Friday, February 15, 2008

తోచీ తోచనమ్మ...? - A good analysis from another blog



Posted in http://teluguman.blog.com/2140235 (Tuesday | October 02, 2007)

ఈ రోజు కీ.శే.రాజీవ్ గాంధి భార్య సోనియాగాంధి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో మాట్లాడబోతోంది.ఆమె అక్కడికెందుకెళ్ళిందో ఏం మాట్లాడబోతోందో నాకు తెలవదు.తెలుసుకోవాలన్న ఇంట్రష్టూ లేదు.అయితే ఈ వార్త విన్నాక కొన్ని సందేహాలు కలిగాయి.

1. ఈమెగారు ఏ హోదాలో అక్కడికెళ్ళింది ? వాళ్ళు ఏ హోదాలో అక్కడ మాట్లాడనిస్తున్నారు ? మనకి తెలిసినంతవరకు ఈమెగారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలూ UPA కమిటీకి ఛెయిర్ పర్సనూ. అంతకన్నా మరింకేమీ కాదు.ఇలాగే ఫార్వర్డు బ్లాకు ముస్లిం లీగు మొదలైన అన్ని పార్టీల అధ్యక్షుల్నీ అమెరికా పీటేసి కూర్చోబెట్టి UNO లో మాట్లాడనిస్తుందా ?

2. ఇదివరలో అనాధికారిక వ్యక్తుల్ని ఇలా UN వేదిక ఎక్కనిచ్చిన దృష్టాంతాలేమీ లేవు.మన దేశం తరఫున నెహ్రూ మాట్లాడాడు.వాజపేయి మాట్లాడాడు.సరే ! వాళ్ళకా సమయంలో ఏదో ఒక పెద్ద ఆధికారిక హోదా ముద్రాధికారమూ ఏడిశాయి.ఆ ప్రకారంగా చూస్తే ఇప్పుడు మాట్లాడాల్సింది సోనియా కాదు, మన్ మోహన్ సింగు.కాని ఇలా జరుగుతోందేమిటి చెప్మా ? ఈ చర్యకి ఉన్న రాజ్యాంగబద్ధత ఏమిటి ? ఒక ప్రైవేటు వ్యక్తిగా ఈమెగారు అక్కడ పిచ్చికూతలు కూస్తే ఇక్కడ ప్రభుత్వం వాటికి కట్టుబడి ఉండాలా ?

3. కాదు-కూడదు-సోనియా స్పెషలు-అందుకని మాట్లాడనిస్తున్నాం అంటే ఆ స్పెషల్ కి అర్థమేంటో మనం తెలుసుకోవచ్చా ? మనకి తెలిసినంతవరకు రాజీవ్ గాంధి పెళ్ళాం కావడం మినహాయిస్తే ఇండియాలోనే ఈమెగారికి ఏ విధమైన స్పెషాలిటీ లేదు.మరి అంతర్జాతీయ వేదికల మీద ఇంత స్పెషల్ ఎలా అయిపోయిందబ్బా హఠాత్తుగా ? మన దగ్గర ప్రతిభా పాటిల్ కి ఎంత విలువుందో అంతర్జాతీయ వేదికల మీద సోనియాకీ అంతే విలువుంది.

4. ఈ స్పెషల్ కి అర్థమేంటో ఎవరూ చెప్పనప్పుడు కరెక్టుగా అదేంటో ఊహించే అధికారమూ అవకాశమూ మనకుంటాయి కదా !అలా ఊహించాలంటే ఈమధ్య జరిగిన సంఘటనల పరంపరంతా ఒకసారి నెమరేసుకోవాలి.

అవి :- (అ) అమెరికాతో అణు వొప్పందం కోసం సోనియాగాంధి అదేదో తన సొంత పెళ్ళిలాగా తహతహలాడిపోవడం. అందుకోసం దేశప్రయోజనాల్నే పణంగా పెట్టడానికీ ; బ్రిటిష్ ఇండియాలో కారన్ వాలిస్సూ రాబర్ట్ క్లైవూ మన రాజుల్ని చేసినట్టు ఇండియాని నిరాయుధం చెయ్యడానికి అమెరికాతో కలిసి కుట్రపన్నడం

(ఆ) అందుకోసం తమ ప్రస్తుత భాగస్తులైన పుర్రచేతిగాళ్ళ (CPI, CPM) తో విరోధానికీ తద్వారా తమ ప్రభుత్వాన్ని తామే కూల్చేసుకోవడానికీ తిరిగి ఎన్నికలు జరిపించడానిక్కూడా ధీమాగా సిద్ధపడడం.

(ఇ) ఇక్కడి భూముల్ని SEZ ల పేరుతో మన రైతుల నుంచి బలవంతంగా లాక్కుని విదేశీ కంపెనీలకి కట్టబెట్టడం.

(ఈ) దేశవ్యాప్తంగా మతం మార్పిడీ కార్యక్రమాలు ఎన్నడూ లేనంతగా ఊపందుకోవడం.కాంగ్రెస్ అధికారంలోకొచ్చినప్పటినుంచి హిందూమతాన్ని దెబ్బతీసే చర్యలే తప్ప మరొకటి చెయ్యడంలేదు.మన రాష్ట్రమే తీసుకుంటే ఒక్క ఏడాదిలోనే మైనారిటీ మందిరాలు మెజారిటీ మందిరాలుగా మారాయి. జిల్లాల వారీగా కింద ఇచ్చిన మందిరాల గణాంకాలు పరిశీలించండి : మొదటి సంఖ్యలు హిందూ దేవాలయాలవి. రెండో సంఖ్యలు చర్చిలవి. మూడో సంఖ్యలు మసీదులవి.


ఆదిలాబాదు----12,346----3,347----18,482
అనంతపురం ----14,008----4,892----9,328
చిత్తూరు----26,120----9,098----12,320
కడప----22,982----7,241----14,223
తూర్పు గోదావరి----8,220----12,123----9,230
గుంటూరు----9,302----16,388----5,429
హైదరాబాదు (రంగారెడ్డి కూడా కలిపి)----13,144----3,204----15,203
కాకినాడ (మెట్రోపాలిటన్)----7,203----8,585----5,274
కరీం నగరు----4,129----1,648----9,714
ఖమ్మం----5,210----7,203----5,922
కృష్ణా----8,929----8,462----3,769
కర్నూలు----6,549----5,203----9,293
మచిలీపట్నం----5,000(సుమారు)----8,320----6,493
మహబూబ్ నగరు----3,299----3,128----7,235
మెదక్----6,302----3,203----3,234
నెల్లూరు----7,993----6,782----7,323
నల్గొండ----6,882----2,412----5,239
నిజామాబాదు ----4,638----3,203----9,366
ప్రకాశం----4,255----5,583----4,932
శ్రీకాకుళం----7,339--9,879--2,140
వరంగల్లు----1,393----6,320----1,342
పశ్చిమ గోదావరి----3,293----5,464----2,765
విశాఖపట్నం----6,430----3,203----4,203
విజయనగరం----3,891----3,100----3,500


(ఉ) అన్ని స్థాయిల్లోను ఒక మతానికి చెందినవాళ్ళు వచ్చి తిష్ఠ వెయ్యడం.అదేమంటే దళితులని పేరుపెట్టుకుని బుకాయించడం

(ఊ) ఇక్కడి ఆడవాళ్ళ మనస్తత్వాన్ని అమెరికా ఆడవాళ్ళ తరహాలో మార్చేందుకు వీలుగా చట్టాలు తేవడం

ఇవన్నీ చూస్తూంటే ఈమె ఎవరికోసం పనిచేస్తోంది ? ఎవరికి అంకితమయింది ? అనే సందేహాలు కలగడం సహజం.కాని ఈ సందేహాలకు సంతృప్తికరమైన సమాధానాలు ఇంతవరకు లభించలేదు.దొరుకుతున్న సాక్ష్యాలూ అందుతున్న సంకేతాలూ అన్నీ పూర్తి విరుద్ధంగా ఉన్నాయి.లేకపోతే నేనీమెని గట్టిగా సపోర్టు చేస్తూ ఒక టపా రాసుండేవాణ్ణి.ఈమె కోసం ఎంతమందినైనా సరే, ఎదుర్కుని ఉండేవాణ్ణి.

ఈమెని కేంబ్రిడ్జిలోని ఒక గ్రీకు రెస్టారెంటులో రాజీవ్ గాంధికి పరిచయం చేసింది అమెరికన్లు.ఎన్నికలు రాబోతున్న వేళ ఈమెని ఇలా కృత్రిమంగా పట్టుకుని ఆకాశానికెత్తి పెద్దదానిగా ప్రొజెక్ట్ చేసి భారతీయుల చేతనే ఆమెని అయ్యారే ! భళారే ! అనిపించి గెలిపించి తన స్వార్థ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలనే వ్యూహంతో అమెరికా పన్నిన పాచిక ఇది అని స్పష్టంగా తెలిసిపోతూనే ఉంది.

 
Source
http://teluguman.blog.com/2140235