముస్లింలకు ఆమోదయోగ్యం కాదు. ఇస్లాంను అధ్యయనం చేయాలంటే అలాంటి పండితుల రచనలు పరిశీలించక తప్పదు. అవి ఇంకా లభించటం కొన్నిటిని మళ్ళీ ముద్రించటం శుభసూచకం. లండన్ లో ఇస్లామిక్ బుక్ షాపులో బురఖాలో ఉన్న ముస్లిం ఈ పుస్తకాలను అమ్మటం విశేషం. భావస్వేచ్ఛను, విద్యారంగం స్యేచ్ఛను కాపాడుకుంటేనే అధ్యయనం కొనసాగుతుంది. నమ్మక విరుద్ధమైన విషయాలు రాసేవారే రష్డీని విమర్శించడం రెండు నాలుకల ధోరణి. రష్డీ పోరాటం వారి పోరాటం కూడా.
మేథావుల ద్రోహం
ఇస్లాంలో ఉన్న ప్రతిదాన్నీ విమర్శించే హక్కును ఈ పుస్తకం ద్వారా నేను ప్రదర్శిస్తున్నాను. అది నమ్మకాలకు వ్యతిరేకం కావచ్చు, దోషాలుండవచ్చు, వ్యంగ్యం కావచ్చు, అపహాస్యం కావచ్చు. ఇస్లాం పిడివాదాన్నీ, చరిత్రనూ, ఆధారాలనూ నిశితంగా పరిశీలించే హక్కు ముస్లింలకూ ముస్లిమేతరులకూ ఉన్నది. ముస్లింలు తరచు పాశ్చాత్య సంస్కతిని ఖండిస్తుంటారు. జాతి వాదం, కొత్త వలస వాదం, సామ్రాజ్యవాదం ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్నాయని అంటుంటారు. ఇలా విమర్శించే హక్కును వారు వినియోగించుకుంటున్నారు. విమర్శ లేకపోతే ఇస్లాం మధ్యకాలపు మూర్ఖత్వ పిడివాదాల మధ్య, నియంతృత్వ అసహనాల మధ్య గతం నుండి బయటపడలేక జడంగా నిలిచిపోతుంది. దీనివలన ఆలోచన స్తంభించి మానవ హక్కులూ, వ్యక్తిత్వం, సొంత ఆలోచన, సత్యాన్వేషణ పోతాయి.
మేథావుల పట్ల తమ విధులను పాశ్చాత్య పండితులు, ఇస్లాం వాదులు విస్మరించారు. ఇస్లాం పేరెత్తేసరికి నిశిత పరిశీలనంతా వదిలేసి ద్రోహం చేసుకుంటున్నారు. మరికొందరు నిష్పాక్షికంగా సత్యాన్వేషణ చేసే ప్రయత్నానికి కూడా స్వస్తి పలికారు.
కొందరు ఇస్లాం వాదులు తమ మిత్రుల ఆందోళనకర ధోరణులను గుర్తిస్తున్నారు. అరబ్బుల ఇస్లాం పిడివాదాన్ని కార్ల్ బిన్స్ వాంగర్ గుర్తించాడు. (లూయీస్, ది జ్యూస్ ఆఫ్ ఇస్లాం, పుట. 194, నోట్ 1, ప్రిన్ స్టన్ 1984) ఫ్రాన్స్ లో ఇస్లాంను విమర్శించటం, అరబ్బు దేశాలను తప్పుపట్టడం ఆమోదయోగ్యంగా లేదని జాక్ ఎలూల్ 1983లో రాశాడు. (బాత్ యోర్, ది థిమ్మి, లండన్, 1985) 1968లో మాక్సిమ్ రాడిన్ సన్ రాస్తూ ప్రవక్త నైతిక థోరణిని విమర్శంచటం, ఇస్లాంలో అలాంటి థోరణులను దూషించటం సహించలేకపోయిన ఉదంతాలను చరిత్రకారుడు నార్మన్ డేనియల్ చూపాడు. క్షమాపణలు చెప్పుకునే థోరణి ఆవరించి, అవగాహన తొలగిపోయింది అన్నాడు. (రాడిన్ సన్ రాసిన మహమ్మద్, ది లెగసీ ఆఫ్ ఇస్లాం, జోసెఫ్ సాస్ సంపాదితం, ఆక్స్ ఫర్డ్ 1974).
మొదటి ప్రపంచ యుద్ధ కాలం నాటికి ఇస్లాం పుట్టుపూర్వోత్తరాలను గురించి నిశితంగా పరిశీలించే ధోరణిని పాశ్చత్య పండితులు కోల్పోయారని పెట్రిషియాత్రోస్, ఇబ్నారవండి వ్యాఖ్యానించారు. బైబుల్ని విమర్శించిన ధోరణిలో కొరాన్ ను విశ్లేషించి చూడటం బొత్తిగా కనిపించటం లేదని జాన్ వాన్స్ బ్రో అన్నాడు. (కొరానిక్ స్టడీస్, అక్స్ ఫర్డ్ 1977, పీరిన్, పుట.9) 1990 నాటికి పరిస్థితి ఎలా దిగజారిందో ఆండ్రూ రిపిన్ వివరించాడు.
హిబ్రూ బైబుల్, తొలినాటి క్రైస్తవం చారిత్రకంగా అధ్యయనం చేసినవారు ఇస్లాం పరిశీలనకు పూనుకొని నిశిత ఆలోచన అంటూ ఏమీ ఇస్లాం పుస్తకాలలో లేకపోవడం పట్ల ఆశ్చర్యం వెలిబుచ్చారు. చారిత్రకంగా ఇస్లాం జనించిందనే భావన చాలామంది రచయితలలో ఉన్నది. విభిన్న చారిత్రక సంప్రదాయాలను పొందుపరచవలసి ఉన్నప్పటికీ ఒకానొక సన్నివేశంలో ఏది సబబు అని నిర్ధారించడం సమస్యగా తయారవుతున్నది. యూదుల వాదం, క్రైస్తవం అధ్యయనం చేయడంలో మూలాన్ని విమర్శించడం, నోటిమాటల సంప్రదాయాలను గుర్తించడం సాహిత్య విశ్లేషణ నిర్మాణం పరిగణనలోకి తీసుకుంటారు. అలాంటి పరిశోధనా ధోరణి ఇస్లాం పట్ల తక్కువగా ఉన్నది. (రిపిన్ పీఠిక, పుట 9, ముస్లిమ్స్, లండన్, 1991)
ఇస్లాం పట్ల నిశిత పరిశీలనా ధోరణి లేకపోవడం వలన అనేక పుక్కిట పురాణాలకు ఆధిక్యత అంటగడుతున్నారు. సహనం మహమ్మద్ చట్టాలను ఇచ్చిన తీరు చాలా గొప్పగా ఆకాశానికి ఎత్తుతున్నారు. ఇస్లాంను నిశితంగా పరిశీలించకుండా ఉన్నందున ఇలాంటి భ్రమలు ఎలా తలెత్తాయో చూద్దాం.
1. విదేశీ సంస్కృతి కొన్ని విధాల అవసరం, ఆధిక్యత వహించిందీ అనుకోవటం, మరికొన్ని విధాల తక్కువదనీ, తృణీకరించాలనుకోవడం సాధారణంగా కనిపిస్తుంది. ఎవరి సంస్కృతి వారికి అలవాటు చొప్పున అసహ్యత పుట్టిస్తుంది. పిల్లలకు పొరుగింటి వాతావరణం నచ్చుతుంది. విదేశాలలో ఉన్న పెద్దలు వారి స్థితి అంతా మెరుగ్గా ఉందనుకొంటారు. వారు మెచ్చుకునే సంస్కృతిలో ఇబ్బందికర ధోరణులను చూసీ చూడనట్లు పోతారు. కొత్త దేశంలో, కొత్త వ్యక్తుల్ని సిద్ధాంత వ్యక్తిగత, ఉద్వేగ కారణాలవలన వారికి కావల్సిందే చూస్తారు. మార్గరేట్ మీడ్ తన సిద్ధాంతాలకు సమోవా దీవులలో ఆమోద ముద్రకోసం అన్వేషించింది. కమింగ్ అఫ్ యాజ్ ఇన్ సమోవా లో ఆమె రాసిందంతా భవిష్యత్తులో మన అశలకూ భయాలకూ సంబంధించిన విషయాలే. (ఫ్రీమన్, మార్గరేట్ మీడ్ అండ్ సమోవా, లండన్, 1984) ఇది మన ఆశలకు అనుగుణంగా కావచ్చుకాని వాస్తవాలకు అనుగుణం కాదు.
మానవ జాతిలో కొందరు నైతికంగా ఉత్తములనీ, మరికొందరు తక్కువ అనీ భ్రమలున్నాయి. కొంతమంది రచయితలు వారి పొరుగు వారి గురించి చెడ్డగా ఆలోచిస్తూ తమకు సంబంధంలేని మానవ జాతిని గురించి వారి సంక్షేమాన్ని గురించీ రాస్తుంటారు (రస్సెల్ ఆన్ పాప్యులర్ ఎస్సేస్, న్యూయార్క్ 1950 పుట. 58)
పాశ్చాత్య యూరోప్ అమెరికా సంయుక్త రాష్ట్రాలలో అధిక సంఖ్యాకులు మత నమ్మకాలకు వ్యతిరేక సాక్ష్యాధారాలున్నప్పటికీ, విశ్వాసాలను అట్టిపెట్టుకుంటున్నారు. గాలప్ పోల్ ప్రకారం అమెరికాలో 9 శాతం మాత్రమే నాస్తికులమని, అజ్ఞేయ వాదులమని, మతం లేని వారమని చెబుతున్నారు. ఫ్రాన్స్ లో 12 శాతం మాత్రమే నాస్తికులమని చెబుతున్నారు. ఇందులో ఆశ్చర్యం లేదు.
మత పీఠాల నుండి, ప్రసార సాధనాల వలన జరిగే ప్రచారం, మతేతరంగా చూస్తే అవినీతిగా, మానవ ద్వేషంగా ఉంటుంది. క్రైస్తవం అవలంబించమని చెప్పడంలో ఇదంతా వాస్తవమని గాక, అందులో గిట్టుబాటు ఉన్నదంటారు. మేథస్సు సంబంధంగా చూస్తే మతంలో చిత్తశుద్ధి లేదు. మతంలో తప్పించుకోవడం సులభం. మతం నుండి మంచి అంతా వస్తుందనీ, మతం ఏం చేసినా మంచిదేననే భావన ప్రబలి ఉంది. రాబిన్ సన్ ఏన్ ఏథియస్ట్స్ వాల్యూస్, ఆక్స్ ఫర్డ్ 1964 పేజి 117-118)
మొత్తం మీద పాశ్చాత్య సమాజం నుండి అక్కడి ప్రసారాలు మతం పట్ల ఏ మాత్రం నిశిత పరిశీలన చేయడం లేదు. రిచర్డ్ డాకిన్స్ ఈ విషయమై రాస్తూ ఇలా అంటాడు.
మత సున్నిత విషయాలను పరిగణనలోకి తీసుకోవాలంటుంటారు. సెక్యులర్ వాదులు సైతం మత విషయాలు వచ్చేసరికి మెత్తబడతారు. అశ్లీల శృంగారం స్త్రీలను కించపరిచేదిగా ఉందంటూ, ఖండించడంలో స్త్రీ హక్కు వాదులతో కలుస్తాం. స్త్రీలకు సాక్ష్యం ఇచ్చే హక్కు లేదనే చోట, కోర్టు తీర్పు వలన, రాళ్ళు కొట్టి చంపటమంటే అలాంటి పవిత్ర గ్రంథం జోలికి పోము. జంతువుల పరిశోధనలలో మత్తుమందు ఇచ్చి శస్త్ర పరికరాలు వాడుతుంటే, జంతువులను కాపాడాలనేవారు విమర్శిస్తున్నారు. కాని జంతు వధ శాలల్లో వీటిని గొంతుకోసేటప్పుడు అవి బ్రతికుండాలని మతపరంగా చెబితే ఏమంటారు... మత వ్యక్తిని అతడు తన విశ్వాసాన్ని ఎలా సమర్ధించుకొంటావని అడిగితే మాత్రం మత స్వేచ్ఛలో జోక్యం అంటారు. (డాకిన్స్ న్యూ హ్యూమనిస్ట్ ఎ డిప్లోరబుల్ ఎఫైర్ సంపుటి 104 లండన్ మే 1989)
యూరోప్ దేశాలు 16వ శతాబ్దంలో తొలుత ఇతర దేశాల నాగరికతలు చూచినప్పుడు ఏం జరిగిందో దృష్టిలో పెట్టుకుంటే ఇస్లాం పట్ల నిశిత పరిశీలన ఎందుకు లేదో, ఇస్లాం సహనవంతమైందనే భ్రమ ఎలా జనించిందో విశదమవుతుంది. అమెరికాను కనుగొనక ముందు, గ్రీకులు, రోమనులు స్వర్ణయుగాన్ని గురించి, అటవికుల ధర్మ స్వభావాన్ని గురించి భ్రమలో ఉన్నారు. ఈడెన్ తోట నుండి ఆడం, ఈవ్ లను బహిష్కరించడం స్వర్ణయుగపు సాధారణ సహజధర్మభావనలోనిదే. కాలుష్యం లేని అడవులలో మన ప్రాచీనులు అనుభవించిన కాలం అదంతా.
జర్మేనియా జర్మనుల ఔన్నత్యం, రోమ్ అధర్మం పోల్చి చూపాడు. టాసిటన్ (98 సి.ఇ.లో) రోమ్ నాగరికతలో ఆడంబరత్వం, జర్మన్ సంస్కృతిలో సహజత్వం చిత్రించాడు. పరిసరాల పరిశీలన దృష్ట్యా అంతా అసంబద్ధమైనదే. (టాసిటన్ పుట 1034) మాంటేన్, రూసో, గిబ్బన్ ఇలాంటి ప్రభావాలకు లోనైనవారే.
16వ శతాబ్దంలో ఈ సిద్ధాంతాలకు పునాది వేసిన పీటర్ మార్టర్ ఆంగ్లిరస్ (1459-1525) ఒక పుస్తకం రాశాడు. అందులో ఇండియన్లను పొగడుతూ వారు మోసాలు చేయరనీ, డబ్బుకు బానిసలు కారనీ, క్రూరమైన న్యాయవేత్తలు లేరని అంటూ, స్పెయిన్ వారు సంకుచితంగా, అసహనంతో క్రూరంగా ప్రవర్తిస్తారని చెప్పాడు. (డే రేబస్ ఓసి యూనిక్స్ ఎట్ ఆర్చోమోవే 1516)
పీటర్ మార్టర్ ప్రభావంతో మాంటేన్ రాస్తూ నరుల్ని నలుచుకు తినే విషయ ప్రస్తావన చేశాడు. ఇందులో సాంస్కృతిక సాపేక్షతా వాదం కూడా ఉన్నది. బ్రెజిల్ లోని ఇండియన్ల గురించి మాంటేన్ రాస్తూ ఇలా అన్నాడు.
మన తప్పుల్ని మూసిపెట్టుకుని వారి అటవిక దోషాల్ని నిర్ధారించడం తగదు. మనిషిని సజీవంగా తినటం ఆటవికత్వం. సజీవంగా ఉన్న వ్యక్తిని చిత్రహింసలు పెట్టి, కాల్చి కుక్కలకూ, పందులకూ వేయడం మన మధ్యనే జరుగుతుండడం మతం పేరిట, పవిత్రత పేరిట చూస్తున్నాం. చనిపోయిన వ్యక్తిని కాల్చి తినడం కంటే ఇది దారుణమైన ఆచారం. (మాంటేన్ పుట 113 ఆన్ కేనిబల్స్ 1580)
ఇండియన్లు అవినీతికి దూరంగా సాధారణమైన జీవనాన్ని గడుపుతున్నట్లు వారి పోరాటం కూడా ఉన్నతమైనట్లు మాంటేన్ పేర్కొన్నాడు.
టాసీటస్, పీటర్ మార్టర్ వలే మాంటేన్ సమాచారం కూడా నిర్దిష్టమైనది కానప్పటికీ, తన సంస్కృతీ నాగరికతలను స్వల్ప సమాచారం ఆధారంగానే విమర్శించాడు. ఇస్లాంపట్ల సానుభూతితో కూడిన ధోరణులు 17వ శతాబ్దంలో జూరి, బెయిలీ వంటివారు వెల్లడించారు. టాసిటస్, పీటర్ మార్టర్, మాంటేన్ ధోరణిని పోలినదే ఇది కూడ.
జూరి ఇలా అన్నాడు. క్రైస్తవులకు వ్యతిరేకంగా సారసిన్లు కనబరిచిన క్రూరత్వానికీ, భక్తులపై పాపరి ప్రదర్శించిన అమానుషత్వానికీ పోలికే లేదు. క్రైస్తవులపై సారసీన్లు చిమ్మించిన రక్తం కంటే మతం పేరిట బార్త్ లో మియోదినం నాడు జరిగిన హత్యాకాండ, వాడియోపై జరిగిన యుద్ధంలో ఎంతో రక్తం ప్రవహించింది. మహమ్మదీయ వాదం క్రూరమైనదని ప్రచారం చేయటం, క్రైస్తవాన్ని మినహాయించడం సరైనది కాదు. మానవుల్ని తినే ఆటవిక క్రూరత్వం కంటే పాపరీ దారుణాలు అమానుషమైనవి. (బెయిలీ వ్యాసం-మహమ్మద్, నెస్టోరియస్, 1740, అమ్ స్టర్ డామ్, డిక్ష్షనరీ హిస్టారిక్ ఎట్ క్రికెట్ 5వ ప్రచురణ 10 సంపుటాలు, అనువాదం బెర్నార్డ్, లండన్, 1734-41)
జూరి రాసిన లెటర్స్ పేస్టరల్స్ (1686-89) గమనిస్తే ఇతడు హ్యూజ్ నాట్ పురోహితుడనీ, బోస్కు బద్ధ శత్రువనీ హాలండ్ నుండి రాస్తున్నాడనీ స్పష్టపడుతుంది. సెయింట్ బార్త్ లో మియోదినం నాడు కనబరిచిన కేథలిక్కుల క్రూరత్వం, సారసిల్న పిరికితనం ముందు దారుణంగా అతనికి కనిపించింది. రోమన్ కేథలిక్కులను విమర్శిస్తూ, ముస్లింల సహన ధోరణిగా కనిపించే వాతావరణాన్ని జూరి వినియోగించుకున్నాడు.
జూరి వలన ప్రభావితుడైన పీర్ బెయిలీ, ఇస్లాం సహనం అనే భ్రమలో కొనసాగాడు. ఇండియాలో పోర్చుగీసువారు బ్రాహ్మణులను హింసించిన తీరు, అమెరికాలో స్పెయిన్ వారు ఇండియన్ల పట్ల చూపిన క్రూరత్వంతో పోల్చితే టర్కులు సహనంగా ఉన్నట్లు అతనికి అనిపించింది. క్రైస్తవులకంటే ముస్లింలు ఇతర మతాలపట్ల మానవత్వాన్ని కనబరిచారని అతను అంటాడు. సహనాన్ని కావాలని ఆశించిన బెయిలీ మత అసహనానికి గురై, హాలండ్ నుండి పారిపోవలసి వచ్చింది.
జూరి, బెయిలీలకు టర్కీ అంటే ముస్లింలని అర్థం. టర్కీలో సహనాన్ని ముస్లింల సహనంగా చిత్రించారు. ముస్లింల దారుణ హింసలు ఈ రచయితలకు తెలియవు. క్రైస్తవులూ, యూదులూ తొలి రోజుల్లో జరిపిన హింస, సింధు రాష్ట్రంలో దాడుల సందర్భంగా హిందువుల, బౌద్ధుల ఊచకోత, అల్మొహడ్ ల అసహనం, జొరాష్ట్రియన్ల పీడన ఈ రచయితలకు పట్టలేదు. కాన్ స్టాంట్ నోపుల్ పతనమైనప్పుడు క్రైస్తవుల రక్తం వీధులలో ప్రవహించటం ఈ ఫ్రెంచి రచయితలకు పట్టినట్లు లేదు. సమకాలీన టర్కీలో ఉన్న దేవ్ ష్రిమ్ అనే అమానుష ఆచారం ఈ రచయితలు ప్రస్తావించలేదు.
చాలామంది అల్ప సంఖ్యాకులు సనాతనుల, కేథలిక్కుల హింసను తప్పించుకొని టర్కీలో తలదాచుకున్నారు. 1492, 96లో స్పెయిన్ నుండి బహిష్కరణకు గురైన యూదులు హంగరీ నుండి మారనాస్ కాల్వనిస్టులు, రష్యా, శైలీషియా నుండి మరి కొందరు టర్కీలో తలదాచుకున్నారు. వీరంతా ద్వితీయ శ్రేణి పౌరులుగా, ప్రవాసులుగా సహించబడ్డారు. జూలి, బెయిలీ ఇస్లాం చరిత్రను బాగా అవగాహన చేసుకోకుడానే ముస్లిం సహనాన్ని గురించి ప్రస్తావించటం తప్పు. ప్రతి శతాబ్దంలోనూ దేశానుగుణంగా పాలకులను బట్టి పరిస్థితి మారుతూ వచ్చింది. అన్ని మత విశ్వాసాల పొందిక అనే సిద్ధాంతం కేవలం ఊహాజనితమే.
బెయిలీ, జూరీలు తెగ పొగిడిన 17వ శతాబ్దపు టర్కీ కూడా అంత ఆకర్షణీయమైనదేమీ కాదు. 1662లో కాన్ స్టాంట్ నోపుల్లో ఇంగ్లీషు రాయబారి ఇలా అన్నాడు.
ప్రస్తుతం వజీర్ క్రైస్తవుల, ఇతర మతాలపట్ల తన సహజ ద్వేషాన్ని చూపటంలో తండ్రికి మించిపోయాడు. రెండేళ్ళక్రితం గలాటా, కాన్ స్టాంట్ నోపుల్లో చర్చీలు తగులబెట్టగా ఆ స్థలాలను గ్రీకులూ, ఆర్మీనియన్లూ, రోమన్లూ అధిక ధరలకు సుల్తాన్ నుండి కొనుక్కున్నారు. ఆ స్థలాలలో మందిరాలు నిర్మించి తమతమ ఉత్సవాలు జరుపుకున్నారు. ఈ అవకాశాన్ని వజీర్ బాగా వాడుకున్నాడు. నేరస్తులను జైలుపాలు చేశాడు. కాని ముఖ్యమైన వారిని వదిలేశాడు (బాట్ యార్ పారిస్ 1991 లెక్రిస్టిన్స్ ది ఓరియంట్ జిహాద్ ధిమ్మి)
టర్కీ సహనాన్ని ఒక పండితుడు ఇలా ప్రస్తావించాడు. 16, 17 శతాబ్దాలలో బల్గేరియా ఉత్తరాన, మేసిడోనియా సరిహద్దులలో జనాన్ని బలవంతంగా మతం మార్చేటట్లు, టర్కులు వత్తిడి చేశారు. నిరాకరించిన వారిని సజీవంగా తగలబెట్టారు. లేదా ఉరితీశారు. (బాత్ యార్ పుట. 56)
17వ శతాబ్దం చివరలో వెలువడిన టర్కీ గూఢచారి ఉత్తరాలకు నాంది పలికాయి. మాంటెస్కో (1721), మదాండి గ్రాఫిగ్నీ (1747), డార్గెన్ (1750), వోల్టేర్ (1764), వొరేస్ వాల్ పోల్ (1756), గోల్డ్ స్మిత్ (1762) రాసిన ఉత్తరాలు ఈ ధోరణి లోనివే.
18వ శతాబ్దంలో సొంత నాగరికతను విమర్శిస్తూ ఆటవికత్వాన్ని సమర్థిస్తూ ఒక ధోరణి ప్రబలింది. ఈ ఆటవికత యూరప్ లో ఉన్నతమైన సమకాలీన దృశ్యంగా పరిణమించింది. యూరోప్ వారి అవి నీతి, దిగజారుడు తనాన్ని పేర్కొన్న రచయితలు విదేశీ సంస్కృతీ ఔన్నత్యాన్ని, చైనా, పర్షియా, పెరూ వివేచనా నీతిని ఆకాశానికెత్తారు. ఈ యూరోప్ రచయితలకు ఇతర సంస్కృతులపట్ల అవగాహన లేదు. ఆసక్తీ లేదు.
అలాంటి భూమికలో 18వ శతాబ్దంలో మహమ్మద్ పట్ల పుక్కిటి వురాణగాథలను సహనశీలి, వివేచనాత్మకవాది, న్యాయమూర్తి అని ఎందుకు పేర్కొన్నారో అర్థం చేసుకోవచ్చు. బోలోన్ విల్ రాసిన మహమ్మద్ జీవితచరిత్ర అని మరణానంతరం 1730లో వెలువడింది. వోల్టేర్, గిబ్బన్ పై దీని ప్రభావం ఉన్నది. ఇస్లాంను గురించి, దాని స్థాపకుని గురించి యూరోప్ లో ఏర్పడిన అభిప్రాయాలకు ఈ పుస్తకం ప్రాతిపదికలు వేసింది. బోలన్ విల్ కు అరబిక్ తెలియదు. గనుక ఇతర ఆధారాల సహకారంతో రాశాడు గనుక చాలా దోషాలు, అలంకరణలు చోటు చేసుకున్నాయి. (హోల్డ్, పుట 300 ది ట్రీట్ మెంట్ ఆఫ్ అరబ్ హిస్టరీ) బోలన్ విల్ రచనలో మహమ్మదును, ఇస్లాంను తన మత ద్వేష భావాలకు అనుకూలంగా క్రైస్తవ వ్యతిరేకతకు సానుకూలంగా వాడుకున్నారు. ఇస్లాం హేతుబద్ధం అన్నాడు. అందులో మర్మాలూ, అద్భుతాలు లేవన్నాడు. దైవాంశ కాకపోయినా మహమ్మద్ గొప్ప రాజనీతిజ్ఞుడనీ, ప్రాచీన గ్రీస్ లో ఆవిర్భవించిన వారికంటే గొప్ప శాసనకర్త అనీ అన్నాడు.
ఈ రచనలు జఫ్రీ వ్యాఖ్యానిస్తూ క్రైస్తవులను చిన్నబుచ్చటంలో, మహమ్మద్ ను అత్యున్నతంగా పొగడడంలో ఇది ప్రముఖ పాత్ర వహించిందన్నాడు. హర్ గ్రోంజె ఈ పుస్తకంపై వ్యాఖ్యానిస్తూ ఇస్లాంపై మిడిమిడి జ్ఞానంతో రాసిన పౌరోహిత వ్యతిరేక ఉద్వేగంగా చిత్రించాడు. గిబ్బన్ పుస్తకం హిస్టరీ ఆఫ్ ది డిక్లైన్ అండ్ ఫాల్ ఆఫ్ ది రోమన్ ఎంపైర్ పై బోలన్ విల్ బురద చల్లటాన్నికూడా గమనించవచ్చు. (జఫ్రీ ది క్వెస్ట్ ఆఫ్ ది హిస్టారికల్ మహమ్మద్. పుట. 30)
ఖురాన్ ను 1734లో జార్జిసేల్ ఇంగ్లీషులోకి నిర్దిష్టంగా అనువదించాడు. మహమ్మద్ జీవిత చరిత్ర రాసిన బోలన్ విల్ వలే సేల్ కూడా అరబ్బులు దైవాంశతో జనించారని నమ్మాడు. (హోల్ట్. పుట. 302)
వోల్టేర్ ధోరణి ఆ శతాబ్దంలో ఆవరించి ఉన్న పరిస్థితులను ప్రతిబింబించింది. మహమ్మద్ అనే నాటకం (1742)లో మనుషుల ఆత్మలను బంధించినవాడుగా చిత్రించటం అతడి స్వభావానికి మించిపోయిన పరిస్థితి అని ఒక ముస్లింకు రాస్తూ వోల్టేర్ అభిప్రాయపడ్డాడు. (బసాక్, 1950 రివ్యూ సైకాలజీ డి పీపుల్స్ 3 పుట. 110, నోట్.2) 1756లో ఎస్సే సుర్ లే మోర్స్ లోనూ, ఫిలాసఫీ నిఘంటువులోనూ వోల్టేర్ ఇస్లాంకు అనుకూలంగా, క్రైస్తవానికి ముఖ్యంగా కేథలిక్కులకు వ్యతిరేకంగా రాశాడు. ప్రపంచాన్ని పట్టి పీడించిన విషపూరిత మతంగా క్రైస్తవాన్ని చిత్రించాడు. (ఎడ్వర్డ్స్ పుట. 715) 18వ శతాబ్దపు మేథావుల వలే వోల్టార్ దైవాన్ని నమ్మినప్పటికీ అద్భుతాలనూ, పిడివాదాన్నీ, పౌరోహిత్యాన్నీ, దైవదత్త మతాన్నీ వ్యతిరేకించాడు.
1762లో ది శర్మన్ ఆఫ్ ది ఫిఫ్టీ రాస్తూ క్రైస్తవులు జీసస్ రక్తమాంసాలను గురించి చెప్పే దాన్నీ, వారు చెప్పే అద్భుత చర్యలనూ విమర్శించాడు. బైబుల్ పరస్పర విరుద్ధాలతో ఉన్నదన్నాడు. క్రైస్తవ దేవుడు క్రూరమైన, ద్వేషపూరితమైన నిరంకుశుడన్నాడు. నిజమైన దేవుడు ఒక యువతికి పుట్టటం, శిలువపై మరణించటం జరగదని, పరస్పర విరుద్ధాలూ, ఉన్మాదం, భయానకంతో గూడిన గ్రంథాలకు ప్రేరణ ఇవ్వడం వోల్టేర్ రాశాడు. (ఎడ్వర్డ్స్. పుట. 715)
వోల్టేర్ దృష్టిలో ఇస్లాం పిడివాదాలు సాధారణమైనవనీ, ఒకే దేవుడు, అతడికి ఒకే ప్రవక్త మహమ్మద్ ఉన్నాడని చెప్పాడు. ప్రకృతే దైవం అనే వారికి ఇస్లాంలోని కృత్రిమ వివేచన నచ్చింది. పురోహితులు లేరు, అద్భుతాలు లేవు. మర్మవాదం లేదు. క్రైస్తవులకు అసహనం ఉండగా ఇస్లాం ఇతర మతాలను సహిస్తుందని కూడా నమ్మాడు.
గిబ్బన్ 18వ శతాబ్దంలో అభూత కల్పనలు, బోలన్ విల్ రచనలతో ప్రభావితుడయ్యాడు. 1776లో డిక్లైన్ అండ్ ఫాల్ ప్రథమ సంపుటి రాసే నాటికి ప్రాశ్చాత్యలోకాన్ని గురించిన పుక్కిటి గాథలు అలుముకొని ఉన్నాయి. ఇస్లాం ఆనాటి శూన్యావస్థను నింపటానికి తగినట్లుగా ఉన్నదని బెర్నాల్డ్ లూయీస్ అభిప్రాయపడ్డాడు. యూరో ప్రజల్ని అంతవరకూ అకట్టుకున్న చైనా వారేమయ్యారు...... 18వ శతాబ్దం ఉత్తరార్ధంలో పరిస్థితిని లూయీస్ ఇలా వివరించారు. పోల్చి చూచుకోవటానికీ, స్వవిమర్శకు యూరోప్ కు గాథలు కావలసి వచ్చాయి. ఒకటి ఉన్నతమైన ఆటకవిత్వం, రెండవది వివేచనాత్మక ప్రాచ్య విధానం కనిపించాయి. కొంతకాలం పాటు జెసూట్లు చైనావారి విధానాలను నైతిక ధర్మాలకు అదర్శంగా భావించారు. వారి తత్వవేత్తల సహనం మతేతరంగా స్వీకరించారు. తిరిగివచ్చిన యాత్రికులు నివేదించేదాన్నిబట్టి చైనాలో విషయాలు జెసూట్లు చెప్పినట్లుగా తాత్వికంగా లేవని అర్థం అయింది. ఒక శూన్యదశ ఏర్పడింది. అది నింపటానికి ఇస్లాం తగినదిగా భావించారు (లూయీస్, రేస్ అండ్ స్లేవరీ ఇన్ ది మిడిల్ ఈస్ట్ న్యూయార్క్, 1990, పుట. 95)
గిబ్బన్ ను గురించి బెర్నార్డ్ లూయీస్ చెప్పేది 17, 18 శతాబ్దాలలో ఇస్లాం గురించి రాసిన వారందరికీ వర్తిస్తుంది. గిబ్బన్ అసంపూర్ణ జ్ఞానం, యూరోప్ పాండిత్యంలో లోటుపాట్లవలన అతని సందేహవాదం కూడా మొద్దుబారింది. సంప్రదాయ జీవిత చరిత్రల సాహిత్యంలో మరుగున పడిన ముస్లిం మతగాథల్నిగిబ్బన్ కనుక్కోలేదు. ఆనాటి చరిత్రకారుడికి ఇట్లాంటి విశ్లేషణ దృష్టి లోపించటం అర్థం చేసుకోవచ్చు (లూయీస్. పుట. 95)
వోల్టేర్ వలే గిబ్బన్ కూడా క్రైస్తవంతో పోల్చి ఇస్లాంకు అనుకూలంగా చిత్రించాడు. క్రైస్తవ దైవత్వ సూత్రాలను పరోక్షంగా ఖండించడానికి మహమ్మద్ మానవత్వాన్ని చరిత్రకారుడుగా గిబ్బన్ నొక్కి వక్కాణించాడు. పురోహిత వర్గానికి వ్యతిరేకంగా ఉన్న గిబ్బన్ ఆ వర్గం నుండి విమోచన పొందిన ఇస్లాంను సమర్థించాడు. మొత్తం మీద క్రైస్తవానికి వ్యతిరేకంగా ఇస్లాంను ఒక ఆయుధంగా వాడాడు.
ఇస్లాం ఒక హేతుబద్ధమైన, పురోహిత వర్గంలేని మతంగా గిబ్బన్ దృష్టిలో ఉన్నది. మహమ్మద్ వివేకవoతమైన సహనంతో కూడిన న్యాయసూత్రాలను ఇచ్చాడు. యూరోప్ లో ఈ వాదన చాలాకాలం ప్రభావితం చేసింది. ఇప్పటికీ పండితులూ, పామరులూ నిశిత దృష్టి లేకుండా ఈ కట్టుకథల్ని నమ్ముతున్నారు. టర్కీ సహనాన్ని ముస్లిం సహనంగా ఓల్టేర్, గిబ్బన్ లు చూపారు. భిన్న విశ్వాసాలకు 18వ శతాబ్దంలో టర్కీలో తావు లేదు. యూదులను జుగుప్సతో చూచినట్లు కార్ స్టన్ నైబర్ అనే యాత్రికుడు పేర్కొన్నాడు. 1758లో కాన్ స్టాంట్ నైబర్ అనే యాత్రికుడు పేర్కొన్నాడు. 1758లో కాన్ స్టంట్ నోపుల్ పరిస్థితిని బ్రిటిష్ రాయబారి ఇలా వర్ణించాడు. సుల్తాన్ తన నియమాలను పాటించేటట్లు ధృఢ నిశ్చయంలో ఉన్నాడు. రహస్యంగా పయనించిన సుల్తాన్ ఒక యూదును కలిసినప్పుడు అతన్ని గొంతు నరికి చంపించి వేశారు. మరునాడు ఒక అర్మీనియన్ను అలాగే చేశారు. ప్రతిచోట భయానక వాతావరణం అలముకున్నది. (బాత్ యార్ ప్యారిస్, 1991 థిమ్మి 7-20 సిరీస్, పుట. 427)
1770లో కాన్ స్టాంటినోపుల్ లో ఒక రాయబారి రాస్తూ చీకటి పడిన తరువాత గ్రీకులూ, ఆర్మీయన్లూ, యూదులూ ఇంటి బయట కనిపిస్తే అరమరికలు లేకుండా చంపేయమన్నారన్నాడు. 1785లో మరొక రాయబారి రాస్తూ క్రైస్తవులు రహస్యంగా తమ చర్చీలు బాగుపరచుకుంటే ముస్లింలు అభ్యంతరం తెలుపగా టర్కీ అధికారులు వాటిని నాశనం చేశారన్నారు. (బాత్ యార్, పుట. 429).
1841లో హీరోస్ అండ్ హీరో వర్షిప్ రాసిన కార్ లైట్ మహమ్మదు గురించి ప్రస్తావించినప్పుడు, పాశ్చాత్య మేథావి ఒక ఇస్లాం నాయకుడిని గురించి సానుభూతితో చిత్రించిన తొలి రచనగా పేర్కొన్నారు. ప్రపంచంలో గొప్ప మతానికి స్థాపకుడుగా మహమ్మద్ ఉండటం హాస్యాస్పదంగా అనిపిస్తుందన్నాడు. (వాట్. పుట. 17 - ఇన్ ట్రడక్షన్ టు ఖురాన్, ఎడింబరో 1977) కార్ లైల్ వ్యాసంలో సరైన వాదనలేవీ లేవు. తీవ్రమైన, అశ్చర్యకరమైన పదగుంభనం గుప్పించారు. (ఆక్స్ ఫర్డ్ కంపానియన్ టూ లిటరేచర్, పుట. 171)
ప్రకృతి మర్మాలను గురించి రణగొణ ధ్వని చేశాడు. ఏదైనా వాదనలంటూ ఉంటే అవన్నీ దోషపూరితమైనవే. మహమ్మద్ ను ద్రోహి కాదన్నాడు. ఎందుకు కాదు. ఒక మాంత్రికుడు, చిత్తశుద్ధిలేని వాడు చేసే పనులకు ఇంతమంది లొంగటం అనూహ్యమన్నాడు. మత విజయం అతనికి కొలమానమైంది. సంఖ్యనుబట్టి సత్యాన్ని కొలిచాడు. 180 మిలియన్ల ముస్లింలు ఉండగా అంతమందిని ఒక తప్పుడు మతం అవలంబించేటట్లు మహమ్మద్ నచ్చచెప్పలేడన్నాడు. వాస్తవానికి మహమ్మద్ నచ్చచెప్పింది కొన్ని వేలమందికే. మిగిలినవారు కేవలం అనుకరించారు. చాలామంది ముస్లింలు గుడ్డిగా తమ తండ్రుల మతాన్ని అనుసరిస్తారు. మహమ్మద్ చిత్తశుద్ధికి అనుకూలంగా, వ్యతిరేకంగా వాదాలను అధిక సంఖ్యాకులు పరిశీలించారనటం అసంబద్ధం.
నమ్మేవారంతా సిద్ధాంత సత్యాన్ని అంచనా వేసారనటం అసందర్భమే. సైంటాలజీ నమ్మేవారి సంఖ్య ఏటా పెరుగుతున్నది. అంటే సాలీనా దీనిలో సత్యం కూడా పెరుగుతున్నదా... ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలకంటే క్రైస్తవులు అధిక సంఖ్యలో ఉన్నారు. అంటే ఇస్లాంకంటే క్రైస్తవం ఎక్కువ సత్యమా... ఐన్ స్టీన్ కి వ్యతిరేకంగా 100 మంది రచయితలు అనే శీర్షికన ప్రచురించిన పుస్తకంపై ఐన్ స్టీన్ వ్యాఖ్యానిస్తూ నేను దోషపూరితమైతే ఒకళ్ళు చాలేమో అన్నాడు. దీన్ని తిప్పి చూసినా అంతే.
చిత్తశుద్ధి లేని వ్యక్తి తాను బోధించింది. సత్యం అయినా కాకపోయినా జయప్రదంగా రాణించలేకపోవచ్చు అనటం కూడా తప్పుడు వాదమే. మహమ్మద్ చిత్తశుద్ధి మనకెలా తెలుసు... అతడు, లేకుంటే జయప్రదం అయ్యేవాడే కాదు అంటారు. అతడు ఎలా జయప్రదం అయ్యాడు.... చిత్తశుద్ధి వల్లనా? ఇలా తిరుగుడు వాదం ఉంటుంది. రాన్ హబ్బర్డ్ పందెం వేసి తాను ఒక కొత్తమతాన్ని స్థాపించగలనని ఆర్థర్ క్లార్క్ తో అన్నాడట. ఈ నానుడి పేరిట హబ్బర్డ్ వెళ్ళి సైంటాలజీ మతాన్ని స్థాపించాడంటారు. ఇందులో ఎంత నమ్మాలో తెలియదు. టెలీ ఎవాంజలిస్టులు, గురువులు, మత స్థాపకులు, ఉద్యమాలు వీటన్నిటి వెనుక కొన్ని గాథలు ఉండనే ఉంటాయి.
ఇస్లాంపట్ల కార్ లైల్ కు మిడిమిడి జ్ఞానమే ఉన్నది. మహమ్మద్ పై అతడి వ్యాసం పాండిత్యం దృష్ట్యా చూస్తే పనికిరాదు. బంథామ్ చెప్పిన ఉపయోగవాదానికీ, పదార్థ వాదానికీ వ్యతిరేకంగా ఇస్లాంను ఒక ఆయుధంగా మాత్రమే వాడాడు. పారిశ్రామిక విప్లవం వలన ఆవిర్భవిస్తున్న యాంత్రిక ప్రపంచదృష్టిపట్ల కలవరపడిన కార్ లైల్ ప్రాశ్చ వివేచనా గాథలలో సేదతీర్చుకున్నాడు. ఫ్లాబర్ట్ వలె కార్ లైల్ కూడా ఆధ్యాత్మిక పక్షవాతం నుండి పాశ్చాత్యలోకం పునరుజ్జీవం పొందాలని ఆశించాడు. అతడి భావాలు 19-20 శతాబ్దాలలో కూడా మళ్లీ తలెత్తాయి. ఇస్లాం ఒక విధంగా క్రైస్తవానికి గందరగోళ రూపమనీ, క్రైస్తవానికి వికృత బిడ్డ అని చరిత్రకారుడు భావించాడు. డాంటే, తన సమకాలీనులూ ఇస్లాంను హీనమైనదిగా, దారితప్పిన క్రైస్తవంగా చూశారు. కార్ లైన్ ఒక విధమైన క్రైస్తవంగా మహమ్మద్ మతాన్ని భావించి సిరియన్ శాఖలకంటే ఉత్తమమైనదిగా తలపోశారు. (కార్ లైల్ పుట. 297 సార్టార్ రిసార్టర్స్, లండన్, 1973)
ఉత్తమ ఆటవికత్వం అనే భావనకు మతం ముసుగు తొడిగి, మహమ్మద్ ను చిత్రీకరించి చూపాడు కార్ లైల్. మహమ్మద్ ప్రత్యక్షంగా మార్మికాలతో, జీవితంతో, ప్రకృతిలో సంబంధాలు గలవాడన్నాడు. పాశ్చాత్య నాగరిక, సందేహవాద ప్రపంచానికి లభించని, మార్మిక స్వభావాల నిజరూపం మహమ్మద్ కు ఉన్నాయని చిత్రించాడు.
మహమ్మద్ ప్రకృతి నుండి సూటిగా పుణికిపుచ్చుకున్నవానికి ప్రతిబింబంగా వెలుగొందాడు. సంస్కృతికి దూరంగా, కొంత ఆటవికంగా, ప్రకృతి బిడ్డగా అతడున్నాడు. (కార్లైల్ పుట 288-301 షార్జాలోని సార్టస్)
అరబ్బులకు మత స్వభావం ఉన్నదనీ, ధాన్యం గాఢ భావాలు, ఉత్సాహం గలవారనీ స్కాటిష్ పండితుడు చిత్రించాడు. ముఖ్యంగా కావలసింది సత్యం కాదు. చిత్తశుద్ధి మాత్రమే. హేతువుకు అతీతంగానైనా నమ్మేది చిత్తశుద్ధితో అయితే చాలు. చిత్తశుద్ధి లేనివాని సత్యాలకంటే, మహమ్మద్ అసత్యాలే సత్యాలు. (పుట 307 - కార్లైల్ - పై పుస్తకంలో)
ప్రాచీన ఫాసిస్టు లక్షణాలు కార్లైల్ భావాలలో గమనించాడు రస్సెల్. తదితరులు కార్లైల్ ఫాసిజం, అతడు హింసను శ్లాఘించిన దానిలో, క్రూరత్వం, నిర్హేతుకతను పొగిడిన రీతిలోనూ చూడవచ్చు. హేతువు అంటే అతడికి జుగుప్స. తీవ్ర లక్షణాలున్న వ్యక్తిగా, విషయాలు నిర్దుష్టంగా చెబుతాడు. (కార్లైల్ పుట 306 పై పుస్తకంలో) కార్లైల్ రచనను తీవ్రంగా స్వీకరించినవారెవరైనా ఉన్నారేమో తెలియదు. కాని ముస్లింలు ఇతడు మహమ్మద్ గురించి రాసినదంతా, యూరోప్ లో మహమ్మద్ ను స్వీకరించినట్లుగా భావించారు. జాగ్రత్తగా చదివితే మహమ్మద్ అన్ని సందర్భాలలో చిత్తశుద్ధి లేనివాడనీ, అతడి నైతిక ప్రవచనాలు అంత శ్లాఘనీయాలు కాదనీ, ప్రవక్తలలో వాస్తవమైన వాడేమీ కాదనీ రాసినట్లు గమనించవచ్చు. ఖురాన్కు అవమానకరమైన భాగం కూడా ఉంది. అదంతా విసుగు పట్టించే, మోటుగా చెప్పిన గందరగోళం, సమర్థించడానికి వీల్లేని మూర్ఖత్వం ఉంది. తప్పనిసరైతే తప్ప యూరోపియుడెవరూ ఖురాన్ చదవలేడు (కార్లైల్ పుట 299 అదే పుస్తకంలో) కార్లైల్ ను కూడా మనం చదవలేం.
కార్లైల్ రచననుండి పై భాగాలను ఒక ప్రత్యేక పుస్తకంగా అచ్చు వేసి ముస్లింలు చదువుతున్నారంటే, మహమ్మద్ ను గురించి అతడు అనుకూలంగా చెప్పిందంతా హీరో ఏజ్ ఏ పొయిట్ లో విస్మరించాడని ముస్లింలు గమనించరాదనే అయి ఉంటుంది. ప్రవక్తల్నినమ్మాలంటే, ఆదిమ దశలో ఉండాలి అని అతడు అన్నాడు. మహమ్మద్ జనాన్ని ఉద్దేశించి మాట్లాడడంలో అర్థంలేని, పొందికలేని దోషాలు దొర్లాయి. మంచి చెడ్డల సమ్మిళితంగా మాట్లాడడం, అంత జనంలోనే కుదురుతుంది. (కార్లైల్ పుట. 332)
మహమ్మద్ ప్రభావం క్షీణించడం పట్ల కార్లైల్ ఇలా రాశాడు.
మహమ్మద్ గొప్ప ప్రవక్త అనడం తప్పు. అలాంటి తప్పు నేటికీ మనకు సంక్రమించింది. మహమ్మద్ మాటలో అసందర్భాలు, కట్టుకథలు, అపవిత్రాలు, అసహనాలు ఉన్నయి. అతడు గొప్ప వక్త అనడం సందేహాస్పదం. దుర్విగ్ధతతో కూడిన వాచాలుడు మాత్రమే. అరేబియాలో కూడా మహమ్మద్ కాలదోషం పట్టి మరుగున పడి ఉంటాడు. ఆయన చెప్పేదంతా దోషపూరితమే (కార్లైల్ పుట 343).
అతడి ఖురాన్ అర్ధం లేని మూర్ఖ గ్రంథం. అది అతడు నమ్మినట్లు, దేవుడు రాశాడని మనం నమ్మలేం. ఇంతకంటే ద్రోహకర ప్రకటన ఏం కావాలి (కార్లైల్ పుట. 344)
అరబ్బు మూలాధారాలపై 17, 18 శతాబ్దాల యూరోప్ పండితులకు అవగాహన లేదు. మిడిమిడి జ్ఞానమే వారికుంది. క్రైస్తవ అసహనం, క్రూరత్వం, పురోహిత వర్గం, పిడివాదాన్ని ఎదుర్కోవడానికి ఇస్లాంను ఆయుధంగా వాడుకున్నారంతే.
19వ, 20వ శతాబ్దాలలో యూరోప్ లోని ఇస్లాం పండితులకు ఇస్లాంను గురించి ఎక్కువగా తెలుసు. క్రైస్తవులలో భక్తులు, పురోహితులు ఇస్లాంకు మతరీత్యా సమానత్వం ఆపాదించాలంటే మహమ్మదును గురించి ఎక్కువగా తెలుసుకోవాలనుకున్నారు. ఇస్లాం తోటి మతమనీ, యూదు, క్రైస్తవ భావాలతో ప్రభావితం అయిందనీ, కనుక అవి ఉండటమో, ఊడటమో కలసి కట్టుగా జరుగుతుందనీ భావించారు. ఇస్లాం పిడి వాదాన్ని అసంబద్ధతలనూ సిద్ధాంతాలనూ విమర్శిస్తుంటే తమ నిర్మాణచట్రం కూడా కదలి, కూలిపోతుందని క్రైస్తవులు భావించారు. హేతువాదం, సందేహవాదం, నాస్తికవాదం సెక్యులరిజం, పారిశ్రామిక విప్లవం, రష్యా విప్లవం. కమ్యూనిజం, భౌతిక వాదం తలెత్తటం పాశ్చాత్యలోకంలో ప్రమాదకరమైన సామాజిక, ఆర్థిక తాత్విక విషయాలుగా భావించారు. సర్ హేమిల్ టన్ గిబ్ రాస్తూ ఇస్లాం క్రైస్తవం ఒకే ఆధ్యాత్మిక లక్ష్యంతో ఉన్నాయన్నారు. (డేనియల్. పుట. 306) సందేహవాదాన్ని గురించి జాగ్రత్త వహించాలన్నారు. క్రైస్తవం, ఇస్లాం మతాలు ప్రాపంచిక వత్తిడుల వలన శాస్త్రీయ, నాస్తిక వాదుల దాడికి గురవుతాయని నార్మన్ డేనియల్ బాధపడ్డారు. (అదే పుస్తకం పుట 307)
ముస్లిం స్నేహితులను, తోటివారిని బాధపెట్టకుండా ఇస్లాంను నిశిత పరిశీలనకు గురి చేయకుండా ఉండాలని క్రైస్తవ పండితులు భావించారు. ముస్లింలను బాధించే విషయాలు రాసినందుకు క్షమాపణలు చెప్పటం, చర్చనీయాంశాలలో ఎటూ నిర్ణయాలు తీసుకోకపోవటం క్రమంగా అనుసరించారు. ప్రొ. వాట్ మహమ్మద్ జీవిత చరిత్ర రాస్తూ ఖురాన్ ప్రస్తావనలో మహమ్మద్ ఇలా అన్నాడు, దేవుడు ఇలా అన్నాడు అనే మాటలు తొలగించి, ఖురాన్ ఇలా అంటున్నది అని మాత్రమే రాసాడు. (వాట్ మహమ్మద్ ఎట్ మక్కా, అక్స్ ఫర్డ్ 1953, పీఠిక) ఇలాంటి పద్ధతులవలన ప్రాచ్య విషయాల చర్చలో జాగర్త వహించాల్సి వచ్చిందనీ, కొన్నిసార్లు చిత్త శుద్ధి లేకుండా పోవటం జరిగిందనీ బర్నార్డ్ లూయూన్ అన్నాడు. (ఇస్లాం అండ్ లిటరల్ డెమోక్రసీ, అట్లాంటిక్ మంథ్లీ, ఫిబ్రవరి, 1993 పుట 11) అంటే చాలా సున్నితంగా చెప్పినట్లే ప్రొ. వాట్ క్రైస్తవ భక్తుడు. ఖురాన్ దైవవాక్యమని నమ్మడు. ముస్లింల సున్నితత్వాన్ని బాధపెట్టకుండా ఉండేటందుకు ఇస్లాంవాదులు కొన్ని మార్పులు కూడా చేశారు. మూలంలో మార్పులు చేయలేదన్నారు. రిచర్డ్ రాబిన్ సన్ రాస్తూ మేథా సంబంధంగా చిత్తశుద్ధి లేని ధోరణి మతంలో ప్రవేశించిందన్నాడు. వాట్ లండన్ లోని సెయింట్ మేరీ బోల్టన్స్, ఎడింబరోలోని సెయింట్ పాల్స్ పాస్టర్ గా ఉండేవాడు. అతడు ఎపిస్కోవల్ పాస్టర్ కూడా. బ్రిటన్ లో ఆ మాటకొస్తే పాశ్చాత్యలోకంలోనే ఇస్లాం పండితుడిగా అతడి ప్రభావం చాలా ఉండేది. సందేహవాదం, నాస్తికవాదం, కమ్యూనిజం మతానికి బద్ధ శత్రువులుగా ప్రొ.వాట్, సర్ హెమిల్టన్ గిబ్ భావించారు. తూర్పు దేశాల నుండి ఆధ్యాత్మిక ఉత్తేజాన్ని ఆశించటంలో వీరు కార్లైల్ ను అనుకరించారు. వాట్ ఇలా అంచనా వేశారు. ఇస్లాం ముఖ్యంగా ప్రాచ్యలోకం దైవం సార్వభౌమత్వాన్ని నొక్కి చెప్పింది. పాశ్చాత్యలోకం ఇటీవల మానవేచ్ఛపై ప్రాధాన్యత చూపింది. ఈ రెండూ భిన్న మార్గాలలో దారి తప్పాయి. ప్రాచ్య లోకం గ్రహించిన సత్యం నుండి పాశ్చాత్యలోకం నేర్చుకోవాలి. (వాట్, ఫ్రీవిల్, లండన్. 1948 పుట 2) (తుది మాట ప్రాచ్యలోకానిదే. పాశ్చాత్యం నుండి ప్రాచ్యం నేర్చుకునేదేమీ లేదా)
సెక్యులరిజం పట్ల తన జుగుప్సను మతం మత వ్యతిరేకత అనే వ్యాసంలో ప్రొ. వాట్ దాచుకోలేకపోయాడు. సెక్యులరిజం, పదార్థవాద ప్రభంజనం తగ్గుముఖం పడుతున్నదని రాసాడు. (వాట్. రెలిజియన్ ఇన్ ది మిడిల్ ఈస్ట్, పుట. 625-27 మధ్య ప్రాచ్యంలో ఆలోచనాపరులు నేటి సమస్యల తీవ్రతను గ్రహించారు. కనుక వ్యక్తిగత జీవితంలో తలెత్తే సమస్యను ఎదుర్కోవటానికి మతావసరాన్ని గుర్తించారని వాట్ ఇలా రాశాడు.
ఈజిప్టులో ముస్లిం సోదరులూ, సిరియా తదితర చోట్ల ముస్లింలు పర్ష్యాలో ఫైడాయన్ ఇస్లాం, పాకిస్తాన్ లో జమాతే ఇస్లాం కొత్తరకపు ఇస్లాం నియంతృత్వాలను వీటిని ఫాసిజంతోనూ, హిట్లర్ జాతీయ సోషలిజంతోనూ పోలికలున్నాయంటాడు. ఉన్నమాట నిజమే. రాజకీయం దృష్ట్యా ఇది సమర్థనీయం కూడా. విశాల దృష్టితో చూస్తే ఈ చిత్రీకరణ వక్రభాష్యం అవుతుంది. కొన్నిసార్లు ఈ ఉద్యమాలు ప్రజల ఉద్రేకాన్ని, హింసను ఆకర్షణీయమైన నాయకుల కోసం, ఉద్యమ సంఘటితం కోసం వినియోగిస్తారు. గతంలోని వీరోచిత విలువలూ, ఉద్వేగాలూ కావాలంటారు. స్వేచ్ఛగా నిశిత పరిశీలన అణచివేస్తారు. ఐనప్పటికీ మతాన్ని పునరుజ్జీవింప చేయటంలో వీటి ప్రాధాన్యత విస్మరించరాదు. కొత్త ఇస్లాం జన ఉద్యమాలు ఇలాంటి పరిణామాలకు అడ్డుకట్ట వేయవచ్చు. అవి ఫాసిజం, జాతీయసోషలిజం వైపుకు పోవచ్చు.
ఫాసిజాన్ని పొగిడిన తీరు రాజకీయ ఎత్తుగడే. ఫాసిజాన్నిచూసీ చూడనట్లు పోనివ్వమనీ, దాని ప్రత్యక్ష ప్రాధాన్యత గమనించమనీ అంటున్నాడు. పవిత్ర టెర్రరిజాన్ని వాట్ సమర్థిస్తున్నాడు. ముస్లిం సోదరులు అనే సంస్థ టెర్రరిస్టు వ్యవస్థ అని మర్చిపోకూడదు. దీని స్థాపకుడు హిట్లర్, ముసోలినీలను మెచ్చుకున్నాడు. రెండవ ప్రపంచ యుద్ధానంతరం హసన్ స్థాపించిన ముస్లిం బ్రదర్స్ సంస్థ పౌరులపై దాడి జరిపింది. సినిమాలూ, హోటళ్ళపై బాంబులు వేశారు. తగులబెట్టారు. సరిగా దుస్తులు వేసుకోలేదని స్త్రీలను కత్తులతో పొడిచారు అనేక హత్యలు చేశారు.
ఇదంతా మత పునరుజ్జీవనం పేరిట మరిచిపొమ్మంటున్నారు.
మేథస్సును నమ్మక పోవటం, చారిత్రక నిస్పాక్షికతనూ, సత్యాన్ని తృణీకరించడం ఆందోళనకరమైన అంశం. చిహ్నాలను అశ్రద్ధ చేయటం మంచిది కాదనీ, చారిత్రక సత్యంకంటే ఈ చిహ్నాలు ముఖ్యమనీ అన్నారు. (వాట్ ముస్లిం, క్రిష్టియన్ ఎన్ కౌంటర్స్, లండన్ 1991, పుట 116) ఖురాన్ కు పీఠిక రాస్తూ వాట్ నిస్పాక్షిక సత్యాన్నివదిలేసి వ్యక్తిగత అంశానికి అనుకూలత చూపాడు.
యూదులూ, క్రైస్తవులూ, బౌద్ధులూ, ముస్లింలూ ఇతరులూ అనుసరించిన విధానాలు వాస్తవమైనవే. ఇవన్నీ వ్యక్తికి జీవితంపట్ల తృప్తికరమైన అనుభవాన్ని ఇచ్చాయి. వీటిలో ఎక్కువా, తక్కువా అనేవి లేవు. ప్రతిదీ సత్యమే. ఈ దృష్టితో ఖురాన్ సత్యమే. ఖురాన్ దైవానికీ, క్రైస్తవ దైవానికీ విరుద్ధ భావన ఉన్నా అవి తప్పుడువి కావు.
ప్రతి భావన సత్యంలో ఒక భాగమే. ఒక భావన విజ్ఞానానికి విరుద్ధంగా ఉన్నప్పుడు సమస్యలు తలెత్తుతాయి. యావత్తు విధానం మరొక పద్ధతికంటే తక్కువైనదని అనుకోవటానికి వీలు లేదు. జీసస్ ను యూదులు చంపలేదని ఖురాన్ అంటుంది. అంతమాత్రాన ఖురాన్ విధానం యావత్తూ క్రైస్తవులకంటే తక్కువదేమీ కాదు. (వాట్ ఇన్ ట్రడక్షన్ టు ఖురాన్, ఎడింబరో 1977)
మేథస్సు దృష్ట్యా పై వాక్యాలలో చిత్తశుద్ధి లేదు. మానసికంగా వాట్ గమ్మత్తులు చేసి, ఎవరినీ నొప్పించకుండా అందరినీ తృప్తిపరచడానికి ప్రయత్నించాడు. వాట్ పదజాలంలో అస్పష్టత సమస్య అలా ఉంచుదాం. ఖురాన్ పద్ధతి భవన, సంపూర్ణ జీవన అనుభవం అనేవి అస్పష్టాలే. ఇస్లాంపట్ల బ్రిటిష్ ఇస్లాం పండితులు నిశిత పరిశీలన ఎందుకు చేయలేదో అర్థమవుతున్నది. ముస్లిమేతరుడు పరమ సత్యంతో సంబంధం లేకుండా కొనసాగాడు అని వాట్ రాశాడు. మానవుడు ఈ సత్యాన్ని సాధించలేదనే దృష్టి అందుకు కారణం కావచ్చు. సత్యాన్ని సాపేక్షికంగా భావించాడు. మానవుడు ఆధ్యాత్మిక అవసరాలు తీరుతున్న సందర్భంలో నమ్మక వ్యవస్థలను నిశిత పరిశీలన చేయజాలడు. వాట్ చూపిన ధోరణిపై జూలియస్ బెండ తన బిట్రేయల్ ఆఫ్ ది ఇంటలెక్చువల్స్ లో బయట పెట్టాడు.
ఆధునిక మేథావులు విశ్వ సత్యాన్ని, నీతిని జుగుప్సగా చూశారు. సాధారణ మానవుల సేవల్ని దృష్టిలో పెట్టుకున్నారు. సత్యాన్ని ఆమోదిస్తే విశ్వజనీనంగా ఉండటం కష్టం అనుకొన్నారు. ప్రాంతీయ సత్యాలూ, ఫ్రాన్స్ కో బ్రిటన్ కో పరిమితమైన సత్యాలు ఉన్నాయని, విశ్వవ్యాప్త సత్యాలు భ్రమలని భావించి వీరు అనందించారు. (బెండ. పుట. 76, 77 బోస్టన్ 1955)
వీటికి ముస్లిం సత్యం, క్రైస్తవ సత్యం అంటూ వాట్ జోడిస్తూ పోయారు. ప్రతి మతం సరైనదేననీ, ఆయా సాంస్కృతిక ప్రాంతంలో అది సరిపడుతుందని వాట్ అన్నాడు.
1920 ప్రాంతంలో తలెత్తుతున్న జాతీయవాదాన్ని బెండ ఎదుర్కొన్నాడు. బాహ్య సత్యాన్ని విడనాడితే, ఫాసిజానికి పోతామని రసెల్ చూపాడు. హిట్లర్ దృష్టిలో విజ్ఞానం సత్యాన్వేషణ చేస్తుందనే దృష్టి అర్థం లేనిది. అతడి ఆమోద నిరాకరణలు రాజకీయ కారణాలుగానే సాగాయి.
1848 నుండి పెరుగుతున్న జాతీయవాద తీవ్రత హేతు విరుద్దానికి ప్రతిరూపం విశ్వవ్యాప్తమైన సత్యం ఉంటుందనేది నిరాకరించారు. సత్యాన్ని దేశీయంగా చూశారు. హేతువాదం సత్యప్రమాణాలను విశ్వజనీనంగా, రాగద్వేషాతీతంగా చూస్తుంది. మానవుల సంక్షేమానికి అది అవసరం. ఈ విధానాన్ని స్వప్నంగా భావించి నిరాకరించే చోట దీని అవసరం ఎంతైనా ఉంది (రసెల్ ఇన్ సైజ్ ఆఫ్ ఐడిల్ నెస్. పుట.107, లండన్. 1935)
నేటి మన కాలంలో మేథస్సు సాపేక్షతావాదం, ప్రధాన రుగ్మతగా కార్ల్ పాపర్ భావించాడు. వాట్ కు సూటిగా సమాధానం ఇస్తున్నాడా అన్నట్లుగా రాశాడు. వాట్ వంటివారు సాపేక్షతా వాదాన్ని తప్పుడు వాదనలతో ప్రవేశపెట్టిన తీరును పాపర్ పరిశీలించాడు. మన దేవుళ్ళను మన ప్రపంచాన్ని సొంత దృష్టితో చూస్తామని, జనోపేన్స్ తత్వవేత్త అన్నమాటలను పాపర్ ఉదహరించాడు. ఐతే, చారిత్రక, సాంస్కృతిక భూమికలు దాటి నిస్పాక్షిక సత్యానికి వెళ్ళలేమనటం అర్థం లేని మాట.
విమర్శను పరిశీలిస్తూ నిశిత పరిశీలనలు చేస్తూ పోతే, అంచలవారీగా మనం వ్యక్తిగత రాగద్వేషాలను తొలగించుకోవచ్చు. భిన్న సాంస్కృతిక ధోరణులున్న వ్యక్తులు ఫలవంతమైన చర్చలు సాగించనూ వచ్చు. పరస్పరం అభిప్రాయాలు తెలుసుకోవాలనీ, నేర్చుకోవాలనీ సత్యానికి చేరువగా వెళ్ళాలనీ అసక్తి ఉండాలంతే. సాపేక్షతా ధోరణిలోకి పోకూడదు. చర్చలో ఉభయులూ అంగీకరించకపోతే, ఎవరో ఒకరు లేదా ఉభయులూ తప్పు కావచ్చు. అంతేకాని ఉభయులూ సరిగానే ఉన్నారనడం తప్పు. ఉభయులూ తప్పనడానికీ, ఉభయులూ సరిగానే ఉన్నారనడానికీ తేడా ఉన్నది. అలంకారాలు శబ్దాలతో వీటిని మాయపుచ్చవచ్చు. సొంత విమర్శ చేసుకోవటం పెద్ద ముందంజ వేయటం. అవతలి వ్యక్తి సరిగా చెపుతున్నాడనటం నేర్చుకోవాల్సిన అంశం. ఉభయులూ సరిగానే చెపుతున్నారని భావిండం మాత్రం ప్రమాదం. ఉభయులూ తప్పుగా భావించడం సర్వ సాధారణంగా జరగవచ్చు. బద్ధకంతో స్వీయ విమర్శను నిరాకరించరాదు. సాపేక్షతావాదాన్ని స్వీకరించనూ రాదు. (పాపర్ ది ఓపెన్ సొసైటీ అండ్ ఇట్స్ ఎనిమీస్. ద్వితీయ సంపుటి. పుట. 369-88, లండన్, 1969)
వాట్ వాదంలో జనించే తార్కిక ఫలితాలను అతడే అంగీకరించకపోవచ్చు. మత విశ్వాసాలలో అధిగమించేవి లేవంటూ వాట్ రాసినప్పుడు అందులో హెచ్చుతగ్గులకు తావులేదు. ఏకేశ్వరాధన ఎక్కువనీ, బహుదేవతారాధన తక్కువనీ ఎలా అంటారు. సైంటాలజీ చర్చికి, బగాయూస్ కూ, మూనీస్ కూ, రెవరెండ్ జోన్స్ కూ, చిల్డ్రన్ అఫ్ గాడ్ కూ ప్రొ. ఎవాన్స్ చర్చించిన కల్ట్స్ ఆఫ్ అన్ రీజన్ కూ సమాన గౌరవ ప్రపత్తులు ఎందుకివ్వరు.... ఎక్కువ, తక్కువ, వాస్తవం అనే మాటల్ని వాట్ వాడటానికి లేదు. పైగా ఈ ధోరణిలో ఆధిక్యత ఆపాదించుకునే అవకాశం ఉన్నది. శాంతాక్లాజ్ వంటి నమ్మకాలుగల క్రైస్తవులూ, ముస్లింలను ప్రశ్నించరాదనీ, అలాంటి నమ్మకాలు చెడు చేయకపోగా ఊరట కలిగిస్తున్నాయనీ వాట్ ధోరణిగా కనిపిస్తుంది. భ్రమలతోగాక, సాహసోపేతంగా సత్యాన్ని అన్వేషించటంలోనే మానవుడు పురోగమించగలడు అని రసెల్ రాశాడు.
చారిత్రక సత్యం కంటే సంకేతపరమైన సత్యం ముఖ్యమని వాట్ అంటాడు. ముస్లింలూ, క్రైస్తవులూ ఇందుకొప్పుకోరు. జె.ఎల్. థామ్సన్ ఇలా రాశాడు. బైబుల్ పాత నిబంధన పండితులు ఇజ్రాయల్ సందేశానికి చరిత్ర ముఖ్యమనీ, ఇజ్రాయల్ తొలి సంప్రదాయాలలో చారిత్రకత ఆమోదించటం క్రైస్తవ విశ్వాసానికి మూలమనీ అంటారు. జీవులకు ఇచ్చిన హామీ దృష్ట్యా మరొకసారి దేవుడు బ్రతికి రావటం కూడా అంతే ప్రాధాన్యత వహించిందంటారు. రోలండ్ డివాక్స్ రాస్తూ బైబుల్ సంప్రదాయాలకు చారిత్రక వునాదులను శాస్త్రీయంగా చూపటం చాలా ముఖ్యం అంటాడు. ఆ విశ్వాసం అబద్ధమైతే మిగిలిన నమ్మకాలన్నీ పోతాయంటాడు. నమ్మకం నిలబడాలంటే మత చరిత్రకూ బాహ్య సత్యానికీ సన్నహిత సంబంధం ఉండాలంటాడు. ఇజ్రాయల్ మత చరిత్రను నిరాకరిస్తే, విశ్వాసాన్నికూడా తృణీకరించినట్లే అవుతుందన్నాడు. (థామ్సన్, హీస్టీరిసిటీ ఆఫ్ ది పేట్రియార్కల్ నెరేటివ్స్, లండన్, 1974, పుట. 326-27)
వాట్ వలె రెండు నాలుకల ఆలోచన చేసిన నార్మన్ డేనియల్ కూడా ఇస్లాంపట్ల ఉదాసీనత చూపిన పాశ్చాత్యుడే. అతడిలా రాశాడు.
మహమ్మద్ ను పవిత్రంగా చూడటం క్రైస్తవులకు అవసరం. ముస్లింలు ఎలా చూస్తారో అలాగే చూడాలి. లేకుంటే ఇస్లాం అవగాహనకు దూరమైనట్లే. అంతమాత్రాన మహమ్మదు పవిత్రుడనీ, మహమ్మద్ ద్వారా దేవుడు మాట్లాడాడనీ ముస్లింలు భావించినట్లుగా వీరు నమ్మనక్కరలేదు. జనం అలా నమ్మినంత మాత్రాన అది వాస్తవం కాబోదు. కాని ఆధ్యాత్మిక మానసిక ధోరణి ఆ విధంగా లేకుంటే ప్రగతి సాధ్యంకాదు. (డేనియల్. పుట. 305)
క్షమాపణ వాదుల వలన అవగాహన లేకుండా పోయిందని రాడిన్ సన్ వ్యాఖ్యానించాడు. బాహ్యసత్యం అనే భావన డేనియల్ కూడా గ్రహించలేకపోయాడు. ఏకేశ్వర వాదులు సాగించిన ఆధ్యాత్మిక పోరాటంలో డేనియల్, వాట్, ఫ్రెంచి పండితుడు లూయీ మేసిబ్నాస్ కొట్టుకు పోయారు. 1962లో వేటికన్ మత సంస్థ కూడా దైవం, జీసస్ ప్రవక్తలను గురించి ప్రధాన సత్యాలను ఇస్లాం మానవాళికందించిందన్నారు.
క్రైస్తవ యూదు మత నాయకులు చేతులు కలిపి, విభేదాలు విస్మరించి, రష్డీని చంపమని ఇచ్చిన పిలుపుకు నిసరసన తెలుపకపోగా, వారూ ఖండించారు. అయోతుల్లాకంటే మించిపోయి వేటికన్ పత్రిక (L’ OSSEREATORE ROMANO) రష్డీని దుయ్యబట్టింది. న్యూయార్క్ కార్డినల్ జాన్ ఓ కానర్ రష్డీ పుస్తకం చదవద్దని కేథలిక్కులకు పిలుపు ఇచ్చాడు. లాయన్స్ కు చెందిన కార్డినల్ అల్బర్ట్ డికోత్రే శటానికి వెర్ససెస్ ను మతానికి అవమానంగా పేర్కొన్నాడు. ఇజ్రాయల్ లో యూదు పురోహితుడు అవర్ హోమ్ షపీర పుస్తకాన్ని నిషేధించమన్నాడు. ఇవ్వాళ ఈ మతాన్ని వ్యతిరేకించినట్లే రేపు ఇంకొకటి వ్యతిరేకిస్తారు అని అన్నాడు. (పైప్స్, రష్డీ ఎఫైర్, న్యూయార్క్, 1990 పుట. 164) కేంటర్ బరీ ఆర్చి బిషప్ డా. కారే రష్డీ పుస్తకాన్ని ప్రవక్తపై దారుణమైన విమర్శగా భావించి ముస్లింలు నొచ్చుకోవటాన్ని అర్థం చేసుకోవచ్చు అన్నాడు.
ఖురాన్ లో జీసస్ క్రైస్త్ పై దారుణ విమర్శ గురించి డా.కారే ఏమంటారు... శిలువపై నాటడాన్నికొరాన్ నిరాకరిస్తుంది. మహమ్మద్ మత శాస్త్రంలో జీసస్ క్రైస్తుకు సంబంధించిన అన్ని విషయాలనూ కాదనటమో, వక్రీకరించటమో జరిగిందని రైస్ రాశాడు. (ముస్లిం వరల్డ్, సంపుటి 1, సంచిక 2, ఏప్రిల్, 1911).
ఇస్లాం ఒక్కటే క్రైస్తవ వ్యతిరేక మతం ఆని ముస్లిం వరల్డ్ పేర్కొన్నది. నాస్తికులను శిక్షించే విషయంలో ఆనందాన్ని పొందటం కాసేపు డా. కారే అతి నిద్రావస్త నుండి మేల్కొని, నేషనల్ గ్యాలరీలో సిలువపై కొట్టిన చిత్రాన్ని ముస్లింలు రంగుపూసి ధ్వంసం చేసిన విషయాన్ని పట్టించుకుంటారా ? సిలువపై కొట్టినదేదైనా ముస్లింలకు అవమానకరమే. ఖురాన్ దైవవాక్యం గనుక. అందులో సిలువను నిరాకరిస్తున్నారు గనుక వారలా అనుకొంటున్నారు.
ఎకనామిస్ట్ పత్రిక ఇలా రాసింది. స్వేచ్ఛాభావన వెల్లడించడానికి వ్యతిరేకంగా మత వురోహిత వర్గాలు ఏకమవుతున్నాయి. రష్డీ వ్యవహారంలో అభిప్రాయ స్వేచ్ఛను కొందరు ముస్లింలు అర్థం చేసుకోకపోవడం విశేషం కాదు. చాలామంది పాశ్చాత్య మేథావులు అర్థం చేసుకోకపోవమే గమనించాలి (పైప్స్ పుట 165).
క్రైస్తవ, యూదు మేథావుల నుండి అనుకోకుండా వచ్చిన మద్దతును ఇరాన్ ఆహ్వానించింది. వలసవాదుల ప్రయత్నాలూ, దైవ విలువల తృణీకరణ, ప్రవక్తల పట్ల అవమానం వీరు అవగాహన చేసుకున్నారు (పైప్స్ పుట 166) ది లాస్ట్ టెంప్టేషన్ ఆఫ్ క్రైస్త్ ప్రదర్శనకు వ్యతిరేకంగా క్రైస్తవులతోపాటు ముస్లింలు ఇస్తాంబూల్ లో చేతులు కలిపి రుణం తీర్చుకున్నారు.
1920 నుండి పాశ్చాత్య లోకంలో వామపక్ష ఉదార మేథావులు యూరోప్ వలన, సామ్రాజ్యవాదం పట్ల నిరసన చూపారు. రసెల్ ఇలా రాశాడు. పాలితజాతులపట్ల, అణగారిన ప్రజలలో ఉన్నత ధర్మాలున్నాయని నమ్మి కొందరు వారిని అభనందించటం ప్రారంభించారు. (రసెల్. పుట. 58, ఆన్ పాప్యులర్ ఎస్సేస్, న్యూయార్క్, 1950. ఇస్లాంను, ఇస్లాం దేశాలనూ విమర్శించటం జాతి విద్వేషంగా, పాశ్చాత్య కుట్రగా పరిగణించారు. ఇస్లాం చట్టంపై రోమన్ చట్టం ఎంత ప్రభావం చూపిందో పెట్రిషియా క్రోన్ రాశారు.
ఇస్లాంకు అలాంటి చట్టాలు నొచ్చుకునేవిగా ఉన్నాయి. యూదులతో పోల్చితే గ్రీస్, రోమన్ ప్రభావాలు అంత బాధాకరమైనవి కాకపోవచ్చు. ఇస్లాం కళలూ, శాస్త్రం, తత్వంలో మాత్రమే ఎలాంటి డొంకతిరుగుడూ లేకుండా ప్రభావాల చర్చ జరుగుతున్నది. పాతకాలపు ప్రాశ్చ్యవాది స్థానంలో నేడు ఆధునిక చరిత్రకారుడు చోటు చేసుకున్నాడు. పాశ్చాత్య సామాజిక శాస్త్రజ్ఞుడూ, అరబ్ వాది, ముస్లింల మంచితనంకోసం తిప్పలు పడుతున్నారు. ఇస్లాం నాగరికత బోధించడంలోనూ, అధ్యయనం చేయడంలోనూ అది పుట్టిన స్థానాన్ని విస్మరిస్తున్నారు. (క్రోస్, రోమన్, ప్రోవిన్షియల్ అండ్ ఇస్లామిక్ లా. కేంబ్రిడ్జ్. 1987, పుట 6.7)
1960-70 నాటికి పశ్చిమ యూరోప్ లో కొందరు ముస్లింలు బయలుదేరి ప్రతి నాగరికత కొన్ని అద్భుతాలతో కూడిందని చెప్పారు. బహుళ సంస్కృతి కర్మాగారాలు, విద్యాసంస్థలూ వెలువడ్డాయి. విమర్శ అంటే జాతివాదం, కొత్త వలసవాదం, ఫాసిజం అని పిలిచాడు.
1920 నుండి 50 వరకూ వామపక్ష మేథావులు కమ్యూనిజాన్ని విమర్శించటానికి నిరాకరించినట్లే రష్డీ వ్యవహారంలో సమాంతర ధోరణులు కనిపించాయి. కప్పి పుచ్చేకుట్ర అని రసెల్ ఈ వాతావరణాన్ని చిత్రించాడు. (రసెల్ థియరీ అండ్ ప్రాక్టీస్ అఫ్ బోల్డ్స్ విజం, పుట 165, లండన్, 1921) 1920లో సాహసోపేతంగా సోవియట్ రష్యాను, కమ్యూనిజాన్ని విమర్శించినప్పుడు, వామపక్షాలు దాడిచేసాయి. వి.యస్. నయపాల్ యమోంగెస్ట్ ది బిలీవర్స్ అనే పుస్తకంలో ఇరాన్ విప్లవాన్నీ, సున్నితంగా ఇస్లాంను విమర్శించినందుకు మేథావులూ, ఇస్లాం వాదులూ విరుచుకుపడ్డారు.
లెనిన్, స్టాలిన్ కమ్యూనిజం గురించి వామపక్ష మేథావులు అబద్ధాలనెలా దిగమింగకున్నారో, జార్జి ఆర్ విల్, ఆర్థర్ కోస్ట్లర్, రాబర్ట్ కాక్వేస్టు చూపారు. రాజకీయంగా సరిగా ఉంటే, సత్యంతో పనిలేదని ఆధునిక ధోరణిగా ఉంది. అలాంటప్పుడు విమర్శ, చర్చ అసమ్మతికి గురవుతున్నాయి. ఏమాత్రం విమర్శించినా అది నేరంగా, ద్రోహంగా భక్తులు భావిస్తున్నారు. (కోస్లర్, ది యోగీ అండ్ ది కమిసార్, 1946 న్యూయార్క్ పుట 125) నిశిత పరిశీలనా దృష్టిని అరమరికలు లేకుండా ధారాదత్తం చేశారని కోస్లరంటున్నాడు. (పుట 127).
స్టాలిన్ నిర్బంధ కార్మిక, శిబిరాల గురించి సాత్రే ధోరణితో, ఖొమినీ దారుణాలపట్ల ఫూకో ప్రవర్తనను పోల్చవచ్చు. (పుట. 127) ఫ్రెంచి కార్మికులు నిరుత్సాహపడకుండా ఉండాలంటే నిర్బంధ శిబిరాల గురించి పట్టించుకోరాదని, లేదా సమాచారం దాచిపెట్టాలని సాత్రే భావించాడు. (కాంక్వెస్ట్, ది గ్రేట్ టెర్రర్, లండన్ 1968 పుట. 678-79) ఇరాన్ లో సంఘటనలపట్ల ఉత్సాహం చూపిన ఫూకో 1976 అక్టోబరులో రాస్తూ, వునర్వికాస కాలం నుండీ పాశ్చాత్యలోకం విస్మరించిన, క్రైస్తవ సంక్షోభానికి గురైన, రాజకీయ ఆధ్యాత్మికత సాధ్యమేనన్నాడు. (ఎరిబన్ పేజి 305-306) పైకల్ ఫూకో పారిస్ 1989) ఇస్లాంను ఫూకో అభనందించడంపట్ల ఒక ఇరాన్ యువతి ఇలా రాసింది.
పాతికేళ్ళ నిశ్శబ్దం, అణచివేత అనంతరం ఇరాన్ ప్రజలకు అటు షా రహస్య పోలీసా సావక్, ఇటు మత మూర్ఖత్వమే మార్గాంతరాలా ? ఆధ్యాత్మికతా ? ఇస్లాంలోకి పోవడమా.. సౌదీ అరేబియా అలానే పయనిస్తున్నదిగా. ప్రేమికులు, దొంగల సమానంగా తలలు తెగతున్నాయి. పాశ్చాత్య వామపక్షం వారికి, ఇస్లాం అభిలషణీయమే మిగిలినచోట్ల ! నా వలే అనేకమంది ఇరానియన్లు గందరగోళ పడుతున్నారు. ఇస్లాం ప్రభుత్వం అనే భావనే నిరాశ కలిగిస్తున్నది. వారేం అంటున్నారో ఇరానియన్లలకు తెలుసు. ఇరాన్ పొరుగు దేశాల్లో ఫ్యూడల్, తప్పుడు విప్లవ వాదుల్ని దాచి పెడుతున్నారు. పాకిస్తాన్, ఇండోనేషియా, ట్యునీషియా వంటిచోట్ల అణగారిన ప్రజలకు చెప్పుకునేందుకు ఇస్లాం తప్ప మరో మార్గం లేదు. ఇస్లాం చట్టం ఎంత దారుణమైందో పాశ్చాత్య ఉదార వామపక్షీయులు గ్రహించాలి. మార్పును కోరేవారికి ఇది భారమైంది. రోగంకంటే చికిత్స ఘోరమైంది.
ఇస్లాంను ఉద్వేగపూరితంగా భావించే వామపక్షీయుల పట్ల వచ్చిన విమర్శకు, అర్థం కాని ధోరణిలో ఫూకో సమాధానం ఇచ్చాడు. కొమిని అధికారం చేపట్టిన అనంతరం తలలు తెగి పడుతుంటే, కొమినిపట్ల అతడి రాజకీయ ఆధ్యాత్మికత పట్ల ఫూకో విమర్శించకుండా తన భావాలకు ఏ మాత్రం బాధపడకుండా ఉన్నాడు.
కమ్యూనిజం ఇస్లాంపట్ల సానుభూతిగలవారు పాశ్చాత్య ద్వేషాన్నిచూపడం ఫూకోవంటి వారు చేస్తూ, ప్రాచ్య ఆధ్యాత్మికతను విస్మరించినట్లు పేర్కొన్నారు. ఈ విషయమై విపుల వివరణ అవసరం. ఇస్లాం నాగరికతకు పాశ్చాత్య విలువలు అన్వయిస్తే, సామ్రాజ్యవాదం, జాతివాదం, వలసవాదం అని ఖండిస్తారు. పాశ్చాత్య విశ్వవిద్యాలయాలలో చక్కగా జీతాలు పుచ్చుకునే మేథావులే వీరంతా.
ఫ్రెంచి కమ్యూనిస్టు పార్టీ పొలిటికల్ బ్యూరో సభ్యుడు, పార్టీ అధికారిక తత్వవేత్త అయిన రోజర్ గరాడే విషయం పరిశీలించి ముగిద్దాం.
స్టాలిన్ మద్దతుదారు, క్వశ్చేవ్ ను వెనకేసుకొచ్చిన వ్యక్తి, ఉత్తరోత్తరా పశ్చాత్తాపం చెందాడు అని గరాడే గురించి మూసే రాశాడు. (లైఫ్స్ ఆఫ్ మైకల్ ఫూకో, లండన్ 1990 పేజి. 110) ముఠా తగాదాలలో గరాడేను ఫ్రెంచి కమ్యూనిస్టు పార్టీ బహిష్కరించిన తరువాత, అనేక అవతారాలెత్తాడు. మార్క్సిస్టు హ్యూమనిజం అన్నాడు కొన్నాళ్ళు. చివరకు ఒక నియంతృత్వంలోకి మారి, ఇస్లాం అన్నాడు. ఇస్లాం నుండి మారితే, శిక్ష మరణం గనుక, బహుశ అందులోనే ఉంటాడనుకుందాం.
ఇస్లాం వాదులు మార్పుకు వ్యతిరేకంగా మౌలిక శక్తుల్ని అట్టిపెడుతున్నాయని, సంస్కరణ వాదులు, సెక్యులరిస్టులు దుయ్యబడుతున్నారు. ఈ విషయమై ప్రొఫెసర్ బెర్నార్డ్ లూయీస్ ఇలా అంటాడు. కొత్తవారు మిత్రులు సైతం అలా విమర్శించడం కద్దు. ఇస్లాం వాదులకు, ఇస్లాం ఛాందసులకూ మధ్య కనిపించే పోలిక పై పైనేగాని, వాస్తవం కాదు. తేడా గమనించకుండానే సంస్కరణ వాదులు విమర్శిస్తున్నారు (లూయీస్ పుట 194 నోట్ 1, రైజ్ అండ్ స్లేవరి అండ్ ది మిడిల్ ఈస్ట్ 1990 న్యూయార్క్)
వాట్, డేనియల్, ఎస్పోజిటనో వంటి పండితులు నిష్పాక్షిక చారిత్రక వాదులు గాక, కేవలం క్షమాపణవాదులుగా ఉన్నారు. నిష్పాక్షికతను వాట్ నిరాకరించాడు. ముస్లిం భక్తుడు ఎలా సమర్థిస్తాడో అలాగే వాట్ కూడా. మహమ్మద్ ఆధ్వర్యాన 600 నుండి 900 యూదుల్ని చంపడాన్ని వెనకేసుకొచ్చాడని, నార్మిన్ స్టిల్ మన్ అన్నాడు. (పేజి. 16, ఫిలడెల్ఫియా) గ్రీక్ తత్వంతో అల్గజాలి తారసపడినప్పుడు, ఇస్లాం మత సిద్ధాంతం విజయవంతంగా బయటపడిందని వాట్ భావించాడు. (వాట్. ది ఫెయిత్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ అల్ ఘజాలి, లండన్ 1967 పేజి 15) మధ్య ప్రాచుర్యంలో సమస్యలకు క్రైస్తవ పరిష్కారం సూచిస్తూ ప్రొఫెసర్ లూయీస్ మతాన్ని, ప్రభుత్వాన్ని వేరు చేయాలన్నాడు. (లూయీస్, పేజి 186, రైజ్ అండ్ స్లేవరి యిన్ ది మిడిల్ ఈస్ట్ 1990, న్యూయార్క్)
ఇటీవల ఒక బ్రిటిష్ యూనివర్సీటీ సౌదీ అరేబియా వత్తిడి వలన ఇస్లాం అధ్యయనం చెప్పే లెక్చరర్ను ఉద్యోగం నుండి తొలగించింది. అతడు ఇస్లాంను చెప్పే తీరు తమకు నచ్చలేదని సౌదీ పోషకులు అన్నారు. (ఈస్టర్ మన్ న్యూ జెరూసలేయ్య్ లండన్ 1992, పేజి 92-93)
అల్జీరియా నుండి బాగా చదువుకున్న ఒక ముస్లిం మిత్రుడు నా పుస్తకాలను చూస్తూ, రస్సెల్ రాసిన వై ఐ యామ్ నాట్ ఎ క్రిస్టియన్ పట్టుకున్నాడు. సంతోషంతో ఎగిరి గంతేశాడు. క్రైస్తవానికి రస్సెల్ గ్రంథం చావు దెబ్బగా భావించాడు. రస్సెల్ వాదనే ఇస్లాంకూ వర్తిస్తుందని అతడు గ్రహించలేదు. దేవుడు అనే చోట అల్లా అని పెడితే, మా మిత్రుడు గూటి నుండి బయట పడతాడా... నిషే రాసిన దానిలో దేవుడు బదులు అల్లా అని రాస్తే నా మిత్రుడు షాక్ తినడా ?
గాడ్ యీజ్ డెడ్ అన్నాడు నిషే. అక్కడ మార్చితే అల్లా మరణించాడు అవుతుంది.
పాశ్చాత్య లోకంలో వస్తున్న శాస్త్రీయ సామాజిక మేథా రంగపు పరిణామాల పట్ల ముస్లింలు ఉదాసీనంగా ఉండజాలరు. వాటి ప్రభావం అందరిపైనా ఉంది. నిషే ఫ్రాయిడ్, మార్క్స్, ఫ్యూయర్ బాహ్, హెన్నెల్, స్ట్రాస్, బాయర్, వ్రెడి, వెల్స్, రెనాన్ వంటి వారి భావాలు తాత్విక ఫలితాల నుండి ముస్లింలు దాగి ఉండజాలరు. ఇస్లాం విషయమై, మతం అద్భుతాల గురించి రాసింది. అన్వయించుకోవాలి. పాత, కొత్త బైబిల్ లో అబ్రహాం, ఇస్మాయిల్, ఇసాక్, జాకబ్, మోసెస్, డేవిడ్, జోనా, ఇనాక్, నోవా, జీసస్ ప్రస్తావనలు ఖురాన్ లో ఉన్నాయి. 19వ శతాబ్దిలో జర్మనీలో బైబిల్ పట్ల, మతం పట్ల నిశిత పరిశీలన సాగింది. బైబిల్ లో జోనా అనే వ్యక్తి ఎప్పుడూ లేడని, పెంటకాక్ ను మోసెస్ రాయలేదని బైబిల్ పండితులు చెబుతుంటే, అలాంటి పరిశీలన ఖురాన్ కు కూడా వర్తిస్తుంది.
పాశ్చాత్య శాస్త్రీయ ఆలోచనకు ఖురాన్ తట్టుకుంటుందా ? మానవుడు, సృష్టి గురించి డార్విన్ పరిణామ సిద్ధాంతం చావు దెబ్బ తీసిందిగదా, ఖురాన్, బైబిల్ కూడా ఆదాం, ఈవ్ ప్రస్తావన చేశాయి. శాస్త్రీయ పరిశీలన ఫలితాలు చాలామంది క్రైస్తవులు అంగీకరించి, సర్దుకుపోతున్నారు. బైబిల్ ప్రస్తావించిన పూర్వీకుల్ని అంటిపెట్టుకోవడం లేదు.
ముస్లింలు ఇంకా మొదటి అడుగు వేయాల్సి ఉంది.
------

2వ అధ్యాయం
2వ అధ్యాయం
ఇస్లాం
ఇస్లాం చరిత్రలో ఇతర ప్రభావాలను కలుపుకు పోవడం ప్రధాన ఘట్టం దీని స్థాపకుడు మహమ్మద్ కొత్త భావాలు వెల్లడించలేదు. పారమార్థికానికీ, అనంతానికీ, మానవుడికీ గల సంబంధాలను గురించి లోగడ ఉన్న భావాలకు ఆయన మెరుగులు దిద్దలేదు. మత భావాల, కట్టుబాట్ల కలగాపులగమే అరబ్బు ప్రవక్త సందేశం, యూదు, క్రైస్తవ, తదితరులతో సంబంధాల వలన ఆయన ప్రేరేపితుడై తన భావాలు సూచించాడు. (ఇగ్నజ్ గోల్డ్ జిహర్, పుట 4-5 ఇన్ ట్రడక్షన్ టు ఇస్లామిక్ థియాలజీ అనువాదం ఆండ్రాస్, రూత్ హమోది 1981 ప్రిన్స్ టన్)
మహమ్మద్ సొంత ఆలోచన గలవాడు కాదు. కొత్త నీతి సూత్రాల్ని అతడు రూపొందించలేదు. అప్పట్లో ఉన్న సాంస్కృతిక సంపద నుండి స్వీకరించాడు. ఈ కలగాపులగ స్వభావాన్ని ఇస్లాంలో చాలాకాలం గుర్తించారు. ఇస్లాం కొత్త మతం కాదని మహమ్మద్ కు తెలుసు. లోగడ ఉన్న గ్రంథాలలోనివే ఖురాన్ పేర్కొన్న దైవదత్త సూత్రాలని తెలుసు. యూదు, క్రైస్తవ తదితర మతాలతో అనుబంధాన్నిప్రవక్త గుర్తించాడు. హేదెన్, పేగన్ అరబ్బుల నమ్మకాలు, ఆచారాలను ప్రవక్త ఇస్లాంలోకి తెచ్చాడని ముస్లిం వ్యాఖ్యాతలు అల్ షరెస్తానీ వంటివారు గుర్తించారు. మక్కా యాత్రకు సంబంధించిన క్రతువులలో ఇది మరీ కనిపిస్తుంది. అయినా తమ మతం సరాసరి స్వర్గం నుండి వచ్చిందనీ, దేవుని నుండి గాబ్రియల్ స్వయంగా ఖురాన్ ను మహమ్మద్ కు ఇచ్చాడని ముస్లింలు నమ్ముతారు. ఖురాన్ అనాది అని, స్వర్గంలో సృష్టి అయిందని, ఫలకాలపై అట్టి పెట్టిన తీరులో సంక్రమించిందనీ భావిస్తారు. (సురా 85.21, 6.19, 97) ఇస్లాంకు మూలం దైవం ఏ సందర్భంలోనైనా మానవుడి జోక్యం ఉందనడం అర్థరహితం, ద్రోహం అంటారు.
ఖురాన్కు మానవ ఆధారాలు వెలికి తీస్తే, మొత్తం కట్టడమంతా కుప్పకూలుతుందనే భయం అనుకోని రీతిలో ముస్లింలలో ఉందేమో రెనాన్ ఇలా అంటాడు. మతాలు వాస్తవాలు. వాటిని వాస్తవాలుగానే చర్చించాలి. చారిత్రక విమర్శకు గురి చేయాలి. (అనటోల్ ఫ్రాన్స్. ది అన్ రైజస్ డాన్ లో ఉదహరించాడు. లండన్ 1929 పుట 110-11) రేనాక్ ఇలా చెప్పాడు. పిడి వాదంతో ప్రభావితం కానివారు మతేతరంగా పరిశీలిస్తే ఇస్లాం పుట్టు పూర్వోత్తరాలు చారిత్రక విషయాలు తెలుస్తాయి. (రెనాక్ పుట. 352 పారిస్ 1984 హిస్టరీ ఎట్ పెరోల్) అప్పుడే చారిత్రకంగా మహమ్మద్ ను తెలుసుకుంటాం. అతడి విశేష జీవితాన్ని మానవ చరిత్రలో భాగంగా చూస్తాం. ముస్లింలకు ముస్లిమేతరులకు సెక్యులర్ అర్థం అవగాహన అవుతుంది.
ఇస్లాంపై జొరాస్ట్రియన్ ప్రభావాన్ని ఇగ్నజ్ గోల్డ్ జిహర్ చూపాడు. అలాగే హెన్రీ కోర్బిన్ కూడా చూపాడు. యూదు ప్రభావాన్ని గైగర్, టోరెట్, కాష్ లు చూపారు. క్రైస్తవ ప్రభావాన్ని రిచర్డ్ బెల్ సమూలంగా పరిశీలించారు. శాబియనిజం, ఇస్లాంకు ముందు అరేబియా ప్రభావాలను వెల్ హాసన్ నాల్ డెక్ హర్ గ్రోంజే, రాబర్ట్ సన్ స్మిత్లు పరిశోధించారు. ఖురాన్ ఇతర మాటల గురించి ఆర్థర్ జెఫ్రీ చూపారు. జూమర్ ఇలా అంటాడు. ఇస్లాం కొత్తగా కనుగొన్నది కాదు. అదొక కలయిక. అందులో కొత్త ఏదీ లేదు. పాత కొత్తల కలయికను మహమ్మద్ కలిపి, మానవ రుగ్మతలకు పరిష్కారాలుగా, కత్తితో వాటిని సాధించాల్సిన తీరు చూపాడు. (జూమర్ పుట. 24 ఇస్లాం. ఎ. ఛాలంజ్ టు ఫెలియ్ న్యూయార్క్ 1908)
అరేబియా దేవతలు
ఖురాన్ లో చాలాచోట్ల హిదెన్ సంప్రదాయాలకు ఇస్లాం రంగు పులిమారు. (జెఫ్రి. ది ఫారిన్ వకాబ్యులరీ అఫ్ ఖురాన్, బరోడ, 1938 పేజి 1) ఉదాహరణకు సుక 113 దయామయుడైన దైవం పేరిట దోషానికి దూరంగా సూర్యోదయంలో శరణు కోరతాను. రాత్రిళ్ళ దోషాలకు దూరంగా రక్షణ వేడుతాను. పాప పిశాచాలకు దూరంగా ఉండాలని కోరుకుంటాను.
ప్రాచీన అరబ్బుల నుండి ఇస్లాం అనేక మూఢనమ్మకాలనూ, మక్కా యాత్రకు సంబంధించిన కర్మకాండను స్వీకరించింది. (సుర. 2.153, 22.28-30, 5.1-4, 22-37) కొందరు ప్రాచీన దేవతలకు సంబంధించి కూడా పేగన్ వాదం నుండి స్వీకరించినట్లు తెలుస్తుంది. (సుర.53.19.20, 71.22.23) జిన్ (గిలి, అగ్ని దేవతలు) అద్ ధాముద్ కు చెందిన జన గాథల్లో కూడా పేగన్ ఆధారాలున్నాయి.
యాత్ర
యాత్రకు సంబంధించిన ఆధార విషయాలను అల్ మారి జలాలుద్దీన్ రూమీ, ఖలీఫ్ ఉమర్, అమర్ లు ప్రస్తావించారు. (అలీ దస్తీ. పుట 94. ట్వెంటీత్రీ ఇయర్స్, ఏ స్టడీ ఆఫ్ ఎ ప్రాపటిక్ కారియర్ ఆఫ్ అహమ్మద్, 1985. లండన్ పుట. 1, 185, జమర్ ది ఇన్ ఫ్యూయన్స్ ఆఫ్ యానిమిజం ఇన్ ఇస్లాం, లండన్. పుట. 150, 148).
యాత్రకు సంబంధించి జరుగుతున్నదంతా ఇస్లాంకు ముందున్న ఆధారమే. అదంతా ఇస్లాంలోకి యథాతథంగా స్వీకరించారు. (జిమర్ పుట 150) ముస్లింలు 12వ మాసంలో మక్కా యాత్ర హజ్ జరుపుతారు. ఇది విధిగా జరపాలని ఖురాన్ ఆదేశిస్తున్నది. ఆరోగ్యవంతులూ, తగిన ఆదాయం ఉన్నవారూ జీవితంలో ఒకసారైనా హజ్ యాత్ర జరపాలి. మొదటి 7 రోజులూ ఎప్పుడు జరిపినా 8. 9. 10 రోజులు మాత్రం దూహల్ హిజా మాసంలో జరపాలి. 8వ రోజున ఈ హజ్ యాత్ర ప్రారంభం అవుతుంది.
మొదటి 5 రోజూలు
మక్కాకు వెలుపల కొన్ని మైళ్ళ దూరాన చేరుకున్న యాత్రికులు పవిత్ర మానసిక స్థితికి సిద్ధపడతారు. ప్రార్థనలు జరిపి అతి సాధారణ దుస్తులు ధరించి పవిత్ర మక్కా ప్రాంగణంలో ప్రవేశిస్తారు. అక్కడ జంతువులను చంపరాదు. మొక్కలు పీకరాదు. హింస చేయరాదు. లైంగిక సంపర్కాలు ఉండరాదు. మక్కా పవిత్ర మసీదులో ప్రార్థనలు జరిపిన తరువాత కాబాకు తూర్పు దిశగా ఉన్న నల్లరాతిని ముద్దు పెట్టుకుంటారు.
తరువాత యాత్రికుడు కాబా చుట్టూ 7సార్లు ప్రదక్షిణలు చేస్తాడు. మూడుసార్లు వేగంగానూ, నాలుగుసార్లు నెమ్మదిగానూ చేస్తాడు. కాబా చుట్టూ తిరిగేటప్పుడు యామని మూల మరొక పవిత్రమైన రాతిని ముట్టుకొని ముద్దు పెట్టుకుంటాడు. ఇబ్రహీం అనే చోటుకు వెళ్ళియాత్రికుడు కాబా
వైపుకు తిరిగి అబ్రహాం ప్రార్థించిన చోట ప్రార్థనలు జరిపివచ్చి నల్లరాతిని ముద్దు పెట్టుకుంటాడు. సమీపంలో ఉన్న జమ్ జమ్ అనే పవిత్ర బావిని సమీపిస్తాడు. ముస్లిం సంప్రదాయం ప్రకారం హగర్, ఇస్మాయిల్ అందులో నీరు తాగారు. వీరిరువుర్నీ పాతిపెట్టిన చోట, మహమ్మద్ మక్కా నుండి జెరూసలేం పోతూ నిద్రించాడంటారు. దీనిని అల్ హిజర్ అంటారు. యాత్రికులు అక్కడకు వెళతారు.
6 నుండి 10వ రోజు వరకు
యాత్రికుడు 24 గేట్లలో ఒక దాని నుండి పవిత్ర మసీదు వెలుపలకు వస్తాడు. అక్కడ అల్ సఫా అనే కొండ ఎక్కుతూ ఖురాన్ సూత్రాలు చదువుతాడు. అల్ సఫా శిఖరం నుండి అల్ మర్వా శిఖరానికి 7 పర్యాయాలు ప్రార్థనలు చేస్తూ పరుగెడతాడు. అడవిలో నీటికోసం హగర్ చేసిన అన్వేషణను ఈ ఆచారం గుర్తుకి తెస్తుంది.
6వ రోజు మక్కాలో గడిపి మరొకసారి కాబా చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు. 7వ రోజు మసీదు ప్రసంగం వింటాడు. 8వ నాడు మీనాకు వెళ్ళి కర్మకాండ జరిపి ఆ రాత్రి అక్కడ ఉంటాడు. 9వ రోజు ఉదయం ప్రార్థనల అనంతరం అరాఫత్ పర్వతానికి వెళ్ళి నిలుచుండే క్రతువు జరుపుతాడు. స్వర్గం నుండి వెళ్ళగొట్టబడిన ఆదం, అవ్వలు అక్కడ కలిసారని సాంప్రదాయం చెబుతుంది. యాత్రికుడు ప్రార్థనలు జరిపి పశ్చాత్తాపం పై ప్రసంగాలు వింటాడు. తరువాత మీనా అరాఫత్ ల మధ్య ముబ్జాలిఫా అనే చోట సూర్యాస్తమయం ముందే ప్రార్ధనలు చేయటానికి వెళతారు.
10వ నాడు త్యాగదినంగా భావిస్తారు. ముస్లింలు దీనిని ఈద్-ఉల్-అజా అంటారు. భక్తులు ప్రార్థనలు జరిపి మీనా స్తంభాల దగ్గరకు వెళతారు. ఈ స్తంభాల మధ్య రాయి పట్టుకుని, కుడి చేతితో 15 అడుగుల దూరానికి విసిరేస్తూ దేవుని పేరిట ఈ పని చేస్తున్నానని దయ్యాలను ద్వేషిస్తున్నానని అనాలి. మిగిలిన రాళ్ళను కూడా అలాగే విసరాలి. తిరిగి వచ్చి మేకను కానీ, మేక పిల్లను కానీ బలి ఇవ్వాలి. తరువాత జుట్టు తీసివేసుకోవటం కానీ, కొన్నికత్తిరింపులివ్వటం గానీ చేస్తారు.
ఈ ఆచారాన్ని ముస్లింలు సమర్థిస్తూ, దయ్యాల్ని అబ్రహాం నిరాకరించినందుకు సూచనగా చేస్తున్నామంటారు. అతడు తన కుమారుడు ఇస్మాయిల్ ని దైవాజ్ఞప్రకారం త్యాగం చెయ్యకుండా నిరోధించగలిగారు. దీని బదులు గొర్రెను బలి ఇస్తారన్నమాట.
ఇస్లాంలో ఏకేశ్వరాధన, విగ్రహ వ్యతిరేకత పేర్కొన్న మహమ్మద్ ఈ మూఢ నమ్మకాలను ఎలా ప్రవేశపెట్టాడు. యూదులూ, క్రైస్తవులూ మోజేస్ నూ, జీసస్ నూ నిరాకరించి మహమ్మద్ ను ప్రవక్తగా అంగీకరించినట్లయితే మక్కా బదులు జెరూసలేం, కాబా బదులు సాక్రా పుణ్యస్థలాలయ్యేవని చరిత్రకారులంటారు.
యూదులు తనను కొత్త ప్రవక్తగా ఆమోదించే అవకాశం లేదని గ్రహించిన మహమ్మద్ మక్కాలో కాదాకు పవిత్రతను మార్చమని దైవాజ్ఞగా పేర్కొంటారు. (సుర.2-138) మక్కాను ఉత్తరోత్తరా వశపరచుకోవచ్చని మహమ్మద్ గ్రహించాడు.
మక్కాలో ప్రవేశించటానికి ముస్లింల 6వ సంవత్సరంలో మహమ్మద్ విఫలుడయ్యాడు. మక్కా మదీనా వాసులు హుదైబా సరిహద్దులలో సమావేశమై చర్చలు జరిపి మదీనాకు ముస్లింలు తిరిగి రావడానికి, మరుసటేడు మక్కాలో ఉత్సవం జరపటానికి అంగీకరించారు. మహమ్మద్ తన అనుచరులతో వచ్చి కాబా ప్రదక్షిణలు జరిపి నల్లరాతిని ముద్దుపెట్టుకున్నాడు.
మరుసటేడు మహమ్మద్ మక్కాను జయించాడు. తొలుత ప్రవక్త లేకుండానే చాలామంది ముస్లింలు నమ్మకంలేని అరబ్బులతో హజ్ లో కలిసారు. తరువాత నమ్మకం లేనివారు మక్కాకు, హజ్ కు రాకూడదని దైవ నిర్ణయంగా ప్రకటించారు. (సుర. 9)
జమర్ ఇలా రాసాడు. మహమ్మద్ 10వ ఏట తన పూర్వీకుల మందిరం ఉన్న మక్కాకు యాత్ర జరిపి ఇస్లాం పేరిట మూఢనమ్మకాలన్నీ అమలు పరిచారు. అర్థం చేసుకోవటానికి వీలు లేనంత కట్టుకథలతో ముస్లిం గాథలను బైబిల్లో ఉదంతాలకు అంటగట్టి, పేగన్ ఆచారాలను వివరిస్తూ పోయారు. (జిమర్ పుట. 157).
మధ్య, పశ్చిమ అరేబియాలలో ఇస్లాం పుట్టింది. ఆ ప్రాంతాలలో నాటి అరబ్బుల మతాన్ని గురించి మనకంతగా తెలియదు. ఇబ్న కల్బీ వంటి పండితులు ది బుక్ ఆఫ్ ఐడల్స్ లో పేర్కొన్న పేర్ల ఆధారంగా కొన్ని వివరాలు తెలుస్తున్నాయి. ఖురాన్ లో ప్రస్తావనలూ ఇస్లాంకు పూర్వం కవితలూ, దేవతల్ని గురించి కించిత్తు గ్రహించగలుగుతున్నారు. నాల్డెక్ ఇలా రాశాడు. మహమ్మద్ తన మతంలో, ఎలాంటి మార్పులూ లేకుండానే హిదెన్ల ఆచారాలనూ, నమ్మకాలనూ స్వీకరించాడు. సనాతన ఇస్లాంలకు గిట్టని అనేక పద్ధతులను స్వీకరించాడు. అరబ్బులలో అవి నేటికీ ఉన్నాయి. ప్రజా బాహుళ్యంలో ఉన్న నమ్మకాలు కొత్త మతం వలన పోలేదు. వేరే పేర్లతో అవి కొనసాగాయి. (నాల్డెక్, అరబ్స్. పుట. 659-72)
లోగడ స్థానికంగా ఉన్న అనేక క్రతువుల్ని ముస్లిం యాత్రలో చాకచక్యంగా మహమ్మద్
ప్రవేశపెట్టాడు.
ఇస్లాంకు ముందు మధ్య అరేబియా తెగల ఆధారంగా ఉన్న సమాజానికి ఒక్కొక్క తెగకు ఒక దైవం ఒకచోట నెలకొల్పి సంచార జాతులు పూజిస్తుండేవారు. అవి మానవాకారం కాకపోయినా, రాతి రూపులో ఉండేవి. ఒక్కొక్క సందర్భంలో మానవాకారంలోనూ లేదా కేవలం నల్లరాయిగానూ ఉన్న వాటిని ప్రతిష్టించేవారు. నల్లరాతిలో దివ్యత్వం ఉన్నదని హిదెన్ అరబ్బులు నమ్మారు.
అల్ సఫా, అల్ మర్వా అనే రెండు కొండలను విగ్రహాలను సూచిస్తాయి. పేగన్ లు ఈ రెండు కొండల మధ్య పరుగెత్తి ఇసాఫ్, నైలా ప్రతిమలను ముద్దుపెట్టుకుంటే అదృష్టం కలిసివస్తుందని నమ్మారు.
పవిత్ర నల్లరాయి, హ్యూబల్
అరబ్బుల లోకంలో నల్ల రాళ్ళను ఆరాధించారు. అలెగ్జాండ్రియాకు చెందిన కెమెంట్, అరబ్బుల నల్లరాతి ఆరాధన ప్రస్తావించాడు. 2వ శతాబ్దిలో మాక్సిమన్ టైరియస్ రాస్తూ దీర్ఘ చతురస్రకార రాతికి అరేబియన్లు పూజించటం తెలుసుకున్నాడు. నల్లరాతి కాబాను ప్రస్తావించాడు. మహమ్మద్, అతని వారసులు కాబాలో నల్లరాతిని, ఇతర విగ్రహాలను ప్రతిష్టించారని, అవి శని గుర్తులని పర్షియన్లు అన్నారు.
కొందరు పవిత్ర వ్యక్తులకు సంబంధం అంటగట్టిన రాళ్ళకు మక్కా పరిసరాలలో మహమ్మదీయ గౌరవం లభించింది. (నోల్డెక్ అరబ్స్ పుట 659-72 మతం నీతి సర్వస్వం)
నల్లరాయి ఒక ఊడిపడిన ఉల్క. స్వర్గం నుండి వచ్చిన ప్రతిష్ట దీనికుంది. గాబ్రియల్ దేవత ఇస్మాయిల్ కు ఇచ్చిన రాతిని ముస్లింలు ఆరాధించడం విచిత్రం. 4వ శతాబ్దిలో కార్మషియన్లు ఈ నల్లరాతిని తొలగించారు. తరువాత కొన్నేళ్ళకు మళ్ళీ ప్రతిష్ఠించారు. తొలగించిన రాయినే మళ్ళి పెట్టారా అనేదే సందేహాస్పదం. (మార్గోలియత్ - ఐడియాస్ అండ్ ఐడియల్స్ ఆఫ్ మోడ్రన్ ఇస్లాం. 20 సంపుటి, పుట 241 ముస్లిం వరల్డ్)
మక్కాలో హ్యూబల్ ను ఆరాధిస్తారు. ఒట్టిపోయిన బావి కాబాకు చెంత ఉండగా, అందులో ఎర్రని విగ్రహాన్ని పెట్టారు. హ్యూబల్ కు మానవాకారం కద్దు. నల్లరాతి పక్కనే ఉన్నందున, హ్యూబల్ కు దీనికీ సంబంధం ఉండవచ్చు. తొలుత హ్యూబల్ కూడా నల్లరాయి అని వాల్ హుసేన్ భావించాడు. కాబా ప్రభువుగా దేవుణ్ణి చూచారనీ, మక్కా ప్రాంత ప్రభువుగా ఖురాన్ పేర్కొన్నదనీ వాల్ హుసేన్ చూపాడు. అల్ లత్, మనత్, అల్ ఉజా దేవతల ఆరాధన మహమ్మద్ వ్యతిరేకించాడు. అరబ్బులు వీరిని దేవుని కుమార్తెలన్నారు. హ్యూబల్ ను అల్లాగా వాల్ హుసేన్ పేర్కొన్నాడు. మదీనా వద్ద్ ప్రవక్తను మక్కా వాసులు ఓడించినప్పుడు హ్యూబల్ విజయంగా వీరి నాయకుడు నినదించాడు. ప్రదక్షిణలు చాలా చోట్ల ఆచారంగా ఉంది. యాత్రికుడు ప్రదక్షిణలో తరచు రాతిని ముద్దు పెట్టుకోవడం, కౌగలించడం కద్దు. ఏడుమార్లు ప్రదక్షిణ జరపడం 7 గ్రహాలు తిరగడాన్ని సూచిస్తున్నదని సర్ విలియం మూర్ భావించాడు. (మూర్ - ది లైఫ్ ఆఫ్ మహమ్మద్ 1923 ఎడిన్ బరో, పీఠిక) బయట, లోపలి గ్రహాల చలనాన్ని అనుకరిస్తూ, కాబా చుట్టూ మూడుసార్లు వేగంగా, 4 సార్లు నెమ్మదిగా ప్రదక్షిణ చేయడాన్ని జిమర్ చిత్రించాడు. (జిమర్ - ది ఇన్ ఫ్లూయన్స్ ఆఫ్ యానిమిజం ఆన్ ఇస్లాం, లండన్ 1920 పుట. 158)
అరబ్బులు సూర్యుణ్ణి ఆకాశంలో ఇతర తారల్ని ఆలస్యంగా ఆరాధించారనడంలో సందేహం లేదు. (నోల్డెక్ - మతం నీతి సర్వస్వం సంపుటి 1, పుట 660) స్టేడిమ్స్ పుంత వర్షదేవతగా భావించారు. అల్ ఉజా పేరిట వీనస్ గ్రహాన్ని గొప్ప దేవతగా గౌరవించారు.
సూర్యుణ్ణి షమ్స్ పేరిట ఆరాధించారు. అనేక తెగలకు ఇది దేవత. దీనికి మందిరం, విగ్రహం ఉండేది. వుకుఫ్ ఉత్సవంలో సూర్యారాధన స్నోక్ హర్ గ్రోంజే గమనించాడు. (జిమర్ - పుట 159, ఇన్ ఫ్లుయన్స్ ఆఫ్ యానిమిజం ఆన్ ఇస్లాం, లండన్ 1920)
సూర్యదేవతగా అల్ లత్ దేవతను చూశారు. ఉదయిస్తున్న సూర్యుడు ధారీ దేవత. సూర్యాస్తమయానికి, సూర్యోదయానికి మధ్య ముస్లింలు ఆరఫత్ - ముజ్దాలిఫా, మీనా, ముజ్దాలిఫా కొండలమధ్య పరుగిడతారు. పేగన్ల సూర్యారాధన స్థానే కావాలని మహమ్మద్ ఇది ప్రవేశపెట్టాడు. చంద్రుడికి హిలాల్, ఖమర్ వంటి పేర్లు నెలవంక వంటివి పెట్టి ఆరాధించారు.
సూర్య రాక్షసుణ్ణి ఉద్దేశించి మీనాలో రాళ్ళు విసరడం తొలుత జరిగిందని హోట్సామా పేర్కొన్నారు. (జిమర్ పుట 160) వేగన్లు వసంత కాలంలో యాత్ర చేయడాన్ని బట్టి ఇలా భావించారు. సూర్య రాక్షసుణ్ణి బహిష్కరించి, వేసవిలో అతడి తీవ్ర పాలనకు స్వస్తి పలికేవారు. ఉరుముల దేవత పంట తెస్తాడని ఆరాధించినట్లు ముజ్దాలిఫా వద్ద ఇలా జరిగినట్లు చెప్పాడు. ముజ్దాలిఫా అగ్ని ఆరాధన ప్రాంతం ఇది పవిత్ర అగ్ని పర్వతంగా ముస్లిం చరిత్రకారులు పేర్కొన్నారు. ముజ్దాలిఫా దేవత. ఖుజా ఉరుముల దేవత. వెన్ సింక్ ఇలా రాశాడు. ఖుజా పవిత్ర కొండపై అగ్ని వెలిగించి, యాత్రికులు విడిది చేసిన తీరు, సినాయ్ తో పోలి ఉంది. ఉభయులు నిప్పులు కురిపించే ఉరుముల దేవతలే. ఉరుమును ఉద్దేశించి భక్తులు పెద్దగా ధ్వని చేయడం, సానుభూతితో స్తుతించడం కద్దు. (జిమర్ పుట. 159)
రాళ్ళు విసిరే ఆచారాన్ని గోల్డన్ బేలో ఫ్రేజర్ వివరించాడు. ప్రమాదకర దోషాన్ని తొలగించడానికి రాళ్ళు విసిరేవారు. మంచిది పొందడానికి కూడా ఇది ఉద్దేశించారు. దోషాన్ని పోగొట్టడానికే ఆదిమవాసులు అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు. మక్కాలో రాళ్ళు విసిరే సంప్రదాయానికి ఇలాంటి వివరణే ఇవ్వవచ్చు. భక్తులు తమ అపవిత్రతను రాళ్ళకు అంటగట్టామని పవిత్రులమయ్యామని అనుకోవచ్చు. (జిమర్ పుట. 121).
హజ్ కు తొలుత మాంత్రిక స్వభావం ఉండేదని జ్యున్ బాల్ భావించాడు.
నూతన సంవత్సరంలో సమృద్ధిగా వర్షం, సూర్యకాంతి, సంపద, పశు పాడి సంపద కావాలని తొలుత ఉద్దేశించారు. ఆరఫత్, ముజ్దాలిఫాల వద్ద సూర్యుణ్ణి ఉద్దేశించి పెద్ద మంటలు వేసేవారు. కరువుకు విరుగుడుగా నేలపై నీరు పోసేవారు. ఆదిమ హేథెనులు రాళ్ళుగా ఉన్న మీనా వద్ద రాళ్ళు విసరడం, గత సంవత్సర దోషాలు పోవాలనే ఉద్దేశంతో చేశారు. శిక్షకు, దురదృష్టానికి వ్యతిరేకంగా ఇదొక ఆచారంగా ఉండేది. (జ్యూన్ బోల్ కళ. యాత్ర మతం నీతి సర్వస్వం).
ఆరఫత్ - ముజ్దాలిఫా, మీనా- ముజ్దాలిఫాల మధ్యపరుగిడడం కూడా మాంత్రిక ప్రాధాన్యతతో కూడినదే. అన్ని క్రతువుల అనంతరం, విందును బట్టి, సంవత్సరాంతంలో సమృద్ధికి సూచన కావచ్చు. యాత్రికునిపై వివిధ ఆక్షలు విధించడం కూడా అతడిని ఒక మాంత్రిక స్థితిలోకి తీసుకురావడం కోసమే.
కాబా
కాబాను ఎప్పుడు నిర్మించారో తెలియదు. కాని, జమ్ జమ్ అనే బావి చెంత ఇది నిర్మించడంలో, నాడు మక్కా మీదుగా ఎమెస్ సిరియాలకు వెళ్ళే ఒంటె ప్రయాణీకులకు మంచి నీరు అందించే ఉద్దేశం కనబడుతుంది.
భక్తులు దీనివద్ద బలులు ఇస్తూ ఆరాధనా వస్తువులు పెడతారు. కాబాలోన నీరు లేని బావి చెంత ముడుపులు చెల్లిస్తుంటారు. గర్భగుడివంటి ఈ స్థలంలో భక్తులు తల గొరిగించుకుంటారు. ముస్లిం హజ్ లో ఈ పద్ధతులు గమనించవచ్చు.
కాబా తొలుత స్వర్గంలో నిర్మితం అయిందనీ, దాని నమూనా ఇప్పటికీ ఉందనీ, ప్రపంచ సృష్టిలో రెండువేల ఏళ్ళ పూర్వం ఇది జరిగిందనీ ముస్లిం రచయితలు పేర్కొన్నారు. భూమిపై ఓ కాబాను ఆదాం నిర్మించగా పెద్ద ఉప్పెనలో అది కొట్టుకు పోయింది. తిరిగి నిర్మించమని అబ్రహాంను ఆదేశించారు. ఇస్మాయిల్ అతడికి తోడ్పడ్డాడు. భవనం మూల రాతి ప్రతిష్ఠాపనకై చూస్తుండగా, గాబ్రియెల్ తటస్థపడి నల్లరాతిని ఇచ్చాడు. తొలుత అది పాలరాతి వలె ఉండేది. దానిని ముట్టుకునే వారి పాపాలతో రాయి నల్లబడింది. జెరూసలేం గురించి పరలోక ఇహలోక స్థితిని యూదులు వర్ణించిన తీరును పోలిన స్థితి ఇది. అబ్రహాం ద్వారా కాబా వచ్చిందనేది మహమ్మద్ కు పూర్వం ఉన్న నమ్మకంగా మూర్, బోరేలు భావించారు. కాబా విషయంలో అబ్రహాంను చూపడం మహమ్మద్ చర్యగా స్నాక్ హర్ గ్రొంజే, అలాస్ స్ట్రెంగర్ లు చెప్పారు.
యూదుల నుండి ఇస్లాంను కాపాడడానికి ఇది ఉపరకరించిందన్నారు. స్ట్రెంగర్ ఇలా నిర్ణయించాడు. ఇలాంటి అబద్ధంతో మానవుడికి కావలసిందేదో మహమ్మద్ సమకూర్చాడు. మతానికీ తత్వానికీ తేడా అక్కడే ఉంది. జాతీయత, క్రతువులు, చారిత్రక స్మృతులు, మార్మికాలు, స్వర్గ ప్రవేశం అన్నీ కల్పించి, తన చిత్త ప్రవృత్తిని మోసగించాడు. బాస్క్వే ఉదహరించిన తీరు. హర్ గ్రోంజే పుస్తకంలో మలిపలుకు, పుట. 287, రివ్యూ ఆఫ్రికన్ 95 (1951)
అల్లా
హీదిస్ అరబ్బుల నుండి అల్లా అనే మాట ఇస్లాంలోకి వచ్చింది. ఉత్తర అరేబియా సబాసియన్లు పెట్టుకున్న పేర్లలో అల్లా ఉన్నది. తరువాత అరబ్బులలో, థియోపోరస్ పేర్లలోనూ ఉన్నది. ఇస్లాం ముందున్న సాహిత్యంలో అల్లాను గొప్ప దైవంగా పేర్కొన్నట్లు వెల్ హాసన్ చూపారు. కొరాన్ లో అతడు వర్షాన్ని ఇస్తాడనీ, సృష్టికర్త అనీ పేర్కొన్నారు. అతని ప్రక్కనే ఇతర దేవుళ్ళను ఆరాధించటమే మక్కా పౌరుల నేరం అయింది. రాను రాను అల్లాను పరమ దైవంగా పేర్కొన్నారు. కొత్త దైవాన్ని ప్రవేశపెట్టాల్సిన ఆవశ్యకత మహమ్మద్ కు లేకపోయింది. హీదెన్ల అల్లాను పవిత్రం చేసి చూపాడు. మక్కాలో అల్లాను దైవంగా చూపకపోయినట్లయితే మహమ్మద్ ఏకేశ్వరాధన బోధకుడయ్యేవాడు కాదు. (నోల్డెక్ - మతం నీతి సర్వస్వం. సంపుటి 1, పుట 664).
పేగస్ అరబ్బుల నుండి బహుదేవతారాధన బానిసత్వం, సులభంగా విడాకులు, సామాజిక చట్టాలూ, సున్తీ, క్రతువుల ప్రక్షాళన ఇస్లాంలోకి వచ్చాయి. ముస్లింల ప్రార్థనలో క్రతువులకు సంబంధించిన విషయాలను వెన్ సింక్ నోల్డెక్, గోల్డ్ జిహర్ అధ్యయనం చేశారు. (జిమర్, ముస్లిం వరల్డ్, సంపుటి 8, పుట 359. యానిమిస్టిక్ ఎలిమెంట్స్ ఇన్ ముస్లిం ప్రేయర్) రోజూ ఐదుసార్లు ప్రార్థించటంలో, ప్రక్షాళన చేసుకోవటంలో భక్తుడు దోషాల నుండి బయటపడటమే ప్రధానంగానీ, శారీరకమైన శుద్ధి ముఖ్యం కాదు. మహమ్మదు సైతం పైశాచిక కల్మషంపట్ల అనేక మూఢనమ్మకాలను అట్టిపెట్టాడు. అవన్నీ అతడి యవ్వన దశలో పేగన్ వాదం నుండి స్వీకరించినవే. రాత్రిళ్ళు దయ్యాలు మానవుడి ముక్కులో నివసిస్తాయి గనుక మేలుకోగానే మూడు పర్యాయాలు చీదాలి అని మహమ్మద్ ఒక సంప్రదాయం ప్రకారం చెప్పాడు. ఒకసారి ఒకతను కడుక్కున్న తరువాత కూడా కాలు తడవకపోవటం గమనించిన మహమ్మద్ వెళ్ళి కడుక్కురమ్మని సలహా ఇచ్చి ఇలా చెప్పాడు. ముస్లిం భక్తుడు ప్రక్షాళన చేసుకున్నప్పుడు మొఖం నీటితో కడుక్కుంటే అతడి పాపాలు కడిగేసుకున్నట్లే, చేతులు కడుక్కుంటే చేతులు చేసిన పాపాలు తుడిచేసినట్లే, అలాగే పాదాలు కడుక్కుంటే కాళ్ళు చేసిన పాపాలన్నీ పోయినట్లే గోల్డ్ జిహర్ ఈ విషయమై రాస్తూ నీటివలన దయ్యాలను పారద్రోలవచ్చుననే భావన ఉండేదన్నారు. ప్రవక్త చెప్పులు బయట భాగాన్ని చేతితో తుడిచి కాళ్ళు కడిగినట్లు భావించేవాడు.
సంప్రదాయ బద్ధంగా ముస్లిం తలను కప్పుకోవాలి. ముఖ్యంగా తల వెనుక భాగాన్ని కప్పుకోవాలి. శరీరంలోకి దోషాలు ప్రవేశించకుండా అలా ఉద్దేశించారనీ వెల్ సింక్ భావించాడు. ముస్లింలు చేసే సంజ్ఞలు, ప్రార్థనలకిచ్చే పిలువు చేతులు పైకెత్తే విధానం అన్నీ దోషాలను పోగొట్టే ఉద్దేశంతోనే అని అంటారు.
జొరాష్ట్రియన్ వాదం
ప్రపంచ మతాలపై జొరాష్ట్రియన్ వాద ప్రభావం. దీనినే పార్శీవాదం అంటారు. బాగా ఉన్నట్లు కొందరూ, లేదని కొందరూ వాదించారు.
ఇరానియన్ మతాల చారిత్రక ప్రాధాన్యత ఇరాన్ అభివృద్ధిలో వాటి పాత్రను బట్టి చెప్పవచ్చు. పాశ్చాత్యలోకంలో, ముఖ్యంగా యూదు మతంపై ఇరాన్ మత ప్రభావం ఉన్నది. గ్రీక్ మార్మిక మత వాదం అయిన మైత్రేయ వాదం, మార్మిక వాదం షియాలపై కనిపించినా ఇరాన్ భావాలూ, మధ్యయుగాలలో ప్రజా బాహుళ్యంలో ఉన్న ఆచార వ్యవహారాలూ స్పష్టంగా ఇస్లాంపై ప్రభావం చూపాయి. (వైడన్ గ్రన్ - ఇరానియన్ మతాలు, బ్రిటానికా విజ్ఞాన సర్వస్వం. 11వ ప్రచురణ పుట. 867) బైబుల్ పాత నిబంధనలో యూదులు బాబిలోనియన్ ప్రవాసం వెళ్ళినప్పుడు జొరాస్ట్రియన్ ప్రభావానికి గురైనట్లు వైడన్ గ్రన్ చూపాడు. (డైరెలిజియన్ ఇరాన్స్ 1965) ఈసయ్య 40-486, జొరాస్ట్రియన్ సూక్తులలో గాతకూ 44 3-5 కి సన్నిహిత సంబంధాన్ని మోర్టన్ స్మిత్ ప్రప్రథమంగా చూపించారు. ఈ రెండిటిలోనూ వెలుగు-నీడలను దేవుడు సృష్టించినట్లున్నది. కొత్త నిబంధనపై జొరాస్ట్రియన్ ప్రభావాన్ని జాన్ హినెల్స్ రాశాడు. యూదులు పార్సియన్ల మధ్య క్రీస్తు పూర్వం రెండు ఒకటి శతాబ్దాలలో సంబంధాలవలన ఈ ప్రభావాలు ఏర్పడ్డాయి. (హినెల్స్, ఇన్ న్యూమెన్ 16, 161-85, 1969) ఇరానియన్ మత ప్రభావం ఇస్లాంపై ప్రత్యక్షంగా ఉన్నది. ఇస్లాంపై యూదు, క్రైస్తవ పరోక్ష ప్రభావాలని ఎన్నడూ సందేహించలేదు. ఈ దృష్ట్యా యూదు, జొరాస్ట్రయన్ల వాదాల సమాంతరాలను చూద్దాం.
ఇరాన్ పరమదైవం, అహూరమజ్జా సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు, నిరంతరుడూ, సృష్టికర్త, తన శక్తులను స్పంటామైన్యూ అనే దివ్య లక్షణం ద్వారా వెల్లడిస్తాడు. విశ్వాన్ని దేవతలతో పరిపాలిస్తాడు. సైతాను వలె అహ్రిమన్ ఈ దైవానికి విరుద్ధంగా ఉండగా, ప్రపంచాంతంలో దానిని నాశనం చేస్తారు. ఆ తరువాత పునరుజ్జీవనం, సంపూర్ణ రాజ్యం, మళ్ళీ ప్రవక్త రావడం, చనిపోయినవారు లేవటం, శాశ్వత జీవనం ఇలాంటివన్నీ ఉదహరించారు. రెండు మతాలు దైవం ఇచ్చినవి. అహూరమజ్జా జొరాస్టర్ కు కొండపై తన ఆజ్ఞలను ప్రసాదిస్తాడు. అలాగే సినాయిపై మోజెస్ కు ఎహోవా ప్రసాదిస్తాడు. చనిపోయిన వారితో, మలిన పదార్థంతో సంబంధాల వలన వచ్చిన అంటును ప్రక్షాళనం చేసుకోవటానికి జొరాస్ట్రియన్ నియమాలు అవస్తే విందిదాద్ లో విపులంగా ఇచ్చారు. బైబుల్లో సృష్టివలే జొరాస్ట్రియన్ గ్రంథాలలో 6 కాలాల సృష్టి ప్రస్తావన ఉన్నది. ఈ మతాల ననుసరించి ఒకే దంపతుల ద్వారా మానవాళి ఆవిర్భవించింది. ప్రళయం వలన ఒక పుణ్యకుటుంబీకులు తప్ప అందరూ నాశనం అవుతారు. అవస్తే ప్రకారం ఒక చలి కాలంలో దీవనలు పొందిన ఇమా తప్ప మిగిలిన వారంతా పోతారు. తరువాత భూమిపై ఉత్తమమైన జంటలను స్వీకరించి మూడు భాగాలలో విభజిస్తారని రెండు మతాలూ పేర్కొన్నాయి. దయ్యాలూ, దేవతలకు సంబంధించి పునరుత్థానానికి సంబంధించి యూదు, జొరాస్ట్రియన్ చెప్పే వాటిలో ఇలాగే పోలికలున్నాయి. (జూయిష్ ఎన్ సైక్లోపీడియాలో జొరాస్ట్రియనిజం. పుట. 695-97.
ఖడిసియా యుద్ధంలో నసానియన్ పర్షియన్ సైన్యంపై 636 కీ.పూ.లో ముస్లింలు జయించినప్పుడు, ఇరుపక్షాల ప్రజలకు ప్రత్యక్ష సంబంధం ఏర్పడింది. ఉన్నత సంస్కృతితో ఏర్పడిన ఈ సంపర్కం వలన అరబ్బులు ఇస్లాంకు ఎంతో ప్రభావితులయ్యారు. కొత్తగా మతం మారిన పర్షియన్లు ఇస్లాం మత జీవనంలో కొత్త దనాన్ని తెచ్చారు.
ఉమాయద్ సామ్రాజ్యం పతనమైనప్పుడు పర్షియన్ మత రాజకీయ భావాల ప్రభావంతో ఆబాసిద్ లు మత రాజ్యాన్ని స్థాపించారు. అబూ ముస్లిం విప్లవంవలన అధికారం సంక్రమించిన అబాసిద్ లు తొలుత పర్షియన్ ఉద్యమంలోని వారే. ససానియన్ల సంప్రదాయాల్ని అబాసిద్ లు పుణికిపుచ్చుకున్నారు. పర్ష్యా రాచరికాన్ని స్వీకరించినవారికి, ఖలీఫా సంస్థ, రాచరికపు సన్నిహితత్వం బాగా తెలుసు. వారిది మత రాజ్యం. వారు మతాధిపతులు. ససానియన్లవలే వీరు దివ్యత్వాన్ని ఆపాదించుకున్నారు. ప్రభుత్వానికి, మతానికి సన్నిహిత సంబంధం ఉండేది. ఒకరిపై ఒకరు ఆధారపడేవారు. సంపూర్ణ సమ్మిళితం ఉండేది. ప్రభుత్వం మతం తాదాత్మ్యం చెందాయి. కనుక మతమే ప్రజల ప్రభుత్వం. పర్షియన్లు అవెస్తా వెందిదాద్ పఠించినట్లే వీరూ కొరాన్ చదివారు. అలా చదివినందువలన భూమిపై సంక్రమించిన అక్రమాలన్నీ పోతాయన్నారు. ఆత్మ విముక్తికి ఇది అవసరమన్నారు. కుటుంబంలో సభ్యుడు చనిపోయిన తరువాత జొరాస్ట్రియన్లు ముస్లింలు తమ పవిత్ర గ్రంథంలో కొన్ని పాఠాలు చదువుతారు. చనిపోయిన వారిపట్ల విచారం వ్యక్తం చేయడాన్ని ఉభయులూ ఖండిస్తారు. ముస్లిం మిజాన్ సిద్ధాంతం పర్షియన్లనుండి తెచ్చుకున్నదే. మనుషుల చర్యల్ని దీనివలన కొలుస్తారు. (కొరాన్ సుర 21.47) మంచి చెడ్డల బేరీజు చేయడానికి యీ సూత్రాలు వాడతారు. ప్రవక్త ఇలా చెప్పాడంటారు. చనిపోయినప్పుడు ప్రార్థనలు చేస్తే ఒక కిరాతక, మృత దేహానికి అంత్యక్రియలు జరిగే వరకూ ఉన్న వారికి రెండు కిరాత్ లు లభిస్తాయి. వ్యక్తిగత ప్రార్థనలకంటే సామూహిక ప్రార్థనలకు 25 రెట్లు ఉన్నత విలువ గలదు.
తుది తీర్పునాడు దేవదూత గాబ్రియల్ మంచి చెడులను నిర్ధారిస్తాడు. దానికి ఒకవైపు స్వర్గం మరొక పక్క నరకం ఉంటాయి. పార్శీవాదం ప్రకారం తీర్పునాడు స్వర్గనరకాల మధ్య ఇరువురు దేవతలు నిలిచి, ప్రతివ్యక్తిని పరిశీలిస్తారు. దైవ ప్రతినిధిగా ఒక దేవత అందరి చర్యల్ని తులనాత్మకంగా చూస్తాడు. మంచి చర్యలు ఎక్కువైతే స్వర్గానికి, లేకుంటే నరకానికి పంపిస్తాడు. అలా మిగిలిన తులనాత్మక కొలతలు క్రైస్తవ ఆచారాల నుండి ఇస్లాం భావాలలోకి వచ్చాయి.
రోజూ 5సార్లు ప్రార్థించే ముస్లిం సంప్రదాయం పర్షియన్ మూలంలోనిదే. తొలుత మహమ్మద్ రెండుసార్లే ప్రార్థన ప్రవేశపెట్టాడు. ఉత్తరోత్తర యూదుల షకారిత్, మింకా, ఆర్బిత్ లను పోలిన ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం ప్రార్థనలు కొరాన్ పేర్కొన్నది. జొరాస్ట్రియన్ల మత తీవ్రతను చూచి, ముస్లింలు వారి ఆచారాన్ని అలాగే స్వీకరించారు. అప్పటినుండీ ముస్లింలు తమ దైవానికి 5సార్లు ప్రార్థనలు చేస్తున్నారు. ఇది పర్షియన్ల అనుకరణే.
యూదు, క్రైస్తవ భావాలు పర్షియా సిద్ధాంతాల నుండిగాక, ఇస్లాం పూర్వపు అరేబియాలోనూ పర్షియన్ భావనలు వచ్చాయి. పర్షియన్ సంస్కృతిలో మక్కా వర్తకులు తరచు తారసిల్లేవారు. పర్షియా ప్రభావం కింద ఉన్న యూఫ్రేట్స్ వద్ద అరబ్ రాజ్యమైన అల్ హిరాకు అరబ్బు కవులు పయనిస్తుండేవారు. అరబ్బులలో ఇరాన్ సంస్కృతి వ్యాపించడానికి అదొక కేంద్రస్థానమని జెఫ్రీ రాశాడు. (జెఫ్రీ. పుట. 14, బరోడా 1938 ది ఫారిన్ ఒకాబ్యులరి ఆఫ్ ది కొరాన్)
అల్ అషా వంటి కవుల రచలనలో పర్షియన్ పదాలు గుప్పించారు. అవస్తే, పెహ్వలి నుండి అనేక పర్షియన్ పదాలు అరబిక్ లోకి వచ్చాయి. కొందరు పేగన్ అరబ్బులు జొరాస్ట్రియన్లు అయ్యారు కూడా. దక్షిణ అరేబియాలో పర్షియా ప్రభావం ఉంది. నసానియన్ల పేర పర్షియన్ అధికారులు పెత్తనం సాగించారు. కొరాన్ లో జొరాస్ట్రియన్లను మద్ జూస్ అంటూ వారిని యూదుల స్థాయిలో చూపారు. అలాగే క్రైస్తవులు, సబియన్లు కూడా. (సుర 22.17) ప్రవక్త జీవితాన్ని రాసిన ఇబ్న హిషం ప్రస్తావిస్తూ, అన్ నదిర్ ఇబ్న హరిత్ ఒకప్పుడు రుస్తుం కథల్ని మక్కా వాసులకు చెబుతూ, పర్ష్యా రాజులు, ఇప్నదియారా గాథలు వల్లించేవాడన్నారు. అంతేగాక తన కథలకంటే మహమ్మద్ కథలు గొప్పవేమీ కాదనేవాడట. టోరే ఇలా రాశాడు. తన ప్రేక్షకులు అదృశ్యం కావడాన్ని గమనించిన ప్రవక్త, బదర్ యుద్ధానంతరం కసి, తీర్చుకున్నాడు. జనరంజకుడైన తన ప్రత్యర్థిని యుద్ధంలో పట్టుకుని, కథలు చెప్పిన దానికి చంపేశారు. (టోరే పుట 106 ది జ్యూయిష్ ఫౌండేషన్ ఆఫ్ ఇస్లాం 1933 న్యూయార్క్)
ప్రవక్త అనుచరులలో సాల్మన్ అనే పర్షియన్ ఉండేవాడనీ, అతడు తన పూర్వీకుల మత విషయాలు మహమ్మద్ కు చెప్పి ఉండవచ్చునని ఇబ్నహిషాం రాశాడు.
ఆరు రోజులలో సృష్టి చేసిన దేవునికి విశ్రాంతి కావాలనే భావనను మహమ్మద్ వ్యతిరేకించాడు. ఈ విషయంలో అతనిపై జొరాస్ట్రియన్ ప్రభావం ఉండవచ్చు. యూదుల సాబత్ పట్ల కూడా పార్సీమతవాదులు అలాంటి అభిప్రాయంతో ఉన్నారు. మహమ్మద్ కూ ముస్లింలకూ శుక్రవారం విశ్రాంతి దినం కాదు. వారాంతంలో సమావేశం కావలసిన దినం మాత్రమే.
గాడిద, కంచరగాడిద మధ్య పరిమాణం గల రెండు రెక్కల జంతువులపై స్వర్గానికి వెళ్ళిన మహమ్మద్. అక్కడ దేవదూత గాబ్రియల్, మోసెస్, అబ్రహాంలను కలిశాడు. తెల్లని ఆ జంతువును బురఖ్ అంటారు. ఇది అస్సీరియన్ల గ్రిఫన్ కు పోలింది కావచ్చు. ముస్లింల భావన పర్ష్యన్ భావాల నుండి సంక్రమించాయని బ్లాట్ అన్నాడు. స్వర్గారోహణ కూడా జొరాస్ట్రియన్ సాహిత్యం నుండి అరువు తెచ్చుకున్నవే. మహమ్మద్ చెప్పినట్లు ముస్లింలు ఇలా అంటారు.
గేబ్రియల్ నన్ను గాడిదమీద కూర్చోబెట్టి స్వర్గద్వారాల దాకా తీసుకు వెళ్ళి తలుపులు తీయమని అరిచాడు. ఎవరు అని అడిగారు. గేబ్రియల్ అని చెప్పగా నీతోబాటు ఎవరు ఉన్నారు అంటే మహమ్మద్ ఆని చెప్పాడు. అతన్ని పిలిచారా అని అడిగితే అవునని గేబ్రియల్ చెప్పాడు. ఐతే ఆహ్వానిస్తున్నాం అన్నారు. ద్వారాలు తెరవగానే అరుగో నీ తండ్రి ఆదాం, ప్రణామం చేయమని గేబ్రియల్ అన్నాడు. నేను సలాం చేశాను. అతను కూడా సలాం చేస్తూ ఆహ్వానం పంపాడు. తరువాత 2వ స్వర్గ ద్వారం దగ్గరకు గేబ్రియల్ తీసుక వెళ్ళారు. అక్కడ జాన్, జీసస్ లు ఉన్నారు. 3వ ద్వారం దగ్గర జోసెఫ్ 4వ ద్వారం దగ్గర ఈనాక్, 5వ ద్వారం దగ్గర ఆరస్, 6వ ద్వారం దగ్గర మోజెస్ ఉన్నారు. ప్రణామం తరువాత మోజెస్ విలపిస్తుండగా కారణం అడిగితే అతను సమాధానమిస్తూ నాకంటే తరువాత వచ్చిన వారు స్వర్గంలో ప్రవేశిస్తున్నారన్నాడు. 7వ స్వర్గ ద్వారం దగ్గర నీ తండ్రి అబ్రహాం అని గేబ్రియల్ చూపగా ప్రణామం చేశాను. తుది ఆరోహణలో ఏనుగు చెవులంత ఆకులు, మంచి ఫలాలు లభించాయి, గేబ్రియల్ అదే చివరి స్వర్గం అని చెపుతూ లోనున్న రెండు నదులూ స్వర్గానివనీ, వెలుపల ఉన్న రెండు నదులూ నైల్, యూఫ్రటిస్ అని చెప్పారు.
అరబిక్ లో మిరాక్ అనే ఈ స్వర్గారోహణ ముస్లిం శకానికి ముందే వందల సంవత్సరాల క్రితం అర్త అనే పహాల్వీ గ్రంథంలో ఉన్నది. (టిస్ డల్, ఒరిజినల్ సోర్సెస్ ఆఫ్ ఇస్లాం, ఎడింబరో 1901, పుట. 80) జొరాస్ట్రియన్ పురోహితులు తమ విశ్వాసం సడలిపోతున్నదని, అర్తా విరాఫ్ ను స్వర్గానికి పంపి ఏం జరుగుతున్నదో తెలుసుకు రమ్మన్నారు. స్వర్గారోహణ అనంతరం భూమ్మీదకు తిరిగి వచ్చి ఇలా వివరించాడు.
తొలుత స్వర్గంలో కింది దశకు చేరుకున్నాను. అక్కడ వెలుగుతున్నదేవతను చూశాను. సారోష్, అజర్ లను చూశాను. ఇదేమి స్థలం, వారెవరు అని అడిగాను. బంగారం తొడిగిన సింహాసనం నుండి లేచి బహమన్ అనే దేవత ఓర్వజ్ అనే దేవత దగ్గరకు తీసుకెళ్ళారు. లోగడ అలాంటి దృశ్యం చూడలేదు. ఆర్మజ్ కు సలాం చేసి అలాంటి స్థలానికి వచ్చినందుకు నన్ను ఆహ్వానించారు. స్వర్గం తరువాత నరకానికి తీసుకు వెళ్ళారు. ప్రణామం చేసిన అనంతరం దేవత నాతో మాట్లాడుతూ మళ్ళీ భూమి మీదకు వెళ్ళి చూసిందంతా చెప్పమని పంపించారు.
ముస్లిం సంప్రదాయంలో సిరాత్ అనే రహదారి ప్రస్తావన ఉంది. చక్కని మత మార్గం అని కూడా అర్థం. నిప్పుల మీద ఈ వంతెన దారి ఉంటుంది. ఈ వంతెన వెంట్రుక వాసి సన్నగా కత్తికంటే పదునుగా ఉంటుంది. ఇరువైపులా ముళ్ళు ఉంటాయి. ధర్మపరులు మెరుపు కంటే వేగంగా నడిచి వెడతారు. పాపాత్ములు తప్పి పోయి నరకంలో పడతారు.
ఇది జొరాస్ట్రియన్ పద్ధతి నుండి స్వీకరించి ఉంటారు. దీని ప్రకారం, మరణానంతరం, ఆత్మ ఒక వంతెన ద్వారా పోతుంది. పాపాత్ములు పోవడం అసంభవం.
ఇండోయోరప్ జాతులలో ఒక భాగమైన ఇండో-ఇరానియన్లలో కలసికట్టుగా ఉన్న సామాన్య
సాంస్కృతిక సంపద ఉంది. వారి పూర్వీకులు ఒక జాతిలో భాగం కావడమే అందుకు కారణం. యజుర్వేదంలో ఈ వంతెన ప్రస్తావన హిందువుల సంప్రదాయంగా వచ్చింది. స్వర్గాన్ని గురించి ముస్లింల భావన ఇరానియన్ ఇండియన్ భావాలకు సన్నిహితమే. మరణానంతరం ఆత్మస్తుతిని జొరాస్ట్రియన్ గ్రంథం హాద్ హోక్స్ నస్క్ పేర్గొన్నది. పుణ్యాత్ముడి ఆత్మ, శవం వద్ద్ మూడురోజులుండి, చివరలో అందమైన 15 ఏళ్ళ యువతితో చేరి, స్వర్గానికి కలసికట్టుగా వెడతారు. ఇది అప్సరసల హిందు కథలను పోలి ఉంది. వారంతా ఇంద్రుని స్వర్గంలో ఉంటారు. (స్టట్లే డిక్షనరీ ఆఫ్ హిందూఇజం పుట.16, లండన్ 1977) వీరంతా నర్తకిలే. స్వర్గానికి ఆత్మల్ని వీరు ఆహ్వానిస్తారు. యుద్ధంలో ఓడిన హీరోలను ఇంద్రుని స్వర్గం ఇలా సత్కరిస్తుంది. (డోసన్ పే 20 హిందూ మిథాలజీ అండ్ రెలిజియన్, కలకత్తా ముస్లింల స్వర్గభావన హిందువులను పోలినదే. తొలి క్రైస్తవ వ్యాఖ్యాతలు ఈ విషయాలను అపహాస్యం చేశారు కూడా. ముస్లింల కోసం అసువులు బాసినవారికోసం స్వర్గంలో కన్యల్ని అప్పగిస్తారు. కొరాన్ లో స్వర్గానికి వాడిన పదాలు పర్షియన్ లో ప్రస్తావించారు. కూజా (ఇబ్రిక్), ఆరిక్ (బండి) ఇలాంటివే. జెఫ్రీ ఇలా రాశాడు. క్రైస్తవ జాతుల నుండి అరువు తెచ్చుకొని, తెల్లని కన్యల గురించి ఉత్తరాది అరబ్బులు వాడగా వారి గురించే, స్వర్గ కన్యలుగా మహమ్మద్ ప్రస్తావించడంలో ఇరాన్ మాటల ప్రభావం కనిపిస్తుంది. (జెఫ్రి పుట 120, ది ఫారిన్ ఒకాబ్యులరీ ఆఫ్ ఖురాన్ బరోడా 1938).
పహల్వి గ్రంథంలో వర్ణించిన స్వర్గం వసంతకాలంలో విరబూసిన చెట్ల తోటల వంటిదే. ఇది ముస్లింల ఆనందకర ఉద్యానవనాలను పోలినదే. (సుర 56. 12-39, 76.12-22, 10.10, 55-50) ప్రభువుపట్ల భయం ఉన్నవారికి రెండు ఉద్యానవనాలు ఉన్నాయి. అన్ని రకాల ఫలాలు రెండేసి ఉన్న ఈ చెట్లకు జలజల పారే సెలయేటి నీరు అందుతుంది. కొన్ని నీడనిచ్చే వృక్షాలు ఉన్నాయి.
సూఫీ ముస్లింల సంపూర్ణవ్యక్తికి జొరాస్ట్రియన్ మత వ్యక్తికి పోలిక ఉంది. ఉభయులకూ ఆమోదముద్ర కావాలంటే ప్రార్థన అవసరం. ఉభయులూ కొన్ని సంఖ్యలపట్ల మూఢనమ్మకాలతో ఉన్నారు. 33 అలాంటిదే 33 దేవతలు మనిషిని స్వర్గానికి తీసుకెడతారు. పవిత్రి విషయాల ప్రస్తావనలో 33 సంఖ్య ఉంది.
దయ్యాలు, అగ్ని, గాలి శక్తులు
ఇన్ని మూఢనమ్మకాలతో ఉన్న ఇస్లాంను హేతుబద్ధమైన మతంగా 18వ శతాబ్దపు తాత్వికులు ఎలా భావించారో ఆశ్చర్యం వేస్తుంది. గాలి. అగ్ని శక్తులు, దయ్యాలు, భూతాల గురించి ముస్లింల భావాలను కొంచెం లోతుగా పరిశీలిస్తే తమ మూర్ఖత్వానికి ఈ తాత్వికులు కలవరపడేవారే.
పర్షియనుల నుండి దేవతలూ, దయ్యాల నమ్మకాలు ఖురాన్ లోకి వచ్చాయి. పేగన్ అరబ్బులలో ఇస్లాంకు పూర్వం ఈ శక్తులూ, భూతాలను గురించి గందరగోళ భావనలుండేవి. చీకటిని జిన్ అనేవారు. ప్రకృతిలో విరుద్ధ శక్తులకు ఈ పేరు పెట్టారు. హిదెన్ అరేబియాలో వీటిని భయంకర శక్తులుగా చూశారు. ఇస్లాం కొన్ని సందర్భాలలో ఈ శక్తులను దయామయంగా భావించింది.
హీదెన్ అరబ్బులు అదృశ్య జిన్ శక్తి వివిధ రూపాలలో అవతరిస్తుందని, పాములు, బల్లులు, తేళ్ళు అలాంటివేనని నమ్మారు. మనిషికి కూడా జిన్ పూనుతుందన్నారు. మూఢనమ్మకాలలో పెరిగిన మహమ్మద్ భూత శక్తులలో నమ్మకం కనబరచారు. హిదెన్ దేవుళ్ళను గుర్తించి దయ్యాలుగా వాటిని ప్రవక్త చూపాడు. (సుర. 37.158) అరేబియా ముస్లింలలోనేగాక ఈ నమ్మకాలు ఇతర ముస్లింలలోనూ వ్యాపించి విదేశాలలో ఉన్న నమ్మకాలతో చిలువలు పలవలుగా మారాయి.
మహమ్మద్ కు సన్నహిత మిత్రుడైన హసన్ ఇబ్నతబిత్ స్త్రీ శక్తి ప్రభావంతో కవిత్వం రాసిన తీరును ప్రొఫెసర్ మెగ్డానాల్డ్ వర్ణించాడు.
మదీనా వీధుల్లో ఈ శక్తి అతన్ని కలిసి మీదపడి 3 కవితలు అల్లవలసిందిగా వత్తిడి చేసింది. అప్పటినుండి అతను ఆమె ప్రభావంతో కవి అయ్యాడు. జిన్ సోదరుడుగా తనను తాను వర్ణించుకొని తన కవితలో బరువైన పద్యాలన్నీస్వర్గం నుండి వచ్చాయన్నారు. కొరాన్ లో దైవదత్తాలను వ్యక్తం చేసే వాటినే ఇతడూ వాడాడు. (జిమర్. పుట. 126-27 ది ఇన్ ఫ్లూయన్స్ ఆఫ్ యానిమిజం ఇన్ ఇస్లాం) మహమ్మద్ కు తొలుత దైవం సందేశం వచ్చిన దానికీ, హసన్ ఇబ్నతాబిత్ వాడిన పదాలకూ పోలిక ఉన్నదని మెగ్డానాల్డ్ సూచించాడు.
హసన్ ను స్త్రీ శక్తి పట్టి కవితలు చెప్పించినట్లే గేబ్రియల్ దేవత మహమ్మద్ తో ప్రవక్త వచనాలు చెప్పించింది. గేబ్రియల్ దేవత మహమ్మద్ కు అనుచరుడైనట్లే నఫాతా అనేమాట సమ్మోహనంగా జిన్ శక్తిని గురించి ప్రయోగించాడు.
కొరాన్ లో మహమ్మద్ జిన్ శక్తులపట్ల నమ్మకాలుంచినట్లు అనేక సందర్భాలలో చూడవచ్చు. (సుర.72, సెమికోలన్ 6.3) అల్లాకు అనుచరులుగా జిన్ చూపినందుకు మక్కావాసులను మందలించటం కనిపిస్తుంది. (6.128) మక్కావాసులు ఈ శక్తులకు బలులిచ్చారు. (37.158) అల్లాకూ, ఈ శక్తులకూ సంబంధాన్ని మక్కావాసులు చూశారు. (55.14) పొగలేని నిప్పు నుండి ఈ శక్తుల్ని దేవుడు సృష్టించాడన్నాడు. జిన్ శక్తులు ఇస్లాం గుర్తింపు పొందినవి. కొరాన్ లో ఈ మూఢనమ్మకాలకు ఆమోదముద్ర ఉన్నది. మెగ్డానల్డ్ ఇలా రాసాడు. ఇస్లాం చట్టంలో ఈ శక్తుల చట్టబద్ధమైన స్థాయిని చర్చించి నిర్ధారించారు. వాటికి, మానవులకూ వివాహాలలో, ఆస్తులలో ఎలాంటి సంబంధాలున్నాయో చూపారు. (ఎన్ సైక్లోపీడియా ఆఫ్ ఇస్లాం జిన్ వ్యాసం)
ఇబ్నసెనా ఇలాంటి శక్తులు లేవంటూ తొలి ఇస్లాం తాత్వికుడుగా ఖచ్చితంగా చెప్పాడు. ముస్లింలలో దృష్టిదోషం అనే మూఢనమ్మకం విపరీతంగా వ్యాపించి ఉన్నది. దురదృష్టాలకు అది కారణం అంటారు. కొరాన్ దీన్ని ఆమోదించింది. (సుర. 113) దీని చెడు ప్రభావాన్ని మహమ్మద్ నమ్మాడు. ప్రవక్తతో ఆస్మ-బిన్-ఉమాయిస్ చెపుతూ జఫర్ కుటుంబం దృష్టిదోషాలకు గురయింది. వాటిని తొలగించేదా అని అడుగుతుంది. ప్రవక్త సమాధానం ఇస్తూ విధిని అధిగమించేది దృష్టి దోషం ఒకటేనని, కనుక తొలగించమని అంటాడు.
యూదు వాదానికి రుణపడిన ముస్లింలు
మహమ్మద్ దేవదూత విధానం, యూదు వాదం కలిపితే ఇస్లాం అవుతుంది. (జిమర్. ఎస్.ఎం. పుట.17 ఇస్లాం, ఎ ఛాలెంజ్ టు ఫెయిత్, న్యూయార్క్, 1908)
మదీనా జీవితంలో సామాజిక, వాణిజ్య రంగాలకు సంబంధించి యూదులు ప్రముఖపాత్ర వహించారని ముస్లిం చరిత్రకారులే రాసారు. యూదు తెగలలో బాను, కానూక, బానూకు రాజ్య, బానునాదిర్ చాలా సంపన్నులుగా భూముల్ని, తోటల్ని సంపాదించారని చరిత్ర చెబుతున్నది. ఆ నగరంలో వృత్తి నిపుణులూ వ్యాపారస్తులూ ఉండేవారు. ఉత్తర అరేబియాలోని కైబర్, తైమా, ఫదక్ నగరాలలో చాలామంది యూదులుండేవారు. క్రీస్తు శకంలో తొలుత యూదుల నివాసాలు అక్కడ ఉండేవి. క్రీ.త. 70లో జెరుసలేం విధ్వంసమైనప్పుడు కొందరు ప్రవాసం వెళ్ళారు. దక్షిణ అరేబియా లోనూ యూదులు ఉన్నట్లు వర్తకులు కనుగొన్నారు. దక్షిణ అరేబియా మత ప్రస్తావనల్లో యూదు మత భావాలు కనిపించాయి. హిమియారెట్ రాజు ధూన్ వాస్ యూదులలోకి మారాడని కూడా సంప్రదాయం చెబుతున్నది.
తోరె ఇలా రాశాడు. హిజాజ్ యూదుల నుండి విశ్వాసాలూ, ఆచారాలూ, మహమ్మద్ కు సంక్రమించాయని ఖురాన్ చదివినవారికి స్పష్టపడుతుంది. కొరాన్ లోని ప్రతిపుటలోనూ హిబ్రూ చరిత్ర యూదుల గాథలూ, యూదుల చట్టం, దైనందిన ఆచారవ్యవహారాలూ కనిపిస్తాయి. అబ్రహాం, మోజెస్ ల మతమే ఇస్లాంగా అవతరించింది. (పేజి. 2)
నోల్డెక్, వెల్ హాసన్ వంటి పండితులననుసరించి మహమ్మద్ నిరక్షరాస్యుడనీ, ముస్లిం సంప్రదాయం అలానే పేర్కొంటున్నదనీ తేటతెల్లమవుతున్నది. తోరే, స్ట్రెంగర్ లు మహమ్మద్ ను అక్షరాస్యుడు అంటున్నారు. మహమ్మద్ సామాజిక పరిస్థితి గమనిస్తే చదువుకున్న దాఖలాలేమీ లేవు. గౌరప్రదమైన కుటుంబం నుంచి వచ్చిన మహమ్మద్ చదవటం, రాయటం రాకపోతే వ్యాపారం చూచి పెట్టమని ఒక సంపన్న వితంతురాలు కోరిందనటం సహజంగా లేదు. పుస్తకాల పాండిత్యం ఉన్నవాడుగా తనను గుర్తించటం మహమ్మద్ కు ఇష్టం లేదు. అలాగైతే దైవం నుండి ప్రత్యక్షంగా తనకు వెల్లడైనట్లు నొక్కి చెప్పటం కష్టం అవుతుంది.
ప్రవక్తకు యూదు చరిత్ర, చట్టం ఆచారాలూ ఎలా తెలిశాయి ? బహుశ యూదు పురోహితుడూ, లేదా ఉపాధ్యాయుడూ ఇందుకు తోడ్పడి ఉండవచ్చునని ఖురాన్ లో రెండు సూచనలున్నాయి. 25.5 సురలో నమ్మకం లేనివారు తనను ఎవరో చెప్పిన కథల్ని విన్నందుకు అధిక్షేపించారన్నారు. తనకు అధ్యాపకులు ఉన్నారని మహమ్మద్ నిరాకరించకపోయినా, తనది దైవ ప్రేరణ అని చెప్పాడు. 16.105 సురలో దైవదూత ఇలా చెపుతుంది. వారన్నట్లు మనిషి అతడికి బోధించాడు. కాని వారు అన్యథా భావించే అతడి భాష అరబిక్ భాషే దక్షిణ మెసపొటేమియా నుండి బేబిలోన్ యూదు ఉపాధ్యాయుడుగా ఉండి ఉండవచ్చునని తోరే వాదించాడు.
వ్యక్తుల నుండి నేర్చుకోవటం, యూదుల కేంద్రాలను సందర్శించటం కాక, యూదుల ఆచార వ్యవహారాలను మహమ్మద్ ప్రత్యక్షంగా తెలుసుకున్నాడు. యూదులతో సంబంధంగల అరబ్బులు వారి కథలూ, గాథలూ, అలవాట్లు గ్రహించాడు. ఇస్లాంకు ముందున్న కవితలో ఇవన్నీ ఉన్నాయి.
ఖురాన్ లోని తొలి సురలననుసరించి యూదులూ, వారి మతం పట్ల మహమ్మద్ మెప్పు కనిపిస్తుంది. జెరూసలేం వైపుకు తిరిగి ప్రార్థించటం లాంటివి అవలంబించి వారి మెప్పు పొందటానికి మహమ్మద్ ప్రయత్నించాడు. లోగడ ప్రవక్తలనే తాను అనుసరిస్తున్నట్లు వారికి నచ్చజెప్పజూపాడు.
గైగర్ రాసిన జుడాయిజం అండ్ ఇస్లాం ఆధారంగా ఇస్లాం పై యూదు ప్రభావాన్ని జిమర్ ఒక పట్టిక వేసి చూపాడు.
(ఎ) భావాలు, సిద్ధాంతాలూ
(1) ఖురాన్లో రబీ హిబ్రూ పదాలు
(2) సిద్ధాంత అభిప్రాయాలు
(3) నైతిక, ఆచార నియమాలు
(4) జీవితం పట్ల అభిప్రాయాలు
(బి) కథలూ, గాథలూ
ఖురాన్లో రబి హిబ్రూ మాటలు
హిబ్రూ నుండి 14 మాటల్ని గైగర్ చూపుతూ యూదుల భావాలు అందులో ఉన్నాయనీ పేగన్ అరేబియాలోనూ, హిదెన్ అరబ్బులలోనూ ఇవి లేవని అన్నారు.
ఎ) తబూత్ అరబ్బు పదం ఏదీ కూడా ఇలా చివరలో ఉండదు. కనుక ఈ పదాంతం హిబ్రూ నుండి వచ్చింది.
బి) తోర-యూదులకు వెల్లడయింది.
సి) జన్నతు - అదన్ - స్వర్గం, ఈడెన్ వనం
(డి) జహాన్నమ్ - నరకం. ఇది తొలుత విగ్రహారాధనగా సూచిస్తూ తరువాత నరకం అనే అర్థంలో వాడారు.
(ఇ) అహబర్ - ఉపాధ్యాయుడు
(ఎఫ్) దరస - గ్రంథ మూలార్థాన్ని నిర్దుష్టంగా, జాగ్రత్తగా పరిశీలించడం.
(జి) రబాని - టీచర్
(హెచ్) శబత్ - విశ్రాంతి దినం
(ఐ) సికీనత్ - దైవసాక్షాత్కారం
(జె) తగూర్త్ - దోషం
(కె) ఫుర్ కన్ - విమోచన
(ఎల్) మాన్ - ప్రవాసం
(ఎమ్) మసాని - పునరుత్తం
(ఎన్) మలాకుట్ - ప్రభుత్వం, దైవపాలన
మహమ్మద్ తను అరబిక్ లో కొన్ని పదాలు వ్యక్తం చేయలేనందున ఖురాన్ కూడా, అరబిక్, సిరిక్ పదాలను స్వీకరించింది. మదీనా, మసీదు, సుల్నాస్, నబి ఇలాంటి పదాలే.
యూదు వాదం నుండి ముఖ్యమైన ఇస్లాం సిద్ధాంత భావాలు స్వీకరించారు. అందులో కొన్ని.
దైవ ఏకత్వం
పేగన్ అరేబియాలో దైవ ఏకత్వం కొత్త కాదు. యూదుల తిరుగులేని ఏకేశ్వర వాదం మహమ్మద్ ను ప్రభావవంతం చేయగా ఏకేశ్వర వాదాన్ని బోధించాడు.
లిఖిత అపౌర్షేయాలు
మహమ్మదు పరిణామంలో అల్లా తనకు ఉత్తేజితులైన వారి ద్వారా లిఖిత పూర్వకంగా అందించాడనే విషయం ప్రధానమైనది. యూదు పండితులు తమ పవిత్ర గ్రంథాలపట్ల లోతుపాతులు తెలుసుకుని ఉండటం మహమ్మదుకు నచ్చింది. తమ సంతానం వలె వారికి పవిత్ర గ్రంథం కూడా తెలుసు. (2.141, 6.20) అదే ధోరణిలో తన అనుచరులు కూడా పాటించేటట్లు అరేబియన్ గ్రంథం కావాలనుకున్నాడు. ఖురాన్ కు మూలం స్వర్గంలో ఉందనీ, దాని ప్రతి లభించిందనీ భావించారు. (85.22) ఇలాంటి భావన పిర్కే అబోత్ (వి.6)లో కూడా ఉన్నది.
సృష్టి
సృష్టిని గురించి మహమ్మద్ పేర్కొన్నది. బైబుల్ లోని ఎక్సోడస్ లో ఉన్నది. (20.11) భూమి, ఆకాశం సృష్టించిన తరువాత వాటి మధ్యదంతా అరు రోజుల్లో సృష్టి అయినా అలసట రాలేదు. (సుర. 1.37) మరొకచోట 2 రోజుల్లోనే భూమిని సృష్టించినట్లు ఖురాన్ పేర్కొన్నది. (41.8.11)
ఏడు స్వర్గాలు, ఏడు నరకాలు
ఖురాన్ లో తరచూ ప్రస్తావించిన ఏడు స్వర్గాలూ (17.46, 23.88, 41.11, 65.12) చగీజా (9.2)లోనూ ఉన్నది. కొరాన్ లో నరకాన్ని ఏడు విభాగాలుగా చూపారు. (15.44) జుహార్ లో ఇలాంటి చిత్రణే ఉన్నది. (2.150) ఈ భావనలన్నీ ప్రాచీన ఇండో-ఇరానియన్ మూలాధారాలలో కనిపిస్తాయి. హిందూ, జొరాస్ట్రియన్ గ్రంథాలలో 7 సృష్టులు, 7 స్వర్గాలు ఉన్నాయి. దేవుడి సింహాసనం నీటిమీద ఉన్నది. (సుర. 11.9) యూదుల రాషితో దీన్ని పోల్చి చూడవచ్చు. జూనిసిస్ లో దివ్య సింహాసనం స్వర్గం నుండి నీటిమీదకు వచ్చిందని ఉన్నది. (1.2) మాలిక్ నరక కాపలాదారుగా చిత్రహింసలను జరిపిస్తుంటాడని పేర్కొన్నాడు. (సుర. 43.76) అలాంటి రాకుమారుణ్ణి యూదులు కూడా పేర్కొన్నారు. అగ్ని దేవత విచిత్ర రూపమే మాలిక్. ఇది అమోనైట్స్, మోలెక్, లెవిటికస్, కింగ్స్, జరీమియాలో కనిపిస్తుంది.
స్వర్గ, నరకాలను వేరుచేసే అరఫ్ గోడ ప్రస్తావన సుర 7.44లో ఉన్నది. ఇరువురి మధ్య పలుచని తెర అడ్డంగా ఉండగా ఉభయులూ పరస్చరం గుర్తిస్తారు. స్వర్గంలో ఉన్నవారిని ఉద్దేశించి మీకు శాంతి కలుగుగాక అంటుంటారు. వారికి స్వర్గం ప్రవేశించాలని ఉన్నా అలా చేయలేరు . ఎక్లీసియాస్ట్ 7.14 యూదుల మిద్రాష్ ఇలా ప్రస్తావిస్తుంది. మధ్య స్థలం ఎంత ఉన్నది ? జుకానన్ రబి ఒక గోడ ఉన్నదనగా అచారబి ఒక తెర ఉన్నదంటాడు. ఉభయులూ పరస్చరం చూసుకోవచ్చు. జొరాస్ట్రియన్ రచనలలో కూడా వెలుగు నీడల మధ్య ఉన్ అంతరమేనని ఇలాంటి ప్రస్తావనలు పేర్కొన్నాయి.
ఖురాన్ లో సైతాను చాటుగా వినడం, రాళ్ళతో కొట్టి అతన్ని తరమటం ప్రస్తావించారు. (సుర. 15.17, 37.1, 67.5) యూదుల రచనలలో తెర వెనుక నుండీ వింటూ రాబోయే విషయాలు తెలుసుకోవడానికి జనై ప్రయత్నించినట్లు పేర్కొన్నారు. సుర. 1.29 ప్రకారం నరకాన్ని ఉద్దేశించి నిండిపోయిందా ? అనగా సమాధానంగా ఇంకెవరైనా ఉన్నారా ? అని అన్నది. అకిబాలో కూడా నరకాధిపతి రోజూ తనకు కడుపునిండా ఆహారం ఈయమని అడగటం కనిపిస్తుంది. (8.1)
సుర 11.42, 23.27లో వరద ప్రళయాన్ని గురించి పాత్ర పొంగింది అని ప్రస్తావన ఉన్నది. యూదుల రచనలో మసిలే నీటితో ప్రజలను శిక్షించినట్లున్నది. స్వర్గంలో ప్రవేశించటం ఏనుగు సూది బెజ్జం గుండా వెళ్ళినట్టేనని రబైలు చెప్పగా, ఖురాన్ లో ఒంటె సూది బెజ్జం నుండి వెళ్ళినట్లే అన్నారు. (సుర. 7.36)
టాల్ మండ్ లో మనిషి చేతులే అతడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెపుతాయని ఉన్నది. (చగీజ 16, తనిత్ 11) మనుషులకు వ్యతిరేకంగా మనుషులే సాక్ష్యం చెపుతారు. మీరే నాకు సాక్ష్యం అని ప్రభువు అన్నాడు. సుర 24.24లో వారి చర్యలకు విరుద్ధంగా వారి నాలుకలూ, చేతులూ, కాళ్ళే సాక్ష్యం చెపుతాయి.
సుర 22.46లో దేవునితో ఒకరోజు నీ వేయి సంవత్సరాలతో సమానం బైబుల్ సామ్స్ లో 90.4 ప్రకారం దేవుని సృష్టిలో వేయి సంవత్సరాలు గడిచినా ఒక్క రోజుతో సమానం.
కాఫ్ పర్వతం
సంప్రదాయాల ప్రకారం అబ్దల్లా ఒకనాడు భూమి మీద అత్యున్నత పర్వతం ఏదని ప్రవక్తనడగగా కాఫ్ పర్వతం అనీ, అక్కడ పచ్చలు (ఎమరాల్డ్స్) దొరుకుతాయన్నాడు. జనెసిస్ లో 1.2 లోహు యావత్తు ప్రపంచాన్ని పచ్చని రేఖతో నింపుతుంది. కనుక చీకటి వచ్చిందని ఉన్నది. దాని ముసుగు రూపమే పై సంప్రదాయాలలోకి వచ్చింది.
నైతిక చట్టబద్ధమైన నియమాలు
మహమ్మద్ కొన్ని నీతి ప్రవచనాలను తాల్మడ్ నుంచి తెచ్చుకున్నాడు. పాపాన్ని అనుసరించమని తల్లిదండ్రులు కోరినా పిల్లలు నిరాకరించాలి. జబామత్ 6, సుర 29.7, రంజాన్ సందర్భంగా ఉపవాసంలో తినటం, త్రాగటాన్నిగురించి సుర 2.187 ఇలా చెప్పింది. సూర్యోదయంలో తెలుపు నలుపు దారాల మధ్య తేడా చూడగలిగినంతవరకూ తిని, తాగి తరువాత ఉపవాసం ఉండు. మిష్న, బెరాకోత్ 1.2లో షమా ప్రార్థన చేయాలి. సుర 4.46లో భక్తులు తాగినప్పుడూ, మలినం అయినప్పుడూ, స్త్రీ సంపర్కం ఉన్నప్పుడూ ప్రార్థన చేయరాదన్నాడు. బెరాకాత్ 31.2, 111.4, ఎరుబిన్ 64 ప్రకారం ఇలాంటి నిబంధనలే ఉన్నాయి. ప్రార్థన నిలుచుండి, నడుస్తూ, స్వారీలో కూడా చేయవచ్చు. బెరాకత్ 10, సుర 2.230, 3.188, 10.13, అత్యవసర పరిస్థితులలో పాపం చేయకుండా ప్రార్థనల వ్యవధి తగ్గించవచ్చు. మిష్న జరాకత్ 4.4, సుర 4.102 జరాకత్ లో పేర్కొన్నట్లే ప్రక్షాళన క్రతువు 5.8 సురలో ఉన్నది. నీరు లేనప్పుడు ఇసుకతో ప్రక్షాళన చేసుకోవచ్చని సుర 4.46, 5.8 చెబుతున్నది. తాల్ మద్ లో ఇసుకతో శుభ్రం చేసుకుంటే చాలు అని అన్నారు. బెరాకాత్ 46 ప్రార్థనలు మరీ బిగ్గరగా ఉండరాదని సుర 17.110 చెపుతుండగా, అదే విషయం 31.2లో బెరాకాత్ పేర్కొన్నది.
ఖురాన్ సుర 2.28 ప్రకారం విడాకులు పొందిన స్త్రీ తిరిగి పెళ్ళి చేసుకోటానికి 3 మాసాల వ్యవధి ఉండాలి. అదే నిబంధనను మిష్న జబామత్ 4.10 చెప్పింది. తాల్ మద్ కెతూబత్ 40.1 పేర్కొన్న వివాహ సంబంధాలు కొరాన్ సుర 2.33లో అనుసరించింది. బిడ్డకు రెండేళ్ళపాటు తల్లిపాలివ్వాలని ఉభయ మతాలు నొక్కి చెబుతున్నాయి. సుర 31.13, 2.223, కేతుబత్ 60.1.
యూదుమతం నుండి మహమ్మద్ స్వీకరించిన సిద్ధాంతాలను తోరే ఇలా పేర్కొన్నాడు.
డేనియల్ 19.2లో చిరపరిచితమైన భావన పునరుత్థానం, ఇందులో ప్రస్తావన ఉన్నది. తీర్పునాడు అందరి వివరాలు వివరంగా చూస్తారు. స్వర్గం, నరకం, ఉద్యానవనం, నిరంతర అగ్నిలో దహనం అనేవి నిర్ణయిస్తారు. వీటినే మహమ్మద్ తన కల్పనతో ఇంకా మెరుగులు దిద్దాడు. దేవతలూ, దయ్యాలూ సిద్ధాంతపరంగా చోటు చేసుకున్నాయి. ఖురాన్ లో స్వర్గానికీ, భూమికీ, మనిషికీ, ప్రకృతికీ ఇచ్చిన చోటునుబట్టి చూస్తే జెనెసిస్ ప్రథమాధ్యాయం మహమ్మద్ ను బాగా ప్రభావితం చేసిందని చెప్పవచ్చు.
కథలూ, గాథలూ
ఇమాన్యుఅల్ డాష్ ఇలా రాసాడు.
మహమ్మద్ చిన్నప్పటి నుండీ సమకాలీన యూదు మతాన్ని బాగా ఆకళింపు చేసుకొని, మనకు తాల్ మద్, తార్గం, మిద్రాష్ లో కనిపించేదంతా జొప్పించాడు
ఖురాన్ లో కనిపించే పాత నిబంధన పేర్లుః
అరన్-హరుణ్, ఏబెల్ -హబిల్, అబ్రహాం-ఇబ్రహీం, ఆదం-ఆదం, కెయిన్-కబిల్, డేవిడ్ -దావూద్, ఎలియాస్ - ఇలియాస్, ఎలీజా-అల్యాన, ఇనాక్-ఇద్రీస్, ఎజ్రా - ఉజేయిర్, గేబ్రియల్ -జిబ్రిల్, గాగ్-ఎజూజ్, గోలాయత్ - జలూత్, ఐజాక్ - ఇషాక్, ఇస్మాయిల్, ఇస్మాయిల్, జేకబ్-యాకూబ్, జోబ్ - అయూబ్, జోనా - యూనస్, జాషువా-యూష, జోసెఫ్-యూసఫ్, కోరా - కొరాన్, లోట్ - లూత్, మజాగ్ - మజూజ్, మైకల్ -మికెల్, మోజెస్-మూసా, నోవా-నూహ్, ఫెరొ-ఫెరాన్, సాల్-సాలుత్, సోలమన్ - సులేమాన్, తెరా -అజర్.
పాత నిబంధనల నుండి స్వీకరించిన ఘట్టాలూ, కథలపై ఇస్లాం నిఘంటువు వ్యాఖ్యానిస్తూ వింత నిర్దుష్టత కోసం తాల్ముడ్ గాథలను మిళితం చేసి చూశారని పేర్కొన్నది. ఆరస్ ఆవుదూడను చేస్తాడు 20.90.
కెయిన్, ఎబెల్ 5.30
అబ్రహాం దేవతల్ని సందర్శించుట 11.72, 15.51
కుమారుని బలి ఇవ్వటానికి అబ్రహాం సంసిద్ధత 37.101
ఆదాం పతనం 7.18, 2.84
కొరా, అతని వర్గం, 28.76, 29.38, 40.25
ప్రపంచసృష్టి 16.3, 13.3, 35.1, 12
దావీద్ దైవస్తుతి 34.10
ప్రళయం 54.9, 59.11, 11.42
జేకబ్ ఈజిప్టుకు పోవుట 12.100
జోనా-చేపలు 6.86, 10.98, 37.139, 68.48
జోసెఫ్ చరిత్ర 6.84, 12.1, 40.86
అమృత వర్షం 7.160, 20.82
మోజెస్ శిఖరాన్ని తాకుట 8.160
నోవానవ 11.40
పేరో 2.46, 10.76, 43.45, 40.38
సోల్ మన్ తీర్పు 21.78
షీబారాణి 27.72
మహమ్మద్ లోగడ మతాలకు చెందిన పవిత్ర గ్రంథాలను ముఖ్యంగా హిబ్రూ గ్రంథాలను దృష్టిలో పెట్టుకుని సన్నిహిత సంబంధం ఏర్చరచుకున్నాడు. (తోరే పుట 105) మహమ్మద్ ఈ విధంగా పాత నిబంధనలనుండి అనేక సంఘటనలు, పాత్రల్ని స్వీకరించినా వాటితో సూటిగా పరిచయం ఉండబోదని చాలమంది పండితులంటారు, ఓబర్ మన్ ఇలా రాసాడు.
మహమ్మద్ దైవదత్తంగా భావించేవన్నీ పాత నిబంధన చుట్టూ పరిభ్రమిస్తుండగా అందులో ఎన్నో అసంబద్ధతలు, వ్యత్యాసాలు, భ్రమలు కనబరచాడు. అలాగే కొత్త నిబంధనకు సంబంధించి కూడా ఉన్నది. ఇలా వక్రీకరించిన బైబుల్ విశేషాలు మహమ్మద్ వెల్లడించిన వాటిలో ఉండగా బైబుల్ అనంతర ఆధారాల్లోనూ అలాంటివి కనిపించాయి. (ఓబర్ మన్ పుట 94 అరబ్ హెరిటేజ్ ప్రిన్స్ టన్ 1944)
తాల్ ముద్ తదితర యూదు ఆధారాల నుండి స్వీకరించినప్పుడు కూడా మహమ్మద్ సొంతమేదీ చూపలేదు. తోరే ఇలా రాశాడు.
అతడి పాత్రలన్నీ ఒకే తీరులో ఉంటూ ఒకే భాషణలు చేశాయి. అతడికి నాటకీయ సంభాషణ ఇష్టం. కాని నాటకాలలో దృశ్యం సాగేతీరు ఆట్టే తెలియదు. సంఘటనల క్రమం తార్కికంగా ఉండేది కాదు. కథావగాహనకు అవసరమైన స్పష్టత వదిలేసేవాడు. పునరుక్తి కనబడేది. హాస్యం లోపించింది. సుర 11.27-51లో నోవా అనుభవాలు సుదీర్ఘంగా పేర్కొన్నారు. ఖురాన్ లో అనేకసార్లు చెప్పిన ధోరణిలోనే ఒకేరీతిలో ఉత్తేజంలేని, విసుగుపుట్టించే సందర్భాలున్నాయి. నోవా సమకాలీనులు 40 పగళ్ళూ, 40 రాత్రిళ్ళూ ప్రళయంలో పయనించటానికి సంసిద్ధులయ్యేవారేమో, (తోరే, పుట 108, న్యూయార్క్ 1933, ది జ్యూయిష్ ఫౌండేషన్ ఆఫ్ ఇస్లాం)
హిబ్రూ వరుస క్రమం గురించి మహమ్మద్ కు స్పష్టత లేదు. సాల్, డేవిడ్, సోలమన్లు పేట్రియార్క్ కు తరువాత వచ్చారని తెలుసు. ఇతర ప్రవక్తలూ, వారి నివాసకాలం క్రమంగా తెలియదు. ఎజ్రాను గురించి స్పష్టత లేనందున నిర్దుష్టంగా అతడిని ఎక్కడ ఉంచాలో తెలియదు.
ఎలీజా, ఎలీషా, జోబ్, జోనా, ఇద్రిస్ మొదలైనవారిని ఎక్కడ ఉంచాలో తెలియక వదిలేశాడు. జీసస్ వంశక్రమం అతడు వినలేదు. జాన్ ను గురించి తప్ప మిగిలిన సమకాలీనుల గురించి కూడా తెలియదు. క్రైస్తవ చరిత్ర తెలియదు. మోజెస్ ను జీసస్ తో కలిసి చూపేవాడు. జీసస్ తల్లి మేరీని మోజెస్ సోదరి మిరియం. ఆరన్ లతో కలిపి చూశాడు. నోవా కాలంలో రాజైలు పేర్కొన్న సంఘటనను మహమ్మద్ సాలమన్ కు సంక్రమింపజేశాడు. 950 సంవత్సరాలు బ్రతకగా (జెనెసిస్ 9.29) మహమ్మద్ వరద ప్రళయ కాలాన్ని అన్ని సంవత్సరాలుగా పేర్కొని గందరగోళం సృష్టించాడు. (సుర 29.13) జెనెసిస్ లో (9.22) ప్రళయానంతరం జరిగిన హేమ్ చెడు ప్రవర్తనను గురించి కూడా మహమ్మదు గందరగోళం చెందాడు. నోవా భార్యను నమ్మకం లేని వారిలో ఎందుకు చేర్చాడో తెలియదు. ఖురాన్ లో సాల్ గిడియన్ల మధ్య ఇలాంటి గందరగోళమే ఉన్నది. (సుర. 2.250, జడ్జిమెంట్ 7.5)
ఆదాము సృష్టి
సుర 2.28-33 ఇలా చెబుతున్నది. దేవతలతో ప్రభువు ఇలా అన్నాడు. భూమి మీద నా బదులు ఒకరిని ప్రవేశపెట్టబోతున్నాను అని దేవుడు అనగా వారు ఇలా అన్నారు. పాపాలు చేసి, రక్తం చిందించేవారిని ప్రవేశపెడతారా, ఐనా నిన్ను శ్లాఘించి కొలుస్తాము. దీనికి భగవంతుడు మీకీ విషయం తెలియదని నాకు తెలుసు అన్నాడు. ఆదాముకు అన్ని వస్తువుల పేర్లు చెప్పి దేవతలవైపు తిరిగి మీరు చెప్పేది నిజమైతే వస్తువుల పేర్లన్నీ చెప్పమని అడిగాడు. వారు దేవుని స్తుతిస్తూ తమకు, తెలియదనీ, దేవుడు వివేచనాత్ముడనీ, సర్వజ్ఞుడనీ అన్నాడు. ఆదామును పేర్లన్నీ చెప్పమని దేవుడు ఆజ్ఞాపించగా, అతడు అన్నీ చెప్పాడు. అప్పుడు దేవుడు భూమి ఆకాశాలలో రహస్యాలన్నీ నాకు తెలుసనీ, మీరేది దాచిపెడతారో, ఏది వెల్లడిస్తారో నాకు తెలుసు అని దేవుడు వారితో అన్నారు.
పై కథకు ఆధారాలెక్కడో చూద్దాం. మానవుని సృష్టించాలని దేవుడు ఉద్దేశించి దేవతలకు సలహాలిస్తూ మన రూపంలో మనిషిని సృష్టిద్దామన్నాడు. (జెనెసిస్ 1.26) అంతటవారు దేవుణ్ణి ఉద్దేశించి దేవతలకు సలహాలిస్తూ మన రూపంలో మనిషిని సృష్టిద్దామన్నాడు. (జెనెసిస్ 1.26) అంతట వారు దేవుణ్ణి ఉద్దేశించి మానవుడు ఎవరు, అతడి ప్రత్యేకత ఏమిటి అని అడిగాడు. (కీర్తనలు 8.5) అందుకు సమాధానమిస్తూ మీకంటే అతని వివేచన అధికమైనది అన్నాడు. అప్పుడు వారి ముందుకు పశువుల్నీ, పక్షుల్నీ తెచ్చి పేర్లు చెప్పమనగా చెప్పలేకపోయాడు. మనిషిని సృష్టించిన తరువాత అతడిని అడిగితే వాటి పేర్లన్నీ చెపుతూ ఎద్దు, గాడిద, గుర్రం, ఒంటె అంటూ వరుసగా పేర్కొన్నాడు. నీ పేరేమిటి అని అతడిని అడిగినప్పుడు భూమిలో నుంచి పుట్టాను అని చెప్పగలిగాడు. (లెవెటికస్, పరాష 19, జెనెసిస్ పరాష 8, సానెడ్రిస్ 38)
వివిధ సురలు ఆదామును దేవతలు పూజించాలని భగవంతుడు ఆదేశించినట్లు పేర్కొన్నాయి. (7.10-26, 15-29-44, 18.48, 20.115, 37.71-86) సైతాను తప్ప మిగిలిన వారంతా ఈ ఉత్తరువులు పాటించారు. రాబై మోజెస్ మిద్రాస్ లూ పేర్కొన్న దానితో ఇది సరిపోతుంది.
కెయిన్, ఏబెల్
మహమ్మద్ ప్రవచించిన ధోరణిని తోరే విమర్శించగా, ముఖ్యమైన కథావస్తువులు వదిలివేసిందానికి ఉదాహరణగా కెయిన్, ఏబెల్ ఉదంతాన్ని గైగర్ ఇచ్చాడు. ఖురాన్ లో (సుర 5.35) పొందికగా ఈ విషయాన్ని పేర్కొనలేదంటూ మిష్న సన్ హెడ్రిస్ 4.5లో గమనిస్తేగాని స్పష్టత రాలేదని గైగర్ చూపాడు. ఖురాన్ లో ఏబెల్ హత్యను బైబుల్ నుండి స్వీకరించారు. కెయిన్ చంపకముందు ఏబెల్ సంభాషణను జెరూసలేంకు చెందిన టార్గమ్ నుండి స్వీకరించారు. ఖురాన్ లో ఈ హత్యానంతరం ఎబెల్ ను పాతిపెట్టడానికి కెయిన్ కు తోడ్పడే నిమిత్తం దేవుడు ఒక కాకిని పంపిస్తాడు.
దేవుడు పంపిన కాకి భూమిని తవ్వి సోదరుడి దేహాన్ని ఎలా పాతి పెట్టాలో కెయిన్ కు చూపింది. అప్పుడు పశ్చాత్తాపం చెందిన వారిలో ఒకడుగా అతడు రూపొందాడు. అత్మను చంపినవారు మానవాళిని చంపినట్లే, ఈ విషయం ఇజ్రాయిల్ సంతతికి తెలియజెప్పడమైంది. ఆత్మను సజీవంగా సంరక్షించినవారు మానవాళిని రక్షించినట్లే. (సుర 5.30-35).
ఈ మాటలకూ ఇంతకు ముందు చెప్పిన దానికీ సంబంధం లేదు. దీనిలో స్పష్టత చూడాలంటే మిష్న సాన్వెడ్రిస్ పరిశీలించాలి. 4.5.
కెయిన్ తన సోదరుణ్ణి చంపాడు. సోదరుడు రక్తం చిందించి ఎలుగెత్తి పలికింది. ఇక్కడ రక్తాన్ని ఏకవచనంతో కాక బహువచనంతో ప్రయోగించారు. మానవుణ్ణి వ్యక్తిగా సృష్టించిన అతణ్ణి చంపినప్పుడు మొత్తం జాతిని చంపినట్లుగా భావించాలని పేర్కొన్నారు. వ్యక్తి జీవితాన్ని కాపాడిన వారు జాతి యావత్తునూ కాపాడినట్లే అన్నారు.
ఈ వదిలేసిన భాగాన్ని ఖురాన్ లో చేర్చి చూస్తే విషయం బోధపడుతుంది.
నోవా
ఖురాన్ లో నోవా కథ కొంతవరకు జెనెసిస్ నుండి రాగా, అతడి శీలాన్ని గురించిన విషయం రాబైల ఆధారంగా రాబట్టారు. (సుర 7.57, 10.72, 22.43) నౌకను నిర్మిస్తున్నప్పుడు తన వారితో నోవా మాట్లాడిన మాటలు సాన్ హెడ్రిస్ లో ఉన్నాయి. (108) కొరాన్ , రాబై గ్రంథాలు కూడా వరదలలో జనించిన తరంవారికి మసిలే నీటిలో శిక్షించారని రాసాయి. (రోష్ హష్న 16.2 , సాన్ హెడ్రిస్ 108, సుర 11.42, 33.27)
నిందాడ్ ఆగ్ని ప్రమాదం నుండి అబ్రహాంకు (ఇబ్రహాం) కథ ఖురాన్ అంతటా ప్రస్తావించారు. సుర 2.260, 6.74-84, 21.52.72, 19.42-50, 26.69-79, 29.15, 16, 37.81-95, 43.25-27, 60.4, గైగర్ తిష్ డాల్ ప్రకారం ఖురాన్ మూలాధారాలు, సంప్రదాయాలు యూదు మిద్రాష్ రాబా నుండి స్వీకరించినవే. బైబిల్ విషయాల గురించి మిద్రాష్ ముస్లిం మూలంలో భిన్నత్వం ఉంది. హామ్ మనమడుగా నిమ్ గాడ్ ను జెనెసిస్ పేర్కొని, అతడు సామ్రాజ్యాన్ని స్థాపించాడన్నది. ముస్లిం, మిద్రాష్ కథనం ప్రకారం, నిమ్ రాడ్ ప్రజలు పూజించే విగ్రహాలు ధ్వంసం చేసినందుకు అతన్ని శిక్షించారు. అతన్ని నిప్పుల్లో పడేస్తే హాని లేకుండా బయటపడ్డాడు. తిష్ డాల్ ప్రకారం జనెసిస్ 15.7ను అవగాహన చేసుకోనందున ఇలాంటి కథ వచ్చింది. నేను ఉర్ నుండి మిమ్మల్ని బయటకు తెచ్చిన ప్రభువును ఉర్ బాబిలోనియా నగరం. చాల్డియన్ ఉర్ అనేది అబ్రహాం నగరం. మాటల్లో ఉర్ శబ్దం ఓర్ వలె వినిపించవచ్చు. ఓర్ అంటే నిప్పు వెలుగు. కొన్నాళ్ళకు యూదు వ్యాఖ్యాత జొనాథన్ బెన్ ఉజల్ జనిసిస్ నుండి అనువదిస్తూ చాల్డియన్ అగ్ని గుండం నుండి రక్షించిన ప్రభువును అన్నాడు. విగ్రహారాధన చేయని అబ్రహాంను అగ్నిగుండంలోని నిమ్ రాడ్ పడేసినట్లు రాసి, దోషాల్ని ఇంకా పెంచేశాడు. వ్యాఖ్యాత. జెనెసిస్ ను ఒప్పుకున్నా, నిమ్ రాడ్ ఒక వేళ వుంటే, అతడు అబ్రహాం సమకాలీనుడు కాదు.
జోసెఫ్
బైబిల్ నుండి ప్రధాన కథ స్వీకరించినా, ఖురాన్ పేర్కొన్న దానిలో జోసెఫ్ గురించి పొందిక లేదని టోరే చూపాడు. (టోరే పుట 108) సుర 12 అంతా అతడిని గురించి ఉంది. ఇందులో పోయిన కొన్ని భాగాలను మిద్రాసి నుండి తెచ్చి నింపితే అర్థమౌతుంది. (మిద్రాష్ యల్ కుత్ 146)
పోతిఫర్ భార్య జోసెఫ్ ను ఆకర్షించ ప్రయత్నిస్తుంది. తొలుత అతడు నిరాకరించి, వెలుగు తన నుండి వెళ్ళిపోతుండగా, అంగీకరిస్తాడు.
ఎలాంటి వెలుగో ఖురాన్ చెప్పదు. ఖురాన్ ఈ విషయాన్ని సోటా నుండి 36.2 స్వీకరించింది. రాబి జొకాసన్ ఇలా చెపుతూ, ఇరూవురూ పాపం చేశారు. అమె తనతో రమ్మని అతడిని అడిగింది. అప్పుడు అతడికి తండ్రి స్వరూపం కనిపించి జోసెఫ్, నీ సోదరుల పేర్లు నీతోపాటు యఫాడ్ రాళ్ళపై చెక్కుతారు. అవి చెరిపేటట్లు చూస్తావా ?
ఖురాన్ లో ఈ కథ అర్థం కాదు. మిద్రాష్ యాల్ కుట్ 146 చూస్తే గానీ అసలు విషయం తెలియదు. పోటిఫర్ భార్య మోహం చూసి నవ్విన స్త్రీలందరినీ ఒక విందుక పిలువగా అక్కడ జోసెఫ్ అందం చూసి ఒళ్ళు మరిచి కత్తులతో వేళ్ళు కోసుకున్నారు. అలా కత్తులెందుకున్నాయో కొరాన్ వివరించదు. పండ్లు కోసి తినడానికి ఆ కత్తులు ఉద్దేశించినట్లు మిద్రాష్ యార్ కుట్ పేర్కొన్నది.
ఖురాన్ లో జేకబ్ తన కుమారులను భిన్న ద్వారాల నుండి ప్రవేశించమంటాడు. జెనెసిస్ పరీష 91 ప్రకారం జేకబ్ వారితో ఒకే గేటు ద్వారా ప్రవేశించవద్దని అంటాడు. తోరే ఈ కథను ఇలా వివరించాడు.
బెంజమిన్ వద్ద కప్పు ఒకటి కనిపించగా అతడిని దొంగ అన్నారు. అతడు దొంగతనం చేసి ఉంటే అంతకు ముందే అతని సోదరుడు కూడా చేసి ఉంటాడని అక్కడివారన్నారు. జోసెఫ్ ను దొంగగా చిత్రించటం గురించి వ్యాఖ్యాతలు విఫలమయ్యారు. బెంజమన్ తల్లి అంతకు ముందు ఇది కాజేసినట్లు మిద్రాష్ లో వివరణ ఉన్నది. రేచల్ ఆమె తండ్రి ఇంట్లో దైవ విగ్రహాలను తీసుకు వెళ్ళిపోయిన కాలానికి ఈ సందర్భం వర్తిస్తుంది. (జెనిసిస్ 31, 19-35)
ఖురాన్ ప్రకారం జేకబ్ కు అతని కుమారుడు జోసెఫ్ బ్రతికి ఉన్నట్లు దివ్యదర్శనం ద్వారా తెలుసు. (సుర 12.86) ఈ సమాచారాన్ని ఎప్పుడు రాబట్టిందీ మిద్రాష్ యాల్ కుబ్ వివరిస్తుంది. (సి ఎక్స్ ఎల్ 111) నమ్మకం లేనివారు తన యజమానిని, చనిపోయినవారు జీవితాన్ని కొనసాగిస్తారా అని అడిగాడు. అలాగైతే జేకబ్ విషయంలో ఊరడించటం సాధ్యమయ్యేది. ఇందుకతడు సమాధానమిస్తూ అతడింకా బతికే ఉన్నాడనీ, కనుక ఓదార్చవలసిన సమస్యే లేదనీ అన్నాడు.
హుద్, మోజెస్, ఇతరులు
బైబుల్లోని ఎబర్ ను హుద్ గా పేర్కొన్న వివరాలన్నీ రాబై రచనల నుండి స్వీకరించారు. (సుర 11.63 ను మిష్నాసాస్ హెడ్రిన్ 10.3తో పోల్చవచ్చు.). ఖురాన్ లో ఇలాంటివే మోజెస్, ఫెరోని గురించి కూడా ఉన్నాయి. ఎక్సోడస్ లో 15.27 యూదు వ్యాఖ్యాతలు వివరిస్తూ ఎలిమ్ వద్ద 12 నీటి బుగ్గలు కనుగొన్నారని, ప్రతి తెగకూ ఒక బావి ఉండేదని రాశారు. దీనినే మహమ్మద్ మార్చేసి మోజెస్ తాకిన కొండ శిఖరం నుండి 12 నీటిబుగ్గలు వచ్చాయన్నాడు. అబోదసార 2.2లో దేవుడు నియమాలను ఇస్తున్నప్పుడు ఇజ్రాయల్ ప్రజలని సీనాయి పర్వతంతో కప్పిపుచ్చాడన్నారు. దీనినే ఖురాన్ సుర 7.170లో ఇలా పేర్కొన్నది. పర్వతాన్ని కుదిపేయగా అది ప్రజల్ని ఆవరించటం వలన తమపై పడుతున్నట్లు వారు భయపడ్డారు. భక్తితో మేము తెచ్చిన నియమాలను స్వీకరించమని చెప్పాం.
సోలమన్, షీబా
సోలమన్ కథను షీబారాణితో గల సంబంధాన్ని ఖురాన్ పేర్కొన్నది. సోలమన్ పక్షులతో మాట్లాడగలడని కొరాన్ చెపుతుంది. యూదు వ్యాఖ్యాతలు అదే అభిప్రాయం వెల్లడించారు. వివిధ సురల ప్రకారం గాలి, శక్తులు సోలమన్ కి లొంగాయి. పక్షులు, పశువులూ, భూతాలూ అతడి సైన్యంగా ఉన్నాయి. (సుర 21.81, 27.15, 34.11, 38.35) ఎస్తర్ లో వివిధ భూతాలూ, దయ్యాలూ అతడికి లొంగి ఉండేవి అని ఉండేది. ఈ భూతాలు దేవాలయ నిర్మాణంలో తోడ్పడిన కథను మహమ్మద్ చెప్పాడు. అతడి మరణానంతరం కూడా నిర్మాణం కొనసాగించారని అన్నాడు. సుర 34. ఇది యూదుల గిటిన్ 68 నుండి స్వీకరించారు.
అలెగ్జాండర్
పాత నిబంధన రాబై సాహిత్యం, అరేబియన్ కథల ఆధారంతో కాక భిన్నంగా ఖురాన్ లోని సుర 18 కొన్ని గాథల్ని పేర్కొన్నది. వీటికి ఆధారాలు చూపే ముందు రెండు నదుల సంగమం కోసం మోజెస్, అతని సేవకుడి అన్వేషణతో అరంభిద్దాం. మధ్యమ అల్ బహరాయ్ 59.81.
అక్కడికి చేరేటప్పటికి సైతాన్ ప్రభావం వలన తనతో తెచ్చుకున్న చేపల సంగతి మరచిపోయారు. అవి నీటిలోకి దూసుకెళ్ళిపోయాయి. చేపల కోసం వెతుకుతుండగా దైవ సేవకుడు కనిపించాడు. సరైన మార్గం చూపిస్తే అతన్ని అనుసరిస్తానని మోజెస్ (మూసా) అంటాడు. వారొక ఒప్పందానికి వచ్చిన తరువాత అతడు మోజెస్ ను ఉద్దేశించి నా చర్యలు నీకు తొలుత అర్థం కావనీ, వివరణ అడగవద్దనీ, కొన్నిసార్లు భరించటం కష్టమవుతుందనీ అన్నాడు. వారలా పోతుండగా దైవసేవకుడు చేస్తున్న కొన్ని ఘోరకృత్యాలను చూసి సహనం కోల్చోయిన మోజెస్ ను సంజాయిషీ అడుగుతాడు. నేను ముందే చెప్పాను కదా నీకు ఓపిక ఉండదని అంటూ మోజెస్ ను (మూసా) వదిలి వెళ్ళిపోతూ తన చర్యలకు కారణాలు చెప్పగా అన్నిటికీ తగిన వివరణ ఉన్నట్లు తెలిసింది.
ఈ కథకు 3 ఆధారాలను నోల్డెక్ తదితరులు చూపారు.
1. గిల్ గామిష్ గాథ క్రీస్తు పూర్వం 18వ శతాబ్దంలో ఈ బేబిలోనియన్ కవిత ఇంకిడు, గిల్ గామిష్ ల వీరోచిత గాథకు ఇంకిడు చనిపోయినప్పుడు తాను చనిపోతాననుకొని అమరత్వం కోసం గిల్ గామిష్ అన్వేషిస్తాడు. తన పూర్వీకులు ఉత్నాపిస్టిమ్ అనే అతను రెండు నదుల ముఖ ద్వారం వద్ద ఉంటున్న ఏకైక శాశ్వత జీవి అని తెలుసుకున్నాడు. వృద్ధులకు మళ్ళీ శక్తినిచ్చే మొక్కను గురించి చెప్పి అది సముద్ర గర్భంలో ఉంటుందన్నాడు. గిల్ గామిష్ అమొక్కను తెస్తుండగా చివరిలో ఒక సర్పం దాన్ని కాజేస్తుంది.
2. అలెగ్జాండర్ ప్రేమ. సిరియా సాహిత్యంలో అలెగ్జాండర్ ప్రేమ గాథకు ఆధారాలున్నాయి. క్రీస్తు పూర్వం వంద సంవత్సరాలలో కేలిస్తిన్స్ సాహిత్యంలో దీనికి ఆధారాలున్నాయి. అలెగ్జాండర్. అతడి వంటవాడు ఆండ్రియాస్ జీవన ధార కోసం అన్వేషిస్తారు. ఒకచోట ఆండ్రియాస్ ఉప్పు చేపలను నీటిలో కడుగుతుండగా అవి బ్రతికి ఈదుకుంటూ వెళ్ళి పోతాయి. వాటిని పట్టుకోవటానికి దూకిన ఆండ్రియాస్ అమరుడవుతాడు. ఈ కథ తెలిసిన ఆండ్రియాస్ తాను అన్వేషిచలేక పోయానని అనుకుంటాడు. మళ్ళీ అతనికి ఆ నీరు కనిపించలేదు.
3. ఎలిజా, రాబిజాషువా బెన్ లెవీ. యూదు గాథ ప్రకారం రాబి జాషువా బెస్ లెవీ ఎలిజాతో కలిసి పయనమవుతాడు. కొరాన్ లో దైవ సేవకుని వలె ఎలిజా కూడా అనేక నిబంధనలు పెడుతుంది. అతడివలె ఎలిజా కూడా ఘోర కృత్యాలు చేయగా రాబి కూడా మోజెస్ వలె చలిస్తాడు.
ఈ మూలాధారాలను పోల్చడాన్ని వెన్ సింక్ ఇలా వివరించాడు. జాషువా బెన్ లెవీని గురించి యూదుల ద్వారా తొలుత మహమ్మద్ గ్రహించాడు. తరువాత ముస్లిం గాథలలో ఇది కనిపించదు. మూసా (మోజెస్) ఖురాన్ కథలోని మొదటి భాగంలో గిల్ గామిష్ అలెగ్జాండర్ గానూ, రెండవ భాగంలో ఎలిజాగానూ ప్రాతినిధ్యం వహిస్తుంది. (వెన్ సిక్, అల్ కదిర్ ఎన్ సైక్లోపీడియా ఆఫ్ ఇస్లాం తొలి ప్రచురణ)
అలెగ్జాండర్ ఎట్టకేలకు 82.96 సూత్రాలలో కనిపిస్తాడు. అక్కడ ధుల్ కార్నియన్ గా అవతరించాడు. దైవం వలన ఇతడికి రెండు కొమ్ములున్నట్లు సైరిక్ సూత్రం చెబుతున్నది. కొరాన్ ప్రకారం గాగ్ కథను, మగాబ్ తో కలిపేసి అలెగ్జాండర్ గా పేర్కొన్నారు. (జెనెసిస్ 10.2, ఎ జెక్ 38).
ఇతర విషయాలు
దేవుణ్ణి రబ్ అనీ, కొన్నిసార్లు రబ్ అల్ అలామిన్ అనీ మహమ్మద్ ప్రస్తావించాడు. (ఓబర్ మన్ పుట. 100.ది అరబ్ హెరిటేజ్ ప్రిన్ స్టన్ 1934 సుర 56.79, 82.29, 83.6) యూదు, అగధా ప్రస్తావనలలో రిబన్ హా ఓలామిన్ అని దైవాన్ని పిలవటం కనిపిస్తుంది. దేవుణ్ణి అల్ రహమాన్ అని కూడా మహమ్మద్ సంబోధిస్తాడు. 55.1, 78.3 ప్రతి సుర శీర్షికలోనూ, కొరాన్ లో ఇతర చోట్లా దైవం పేరు 50 చోట్ల ప్రస్తావనకు వస్తుంది. ఇస్లాంకు పూర్వం అరేబియాలో దీన్ని వాడారు. దక్షిణ అరేబియా సుర శిలా ఫలకాలలో ఇది కనిపిస్తుంది. దీనిని సూటిగా యూదుల నుండి మహమ్మద్ స్వీకరించాడనేది బెల్ సందేహించాడు. హరహమాన్ అనే యూదు సాహిత్యంలో తరచు ఉన్నట్లు ఓబర్ మన్ పేర్కొన్నాడు. జరఫ్రీ ఇలా అంటాడు. ప్రాచీన కవితలో ఈ పదం ప్రస్తావనకు రావటం, మహమ్మద్ ప్రత్యర్ధులైన ప్రవక్తలు ఈ పదాన్ని వాడటం మసైలామ అల్ అసవాద్ దీన్ని ప్రయోగించటం వలన బహుశ యూదుల బదులు దీని మూలం క్రైస్తవులలో ఉండొచ్చని తెలుస్తున్నది. నిర్థారణగా చెప్పలేము. (జఫ్రీ పుట 141, బరోడా, 1938)
క్రైస్తవం
క్రైస్తవ బోధలూ, క్రైస్తవ మతాన్ని గురించి ఏమంత అవగాహన లేదు. వాటిపట్ల లోతుపాతులు తెలియవు. క్రైస్తవ మతాచారాలను గురించి అంత మూర్ఖంగా చెప్పటాన్ని బట్టి ఇలా భావించవచ్చు. నోల్డెక్ ఈ విషయాలను సూచించాడు. (సుర 5.111) కొరాన్ లో చివరి భాగాల్లోనూ క్రైస్తవ మతాన్ని గురించి తెలిసినట్లుగా ప్రస్తావన లేదు. (రిచర్డ్ బెల్ పుట 136, లండన్ 1926, ది ఆరిజన్ ఆఫ్ ఇస్లాం ఇన్ ఇట్స్ క్రిస్టియన్ ఎన్విరాన్ మెంట్) అరేబియాలో మహమ్మదు పుట్టిన కాలంలో క్రైస్తవం వ్యాపించి ఉన్నది. అది బహుశ సిరియస్ క్రైస్తవం కావచ్చు. అల్ హిరాలో చాలా క్రైస్తవ కుటుంబాలు మోనుపిసైట్ కి చెందినవి. ఖురాన్ లో కనిపించిన ఆధారాలు సిరియాక్ భాషకు చెందినవి. కనుక అరబ్బుపై సిరియా ప్రభావం అల్ హిరాలోని క్రైస్తవుల ద్వారా వచ్చి ఉండవచ్చు. దక్షిణ అరేబియాలోని నజరాన్ లో కూడా క్రైస్తవ సమాజం ఉన్నది. చాలామంది నెస్టోరియన్లు, కొందరు అబిసీనియా మోనోపిసైట్ కు చెందినవారు కూడా. ముస్లిం సంప్రదాయాల ప్రకారం సిరియన్ క్రైస్తవులతో మహమ్మదుకు వ్యక్తిగత సంబంధం ఉన్నది. యువకుడుగా మహమ్మద్ సిరియాకు వ్యాపార ప్రయాణాలు చేసినట్లు ముస్లిం ఆధారాలు తెలుపుతున్నాయి. నజరన్ బిషప్ బోధనలను మక్కా వద్ద ఉకాజ్ ఉత్సవ సందర్భంగా మహమ్మద్ విన్నాడంటారు.
వ్యాపార రీత్యా అబిసీనియాకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. మహమ్మదుకు ముందు దక్షిణ అరేబియా కొంతకాలం అబిసీనియా పాలనలో ఉన్నది. మక్కాలో కొందరు ఇస్లాంలోకి మారి చిత్రహింసలు తప్పించుకోటానికి అబిసీనియా పారిపోయినట్లు కథలున్నాయి. క్రైస్తవం పట్ల అప్పుడే మహమ్మదుకు కొత్త ఆసక్తి కలిగిందని తోరే రాసాడు.
ఐనప్పటికీ త్రిమూర్తి సిద్ధాంతాన్ని మహమ్ముద్ అర్థం చేసుకోలేదు. ఖురాన్ లో క్రైస్తవులను గురించి ఉన్నదంతా స్థానిక ముఠాల నుండి స్వీకరించినదే.
నిద్రించే ఏడుగురు
ఎఫీసన్ కు చెందిన ఏడుమంది నిద్ర గురించి గాథలు 5వ శతాబ్దం చివరిలో మొదలై పశ్చిమాసియా, యూరోప్ లకు వ్యాపించింది. తొలుత సిరియన్ బిషప్ జేమ్స్ (452-521) ప్రస్తావించగా టోర్స్ కు చెందిన గ్రిగరీ దీన్ని లాటిన్ లోకి అనువదించాడు. (540-90) గిబ్బన్ ఇలా రాశాడు. సుప్రసిద్ధమైన ఈ కథ మహమ్మదు సిరియాకు ఒంటెలను తీసుకు పోతుండగా తెలుసుకొని ఇది దైవదత్తంగా ఖురాన్ లో ప్రవేశపెట్టాడు. (సుర 18.8-26) ఖురాన్ ఇలా పేర్కొంటున్నది.
గుహలోని అనుచరులనూ, అల్ రకీమ్ ను అద్భుతమైన చిహ్నాలుగా గుర్తించారా.... ఒక కథ ప్రకారం డెసియన్ చక్రవర్తి శిక్షలను తప్పించుకోవడానికి క్రైస్తవ యువత కొండ గుహల్లోకి పారిపోయారు. వారిని వెంటతరిమినవారు దాగిన చోటు తెలుసుకుని గుహను మూసివేశారు. 200 ఏళ్ళ తరువాత వారంతా అద్భుతంగా బతికి బయటపడ్డారు. అల్ రకీమ్ అనే పదాన్ని గురించి వ్యాఖ్యాతలు సంవత్సరాల తరబడి చర్చించారు. అరామిక్ ప్రతిలో ఉన్న డెసియన్ అనే పేరును తప్పుగా చదవటంతో ఇది వచ్చి ఉంటుందని తోరే సూచించాడు. (తోరే. న్యూయార్క్ 1933, పుట 46. 47 ఎ జ్యూయిష్ ఫౌండేషన్ ఆఫ్ ఇస్లాం)
మేరి, త్రిమూర్తి సిద్ధాంత దురవగాహన
సుర 19.28, 29 ప్రకారం జీసస్ జననాంతరం జనం మేరీ దగ్గరకు వచ్చి మేరీ నీవు అద్భుతమైన పని చేశావు. అరన్ సోదరీ, నీ తండ్రి చెడ్డవాడు కాదు. నీ తల్లి వ్యభిచారిణీ కాదు. మరొక చోట ఇమ్రాన్ ప్రవక్తగా పేర్కొన్నారు. (సుర 66.12, 3.31) ఇంకొక చోట మోజెస్ కు పవిత్ర గ్రంథాన్నిచ్చి అతడి సోదరుడు అరన్ ను మంత్రిగా నియమించాడు. జీసస్ తల్లి మేరీని మోజెస్ సోదరి మిరియంగా మహమ్మద్ అనుకొన్నట్లు స్పష్టపడుతుంది. ఈ విషయాన్ని విడమరచి చెప్పటానికి భాష్యకారులు ముప్పుతిప్పులు పడ్డారు.
సుర 19లో జీసస్ తల్లి మేరీ వద్దకు దేవదూత వచ్చి అమె కన్య అయినప్పటికీ దైవేచ్ఛ ప్రకారం కుమారుణ్ణి కంటుందని చెప్పారు.
ఈ విధంగా అమె గర్భం ధరించి ఒక మారు మూల ప్రాంతానికి వెళుతుంది. త్రోవలో ఈత చెట్టు వద్ద ఆమెకు నొప్పులు వస్తాయి. ఆ బాధలో చనిపోతే బాగుండేది అనుకున్నది. అప్పుడు లోనుండి ఒక స్వరం ఇలా పలికింది. బాధపడకు, భగవంతుడు నీ పాదాల చెంత నీటి ప్రవాహాన్ని ఏర్చరచాడు. నీకు అందేటట్లు ఖర్జూర ఫలాలు అందిస్తున్నాడు. అవి తిని, నీరు త్రాగి నీకెవరైనా కనిపిస్తే ఇలా చెప్పు. నేను దయామయుడైన దేవుని వద్ద ప్రతిన పూనాను. నేను నేడు మానవులతో మాట్లాడను.
మేరీ చరిత్రలో రక్షకుని బాల్యదశ గాథలు ఈ కథకు ఆధారాలున్నాయి. పసివాడుగా జీసస్ చెట్టును ఉద్దేశించి నీ కొమ్మలు కిందకు వాలేటట్లు చేయి. అప్పుడు నా తల్లి పండ్లు ఆరగిస్తుంది, అనగానే కొమ్మలు కిందకు వంగగా మేరీ పండ్లు కోసుకొని తింటుంది. తరువాత చెట్ల కొమ్మలు మామూలుగా పైకి వెళ్ళిపోతాయి. జీసస్ అడిగిన ప్రకారం చెట్టు వేళ్ళ నుండి మంచినీరు పైకి ఉబకగా వాటిని ఆమె సేవిస్తుంది.
ఖురాన్ లో ఇతర కథా భాగాలు హెలెనిక్ గ్రీసు నుండి, కోప్టిక్ చరిత్ర నుంచి స్వీకరించారు.
జీసస్
సుర 4.155, 156 ప్రకారం జీసస్ ను శిలువ వేయలేదు. అతడిని చంపలేదు, శిలువ వేయలేదు. అని మహమ్మదు కల్పితంగా కొందరు భావించారు. కాని బాసిలిడియన్లవంటి తెగలు శిలువ వేయటాన్ని అంగీకరించక, క్రీస్తు స్థానంలో సైమన్ అనే అతన్ని శిలువ వేశారని చెప్పారు.
ఉయ్యాల తొట్టి నుండి జీసస్ మాట్లాడాటం. మట్టితో చేసిన పక్షి బొమ్మలలో ప్రాణం పోయటం వంటి కథలున్నాయి. (సుర 5.121) వీటిని కోప్టిక్ రచనల నుండి స్వీకరించారు. సుర 5లో స్వర్గం నుండి ఫలకాలు రావడం ప్రస్తావించారు. జీసస్ చనిపోయేముందు శిష్యులతో విందారగించిన విషయం దీనికి ఆధారం.
త్రిమూర్తిత్వం
క్రైస్తవ త్రిమూర్తి సిద్ధాంతం మూడు సురలలో ప్రస్తావించారు.
దేవుణ్ణి, అతని దేవతల్ని నమ్ము. ముగ్గురు అనకు సుర 4.169
ముగ్గురిలో దేవుడొకడు అనేవారు నమ్మకం లేనివారు. మేరీ కుమారుడు ప్రవక్త మాత్రమే. అతని తల్లి ప్రమాణం చేసింది. వారిరువురూ భుజించారు. (సుర 5.77)
దేవుడు అంటాడు. మేరీ కుమారుడు జీసస్, మానవులకు ఇలా చెప్పావా... దేవుడు గాక నన్ను నా తల్లిని దేవుళ్ళుగా స్వీకరించండి (సుర 5.116)
తులనాత్మకత
తుది తీర్పునాడు మంచీచెడు తులనాత్మకంగా నిర్ణయించే రీతి ఇస్లాంలోకి పర్ష్యా నుండి వచ్చింది. ఇతర లక్షణాలు అబ్రహాం టెస్టమెంట్ నుండి రాబట్టారు. బహుశ ఈజిప్టులోని బుక్ ఆఫ్ డెడ్ నుండి అంతా స్వీకరించవచ్చు.
పహ్వలి గ్రంథం నుండి ప్రవక్త ఆరోహణ స్వీకరించారు. అందులో చాలా భాగం అబ్రహాం టెస్టమెంట్ నుండి తీసుకున్నారు. దేవదూత మైకెల్ స్వర్గానికి పేట్రియార్ ను తీసుకెళ్ళాడు. ఒకటి స్వర్గానికి మరొకటి నరకానికి వెళ్ళే రహదార్లు ప్రస్తావించారు.
అబ్రహాం ఒక విశాల మార్గాన్ని, ఒక ఇరుకు దారిని చూచాడు. గేటు వెలుపల (ఆదాం)ను బంగారపు సింహాసనంపై కూర్చుండడం చూస్తారు. అతడు గంభీరంగా ఉంటాడు. దేవతలు తీసుకెడుతున్న అనేక ఆత్మలు విశాల ద్వారం గుండా పోతాయి. కొన్ని అత్మలు ఇరుకు ద్వారం గుండా పోతాయి. ఆదాం జుట్టు పట్టుకుని, ఏడుస్తూ, మూలుగుతూ ఉంటాడు. ఇరుకు దారిలో అనేకు స్వర్గానికి పోవడం చూసి మళ్ళీ సంతోషంగా సింహాసనంపై ఉంటాడు.
మహమ్మద్ స్వర్గానికి వెళ్ళినప్పుడు ఆదాంను చూస్తాడు. మిష్కతల్ మసాబి అనే ముస్లిం గ్రంథంలో ఆ విషయం ఉంది. చూడు అధిష్టించిన వ్యక్తి కుడివైపు నల్లని స్వరూపులు, ఎడమవైపు నల్లని ఆకారంలో ఉంటారు. కుడి వైపు చూసి నవ్వుతాడు. ఎడమవైపు చూసి విలపిస్తాడు. ధర్మజ్ఞుడైన ప్రవక్తకు స్వాగతం పలుకుతాడు. నేను ఆదాంను, కుడివైపు వారు స్వర్గవాసులు, ఎడమవైపు వారు అగ్నిలో మాడే నరకవాసులు. కుడివైపు వారితో నవ్వడం, ఎడమవైవు వారిని చూచి విలపించడం అందుకే.
సూది బెజ్జం
సుర 7.38 ఇలా చెబుతుంది. మన సంజ్ఞల్ని తప్పుడుగా భావించేవారు. నిరాకరించేవారు. స్వర్గంలో ప్రవేశించాలంటే ముందుగా సూదిబెజ్జం నుండి ఒంటె ప్రవేశించాలి. వారికి స్వర్గద్వారాలు తెరిచి ఉండవు. మాచ్యూ 19.24లో ఉన్నదానికి ఇది ప్రతిధ్వని. సంపన్నుడు దైవ రాజ్యంలో ప్రవేశించడం కంటే, ఒంటె సూది బెజ్జంలోకి వెళ్ళడం సులభం. (మార్క్ 10.25, లూక్ 18.25)
శాబియన్లు
7వ శతాబ్దంలో మధ్య అరేబియా శాబియన్ల ప్రభావానికి మహమ్మదు, అతని సమకాలీనులు గురి అయి ఉండవచ్చునని మూర్ వంటి పండితులు భావించారు. ఇది రెండు తెగలకు చెందినది. గనుక కొంత గందరగోళం ఉంది. ఎన్ సైక్లోపీడియా ఇస్లాంలో కారాడివాక్స్ (1వ ముద్రణ) ప్రకారం ఖురాన్ లో గ్రంథ సంబంధిత ప్రజలు అనేది శాబియన్లు, యూదులు, క్రైస్తవులకు చెందిందన్నారు. అంటే మాండియన్లను ఉద్దేశించారన్నమాట. ఈ మాండియన్లు బాప్తిజాన్ని పాటించిన యూదు-క్రైస్తవ జాతులు. ఒకటి రెండు శతాబ్దాలలో జొర్డాన్ కు తూర్పున వీరు ఆవిర్భవించారు. బెల్, టోరే ప్రకారం శాబియన్ అనేది మాడియన్లకు చెందకపోవచ్చని, మహమ్మద్ అలా ఉద్దేశించలేదని వారన్నారు.
హర్రస్ కు చెందిన శాబియన్లు మరో ముఠా తారల్ని పూజించి, ఆకాశ శక్తుల్ని ఆమోదించారు. వారిని ఉద్దేశించి అని ఉండొచ్చు. ఏడు గ్రహాల్ని వారి దేవాలయాలుగా భావించారు వీరు. అల్ శరస్తాని ప్రకారం ఒక తెగ శాబియన్లు తారల్ని ప్రత్యక్షంగా ఆరాధించారు. మరొక తెగవారు తారల్ని పోలిన విగ్రహాలు చేసి ఆరాధించారు. మహమ్మద్ ను ప్రభావితం చేసిన శాబియన్లు ప్రమాణాలు చేస్తూ తారలు, గ్రహాలను ఆరాధించారు. (సుర 56.75)
పడిపోతున్న తారల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. (సుర 53)
పేగన్ మక్కా వాసుల ఆచార వ్యవహారాలను, క్రతువులను శాబియన్లు ప్రభావితం చేసి ఉండొచ్చు. కాబాలో మక్కా వాసులు 360 విగ్రహాలుంచారు. ఏడు గ్రహాల చుట్టూ ప్రదక్షిణకు సూచనగా కాబాలో ఏడుసార్లు తిరగడం ఉండేదని మూర్ సూచించాడు.

Subscribe to:
Posts (Atom)